
సాక్షి, అమరావతి: టీడీపీ ప్రభుత్వ హయాంలో గిరిజనులు తీవ్ర నిర్లక్ష్యానికి గురయ్యారని, వారి హక్కులను హరించేలా అప్పటి ప్రభుత్వం వ్యవహరించిందని ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి ధ్వజమెత్తారు. గిరిజనుల హక్కులు, రిజర్వేషన్లపై సీఎం వైఎస్ జగన్‌కి చంద్రబాబు లేఖ రాయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఆమె శనివారం మీడియాకు ఓ ప్రకటన విడుదల చేశారు.
► సీఎం వైఎస్ జగన్ బాక్సైట్ అనుమతులు రద్దు చేశారు.
► గిరిజన సలహా మండలిని ఏర్పాటు చేశారు.
► గిరిజన విశ్వవిద్యాలయం, ఇంజినీరింగ్, మెడికల్ కళాశాలల ఏర్పాటుకు ఆదేశాలిచ్చారు.
► ఏడు ఐటీడీఏలలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణానికి చర్యలు తీసుకున్నారు.
► ఏజెన్సీ పంచాయతీల్లో 100 శాతం వార్డులను, జెడ్పీటీసీ స్థానాలను గిరిజనులకు రిజర్వ్ చేశాం.
► మైదాన ప్రాంతాల్లోనూ 100 శాతం గిరిజన జనాభా ఉన్న తండాల్లో సర్పంచ్‌లు, వార్డు మెంబర్ల స్థానాలన్నింటినీ గిరిజనులకే కేటాయించాం.
► 4.76 లక్షల గిరిజన కుటుంబాలలకు ఉచిత విద్యుత్ ఇస్తున్నాం. జీవో నంబర్–3ను సుప్రీంకోర్టు కొట్టేయడానికి టీడీపీ ప్రభుత్వం చేసిన తప్పిదమే కారణం. గతంలో గిరిజనులకు 100 శాతం రిజర్వేషన్ కల్పించే జీవో 275 అమల్లో ఉండగా.. దాన్ని నిర్లక్ష్యం చేసి జీవో నంబర్–3ను తెచ్చారు. రాజ్యాంగంలో విస్తృతాధికారాలున్న 5(2) అధికరణం ప్రకారం కాకుండా, పరిమితాధికారాలున్న 5(1) ప్రకారం జీవోను తేవడం వల్ల సుప్రీం కోర్టులో వీగిపోయింది.
Comments
Please login to add a commentAdd a comment