
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం వివిధ శాఖలపై సమీక్ష నిర్వహిస్తున్నారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో సాంఘిక సంక్షేమం, గిరిజన, మైనారిటీ శాఖలపై జరుగుతున్న సమావేశంలో ఉప ముఖ్యమంత్రులు పుష్ప శ్రీవాణి, అంజాద్ బాషా, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. అలాగే మధ్యాహ్నం 3 గంటలకు ఎలక్ట్రిక్ బస్సులపై, సాయంత్రం 4.30 గంటలకు రాజధాని సీఆర్‌డీఏ అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించనున్నారు. కాగా సీఎం జగన్ నిన్న వాణిజ్య పన్నులు, ఎక్సైజ్, రిజిస్ట్రేషన్, స్టాంపులు, రవాణా శాఖల మంత్రులు, ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే.