గిరిజన ప్రాంతాల్లోని సమస్యల్ని వెంటనే పరిష్కరించాలి: సీఎం జగన్‌ | Deputy CM Pushpa Srivani And Tribal MLAs Meets CM YS Jagan | Sakshi
Sakshi News home page

గిరిజన ప్రాంతాల్లోని సమస్యల్ని వెంటనే పరిష్కరించాలి: సీఎం జగన్‌

Published Tue, Nov 23 2021 4:47 PM | Last Updated on Tue, Nov 23 2021 5:03 PM

Deputy CM Pushpa Srivani And Tribal MLAs Meets CM YS Jagan - Sakshi

సాక్షి, అమరావతి: గిరిజన ఎమ్మెల్యేల నియోజక వర్గాల్లో అభివృద్ధిపనులు, స్థానిక సమస్యలను పరిష్కరించాలని కోరుతూ.. డిప్యూటి సీఎం పుష్పశ్రీవాణి, గిరిజన ఎమ్మెల్యేలు పీడిక రాజన్న దొర, తెల్లం బాలరాజు, విశ్వసరాయి కళావతి, తదితరులు శాసన సభలోని కార్యాలయంలో.. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిశారు. దీనిపై స్పందించిన సీఎం జగన్‌.. గిరిజన ప్రాంతాల అభివృద్ధికి అవసరమైన అన్నిచర్యలు తీసుకోవాలని సీఎంవో అధికారును ఆదేశించారు.

ఇటీవల కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న రోడ్లు, బ్రిడ్జిల నిర్మాణానికి సంబంధించిన అంశాలు, కరోనా సమయంలో ఆగిపోయిన రోడ్ల నిర్మాణం,ఎత్తైన కొండ ప్రాంతాల్లో నిర్మిస్తున్న రహదారులను మెషిన్స్‌ ద్వారా చేయడానికి అవసరమైన అనుమతులు, కొండ ప్రాంతాల్లోకి వెళ్లేందుకు అవసరమైన రైస్‌ వ్యాన్స్, మెరుగైన ఇంటర్నెట్‌ సౌకర్యం వంటి పలు అంశాలను సీఎం జగన్‌ దృష్టికి తీసుకెళ్లారు.

అదేవిధంగా... జీవో నంబర్‌ 3 పై న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని సీఎం జగన్‌ అధికారులను సూచించారు. షెడ్యూల్డ్‌ ఏరియాలో చేర్చని గ్రామాలను కూడా చేర్చడం కొరకు.. రానున్న అసెంబ్లీలో సమావేశాలలో తీర్మానం చేయనున్నట్లు సీఎం జగన్‌ వెల్లడించారు. కాగా, గిరిజన ప్రాంతాల్లోని సమస్యలన్నింటిని వెంటనే పరిష్కరించాలని  సీఎం జగన్‌ అధికారులను ఆదేశించారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement