
సాక్షి, విశాఖపట్నం : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ ప్రయాణిస్తున్న వాహనం ప్రమాదానికి గురైంది. అయితే ఎంపీ మోపిదేవితో పాటు ఆయన కుటుంబసభ్యులకు తృటిలో ప్రమాదం తప్పింది. విశాఖ జిల్లా కసింకోట మండలం తాళ్లపాలెం వద్ద మోపిదేవి వెళ్తున్న కాన్వాయ్‌లో ముందు వెళ్తున్న వాహనం సడన్ బ్రేక్ వేయడంతో కార్లు ఢీకొన్నాయి. అదే సమయంలో వెనకనే వచ్చిన డిప్యూటీ సీఎం పుష్పశ్రీ వాణి వాహనంలో ఎంపీ మోపిదేవి, ఆయన కుటుంబసభ్యులు విశాఖ బయల్దేరి వెళ్లారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.