సాక్షి, అమరావతి: చదువుకు పేదరికం అడ్డుకాకూడదన్నది ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఉద్దేశమని మంత్రి పుష్పశ్రీవాణి తెలిపారు. దీనికోసమే సీఎం జగన్ విప్లవాత్మక నిర్ణయం తీసుకున్నారని స్పష్టం చేశారు. గురువారం పుష్పశ్రీవాణి శాసనసభలో మాట్లాడుతూ.. నూటికి నూరు శాతం ఇంగ్లిష్ విద్య అందించే రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ సువర్ణాధ్యాయం సృష్టించబోతుందన్నారు. పిల్లల బంగారు భవిష్యత్ కోసమే ప్రభుత్వం ఇంగ్లిష్ విద్యను తీసుకొచ్చిందని వివరించారు. సీఎం జగన్ ప్రైవేటు స్కూళ్లలో తెలుగు సబ్జెక్ట్‌ను తప్పనిసరి చేశారని గుర్తు చేశారు. ప్రతిపక్ష నేత చంద్రబాబుకు ఏనాడైనా తెలుగు సబ్జెక్ట్‌ను తప్పనిసరి చేయాలనే ఆలోచన వచ్చిందా అని పుష్పశ్రీవాణి సూటిగా ప్రశ్నించారు.
దళితులను అవమానించారు..
ఎస్సార్సీపీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్‌బాబు సభలో మాట్లాడుతూ సీఎం జగన్ సిద్ధాంతాలపై నిలబడి పాలన చేస్తున్నారన్నారు. పిల్లలకు ప్రాథమిక దశ నుంచే ఇంగ్లిష్ విద్య అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రతిపక్షం ఇంగ్లిష్ విద్య వద్దని గగ్గోలు పెట్టి ఇప్పుడు యూటర్న్ తీసుకుందన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం ఇంకా వెన్నుపోటు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు, టీడీపీ నేతలు దళితులను ఎన్నో రకాలుగా అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు. దళితుడిగా ఎవరైనా పుట్టాలనుకుంటారా అని హేళన చేశారని ఆయన మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment