దశాబ్ధాల పోరాటానికి సీఎం జగన్‌ పరిష్కారం.. | Deputy CM Pushpa Srivani Spoke With Media In Vijayawada | Sakshi
Sakshi News home page

దశాబ్ధాల పోరాటానికి సీఎం జగన్‌ పరిష్కారం చూపారు

Published Wed, Sep 30 2020 2:31 PM | Last Updated on Wed, Sep 30 2020 3:51 PM

Deputy CM Pushpa Srivani Spoke With Media In Vijayawada - Sakshi

సాక్షి, విజయవాడ: దేశ చరిత్రలో ఎక్కడ లేని విధంగా గిరిజనులకు సీఎం జగన్ భూమి హక్కు కల్పిస్తున్నారని డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి అన్నారు. ఈ మేరకు ఆమె మీడియాతో మాట్లాడుతూ.. 'అనేక దశాబ్దాల గిరిజనుల పోరాటానికి సీఎం జగన్ పరిష్కారం చూపారు. ఏ గిరిజనుడు, గిరిజన సంఘాలు పోరాటాలు చేయకుండానే సీఎం జగన్ ఈ హక్కులు కల్పిస్తున్నారు. లక్షా 10 వేల మందికి ఆర్వోఎఫ్‌ఆర్ పట్టాలు ఇస్తున్నాం. సుమారు 2 లక్షల ఎకరాలు పంపిణీ చేస్తున్నాం. కమ్యూనిటీ పట్టాల ద్వారా 60  వేల మందికి పంపిణీ చేస్తున్నాం.  (ఏపీ: పెన్షన్ల పంపిణీకి సర్వం సిద్ధం)

లక్షా 60 వేల ఎకరాలు కమ్యూనిటీ పట్టాలిస్తున్నాం. భూములు లేని గిరిజనులకు కూడా ఒక్కొక్కరికి 2 ఎకరాలు పంపిణీ చేస్తున్నాం. అనేక దశాబ్దాలుగా గిరిజనులు సాగు చేస్తున్న భూమికి రెవిన్యూ పట్టాలు కూడా పంపిణీ చేస్తున్నాం. మొత్తం 3 లక్షల 50 వేల ఎకరాలకు గిరిజనులకు సాగు హక్కు కల్పిస్తున్నాం. దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఇంత పెద్దఎత్తున గిరిజనులకు భూ పంపిణీ చెయ్యలేదు. సీఎం జగన్ ఇచ్చిన మాట నిలబెట్టుకుని గిరిజన పక్ష పాతిగా నిలిచారు' అని డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి పేర్కొన్నారు. (నిజాలు దాచి.. నిందలు)

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement