tribal areas
-
ఇంటింటికి సౌర సిరులు
మనకు సూర్యుడున్నాడు.వద్దన్నా రోజూ ఉదయిస్తాడు.సిస్టమ్ ఉంటే పవర్‌ఫుల్‌గా పనిచేస్తాడు.కరెంట్ కష్టాలకు చెల్లు చీటి ఇస్తాడు.దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఘనంగా 75 ఏళ్ల ఉత్సవాలను కూడా చేసుకున్నాం. కానీ ఇప్పటికీ దేశంలో కరెంటు దీపం వెలగని గ్రామాలున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌లోని పాడేరు, చుట్టుపక్కల గ్రామాలు కూడా. ఇలాంటి గ్రామాల్లో వెలుగులు నింపారు ఈ హైదరాబాద్ ఇంజనీర్. వాహనం వెళ్లడానికి దారి లేని పాడేరు కొండలను కాలినడకన చుట్టి వచ్చిన రాధికా చౌదరి అక్కడి యాభై గ్రామాల్లో సౌరశక్తితో దీపాలు వెలిగించారు. కోటి ఇళ్లకు సౌర వెలుగులను అందించాలనే కేంద్రప్రభుత్వ నిర్ణయంలో భాగంగా ఆమె నాలుగు లక్షల ఇళ్లకు సర్వీస్ అందించారు. సోలార్ ఎనర్జీలో కెరీర్‌ని నిర్మించుకున్న రాధిక... పీఎం సూర్య ఘర్ యోజన పథకం ద్వారా లబ్ది పొందమని సూచిస్తున్నారు.మూడు తర్వాత బయటకు రారుపాడేరు కొండల్లో నివసించే ఆదివాసీలు మధ్యాహ్నం మూడు గంటల తర్వాత బయటకు రారు. బయటకు వెళ్లిన వాళ్లు సూర్యుడు అస్తమించేలోపే తిరిగి ఇల్లు చేరాలి కాబట్టి మధ్యాహ్నం మూడు తర్వాత ఇల్లు కదలేవాళ్లు కాదు. అలాంటి వాళ్లకు సౌరశక్తితో దీపం వెలుతురును చూశారు. మన పాడేరు వాసులే కాదు, కశ్మీర్‌లోయలోని లధాక్, లేప్రాంతాలు కూడా సౌర వెలుగును చూశాయి. కేరళ, కర్ణాటక, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, తెలంగాణ జిల్లాలతో సహా మొత్తం 27 రాష్ట్రాల్లో 50 పట్టణాల్లో సేవలు అందించారామె. సోలార్ ఉమన్రాధికకు యూఎస్‌లో ఎమ్ఎస్ న్యూక్లియర్ ఇంజనీరింగ్‌లో ఫ్రీ సీట్ వచ్చింది. సోలార్ పవర్‌తో శాటిలైట్లను పనిచేయించడం అనే అంశంలో కోర్సు చేయడానికి నాసా స్పాన్సర్ చేసింది. యూఎస్‌లో కొంతకాలం విండ్ ఎనర్జీలో ఉద్యోగం, మరికొన్నేళ్లు స్వీడిష్ కంపెనీకి పని చేశారామె. ఆల్టర్నేటివ్ ఎనర్జీ సెక్టార్లో అడుగు పెట్టడం నుంచి సోలార్ పవర్ విభాగంలో పని చేయడంలో ఆసక్తి పెంచుకున్నారు రాధిక. ఇండియాలో సర్వీస్ ఇచ్చే అవకాశం రాగానే 2008లో ఇండియాకి వచ్చేశారు. ఆ తర్వాత ఆరేళ్లకు సోలార్ ఎనర్జీలో పని చేసిన సౌరవ్‌తో కలిసి ఫ్రేయర్ ఎనర్జీ ప్రారంభించారు. ‘‘నలుగురు వ్యక్తులం, ఓ చిన్న గది. ఆరు నెలలు జీతం తీసుకోలేదు. ఆ తర్వాత కూడా అనేక ఒడిదొడుకులు ఎదుర్కొని విస్తరించాం. ఇప్పుడు 450 మంది ఉద్యోగులతో పని చేస్తోంది మా సంస్థ’’ అన్నారామె. మనదేశంలో సోలార్ ఎనర్జీ విభాగంలో ఇంత భారీ స్థాయిలో సర్వీస్ అందిస్తున్న ఏకైక మహిళ రాధిక. ఏ వ్యాపారానికైనా ఇండియా చాలా పెద్ద మార్కెట్. కాబట్టి ఇండియా మొత్తాన్ని కవర్ చేయాలన్న కేంద్రప్రభుత్వం విధానాలతో కలిసి పనిచేస్తూ దేశాన్ని సౌరవెలుగులతో నింపడమే ప్రస్తుతానికి ఉన్న ఆలోచన’’ అన్నారామె. ప్రత్యామ్నాయం ఇదిబొగ్గు నిల్వలు తగ్గుతున్నాయి. విద్యుచ్ఛక్తి ఉత్పత్తికి బొగ్గు గనుల మీద ఆధారపడడం తగ్గించి ఆల్టర్నేటివ్ ఎనర్జీని వినియోగంలోకి తెచ్చుకోవాలి. విండ్ పవర్ అనేది వ్యవస్థలు చేపట్టాల్సిందే కానీ వ్యక్తిగా చేయగలిగిన పని కాదు. ఇక మిగిలింది సోలార్ పవర్. సౌరశక్తిని వినియోగించుకోవడం సాధ్యమే. నిజమే... కానీ ఒక ఇంటికి సోలార్ సిస్టమ్ ఇన్స్టాల్ చేసుకోవాలంటే ఎంత ఖర్చవుతుంది? దాదాపు లక్ష అవుతుంది. సగటు మధ్య తరగతి నుంచి ‘అమ్మో ఒక్కసారిగా అంత ఖర్చా మా వల్ల కాదు’ అనే సమాధానమే వస్తుంది. అలాంటి వాళ్లకు రాధిక ఇచ్చే వివరణే అసలైన సమాధానం.నాలుగేళ్ల్ల బిల్ కడితే ఇరవై ఏళ్లు ఫ్రీ పవర్ సోలార్ సిస్టమ్ ఒకసారి ఇన్స్టాల్ చేసుకుంటే పాతికేళ్లు పని చేస్తుంది. నెలకు రెండువేల రూపాయలు కరెంటు బిల్లు కట్టే ఇంటికి రెండు కిలోవాట్ల కెపాసిటీ ΄్లాంట్ అవసరమవుతుంది. దాని ఖర్చు లక్షా నలభై వేలవుతుంది. ప్రభుత్వం నుంచి 60 వేల సబ్సిడీ వస్తుంది. వినియోగదారుడి ఖర్చు 80 వేలు. ఏడాదికి 24 వేల రూపాయలు కరెంటు బిల్లు కట్టే వాళ్లకు నాలుగేళ్లలోపు ఖర్చు మొత్తం వెనక్కి వచ్చినట్లే. ఇక కనీసంగా ఇరవై ఏళ్లు సోలార్ పవర్‌ని ఫ్రీగా పొందవచ్చు. సోలార్ పవర్‌ను పరిశ్రమలకు కూడా విస్తరిస్తే కార్బన్ ఫుట్ ప్రింట్ కూడా తగ్గుతుంది.– రాధికా చౌదరి,కో ఫౌండర్, ఫ్రేయర్ ఎనర్జీ– వాకా మంజులారెడ్డి, ఫొటోలు : మోహనాచారి -
గిరిజనుల భూమి గిరిజనులకే!
ప్రధాన జీవన స్రవంతిలో ఆదివాసీ ప్రజల అస్తిత్వం, గౌరవం, కృషి ఏ మేరకు గుర్తింపునకు నోచుకున్నాయిఅనేదాన్నిబట్టి ఆ జాతి సమగ్ర మూర్తిమత్వం అర్థమవుతుంది. అల్లూరి సీతారామరాజు, రాంజీ గోండ్, కొమురం భీం లాంటి యోధులు ‘జల్’, ‘జంగల్’, ‘జమీన్ ’ పేరిట వారి హక్కుల సాధన కొరకు పోరాడి ప్రాణాలర్పించారు. అయితే స్వతంత్ర భారతదేశంలో గిరిజనుల కోసం చేసిన చట్టాలు నిర్వీర్యమయ్యాయి. చొరబాటుదారులు అడవి ద్వారాలు తీశారు. ఆదిమ జాతీయులకు వారి భూమి వారికి దక్కకుండా పోవడం క్షమించరానిది. ప్రభుత్వాలు, పార్టీలు, స్వచ్ఛంద సంస్థలు ఆలోచించి ఒక ఆమోదయోగ్యమైన కార్యాచరణను రూపొందించుకోకపోతే ఆందోళనకరమైన పరిస్థితులు అనివార్యమవుతాయని గత ఉద్యమాల చరిత్ర చెబుతోంది.మాతృమూర్తైనా, మాతృభాషైనా, మాతృదేశమైనా పలికేటప్పుడు వేరువేరుగా వినిపించినా ఆ మూడింటి అంతఃసూత్రం ఒకటే బంధం. తల్లి గర్భాల యంలో మనం నేర్చుకున్న మనదైన భాషలో మాతృదేశంలో తొలి అడుగు మోపే నవజాత శిశువుకు ఈ మూడింటి అస్తిత్వం అనివార్యంగా ఇవ్వబడుతుంది. ఇలాంటిదే ఒక జాతికి కూడా ఉంటుంది. అదే మూలవాసీ సంస్కృతి. ప్రధాన జీవన స్రవంతిలో ఆదివాసీ ప్రజల అస్తిత్వం, గౌరవం, కృషి ఏ మేరకు గుర్తింపునకు నోచుకు న్నాయి అనేదాన్నిబట్టి ఆ జాతి సమగ్ర మూర్తిమత్వం అర్థమవుతుంది.సుద్దాల అశోక్‌తేజ రాసిన ‘కొమురం భీముడో’ అన్న సినీ గేయం కొత్త ఆలోచనల్ని రేకెత్తిస్తుంది. అడవి తల్లి తన గిరిజన సంతానాన్ని ఆత్మ గౌరవ బావుటా ఎగురెయ్యాలని సందేశాత్మకంగా చేసిన హెచ్చరి కలను స్పష్టం చేసేవిధంగా ఈ పాట సాగింది. వారి హక్కుల కోసం వారే ఉద్యమించాలనే ఉద్వేగాన్ని నింపుతుంది. ఈ పాట ప్రతి గిరిజనుడిని అగ్ని కణంలా వెంటాడింది. దేశంలో గిరిజన ప్రాంతా లున్న అన్ని రాష్ట్రాలలో వారి భాషలోకి తర్జుమా చేసి వినిపించాలనే ప్రణాళికతో అక్కడి నాయకులు ముందుకుపోతున్నారు. ‘మన సంస్కృతి మూలాల్ని నాశనం చేస్తున్న విదేశీయుల మీద నా పోరాటం’ అన్నారు బిర్సా ముండా. నూరేళ్ళ జీవితానుభవంతో 25 ఏళ్లు బతికి ధిక్కార హెచ్చరికను వినిపించి, బ్రిటిష్‌వాళ్ల గుండెల్లో ఫిరంగులు పేల్చాడు. ఆయన జయంతి నవంబర్ 15న ‘జన్ జాతీయ దివస్’గా జరుపుకొంటున్నాం. బిర్సా ముండా చిత్రపటాన్ని పార్లమెంటు సెంట్రల్ హాల్లో ఉంచడంతో పాటు, రాంచీ విమానాశ్ర యానికి, ఇంకా ఎన్నో సంస్థలకు ఆ వీరుని పేరు పెట్టడం జరిగింది. అల్లూరి సీతారామరాజు, రాంజీ గోండ్, కొమురం భీం లాంటి యోధులు ‘జల్’, ‘జంగల్’, ‘జమీన్ ’ పేరిట వారి హక్కుల సాధన కొరకు పోరాడి ప్రాణాలర్పించారు. బ్రిటిష్ పాలనలో మొత్తం 75 సార్లు గిరిజన తిరుగుబాట్లు జరిగాయంటే వారి చైతన్యం ఎంత గొప్పదో అర్థం చేసుకోవాలి. తెలంగాణా గవర్నరు జిష్ణుదేవ్ వర్మ ఈ మధ్యన తెలంగాణ గిరిజన ప్రాంతాలలో పర్యటించడం ముదావహం. గిరిజనులకు బాస టగా నిలవడానికి ‘యాక్ట్ 1/70’ని రూపొందించుకున్నాం. అందులో ఉన్న సెక్షన్ 3(1)(ఎ) ప్రకారం, వివాదాలు తేలేంతవరకు షెడ్యూల్డ్ ప్రాంతాలలో ఉన్న భూమి గిరిజనులదిగానే భావించబడుతుంది. ఈ మధ్యన గవర్నరు పర్యటించిన ప్రాంతం ఆ కోవకే చెందుతుంది. వారికి అధికారులు ఏ మేరకు పరిస్థితులను విశదీకరించారో గానీ, రాజ్యాంగంలోని ‘షెడ్యూల్ 5’ ప్రకారం గవర్నరుకు విశేషాధికారాలు ఉంటాయి. ఇది వజ్రాయుధం లాంటిది. డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ ‘రాజ్యాంగం ఎంత మంచిదైనా దాన్ని అమలు పరిచేవాళ్ళు చెడ్డవాళ్లైతే అది కూడా చెడ్డది కావడం ఖాయం. రాజ్యాంగం ఎంత చెడ్డదైనా దాన్ని అమలు పరిచేవాళ్ళు మంచివాళ్లైతే అది కూడా మంచిదవటం అంతే ఖాయం’ అన్నారు. మన రాజ్యాంగ సంవిధాన మౌలిక నిర్మాణం ఎంతో గొప్పది. సామాజిక అణచివేతకు గురైనవారి అభ్యున్నతి కోసం తోడ్పడడమే రాజ్యాంగంలోని రిజర్వే షన్ల లక్ష్యం.స్వాతంత్య్రానంతరం పాలకులు ఆదివాసీలను చేరడానికి ముఖ్యంగా మూడు ఆలోచనలు చేశారు. ఏకాంతవాసం, కలిసి పోవటం, అభ్యున్నతి. 1958లో మన తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ఈ కలిసిపోవటాన్ని ఎంచుకున్నారు. అంటే ఆదివాసీలతో కలిసి వారిని అభివృద్ధి పరచాలని. ఆదివాసీలను దోపిడీ నుంచి కాపా డాలని, రక్షణగా నిలవాలని, వారికి సంక్షేమ పథకాలు రూపొందింపజేయాలని భావించి ‘పంచశీల’ను ఎంచుకున్నారు. ఆ తరువాత యాక్ట్ డి.ఎఫ్. 1970 చట్టం తీసుకొచ్చారు. గిరిజనుల భూమిని, అటవీ సంపదను ఇది కవచంలాగా కాపాడుతుందని ఊదరగొట్టారు. కానీ ఆ చట్టాలు నిర్వీర్యం అయ్యాయి. చొరబాటుదారులు అడవి ద్వారాలు తీశారు.తెలంగాణాలో నిజాం కాలంలో దీనికోసం హైమన్ డార్ఫ్‌ని తన సలహాదారుగా నియమించుకున్నారు. ఎన్నో సంస్కరణలు చేశామను కున్నారు. కానీ 1948 అనంతరం ఏర్పడిన ప్రభుత్వాలు ఈ దిశగా పెద్దగా చర్యలు తీసుకోలేదు. 1976, ’77లో ఆదిలాబాద్‌లోని ఉట్నూరు ప్రాంతాన్ని సందర్శించినప్పుడు విస్తుపోయే వాస్తవాలెన్నో వెలుగులోకి వచ్చాయి. సంపన్నతే చుట్టరికంగా మహారాష్ట్ర, గుజరాత్, ఆంధ్రా ప్రాంతాల నుండి వచ్చిన ధనికులు గిరిజనుల భూమిని ఆక్రమించుకొని, అసలు హక్కుదారులైన గిరిజనులను అక్కడ నుండి తరిమేశారనీ, దాంతో వారు దూరంగా వచ్చి తలదాచుకున్నారనీ, ఇప్పుడు ఆ స్థలాల నుండి కూడా అటవీ అధికారులు వేరే ప్రాంతాలకు వెళ్ళాలని బెదిరిస్తున్నారనీ గిరిజనులు చెప్పుకొచ్చారు.ఇదంతా వింటుంటే చరిత్రలోని చివరి మొఘల్ రాజు బహదూర్ షా జాఫర్ కథ గుర్తొస్తోంది. 1857 తిరుగుబాటు అణచివేయబడి బ్రిటిష్ సైన్యం చేతిలో ఆయన ఓడిపోయిన తరువాత రెండు గజాల భూమి తన భారతదేశంలో తనకు దొరకలేదనీ, ఆ బాధతోనే తన చివరి రోజుల్లో బర్మాలోనే గడుపుతూ అక్కడే ఖననం చేయబడ్డాడనీ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి గిర్‌గిలాని తన ఉపన్యాసంలో ఉట్టంకించటం గుర్తొస్తోంది. ఇక్కడ మనం చర్చించాల్సిన అంశం ఒకటుంది. రాజ్యాంగంలోని 5వ, 6వ షెడ్యూళ్ళ ద్వారా గవర్నర్లకు విశేష అధికారాలే కల్పించారు. వారి జీవన స్రవంతిని, సంస్కృతి, వైవిధ్యాలను రక్షిస్తూ తమకు నచ్చిన రీతిలో జీవించే విధంగా గవర్నర్లు రెగ్యులరైజేషన్ ద్వారా పరిపాలించే అధికారాలను ఈ అధికరణలు ఇవ్వడం జరిగింది.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విషయానికొస్తే గిరిజనులు, వారి భూములపై హక్కుల అంశంపై అధ్యయనం చేయడానికి ల్యాండ్ కమిటీని నియమించింది. ఆ కమిటీ నివేదికను 2005 ఆగస్టు 15న జె.ఎన్. గిర్‌గిలాని ఆనాటి శాసనసభకు సమర్పించారు. అందులో ఎన్నో భయంకర నిజాలు, గిరిజనేతరులు కబళించిన భూవివరాలు వెల్లడ య్యాయి. అదేవిధంగా ఆంధ్ర ప్రాంతంలోని గిరిజన ప్రాంతాల కోసం ఐఏఎస్ మూర్తి గారిని నియామకం చేసింది ప్రభుత్వం. వీరి నివేది కలో కేంద్రంలో కొంతమంది ఉన్నతాధికారులు అసలు 5వ షెడ్యూ ల్నే రాజ్యాంగం నుంచి ఎత్తివేయాలని ప్రభుత్వానికి సూచించినట్లు ఒక ఆశ్చర్యకరమైన అంశం వెలుగులోకి వచ్చింది. ఈ రెండు నివే దికలు ‘రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్’ ద్వారానే బహిర్గతమయ్యాయి తప్ప, అసలు శాసనసభ మెట్లు ఎక్కలేదన్నది నిజం. తెలంగాణ గవర్నర్ పర్యటించిన ములుగు జిల్లా గోవింద రావు పేట మండలంలోని గిరిజనుల భూముల అన్యాక్రాంతం గురించి ప్రభుత్వం నియమించిన కమిటీ 25 సంవత్సరాల క్రితమే నివేదిక లిచ్చినా ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు. ట్రైబల్ రెగ్యులేషన్ యాక్ట్ కింద వేలాది ఎకరాలు అన్యాక్రాంతమైనాయనీ, వాటిని గిరిజనులకు అప్పగించాలనీ తీర్పులిచ్చినా చలనం లేదు. తరతరాల నుండి జరిగిన అన్యాయాలను దృష్టిలో పెట్టుకొని రూపొందించిన ‘ఫారెస్ట్ రైట్ యాక్ట్ 2006’ కూడా నిరర్థకంగా మారింది. బిహార్‌లో గిరిజన యోధుడు బిర్సా ముండా త్యాగాన్ని శ్లాఘిస్తూ ఏళ్ల తరబడి గిరిజనుల హక్కుల కోసం పోరాడుతున్న డాక్టర్ ఫెలిక్స్ పెడల్‌ను ఇక్కడ ఉదాహరణగా చెప్పుకోవాలి. ఈయన ఎంతో చరిత్ర ఉన్న చార్లెస్ డార్విన్ మునిమనవడు. ఆయన నుండి స్ఫూర్తిని పొందాలి. ‘ఆజాద్ కా అమృతోత్సవ్’ దేశమంతటా జరుపుకొంటున్న శుభ వేళ ఆదిమ జాతీయులకు మాత్రం వారి భూమి వారికి దక్కకుండా పోవడం క్షమించరానిది. ఏ చర్యలు తీసుకున్నామని వివిధ ప్రభు త్వాలు, ప్రభుత్వ యంత్రాంగాలు, వివిధ రాజకీయ పార్టీలు,స్వచ్ఛంద సంస్థలు ఆలోచించాలి. దృఢ సంకల్పంతో ఒక ఆమోద యోగ్యమైన కార్యాచరణను రూపొందిచుకోకపోతే ఆందోళనకరమైన పరిస్థితులు అనివార్యమవుతాయని గత ఉద్యమాల చరిత్ర స్పష్టం చేస్తోంది.సి.హెచ్. విద్యాసాగర్‌రావు వ్యాసకర్త మహారాష్ట్ర మాజీ గవర్నర్ -
కష్టాలకు గొడుగు పట్టారు
కేరళలోని అట్టపాడి గిరిజనప్రాంతంలో నవజాత శిశువుల మరణాలు అనేకం చోటు చేసుకున్నాయి. కారణం పౌష్టికాహార లోపం. పోషకాలు ఇచ్చే అటవీ ఆహారం నశించిపోయి గర్భిణులకు తిండి కరువైంది. దాంతో ఒక స్వచ్ఛంద సంస్థ వారిని గొడుగుల తయారీలో శిక్షణ ఇచ్చింది. 2015 నుంచి ‘కార్తుంబి’ (తూనీగ) అనే బ్రాండ్ కింద ఆ గిరిజన మహిళలు తయారు చేస్తున్న గొడుగులు దేశమంతా అమ్ముడుపోతున్నాయి. తాజాగా ప్రధాని మోడి తన ‘మన్ కీ బాత్’లో వీరిని శ్లాఘించారు. కర్తుంబి గురించి....‘కేరళ సంస్కృతిలో గొడుగులు ఒక భాగం. అక్కడి కార్తుంబి గొడుగుల గురించి నేను ప్రస్తావించ దలుచుకున్నాను. రంగు రంగుల ఆకర్షణీయమైన ఈ గొడుగులను ఆదివాసి మహిళలు తయారు చేస్తారు. కేరళలోని చిన్న పల్లె నుంచి తయారయ్యే ఈ గొడుగులు నేడు పెద్ద పెద్ద మల్టీనేషనల్ కంపెనీలకు చేరుతున్నాయి. ఓకల్ ఫర్ లోకల్‌కు ఇంతకుమించిన ఉదాహరణ ఏం కావాలి’ అని జూన్ 30న తన 111వ ‘మన్ కీ బాత్’లో ప్రధాని మోడి కర్తుంబి గొడుగుల గురించి చేసిన ప్రస్తావన అక్కడి గిరిజన మహిళల ముఖాన చిర్నవ్వులు తేవడమే కాదు దేశవ్యాప్తంగా వారు సాగిస్తున్న కృషిని తెలిపింది. చాలామంది నేడు కార్తుంబి గొడుగుల గురించి తెలుసుకుంటున్నారు. ఆ గాథతో స్ఫూర్తి పొందుతున్నారు.పాలక్కాడ్‌లో గిరిజనులుపాలక్కాడ్లోని లోపలి పల్లెల్లో ముడుగ, ఇరుల, కర్ముగ తదితర గిరిజనులు ఉంటారు. చాలా ఏళ్లపాటు వీరికి డబ్బు అవసరం ఏర్పడలేదు. అటవీ ఆహారమే వీరి ఆహారం. అయితే 2012 నుంచి ఈప్రాంతంలో నవజాత శిశువుల మరణాలు ఎక్కువగా నమోదవడం స్వచ్ఛంద సంస్థలు గమనించాయి. 2012 నుంచి 2015 వరకు ఇక్కడ అనధికారికంగా 200 శిశుమరణాలు జరిగి ఉంటాయని అంచనా. ఇందుకు కారణం గర్భిణులకు పౌష్టికాహారం లేకపోవడమే. ‘మేము తినే కందమూలాలు, పండ్లు, ఆకుకూరలు ఇప్పుడు అడవుల్లో లేవు. క్రూరమృగాల భయం వల్ల మేము వ్యవసాయం చేయము. మాకు అంతిమంగా డబ్బుతో అవసరం ఏర్పడింది. అది మా దగ్గర లేదు. కాబట్టి మేము ఆహారం కొనుక్కుని తినే పరిస్థితుల్లో లేము’ అని అక్కడ మహిళలు చె΄్పారు. దాంతో పాలక్కాడ్‌లో గిరిజనుల కోసం పని చేసే ‘తంపు’ అనే స్వచ్ఛంద సంస్థ వీరి సమస్యను లోకానికి తెలియచేసింది. గల్ఫ్‌లో పని చేస్తున్న కేరళీయుల బృందం వీరి సాయానికి ముందుకు వచ్చింది. ఫలితంగా ఏర్పడిందే ‘కార్తుంబి’ గొడుగుల బ్రాండ్.రంగుల తూనీగపాలక్కాడ్లో పిల్లల కోసం పని చేసే ఒక సంస్థ ‘కార్తుంబి’ (తూనీగ) పేరుతో అందరికీ తెలుసు. అందరినీ ఆకర్షించే ఈ పేరుతోనే బ్రాండ్ ఏర్పాటు చేసి ఆదివాసీ మహిళలకు గొడుగుల తయారీలో శిక్షణ ఇచ్చారు. మొదట 70 మందిని ఎంపిక చేసి వారికి మెటీరియల్ సరఫరా చేస్తే గొడుగులు ఎలా చేయాలో నేర్పారు. ఆ తర్వాత వారు తమ రోజువారీ పనులు చేసుకుంటూనే ఇంట్లో వీలైనప్పుడల్లా గొడుగులు తయారు చేసే వెసులుబాటు ఇచ్చారు. ఒక గొడుగు తయారు చేస్తే 30 రూపాయల కూలీతో ఈ పని మొదలైంది. 2017 నుంచి కేరళ గిరిజన సంక్షేమ శాఖ ఫండ్ రిలీజ్ చేస్తోంది. వీరి నుంచి తయారైన గొడుగులు వివిధ సంస్థల ద్వారా మార్కెటింగ్ అవుతున్నాయి.సీజన్లో 17 వేల గొడుగులు70 మంది మహిళలతో మొదలైన ఈ పని నేడు 350 గిరిజన మహిళలకు చేరుకుంది. వీరు జనవరి నుంచి మే చివరి వరకు మాత్రమే పని చేస్తారు. జూన్ మొదటి వారంలో మాన్సూన్ రావడంతో గొడుగుల అమ్మకాలు ఉంటాయి కాబట్టి. ఒక సీజన్లో వీరంతా కనీసం 17 వేల గొడుగులు తయారు చేస్తున్నారు. ఒక్కొక్క మహిళ రోజుకు 700 నుంచి వేయి రూపాయల వరకు సంపాదిస్తుంది. ఈ త్రీఫోల్డ్ గొడుగులు మెటీరియల్‌ను బట్టి 350 రూపాయల నుంచి 649 రూపాయల వరకూ అందుబాటులో ఉన్నాయి.గొడుగుల దానంచలికాలంలో రగ్గుల దానం ఎంత అవసరమో వానాకాలంలో గొడుగుల దానం అంత అవసరం. కార్తుంబి గొడుగుల మార్కెటింగ్ కోసం ఒక టెకీ సంస్థ కార్పొరేట్ సంస్థలను సంప్రదించి వారిచేత గొడుగులు కొనేలా చేస్తోంది. ఉద్యోగులకు, పేదవారికి ఉచితంగా ఇచ్చేలా చూస్తుంది. అలాగే కేరళలో వానాకాలంలో స్కూళ్లకు వచ్చిపోయే పేద పిల్లలకు గొడుగులు చాలా అవసరం. అందుకే ‘స్కూలు పిల్లలకు కార్తుంబి గొడుగులు’ పేరుతో కూడా క్యాంపెయిన్లు జరుగుతుంటాయి. సీజన్ మొదట్లో బల్క్‌గా ఈ గొడుగులు కొని పిల్లలు పంచుతుంటారు చాలామంది. ఇప్పుడు ప్రధాని ప్రసంగం వల్ల కేరళలోని ఇతర మహిళలు కూడా ఈ గొడుగుల తయారీ పట్ల ఆసక్తి చూపుతున్నారు. రాబోయే రోజుల్లో వానలొస్తే రంగు రంగుల కార్తుంబి తూనీగలు ప్రతి ఒక్కరి నెత్తిమీద ఎగురుతుంటాయని ఆశిద్దాం. -
ఛత్తీస్‌గఢ్: గిరిజన ప్రాంతాల్లో స్వీప్
ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారాన్ని నిలబెట్టుకుంటుందన్న పోల్ పండితుల అంచనాలను, ఎగ్జిట్ పోల్స్‌ను బీజేపీ తలకిందులు చేసింది. సునాయాసంగా మెజారిటీ మార్కు దాటేసి భూపేశ్ బఘేల్ సర్కారును గద్దె దించింది. ఐదు సంవత్సరాల విరామం అనంతరం తిరిగి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. మొత్తం 90 అసెంబ్లీ స్థానాలకుగాను ఏకంగా 54 సీట్లు నెగ్గింది. రాష్ట్రంలో బీజేపీకి ఇదే అత్యధిక మెజారిటీ కావడం విశేషం. గిరిజన ప్రాంతాలైన సర్గుజా, బస్తర్‌లను ఏకపక్షంగా కొల్లగొట్టడమే బీజేపీ విజయానికి ప్రధాన కారణంగా నిలిచింది. బస్తర్, సర్గుజాలో హవా ఛత్తీస్‌గఢ్‌లో తాజాగా వెల్లడైన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్‌కు షాకివ్వడం నిజమే అయినా బీజేపీని కూడా ఒకింత విస్మయపరిచాయనే చెప్పాలి. ఎందుకంటే బఘేల్ సర్కారు ఐదేళ్ల పాలనపై ప్రజల్లో ఎక్కడా పెద్దగా వ్యతిరేకత వ్యక్తం కాలేదు. అందుకు ప్రధానంగా ఆయన పక్కాగా అమలు చేసిన పలు సంక్షేమ, ప్రజాకర్షక పథకాలే కారణంగా నిలిచాయి. ముఖ్యంగా 2018లో రాష్ట్ర చరిత్రలోనే భారీ మెజారిటీతో అధికారంలోకి రాగానే బఘెల్ ప్రవేశపెట్టిన వరికి బోనస్ పథకం రాష్ట్రంలో సూపర్‌హిట్టయింది. వరికి దేశంలోనే అత్యధిక బోనస్ ఇస్తున్న రాష్ట్రంగా ఛత్తీస్‌గఢ్ నిలిచింది. పారీ్టలకతీతంగా అర్హులందరికీ పథకం ఫలాలు అందేలా బఘేల్ జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ నేపథ్యాన్ని బట్టి చూస్తే ఈసారి బీజేపీ గెలుపు అందరినీ ఆశ్చర్యపరిచిన పరిణామమే. గిరిజన ప్రాంతాల్లో అసెంబ్లీ స్థానాలన్నింటినీ ఈసారి బీజేపీ ఏకపక్షంగా ఒడిసిపట్టడమే దాని మెజారిటీకి ప్రధాన కారణంగా నిలిచింది. దక్షిణ ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్, ఉత్తరాదిన ఉన్న సర్గుజా రెండూ బీజేపీకి జైకొట్టాయి. బస్తర్‌లోని 12 స్థానాలకు గాను బీజేపీకి 9 స్థానాలు దఖలుపడ్డాయి. సర్గుజాలోనైతే మొత్తం 14 సీట్లను గాను బీజేపీ ఏకంగా 13 స్థానాలను దక్కించుకుంది. ఈ ప్రాంతం ఉప ముఖ్యమంత్రి టీఎస్ సింగ్‌దేవ్ కంచుకోట కావడం విశేషం. రాజవంశీకుడైన ఆయన 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ప్రభావంతో సర్గుజా ప్రాంతంలో కాంగ్రెస్ హవా కొనసాగింది. ఆనాడు 14 స్థానాలకుకుగాను కాంగ్రెస్‌కు 12 సీట్లు దక్కాయి. ఈసారి పరిస్థితి దాదాపుగా తారుమారవడం విశేషం. ఇక్కడ బీజేపీ హవా దెబ్బకు చివరికి సింగ్‌దేవ్ సైతం ఓటమి చవిచూశారు. బస్తర్‌లో మాత్రం 3 స్థానాలతో కాంగ్రెస్ ఉనికి నిలుపుకోగలిగింది. రాజధాని ప్రాంతంలో కాంగ్రెస్‌కు మొగ్గు ► గిరిజన ప్రాంతాలతో పోలిస్తే రాజధాని రాయ్‌పూర్ ప్రాంతంలో మాత్రం కాంగ్రెస్ మెరుగైన ప్రదర్శనే చేసింది. ►ఇక్కడి 20 స్థానాల్లో ఆ పార్టీ 11 సీట్లు నెగ్గింది. బీజేపీకి 9 స్థానాలు దక్కాయి. ►బిలాస్పూర్ ప్రాంతంలో బీజేపీ 13, కాంగ్రెస్ 10 చోట్ల గెలిచింది. పాలి తనఖర్లో గోండ్వానా గణతంత్ర పార్టీ గెలిచింది. ►దుర్గ్ ప్రాంతంలోనూ 20 స్థానాలుండగా బీజేపీ, కాంగ్రెస్ చెరో పదింటిని గెలుచుకున్నాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
కొండకోనల్లో ‘కొత్త’ బడులు
సాక్షి, అమరావతి: ‘నాడు – నేడు’ కార్యక్రమంతో రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా తీర్చిదిద్దుతున్న వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం.. మారుమూల గిరిజన ప్రాంతాల్లోని పాఠశాలల్లో సమూల మార్పులు తెస్తున్నారు. రవాణా సౌకర్యం లేని కొండకోనల్లో మారుమూల ప్రాంతాల్లో ఉన్న పల్లెల్లోని ఈ పాఠశాలలను ఇంతవరకు ఏ ప్రభుత్వం పట్టించుకోలేదు. దీంతో ఎన్నో ఏళ్లుగా ఉన్నప్పటికీ ఈ పాఠశాలలు పాకల్లో, రేకుల షెడ్లలో నడుస్తున్నాయి. చాలా తక్కువ స్కూళ్లకు భవనాలు ఉన్నప్పటికీ, అవి శిథిలమైపోయాయి. ఇలాంటి పాఠశాలలకు ప్రభుత్వం ‘నాడు – నేడు’ కార్యక్రమం రెండో దశ కింద కొత్త రూపునిస్తోంది. వీటిలో పాడుబడ్డ భవనాలను బాగు చేసి, కొత్త భవనాలు కూడా నిర్మిస్తోంది. తొలుత 20 మందికంటే ఎక్కువ విద్యార్థులున్న 763 స్కూళ్లను గుర్తించారు. వీటిలో రూ.219.69 కోట్లతో పనులు చేపట్టారు. వీటిలో అత్యధికంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో 75 పాఠశాలలు ఉన్నాయి. నెల్లూరు జిల్లాలో 66, తిరుపతి 51, చిత్తూరు 42, సత్యసాయి జిల్లాలో 38 ఉన్నాయి. మిగిలిన జిల్లాల్లో 9 నుంచి 30 వరకు పాఠశాలలు ఉన్నాయి. కొత్త భవనాలు నిర్మించాల్సినవి 360 వరకు ఉండగా, మిగిలినవి మెరుగులు దిద్దాల్సినవి ఉన్నాయి. ఇప్పటికే 180 స్కూళ్ల పనులు పూర్తి చేయగా, మిగిలిన పాఠశాలల పనులు రెండు నెలల్లో పూర్తి చేయాలని పాఠశాల విద్యా శాఖ మౌలిక వసతుల కల్పన కమిషనర్ ఆదేశించారు. నాడు–నేడు మూడో దశలో ఏజెన్సీలోని 20 మంది కంటే తక్కువ విద్యార్థులున్న పాఠశాలలను ఆధునీకరించాలని నిర్ణయించారు. 817 పాఠశాలల్లో సదుపాయాలు.. ప్రతి పాఠశాలలో తాగునీరు, మరుగుదొడ్లు, విద్యుత్‌ను ప్రభుత్వం తప్పనిసరి చేసింది. దీంతో నాడు–నేడు పనులు చేపట్టిన 817 పాఠశాలల్లో యుద్ధ ప్రాతిపదికన రూ.46.83 కోట్లతో ఈ సౌకర్యాలు కల్పిస్తున్నారు. ఇలాంటి పాఠశాలలు కూడా ఏజెన్సీ ప్రాంతాల్లోనే అధికంగా ఉన్నాయి. అత్యధికంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో 457 ఉన్నాయి. -
దళితులు, గిరిజనులకు సముచిత గౌరవం
సాగర్: గత ప్రభుత్వాలకు దళితులు, ఓబీసీలు, గిరిజనులు ఎన్నికలప్పుడే గుర్తుకు వచ్చేవారని ప్రధాని మోదీ ఆరోపించారు. దళిత బస్తీలు, నిరుపేదలుండే ప్రాంతాలు, గిరిజన ప్రాంతాల్లో నీటి వసతి కూడా ఉండేది కాదన్నారు. తమ ప్రభుత్వం మాత్రం దళితులు, ఓబీసీలు, గిరిజనులకు సముచిత గౌరవం ఇచ్చిందని, జల్ జీవన్ మిషన్ ద్వారా వారి ఇళ్లలోకే మంచినీరు అందిస్తోందని చెప్పారు. మధ్యప్రదేశ్‌లోని సాగర్ జిల్లా బడ్తుమా గ్రామంలో శనివారం ప్రధాని సంత్ రవిదాస్ జ్ఞాపకార్థం 11 ఎకరాల విస్తీర్ణంలో రూ.100 కోట్లతో నిర్మించే ఆలయం–స్మారక నిర్మాణానికి భూమిపూజ చేశారు. అనంతరం బినా–కోటా డబుల్ లేన్ రైలు మార్గాన్ని జాతికి అంకితం చేయడంతోపాటు వివిధ రహదారి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ధానాలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడారు. -
ఇంకా 44 శాతం గిరిజన ప్రాంతాలకు నల్లా నీరు లేదు: కేంద్రం
ఇంకా 44 శాతం గిరిజన ప్రాంతాలకు నల్లా నీరు లేదు: కేంద్రం -
రూ.2 వేల కోట్లతో గిరిజన ప్రాంతాల్లో పక్కా రోడ్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాల్లో పక్కా రోడ్లు నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.2 వేల కోట్లు మంజూరు చేసిందని, ఈ పనులకు సంబంధించిన అనుమతులు తాజాగా జారీ అయ్యాయని గిరిజన, మహిళాభివృద్ధి శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ వెల్లడించారు. ఈ రోడ్లతో గిరిజన ప్రాంతాల రూపురేఖలు మారిపోతాయని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. గిరిజన ప్రాంతాల్లో 1,179 రోడ్ల నిర్మాణ పనులను ఈ నిధులతో చేపడతామన్నారు. మొత్తం 3,152.41 కిలోమీటర్ల మేర పనులకు త్వరలో టెండర్లు పూర్తి చేస్తామని, వెనువెంటనే పనులు ప్రారంభించి ఈ ఏడాది చివరికల్లా పూర్తి చేస్తామని మంత్రి వెల్లడించారు. గిరిజన సంక్షేమ శాఖ ద్వారా తలపెట్టిన కార్యక్రమాలను శనివారం జరిగిన మీడియా సమావేశంలో మంత్రి వివరించారు. రాష్ట్రంలోని ప్రతి యూనివర్సిటీ క్యాంపస్‌లో గిరిజన సంక్షేమ శాఖ ప్రత్యేకంగా గిరిజన బాలబాలికల వసతి గృహాలను నిర్మించనుందని తెలిపారు. ఇప్పటికే వరంగల్ కాకతీయ యూనివర్సిటీ పరిధిలో 500 మంది విద్యార్థులకు సరిపడేలా హాస్టళ్లను నిర్మిస్తున్నామన్నారు. 3,467 గిరిజన ఆవాసాలకు రూ.324 కోట్లు ఖర్చు చేసి త్రీఫేజ్ విద్యుత్ సౌకర్యం కల్పించడంతో దాదాపు 2.4 లక్షల ఎకరాలకు సాగునీటి సౌకర్యం కలిగిందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 11లక్షల ఎకరాల పోడు భూములకు సంబంధించి 4 లక్షల దరఖాస్తులు వచ్చాయని, వాటి పరిశీలన ప్రక్రియ తుది దశకు చేరిందని వెల్లడించారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు త్వరలో పోడు భూముల పట్టాలకు సంబంధించి నిర్ణయం తీసుకుంటాయని, ఆ తర్వాత వెంటనే పట్టాలు పంపిణీ చేసేందుకు గిరిజన సంక్షేమ శాఖ సిద్ధంగా ఉందని చెప్పారు. రాష్ట్రంలో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటుకు పార్లమెంటు చట్టం చేసినప్పటికీ ఇప్పటికీ అందుబాటులోకి రాకపోవడం బాధాకర మన్నారు. గిరిజన వర్సిటీ ఏర్పాటు కోసం రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 4 వందల ఎకరాల భూమి అప్పగించిందని, దీనితో పాటు భవనాలు, ఇతర వసతులను కూడా కల్పించి హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయానికి బాధ్యతలు అప్పగించిందన్నారు. ఇదంతా పూర్తయి దాదాపు మూడు సంవత్సరాలు గడిచినా ఇప్పటికీ తరగతులు ప్రారంభం కాకపోవడంతో గిరిజన బిడ్డలు ఉన్నత చదువులకు నోచుకోలేకపోతున్నారని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి క్రిస్టినా జెడ్ చొంగ్తు, ట్రైకార్ చైర్మన్ రామచంద్రనాయక్, జీసీసీ చైర్మన్ రమావత్ వాల్యా నాయక్, గిరిజన సంక్షేమ శాఖ అదనపు కార్యదర్శి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. -
మన్యానికి రైలొస్తోంది! 173 కి.మీ. కొత్త రైల్వేలైనుకు రూ 2,800 కోట్ల అంచనా!
చింతూరు (అల్లూరి సీతారామరాజు జిల్లా): త్వరలోనే మన్యంలో రైలుకూత వినపడనుంది. ఇప్పటివరకు బస్సులు, లాంచీలు మాత్రమే తిరిగిన మన్యం ఏరియాలో రైళ్లు కూడా రాకపోకలు సాగించనున్నాయి. ప్రస్తుతం మన్యం ప్రజలు రైలులో ప్రయాణించాలంటే రాజమహేంద్రవరం, ఖమ్మం, కొత్తగూడెం వెళ్లాల్సి ఉంది. నూతన లైను ఏర్పాటులో భాగంగా మన్యం ఏరియాలో నాలుగు రైల్వే స్టేషన్లు నిర్మించనున్నారు. మారుమూల గిరిజన ప్రాంతాలను అనుసంధానం చేస్తూ రవాణాను సులభతరం చేసేందుకు ఒడిశాలోని మల్కన్‌గిరి నుంచి భద్రాచలం వరకు సుమారు 173 కిలో మీటర్ల మేర రైల్వేలైను మంజూరైంది. దీని నిర్మాణానికి రూ 2,800 కోట్లు అవసరమని అంచనా. ఈ లైన్‌ను మల్కన్‌గిరి నుంచి భద్రాచలం సమీపంలోని పాండురంగాపురం రైల్వేస్టేషన్ వరకు నిర్మిస్తారు. ఈ లైను ఏర్పాటులో భాగంగా పలుచోట్ల 213 వంతెనలు నిర్మించనున్నారు. వీటిలో 48 పెద్ద వంతెనలు, 165 చిన్న వంతెనలు ఉన్నాయి. విలీన మండలాల మీదుగా... మల్కన్‌గిరి నుంచి భద్రాచలం వరకు నిర్మించనున్న రైల్వేలైను విలీన మండలాలైన చింతూరు, కూనవరం, ఎటపాక మండలాల మీదుగా సాగనుంది. దీనిలో భాగంగా ఒడిశాలోని మల్కన్‌గిరి, కోవాసిగూడ, బదలి, రాజన్‌గూడ, మహరాజ్‌పల్లి, లూనిమన్‌గూడ, ఆంధ్రాలోని అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు మండలం కన్నాపురం, కూనవరం మండలం కూటూరు గట్టు, పల్లూరు, ఎటపాక మండలం నందిగామలో స్టేషన్లు ఏర్పాటుచేస్తారు. నందిగామ నుంచి తెలంగాణలో గోదావరి మీదుగా భద్రాచలం, అక్కడి నుంచి పాండురంగాపురం వరకు ఈ రైల్వేలైను నిర్మించనున్నారు. -
ఆదివాసీల హక్కులపై బీజేపీతో చర్చకు సిద్ధం
అగర్తలా: తిప్రాసా ప్రజల సమస్యలపై రాజ్యాంగబద్ధ పరిష్కారం కనుగొనేందుకు బీజేపీతో ముఖాముఖి చర్చలకు సిద్ధమని తిప్రా మోథా చీఫ్ ప్రద్యోత్ దేవ్ వర్మన్ చెప్పారు. తిప్రా మోథా డిమాండ్లను చర్చల ద్వారా పరిష్కరిస్తామని అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ శనివారం చేసిన ప్రకటనపై దేవ్ స్పందించారు. ‘ఆర్థికంగా, రాజకీయంగా, భాషాపరంగా మాకు రాజ్యాంగబద్ధంగా దక్కాల్సిన వాటిపై గౌరవప్రదంగా చర్చలకు పిలిస్తే వెళ్తాం. స్థానిక ఆదివాసీల సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించడానికి మేం సిద్ధం. అయితే, ఈ చర్చలు కేబినెట్ పోస్టు కోసమో, వ్యక్తిగత లబ్ధి కోసమో మాత్రం కాదు’ అని స్పష్టంచేశారు. ఇటీవలి ఎన్నికల్లో రెండో అతిపెద్ద పార్టీగా అవతరించిన తిప్రా మోథా మొత్తం 13 ఎస్టీ రిజర్వుడు స్థానాలనూ గెలుచుకుంది. -
గిరిజన ప్రాంతాల్లో బైక్ అంబులెన్సులు
-
వైద్యచరిత్రలో మరో మైలురాయి.. మారేడుమిల్లి ఘటనతో చలించిపోయి..
సాక్షి, కాకినాడ: మారుమూల పల్లెలకు సైతం 108, 104 సేవలను అందుబాటులోకి తెచ్చిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి నిరుపేదల పాలిట ప్రాణదాతగా నిలిచారు. ఎవరైనా అనారోగ్యం బారిన పడినా.. ఎక్కడ ప్రమాదం జరిగినా ‘కుయ్.. కుయ్..’మంటూ రయ్యిన అంబులెన్స్‌లు వచ్చి వాలిపోయేలా చేసిన ఘనత వైఎస్‌కే దక్కింది. ఆయన తనయుడుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి 108, 104 సేవలను మరింత ముమ్మరం చేశారు. 108 అంబులెన్స్‌లు, ఫీడర్ అంబులెన్స్‌లు సైతం వెళ్లలేని మారుమూల కొండ ప్రాంతాలకు సైతం వెళ్లేలా బైక్ అంబులెన్స్‌లను అందుబాటులోకి తీసుకొస్తున్నారు. కొండలు, గుట్టలు దాటి గిరిజనుల చెంతకు వెళ్లేలా కాకినాడ జేఎన్టీయూ ప్రొఫెసర్, డిజైన్ ఇన్నోవేషన్ సెంటర్ డైరెక్టర్ అల్లూరు గోపాలకృష్ణ రూపొందించిన బైక్ అంబులెన్స్‌లను రాష్ట్రవ్యాప్తంగా ఏజెన్సీ ప్రాంతాలకు సమకూర్చేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చర్యలు చేపట్టారు. ఈ వినూత్న కార్యక్రమం త్వరలో సాకారం కానుంది. తొలి దశలో 108 బైక్ అంబులెన్స్‌లను కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం టెండర్లు కూడా పిలిచింది. ఈ బైక్ అంబులెన్స్ వాహనం డ్రైవింగ్‌తో పాటు కనీస వైద్య సేవలందించేలా శిక్షణ ఇచ్చేందుకు ముమ్మర ఏర్పాట్లు జరుగుతున్నాయి. మారేడుమిల్లి ఘటనతో చలించిపోయి.. ఏజెన్సీ ప్రాంతాల్లో అంబులెన్స్‌లు వెళ్లే దారిలేక సకాలంలో వైద్యమందక కొండలపై ఉండే గిరిజనులు ప్రాణాలు కోల్పోతున్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్న కాలంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం నియోజకవర్గ పరిధిలోని మారేడుమిల్లి మండలం చాపరాయిలో 12 మంది మృతిచెందారు. ఆ విషాదకర ఘటనను చూసి చలించిపోయిన జగన్ గిరిజనుల ప్రాణాలు కాపాడేందుకు ఏదో ఒక ప్రత్యామ్నాయం ఉండాలని పరితపించారు. అందుకనుగుణంగానే గతేడాది నుంచి ప్రత్యామ్నాయ అంబులెన్స్ తీసుకురావాలనే ప్రయత్నంలో ప్రాజెక్టు రూపకల్పన బాధ్యతను జేఎన్టీయూ(కాకినాడ)కి అప్పగించారు. ఈ నేపథ్యంలోనే జేఎన్టీయూ ప్రొఫెసర్ గోపాలకృష్ణ పట్టుదలతో ద్విచక్ర వాహనాన్ని తలపించే బైక్ అంబులెన్స్‌ను ఆవిష్కరించారు. ప్రపంచంలోనే ద్విచక్ర వాహనంతో కూడిన అంబులెన్స్ సిద్ధం చేయడం ఇదే తొలిసారి కావడంతో దీనికి పేటెంట్ హక్కులు కూడా లభించాయి. ఇంతవరకు కొండలపై ఉండే గిరిజన తండాలలో వైద్య సేవలకోసం మూడు చక్రాల(ఫీడర్) అంబులెన్స్‌లను వినియోగిస్తున్నారు. అసలు రహదారి అంటూ లేకుండా కొండలపై నివసించే గిరిజనుల వద్దకు నేరుగా వెళ్లి వైద్య సేవలందించేందుకు వీలుగా బైక్ అంబులెన్స్‌ను రూపొందించారు. అల్లూరి సీతారామరాజు మన్యం జిల్లా చింతలగూడెంలో గర్భిణులను తరలించడం ద్వారా వీటికి ట్రయల్ రన్ కూడా పూర్తయ్యింది. ఈ వినూత్న ఆవిష్కరణను కేంద్ర ప్రభుత్వం ప్రశంసించింది. ఇందుకోసం రూ.5 కోట్లను రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖకు కేటాయించింది. యాప్‌తో జీపీఎస్‌కు అనుసంధానం బైక్ అంబులెన్స్‌ను పర్యవేక్షించేందుకు ప్రత్యేక యాప్ రూపొందించారు. ఈ యాప్‌ను జీపీఎస్‌కు అనుసంధానించడంతో రోగుల సమాచారం సమీపంలోని పీహెచ్సీ లేదా 108 వాహనాలకు వివరాలను చేరవేస్తుంది. 4 జీబీ ర్యామ్, 14 జీబీ స్టోరేజ్ కలిగిన 7.1 ఇంచ్ టచ్ స్క్రీన్ డిస్ప్లేతో కూడిన చిప్, శాటిలైట్ బేస్ నెట్వర్కింగ్ సిస్టమ్ ఇందులో ఉంటాయి. పేషెంట్ వచ్చేలోపు వైద్యానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు సిద్ధం చేస్తారు. అత్యవసరమైతే డాక్టర్‌తో వీడియో కాల్చేసే సౌకర్యం ఇందులో ఉంది. వాహనానికి దుమ్ము, వర్షం, ఎండ నుంచి రక్షణకు టాప్ ఏర్పాటు చేశారు. అంబులెన్స్ లైట్లు,సైరన్, గ్లూకోమీటర్, పల్స్ ఆక్సీమీటర్, యాంటీ స్కిడ్డింగ్, ట్యూబ్‌లెస్ టైర్లు, రక్త పరీక్షల నమూనా కోసం కోల్డ్‌స్టోరేజ్ కంటైనర్, మోటార్ యాక్టివేటెడ్ స్టాండ్ ఉంటాయి. ప్రథమ చికిత్సకు అవసరమైన అన్ని పరికరాలు, మందులు ఇందులో ఉంటాయి. వైద్యచరిత్రలో మైలురాయిగా నిలుస్తుంది.. బైక్ అంబులెన్స్ ద్వారా కార్డియాక్ అరెస్ట్, పెరాలసిస్ వంటి గుండె సంబంధిత రోగులకు తక్షణ వైద్యం అందించే అవకాశం లభిస్తుంది. యూనివర్సిటీలో ఉన్న డిజైన్ ఇన్నోవేషన్ సెంటర్ ద్వారా బైక్ అంబులెన్స్‌ను రూపొందించడం సంతోషంగా ఉంది. ఇది వైద్య చరిత్రలో ప్రభుత్వానికి మైలురాయిగా మిగులుతుంది. ఇప్పటివరకు దేశంలో మరే రాష్ట్రంలోనూ ఈ తరహా ఆలోచన చేయలేదు. తొలిసారి మన రాష్ట్రంలో చేపట్టిన ఈ వినూత్న బైక్ అంబులెన్స్ ఇతర రాష్ట్రాల్లో కూడా ఏర్పాటు చేయాలనే ఆలోచనతో ఉన్నాయి. – ప్రొఫెసర్ ఎ.గోపాలకృష్ణ, డిజైన్ ఇన్నోవేషన్ సెంటర్ డైరెక్టర్, జేఎన్టీయూ కాకినాడ భళా.. బైక్ అంబులెన్స్ సాధారణంగా నాలుగు చక్రాల అంబులెన్స్ ప్రయాణించాలంటే కనీసం 6 అడుగులు రోడ్డు మార్గం ఉండాలి. అదే 3 చక్రాల ఫీడర్ అంబులెన్స్‌కు 3 నుండి 4 అడుగుల రోడ్డు మార్గం ఉండాలి. రెండు చక్రాలతో నడిచే ఈ బైక్ అంబులెన్స్‌కు అడుగు నుంచి అడుగున్నర దారి లేదా కాలిబాట ఉన్నా సులభంగా ప్రయాణిస్తుంది. కొండలు, గుట్టల్ని కూడా ఎక్కేస్తుంది. డ్రైవింగ్ సీటు వెనుక పేషెంట్ కూర్చునేందుకు వీలుగా ఒక సీటును 90 డిగ్రీల కోణంలో రౌండ్‌గా తిరిగేలా అమర్చారు. 110 డిగ్రీల కోణంలో వెనుకకు వంగి సౌకర్యవంతంగా ఉండేలా ఏర్పాటు చేశారు. రోగి కూర్చున్న వెంటనే లాక్ అయ్యేలా ఆటోమేటిక్ లాకింగ్ సిస్టమ్ కూడా ఏర్పాటు చేశారు. ఈ వాహనం వ్యయం రూ.4 లక్షలు అవుతుంది. ఇందుకు బజాజ్ కంపెనీకి చెందిన అవెంజర్ వాహనాన్ని ఎంపిక చేశారు. టైమ్ షెడ్యూల్, అలారమ్ కోడ్స్, పానిక్ బటన్ (వైద్య అవసరాన్ని బట్టి వినియోగించే ఎరుపు, పసుపు, నీలం)ఏర్పాటు చేశారు. -
గిరిజన ప్రాంతాల్లో బైక్‌ల ద్వారా రేషన్ సరఫరా
సాక్షి, అమరావతి: గిరిజన ప్రాంతాల్లో ప్రజా పంపిణీ వ్యవస్థలో మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తున్నట్టు పౌరసరఫరాల శాఖ కమిషనర్ అరుణ్‌కుమార్ చెప్పారు. అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, ఏలూరు జిల్లాల జాయింట్ కలెక్టర్లతో బుధవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సరుకు రవాణాకు ఇబ్బందిగా ఉన్న ప్రాంతాల్లో కొత్త ఎంఎల్ఎస్ పాయింట్లు, బఫర్ గోడౌన్ల నిర్మాణానికి కార్యాచరణ రూపొందించాలని సూచించారు. మారుమూల, కొండ ప్రాంతాల్లో పనిచేస్తున్న ఎండీయూ ఆపరేటర్లకు అదనపు ప్రోత్సాహం ఇవ్వడంతో పాటు, ఎండీయూ వాహనం వెళ్లలేని గిరిజన గ్రామాలకు బైక్‌ల ద్వారా ఇంటింటికీ రేషన్ సరఫరా చేసేలా ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. జనవరి నుంచి కందిపప్పు, పంచదార పంపిణీతో పాటు అంగన్వాడీ, ప్రభుత్వ పాఠశాలలు, హాస్టళ్ల వద్దకే నిత్యావసరాలు డెలివరీ చేసేలా చూడాలన్నారు. ఆర్ అండ్ ఆర్ కాలనీల్లో అవసరాన్ని బట్టి కలెక్టర్ కొత్త రేషన్ షాపులు మంజూరు చేయాలని ఆదేశించారు. రాష్ట్రంలో దాదాపు 45 శాతానికి పైగా ధాన్యం కొనుగోళ్లు పూర్తయినట్టు కమిషనర్ తెలిపారు. జనవరి చివరి నాటికి ఖరీఫ్ సేకరణ పూర్తి చేసే లక్ష్యంతో పని చేస్తున్నామని, ధాన్యం కొనుగోళ్ల సొమ్ముతో పాటు మిల్లర్ల బకాయిలనూ వేగంగా చెల్లిస్తున్నట్టు చెప్పారు. 16 రోజులు దాటిన ఎఫ్‌టీవోలకు చెల్లింపులు పూర్తి చేసినట్టు తెలిపారు. మిల్లర్లు ప్రభుత్వం చెల్లించే బకాయిల్లో కొంత మొత్తం వెచ్చించి ఆరబోత యంత్రాలు (డ్రయర్లు) ఏర్పాటు చేయాలని, లేకుంటే.. 2023 ఖరీఫ్ సీజన్ నుంచి ఆయా మిల్లులకు సీఎంఆర్ నిలిపివేస్తామని కమిషనర్ అరుణ్‌కుమార్ హెచ్చరించారు. -
గిరిజనులకు అండగా.. విశాఖ శ్రీ శారదా పీఠం
-
మోదీ ఇలాకాలో ఆ సీట్లు బీజేపీకి అందని ద్రాక్షే.. 75 ఏళ్లలో ఒక్కసారీ గెలవలే..!
గాంధీనగర్: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు కొద్ది రోజుల్లోనే జరగనున్నాయి. ఈ క్రమంలో భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు అందుకు సన్నద్ధమవుతున్నాయి. ఇప్పటి నుంచే ప్రచారం ముమ్మరం చేశాయి. మరోవైపు చూసుకుంటే గడిచిన 27 ఏళ్లుగా బీజేపీ అధికారంలో ఉంది. ప్రస్తుత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వరుసగా మూడుసార్లు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. గుజరాత్‌పై బీజేపీకి అంతటి పట్టు ఉన్నప్పటికీ.. 7 అసెంబ్లీ స్థానాలు మాత్రం అందని ద్రాక్షగానే మిగిలిపోయాయంటే నమ్మశక్యం కాదు కదా? అయితే, అది నిజమే. స్వాతంత్య్రం సాధించినప్పటి నుంచి చూసుకుంటే ఆ సీట్లలో కాషాయ పార్టీ పాగా వేయలేకపోతోంది. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీకి 182 స్థానాలు వస్తాయని బీజేపీ చెబుతోంది. అయితే.. ఆ 7 స్థానాల్లో మాత్రం ఎందుకు గెలవలేకపోతోంది? బోర్సాద్, ఝగ్డియా, అంకలావ్, దానిలిమ్దా, మహుధా, గర్బడా, వ్యారా అసెంబ్లీ స్థానాలను ఈసారి ఎలాగైనా గెలవాలని భావిస్తోంది బీజేపీ. మహారాష్ట్ర నుంచి గుజరాత్ 1960లో వేరుపడి రాష్ట్రంగా ఏర్పడింది. అక్కడ 1962లో తొలిసారి ఎన్నికలు జరిగాయి. అప్పటి నుంచి ఆయా స్థానాల్లో కాంగ్రెస్, ఇతర పార్టీలు, స్వతంత్రులు విజయం సాధిస్తూ వస్తున్నారు. ► బోర్సాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఇప్పటి వరకు 15 సార్లు ఎన్నికలు జరిగాయి. అందులో రెండు ఉప ఎన్నికలు ఉండగా.. తొలిసారి స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించారు. ఆ తర్వాత ప్రతిసారీ కాంగ్రెస్ విజయఢంకా మోగిస్తోంది. ► ఝగ్డియా సీటులో 1962 నుంచి 2017 వరకు 13 సార్లు ఎన్నికలు జరిగాయి. అక్కడ కాంగ్రెస్, జనతా దళ్, జనతా దళ్ యునైటెడ్, బీటీపీ పార్టీల అభ్యర్థులు విజయం సాధించారు. కానీ, బీజేపీ ఇప్పటి వరకు ఒక్కసారి కూడా గెలవలేకపోయింది. ఇక్కడ 1990 నుంచి చోటు వాసవా గెలుస్తూ వస్తున్నారు. ► వ్యారా నియోజకవర్గంలో 14 సార్లు ఎన్నికలు జరిగాయి. అందులో ఓసారి ఉప ఎన్నికలు జరిగాయి. అన్నిసార్లూ కాంగ్రెస్ విజయం సాధించింది. ► మరో ఆసక్తికర అంశం ఏంటంటే అహ్మదాబాద్‌లోని దనిలిమ్దా నియోజకవర్గం సహా.. అన్ని స్థానాలు ట్రైబల్ ప్రాంతాలకు సంబంధించినవే. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు ట్రైబల్ ప్రాంతంలో కాంగ్రెస్ ఓటు బ్యాంకును బీజేపీ చీల్చలేకపోతోంది. ► 2017లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 99, కాంగ్రెస్ 77, స్వతంత్రులు 3, బీటీపీ 2, ఎన్సీపీ 1 స్థానాన్ని గెలుచుకున్నాయి. ఇదీ చదవండి: కేసీఆర్ సర్కార్ 15 రోజుల్లో కూలిపోతుంది.. రాజగోపాల్‌రెడ్డి -
గిరిజన పల్లెల చెంతకు మెడికల్ క్యాంపులు
-
గిరిజన ఆవాసాల్లో తాగునీటి సమస్యలుండొద్దు
సాక్షి, హైదరాబాద్: గిరిజన ఆవాసాల్లో అసలు తాగునీటి సమస్య తలెత్తొద్దని గిరిజన, మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖమంత్రి సత్యవతి రాథోడ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం గిరిజన సంక్షేమ శాఖ క్షేత్రస్థాయి అధికారులతో ఆమె వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సత్యవతి మాట్లాడుతూ రాష్ట్రంలో 99 శాతం గ్రామాలు మిషన్ భగీరథ పథకంతో అనుసంధానమై ఉన్నాయని చెప్పారు. మిగతా ఒక్క శాతాన్ని కూడా వీలైనంత త్వరగా పూర్తిచేయాలన్నారు. మిగిలిపోయిన 105 గ్రామాలన్నీ గిరిజన ఆవాసాలే అని తెలిపారు. ఆయా గ్రామాలు సుదూరంగా ఉండడం, విద్యుత్ కనెక్షన్లు లేకపోవడం ఇతర మౌలిక వసతుల సమస్యతో మిషన్ భగీరథ పనులు పూర్తికాలేదన్నారు. అత్యవసర అవసరాల కోసం ఆయా గ్రామాలకు ట్యాంకర్ల ద్వారా నీటి వసతి కలి్పంచాలని మంత్రి ఆదేశించారు. కాన్ఫరెన్స్‌లో గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి క్రిస్టినా జడ్ చోంగ్తూ, అదనపు సంచాలకుడు సర్వేశ్వర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
‘ఔషధాల అడ్డా’కు
హుకుంపేట(అరకు): గిరిజన ప్రాంతంలో ఆరోగ్యపరంగా, వాణిజ్యపరంగా పేరు గాంచింది అడ్డ తీగ. ఫణెర వహ్లి అనే శాస్త్రీయ నామంతో పిలిచే ఈ అడ్డ చెట్లు విశాఖ, తూర్పుగోదావరి జిల్లాల ఏజెన్సీ ప్రాంతాల్లో అడవితో పాటు పలు చోట్ల సహజంగాను పెరుగుతాయి. ఈ అడ్డ ఆకులతో విస్తరాకులు, బెరడుతో తాళ్లు, అడ్డ గింజలు.. ఇలా చెట్టులోని అన్ని భాగాలు గిరిజనులకు ఎంతో ఉపయోగపడతాయి. ఈ ఆకులను, గింజలను, అడవుల నుంచి సేకరించి వారపు సంతల్లో విక్రయిస్తుంటారు. సమృద్ధిగా యాంటీ ఆక్సిడెంట్లు అడ్డ ఆకుల్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉండటం వలన ఈ ఆకులను తింటే ఆరోగ్యానికి మేలు చేకూరటమే కాక, జీర్ణ సంబంధిత సమస్యలు కూడ తగ్గుతాయి. అడ్డ గింజల్లో ప్రోటీన్, కాల్షియం ఇంకా ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఇది షుగర్ బారిన పడకుండా కాపాడుతుంది. ఏజెన్సీలో సంక్రాంతి రోజు గిరిజన సంప్రదాయ వంటకం పులగంలో ఈ అడ్డ గింజలు వేసి దేవతలకు నివేదిస్తారు. ఆ తర్వాత పులగాన్ని అడ్డాకులలో భుజిస్తారు. కొన్ని ప్రముఖ దేవాలయాల్లో అడ్డాకులను ప్రసాదం ప్యాకింగ్ కోసం నేటికీ వాడుతుండటం విశేషం. నేటి తరానికి వివరించాలి క్రమేపీ గిరిజనుల్లో అడ్డ ఆకుల సంప్రదాయపు అలవాట్లు తగ్గుతూ వస్తున్నాయి. ప్రస్తుత తరానికి వీటి ప్రాముఖ్యత తెలియక వాటిని పట్టించుకోవటం లేదు. మరోవైపు అడ్డాకుతో తయారయ్యే విస్తరాకుల ఉత్పత్తి తగ్గటం వలన పేపర్ ప్లేట్ వాడటం పెరిగింది. పేపర్ ప్లేట్లు పర్యవరణానికి అంత అనుకూలమైనది కాదు కనుక ఈ అడ్డతీగ ప్రాముఖ్యత అందరికి తెలియాల్సిన అవసరం ఉంది. సహజంగా దొరికే ఈ అడ్డాకులతో విస్తర్లుగా చేసి పేపర్ ప్లేట్లకు ప్రత్యామ్నయంగా వాడితే పర్యవరణానికి మేలు చేసినట్లేనని పలువురు మేధావులు, గిరిజనులు అభిప్రాయ పడుతున్నారు. అడ్డ ఆకు, తీగలతో ప్రయోజనాలు ► అడ్డాకులతో విస్తరాకుల తయారీ ► అడ్డ తీగలతో నారలు చేసి కంచెలు కట్టడం ► అడ్డ తీగలతో బుట్టలు అల్లుకోవటం ► అడ్డ గింజలను ఆహారం(స్నాక్స్) రూపంలో తీసుకోవటం అప్పట్లో అడ్డాకులే జీవనాధారం మా చిన్నతనంలో అడవిలోకి వెళ్లి అడ్డాకులు సేకరించే వాళ్లం. వాటిని ఎండబెట్టి, వారానికి ఒకసారి వారపు సంతల్లో విక్రయించి వచ్చిన డబ్బులతో జీవనం కొనసాగించాం. అడ్డ గింజలతో కూర వండుకునేవాళ్లం. ఇప్పుడు అడ్డాకులు సంతల్లో అమ్ముదామన్నా గిట్టుబాటు ధర ఉండట్లేదు. ప్రభుత్వ అధికారులు జీసీసీ ద్వారా అడ్డాకులు కొనుగోలు చేస్తే మాకు ఉపాధి కలుగుతుంది. –పాంగి కాసులమ్మ, కామయ్యపేట గ్రామం, హుకుంపేట మండలం ఆరోగ్యానికి మంచిది విశాఖ ఏజెన్సీ అడవుల్లో సహజంగా దొరికే ఈ అడ్డాకులు, అడ్డ గింజలు ఆరోగ్యపరంగా ఎంతో మంచివి. వీటిని వీడీవీకే కేంద్రాల ద్వారా కొనుగోలు చేస్తే గిరిజనులకు మంచి ఉపాధి లభిస్తుంది. వీటితో విస్తరాకులు తయారు చేసి ఉపయోగిస్తే పేపర్ ప్లేట్లు విక్రయాలు తగ్గించి, పర్యావరణాన్ని కాపాడవచ్చు. విస్తరాకుల ద్వారా మంచి ఉపాధితో పాటు ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. –డా.శ్రావణ్‌కుమార్, అసిస్టెంట్ ప్రొఫెసర్, పర్యావరణ విభాగం, బాబా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, విశాఖ -
కరెంటిస్తం.. నీళ్లిస్తం..
నిర్మల్/పెంబి: నిర్మల్ జిల్లా పెంబి మండలం చాకిరేవు గ్రామస్తుల కష్టాలపై అధికార యంత్రాంగం స్పందించింది. స్వయంగా కలెక్టర్ ముషారఫ్‌అలీ వారి గోడు వినేందుకు చాకిరేవు కదలివచ్చారు. తమ గ్రామ సమస్యలు తీర్చాలంటూ నిర్మల్ జిల్లా పెంబి మండలంలోని చాకిరేవు నుంచి కలెక్టరేట్ వరకూ గ్రామస్తులు 75 కి.మీ. నడిచి మంగళవారం కలెక్టరేట్‌కు చేరుకున్న విషయం తెలిసిందే. పిల్లలు, వృద్ధులు, మహిళలు, గర్భిణి సైతం.. కాళ్లకు చెప్పులు లేకున్నా.. తమ గోడును వినిపించడానికి కాలినడకన జిల్లా కేంద్రం వరకు చేరిన తీరును ‘సాక్షి’ ‘అడవి జంతువులకు బోర్లేస్తరు.. మేం అంతకన్న హీనమా..’శీర్షికన ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. అటవీ గ్రామాల గోడు మంత్రులు, అధికారులకు చేరేలా వినిపించింది. ‘సాక్షి’కథనం, గ్రామస్తుల గోస తో కలెక్టర్ ముషారఫ్‌అలీ బుధవారం అన్నిపనులు పక్కనపెట్టి, అదనపు కలెక్టర్ హే మంత్ బోర్కడే (స్థానికసంస్థలు), డీఎఫ్ఓ వికాస్‌మీనా, విద్యుత్‌శాఖ ఎస్సీ జేఆర్ చౌ హాన్ తదితర అధికారులను వెంట తీసుకుని చాకిరేవు చేరుకున్నారు. నిర్మల్‌కు వెళ్లకుండా అక్కడే ఉన్న మిగిలిన గ్రామస్తులతో పాటు కూర్చుని వారి సమస్యలను ఆలకించారు. మీరందరూ వచ్చేయండి.. ‘తాగడానికి నీళ్లు ఎక్కడి నుంచి తెచ్చుకుంటున్నారు. ఇక్కడి నుంచి ఎంతదూరంలో ఉంటుంది..’అని కలెక్టర్ ముషారఫ్‌అలీ అడగటంతో ‘ఊరి నుంచి అద్ద కిలోమీటర్ దూరంల ఉన్న చిక్మన్ వాగుల కెళ్లి నీళ్లు తెచ్చుకుంటం సార్. అక్కడ పశువులు తాగే నీళ్లే మేమూ తాగుతున్నం సార్..’ అని చాకిరేవువాసులు చెప్పారు. ‘మీ ఊళ్లో చిన్నపిల్లలు ఎంతమంది ఉన్నారు.. స్కూల్‌కు ఎక్కడికి వెళ్తున్నారు..’అని మళ్లీ కలెక్టర్ అడగటంతో‘ఊళ్లె 15 మంది దాకా పిల్లలున్నరు సార్. స్కూల్ ఇక్కడికి దగ్గరల లేదు. కిలోమీటరు దూరంల ఉంటది. పిల్లల్ని పంపిద్దమంటే వర్షకాలం వాగుల కొట్టుకపోతరని భయం సార్’అని చెప్పారు. ఇందుకు కలెక్టర్ స్పందిస్తూ.. ‘మరి.. అందుకే మీరందరూ అక్కడికి (చాకిరేవు సమీపంలోని వస్పల్లికి) వచ్చేయండి. మీ అందరికీ పునరావాసం కల్పిస్తాం. మీ పొలాలు మీకే ఉండని, మీ ఇండ్లు మాత్రమే అక్కడికి షిఫ్ట్ చేద్దాం. డబుల్బెడ్రూం ఇండ్లు ఇస్తం. డెలివరీల సమయంలో ఈ వాగులు దాటుకుంటూ పోవాల్సిన కష్టమూ తప్పుతుంది. అక్కడికొస్తే కరెంటు ఉంటది, నీళ్లు ఉంటాయ్, మీ పిల్లలకు స్కూల్ దొరుకుతది, హాస్పిటల్, టీవీ, మొబైల్.. ఇలా అన్నీ దొరుకుతయ్..ఏమంటారు..!?’అని అడిగారు. ఇందుకు చాకిరేవు గ్రామస్తులు ససేమిరా.. అన్నారు. తాము ఉన్న ఊరిని, తాము అభివృద్ధి చేసుకున్న భూములను వదిలి రాలేమన్నారు. ఇక్కడే పుట్టాం.. ఇక్కడే చస్తాం.. అంటూ తేల్చిచెప్పారు. ఆరునెలల్లో కరెంటు.. చాకిరేవు వాసులు రానని అనడంతో ఆయ న వెంటనే అన్నిశాఖల అధికారులతో మాట్లాడారు. అటవీ అధికారులతో మాట్లా డి సోలార్ ఆధారిత బోర్ వేసి, ఇంటింటికీ తాగునీటి వసతి కల్పిస్తామని గ్రామస్తులకు చెప్పారు. మిషన్ భగీరథ పథకాన్ని కూడా తీసుకురావడానికి ప్రయత్నిస్తామన్నారు. అలాగే ఆరునెలల్లో కరెంటు కనెక్షన్లు కూడా ఇప్పిస్తామన్నారు. గ్రామానికి రోడ్డు వేయాలంటే కేంద్ర అటవీశాఖ నుంచి అనుమతులు రావాలని, వాటి కోసం కూడా ప్రయత్నిస్తామన్నారు. చాకిరేవుతో పాటు చుట్టూ ఉన్న గూడేల ఇబ్బందులను సైతం పరిష్కరిస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. ఇంకా టెంట్లోనే.. తమ గ్రామంలో సమస్యలు తీరేదాకా ఇక్కడే ఉంటామంటూ.. చాకిరేవు నుంచి పాదయాత్రగా మంగళవారం నిర్మల్ చేరుకున్న వారంతా కలెక్టరేట్ ఎదుట టెంట్లోనే ఉన్నారు. కలెక్టర్ తమ గ్రామానికి వెళ్లి, హామీలు ఇచ్చినా బుధవారం రాత్రి వరకు అక్కడే ఉన్నారు. టెంట్ వద్దే వండుకుని తిన్నారు. బాధాకరం: మంత్రి సత్యవతి చాకిరేవు గ్రామస్తుల సమస్యలు, వాటి పరిష్కారం కోసం వారు చేసిన పాదయాత్రపై గిరిజనాభివృద్ధి శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ బుధవారం స్పందించారు. వెంటనే గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్, కార్యదర్శి, కలెక్టర్, ఐటీడీఏ పీఓలతో మాట్లాడారు. చాకిరేవులో వెంటనే తాగునీటి వసతి, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు. గ్రామ స్తులు తాగునీరు, ఇతర సదుపాయాల కో సం 75 కి.మీ. దూరంలోని నిర్మల్ కలెక్టరేట్ వరకు నడిచిరావడం బాధాకరమన్నారు. -
ఈ నెలాఖరుకల్లా వైద్య పోస్టులు భర్తీ
సాక్షి, అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా వైద్య ఆరోగ్యశాఖలో ఖాళీలన్నీ ఫిబ్రవరి చివరినాటి కల్లా భర్తీ చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. వైద్య ఆరోగ్యశాఖలో ఇప్పటికే 27 వేలకుపైగా పోస్టులను భర్తీ చేశామని, మరో 12 వేల పోస్టులను భర్తీ చేయాల్సి ఉందని తెలిపారు. ఈ నెలాఖరు కల్లా ఖాళీ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలని అధికారులకు స్పష్టం చేశారు. గిరిజన ప్రాంతాలతో సహా ఖాళీగా ఉన్న డాక్టర్ పోస్టులన్నీ భర్తీ చేయాలన్నారు. గిరిజన ప్రాంతాల్లో నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులోకి తేవాలని నిర్దేశించారు. డాక్టర్లు గిరిజన ప్రాంతాల్లోనే ఉంటూ వైద్య సేవలందించేందుకు అధికారులు ఎలాంటి ప్రతిపాదనలు అందచేసినా గ్రీన్‌సిగ్నల్ ఇస్తానని సీఎం ప్రకటించారు. గిరిజన ప్రాంతాల్లో సేవలందించే వైద్యులకు ప్రోత్సాహకాలు ఎంత ఇవ్వాలన్న అంశంపై అధికారుల స్థాయిలో నిర్ణయం తీసుకుంటే తప్పనిసరిగా ఆమోదిస్తామని చెప్పారు. కోవిడ్, వ్యాక్సినేషన్, ఖాళీల భర్తీపై సీఎం జగన్ గురువారం తన క్యాంపు కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఆ మాటే వినిపించకూడదు.. ప్రభుత్వ ఆస్పత్రుల్లో మార్పులు స్పష్టంగా కనిపించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. ఫిబ్రవరి చివరికి ప్రభుత్వ ఆస్పత్రుల్లో అన్ని ఖాళీలను భర్తీ చేయాలని సూచించారు. డాక్టర్లు లేరు, సిబ్బంది లేరనే మాటే వినిపించకూడదన్నారు. నాడు – నేడు ద్వారా చేపట్టిన పనులతో పాటు వైఎస్సార్ విలేజ్ క్లినిక్స్, అర్బన్ క్లినిక్స్ నిర్మాణ ప్రగతిని ముఖ్యమంత్రి సమీక్షించారు. నాణ్యత విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడవద్దని స్పష్టం చేశారు. ఉపముఖ్యమంత్రి (వైద్య,ఆరోగ్యశాఖ) ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్(నాని), వైద్యఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్ సింఘాల్, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి (కోవిడ్ మేనేజ్మెంట్ అండ్ వ్యాక్సినేషన్) ముద్దాడ రవిచంద్ర, కోవిడ్ టాస్క్‌ఫోర్స్ కమిటీ చైర్మన్ ఎంటీ కృష్ణబాబు తదితరులు సమీక్షకు హాజరయ్యారు. కోవిడ్ తీవ్రత తగ్గుముఖం ► అన్ని రాష్ట్రాల్లోనూ ఆంక్షల సడలింపు ► రాష్ట్రంలో పాజిటివ్ కేసులు 1,00,622 ► ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితులు 2,301 మంది మాత్రమే ► ఐసీయూలో ఉంటూ కోలుకుంటున్నవారు 263 మంది. ► 2,144 మందికి ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా వైద్య చికిత్స ► 104 కాల్ సెంటర్‌కు కాల్స్ గణనీయంగా తగ్గుముఖం. బుధవారం వచ్చిన కాల్స్ 246. ఆస్పత్రిలో చేరినవారు 18 మంది. ► ముమ్మరంగా వ్యాక్సినేషన్. రెండు డోసులు తీసుకున్నవారు 3,73,71,243 మంది. ఒక డోసు తీసుకున్న వారు 55,38,556 మంది. ► ప్రికాషన్ డోస్ లక్ష్యం 12,60,047 కాగా ఇప్పటివరకు 9,79,723 మందికి వ్యాక్సినేషన్ పూర్తి ► రాష్ట్రంలో 15 – 18 ఏళ్ల వయసు వారందరికీ మొదటి డోసు పూర్తి -
గిరిజన ప్రాంతాల్లోని సమస్యల్ని వెంటనే పరిష్కరించాలి: సీఎం జగన్
సాక్షి, అమరావతి: గిరిజన ఎమ్మెల్యేల నియోజక వర్గాల్లో అభివృద్ధిపనులు, స్థానిక సమస్యలను పరిష్కరించాలని కోరుతూ.. డిప్యూటి సీఎం పుష్పశ్రీవాణి, గిరిజన ఎమ్మెల్యేలు పీడిక రాజన్న దొర, తెల్లం బాలరాజు, విశ్వసరాయి కళావతి, తదితరులు శాసన సభలోని కార్యాలయంలో.. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిశారు. దీనిపై స్పందించిన సీఎం జగన్.. గిరిజన ప్రాంతాల అభివృద్ధికి అవసరమైన అన్నిచర్యలు తీసుకోవాలని సీఎంవో అధికారును ఆదేశించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న రోడ్లు, బ్రిడ్జిల నిర్మాణానికి సంబంధించిన అంశాలు, కరోనా సమయంలో ఆగిపోయిన రోడ్ల నిర్మాణం,ఎత్తైన కొండ ప్రాంతాల్లో నిర్మిస్తున్న రహదారులను మెషిన్స్ ద్వారా చేయడానికి అవసరమైన అనుమతులు, కొండ ప్రాంతాల్లోకి వెళ్లేందుకు అవసరమైన రైస్ వ్యాన్స్, మెరుగైన ఇంటర్నెట్ సౌకర్యం వంటి పలు అంశాలను సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లారు. అదేవిధంగా... జీవో నంబర్ 3 పై న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ అధికారులను సూచించారు. షెడ్యూల్డ్ ఏరియాలో చేర్చని గ్రామాలను కూడా చేర్చడం కొరకు.. రానున్న అసెంబ్లీలో సమావేశాలలో తీర్మానం చేయనున్నట్లు సీఎం జగన్ వెల్లడించారు. కాగా, గిరిజన ప్రాంతాల్లోని సమస్యలన్నింటిని వెంటనే పరిష్కరించాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. -
పూల సాగు.. గిరిజన రైతులకు వరం
సాక్షి, అమరావతి/గుంటూరు రూరల్: గిరిజన ప్రాంతాల్లో పూల సాగును చేపట్టేలా వ్యవసాయాధికారులు చర్యలు చేపట్టారు. ఏజెన్సీ ప్రాంత వాతావరణ పరిస్థితులు, భూమి ఇందుకు అనువుగా ఉన్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇందుకు సంబంధించి కార్యాచరణ ప్రణాళికను ఖరారు చేస్తున్నారు. సేంద్రియ పద్ధతిన పూలు, కూరగాయల సాగు చేపడితే హార్టీకల్చర్ విభాగంతో పాటు.. ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఇతోధికంగా తోడ్పడుతుందని వీసీ డాక్టర్ విష్ణువర్ధన్‌రెడ్డి ప్రకటించారు. విశాఖ ఏజెన్సీ రైతులు తరతరాలుగా వరి, మొక్కజొన్న, వేరుశనగ, కంది, రాజ్మా, చిక్కుళ్లు, వలిశలు వంటి ఆహార పంటలను, అల్లం, మిరియాలు, కాఫీ వంటి ఉద్యాన పంటలను సాగు చేస్తున్నారు. అధిక వర్షాలతో ఈ పంటలు ఆశించిన ఆదాయాన్ని ఇవ్వలేకపోతుండడంతో కొంతమంది రైతులు చట్ట విరుద్ధమైన పంటల్ని సాగు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ పంటలను నిషేధించినా అటువైపే మొగ్గు చూపుతుండటంతో.. రైతులను పూల సాగు వంటి వాణిజ్య పంటల వైపు మరల్చేలా వ్యవసాయ శాస్త్రవేత్తలు కార్యాచరణను తయారు చేసినట్టు విష్ణువర్ధన్‌రెడ్డి చెప్పారు. పూలసాగుతో లంబసింగి, అరకు మరింత ఆకర్షణీయం ఇందులో భాగంగా చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రాన్నే ఓ ప్రయోగ క్షేత్రంగా మార్చాలని, పెద్ద ఎత్తున పూలసాగు చేపట్టాలని ఆయన ఆదేశించారు. ఏజెన్సీ ప్రాంత వాతావరణం పూల సాగుకు అనువైన స్థలంగా అభివర్ణించారు. రైతులకు ఈ మేరకు అవగాహన కల్పించేలా వ్యవసాయ శాస్త్రవేత్తలు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రంలో 5 రకాల గ్లాడియోలస్, 3 రకాల ట్యూబారస్, రెండు రకాల చైనా ఆస్టర్, బంతి, చామంతి, తులిప్ వంటి పూల సాగును ప్రయోగాత్మకంగా చేపట్టినట్టు వివరించారు. ఈ పూల సాగును విజయవంతం చేసి.. సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ఆర్గానిక్ ఫార్మింగ్‌కు మారుపేరుగా నిలపాలని సూచించారు. పూల తోటల్ని విరివిగా పెంచితే లంబసింగితో పాటు, ఏపీ ఊటీ అయిన అరకు.. పర్యాటకుల్ని మరింత ఆకర్షిస్తాయని అభిప్రాయపడ్డారు. ఏజెన్సీ ప్రాంతంలో వాతావరణ పరిస్థితులు పాలీహౌస్‌ల అవసరం లేకుండానే పూలను సాగు చేయొచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పూల సాగును ఇప్పటికిప్పుడు చేపడితే ఐదేళ్లలో గిరిజన రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయొచ్చని అంచనా వేస్తున్నారు. పాలిటెక్నిక్ విద్యార్థులతో పూల సాగు.. వివిధ రకాల పూలు, కూరగాయల పంటల సాగుపై శిక్షణ పొందుతున్న చింతపల్లి సేంద్రియ పాలిటెక్నిక్ విద్యార్థులు ప్రయోగాత్మకంగా ఈ పంటల్ని సాగు చేసేందుకు నడుంకట్టారు. గ్లాడియోలస్, తులిప్, నేల సంపంగి, చైనా ఆస్టర్, బంతి, చేమంతి సాగు చేపట్టారు. వీటితో పాటు సేంద్రియ పద్ధతిన కూరగాయల పెంపకాన్ని కూడా చేపట్టి చదువుతో పాటు రోజు వారీ ఖర్చులకు డబ్బును సమకూర్చుకుంటున్నారని ప్రిన్సిపాల్ డాక్టర్ జి.రామారావు వివరించారు. -
కొండెక్కి వస్తారు.. ప్రాణాలు రక్షిస్తారు
సాక్షి, అమరావతి: గోదావరి జిల్లా వై.రామవరం అటవీ ప్రాంతం. చుట్టూ అడవి.. ఎటుచూసినా ఎత్తయిన కొండలు.. నడిచేందుకు కూడా దారిలేని ప్రాంతమది.. అడవంతా జోరు వాన కురుస్తోంది. ఓ గిరిజనుడు తీవ్రమై న కడుపు నొప్పితో గింగిరాలు తిరుగుతున్నాడు. ఆ గూడెంలో ఒకటే అలజడి. డోలీ కట్టి ఆస్పత్రికి మోసుకెళదామంటే సమయం మించిపోయేలా ఉంది. సమాచారం అందుకున్న గిరిజన సంక్షేమ శాఖ సిబ్బంది రంగంలోకి దిగారు. బురదమయమైన మార్గంలోనూ బైక్ (ఫీడర్) అంబులెన్స్‌పై ఓ వ్యక్తి కొండలు, గుట్టల మీదుగా మెరుపు వేగంతో ఆ గూడెం వైపు కదిలాడు. అదే బైక్ వెనుక అమర్చిన పడక కుర్చీలాంటి సీటుపై అతనిని కూర్చోబెట్టుకుని క్షేమంగా ఆస్పత్రికి తరలించాడు. సకాలంలో వైద్య సేవలు అందడంతో ఆ ప్రాణం నిలిచింది. రాష్ట్రంలోని మారుమూల గిరిజన ప్రాంతాల్లో ఎవరికి రోగమొచ్చినా.. గర్భిణులకు ప్రసవ సమయమైనా ఆస్పత్రికి చేరాలంటే కిలోమీటర్ల తరబడి డోలీ మోత తప్పదు. బలమైన కొయ్య (కర్ర)లకు దుప్పటి కట్టడం లేదా తట్ట, నులక మంచాలకు తాళ్లు కట్టి ఇద్దరు లేక నలుగురు చొప్పున కిలోమీటర్ల కొద్దీ మోసుకుపోవాల్సిన దుస్థితి. ఆ ప్రయాణంలో సమయం మించిపోయినా, పరిస్థితి చేయి దాటినా ప్రాణాలు కోల్పోవాల్సిందే. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో 16,068 గిరిజన ఆవాసాలున్నాయి. వాటిలో 1,809 ప్రాంతాలకు దారి కూడా లేకపోవడంతో పాత ఫీడర్ అంబులెన్స్‌లు సైతం అక్కడకు వెళ్లలేని పరిస్థితులు ఉన్నాయి. ఇకపై డోలీ మరణాలు సంభవించకుండా చూసేందుకు రాష్ట్ర ప్రభుత్వం పక్కా కార్యాచరణ చేపట్టింది. అధునాతన బైక్ అంబులెన్స్‌లను రంగంలోకి దించుతోంది. ఎక్కడికైనా సునాయాసంగా వెళ్లేలా.. రాష్ట్రంలోని ఏజెన్సీ ప్రాంతాల్లో ఇప్పటికే 122 ఫీడర్ (బైక్) అంబులెన్స్‌లు, 79 ప్రత్యేక అంబులెన్స్‌లు సేవలందిస్తున్నాయి. వీటికి పక్కన రోగిని పడుకోబెట్టి తీసుకెళ్లేందుకు వీలుగా తొట్టెను అమర్చడం వల్ల మూడు చక్రాలు, ప్రత్యేక అంబులెన్స్‌లకు నాలుగు చక్రాలు అమర్చబడ్డాయి. ఈ కారణంగా ఇవి మారుమూల అటవీ ప్రాంతాల్లోకి వెళ్లడం ఇబ్బందికరంగా మారింది. ఈ నేపథ్యంలో కాకినాడ జేఎన్టీయూకు చెందిన నిపుణులు ప్రత్యేకంగా బైక్ అంబులెన్స్‌కు రూపకల్పన చేశారు. రెండు చక్రాల బైక్‌కు వెనుక భాగంలో రోగిని కూర్చోబెట్టి తీసుకెళ్లేలా ప్రత్యేకంగా సిట్టింగ్ (తొట్టె) ఏర్పాటు చేశారు. దీనిని ప్రయోగాత్మకంగా తూర్పు గోదావరి జిల్లా మారుమూల అటవీ ప్రాంతాల్లో ఈ ఏడాది మార్చి నుంచి నిర్వహిస్తుండగా మంచి ఫలితాలు వచ్చాయి. బైక్ అంబులెన్స్ తీర్చిదిద్దారిలా.. రాయల్ ఎన్ఫీల్డ్ బైక్‌ను తీసుకుని దానికి వెనుక సీటు తొలగించారు. దాని స్థానంలో పడక కుర్చీ మాదిరిగా 140 డిగ్రీల కోణంలో తొట్టె అమర్చారు. రోగి లేదా గర్భిణి భద్రంగా కూర్చునేందుకు వీలుగా దీనిని తీర్చిదిద్దారు. ఆ బైక్‌లో ప్రాథమిక వైద్యానికి అవసరమైన మెడికల్ కిట్ అందుబాటులో ఉంది. అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించేందుకు చిన్నపాటి ఆక్సిజన్ సిలిండర్‌ను కూడా అమర్చారు. సెలైన్ ఎక్కించే సౌకర్యం సైతం ఇందులో ఉంది. డోలీ మరణాలు లేకుండా చూస్తాం రాష్ట్రంలో డోలీ మరణాలు సంభవించకుండా ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. ఇందుకోసం 7 ఐటీడీఏల పరిధిలో అంబులెన్స్‌లు వెళ్లేందుకు వీలులేని 1,809 మారుమూల ప్రాంతాలు గుర్తించాం. వాటిలో 1,503 ప్రాంతాలకు బైక్ అంబులెన్స్‌ల సౌకర్యం కల్పిస్తున్నాం. గర్భిణులు, అనారోగ్యం బారిన పడి న వారిని ముందుగానే గుర్తిం చేలా ‘గిరిబాట’ కార్యక్రమం చేపట్టాం. గిరిజనుల ప్రాణా ల్ని రక్షించేలా కార్యాచరణ చేపట్టాం. – పాముల పుష్పశ్రీవాణి, ఉప ముఖ్యమంత్రి -
కొండకోనల్లో ప్రవాసిని వైద్యం
పోషకాహార లేమి, ప్రసూతి మరణాలు ఇప్పటికీ మారుమూల గ్రామాల్లో నెలకొన్న పరిస్థితులకు అద్దం పడుతుంటాయి. ఒరిస్సాలోని కంధమాల్ జిల్లాలో గిరిజన తండాలు ఎక్కువ. అరకొరగా కూడా అందని వైద్యసేవలు. రోడ్లు, రవాణా, ఫోన్ సదుపాయాలు లేక అటవీ ప్రజానీకం నిత్యం అవస్థలను ఎదుర్కొంటూనే ఉంది. 33 ఏళ్ల ప్రవాసినీ భట్నాగర్ ఈ పరిస్థితిని గుర్తించి, అవసరమైన మెడిసిన్స్ పట్టుకొని కొండకోనల్లో ఉన్న గిరిజనులకు అందజేస్తోంది. ప్రసూతి మరణాల నివారణకు కృషి చేస్తోంది. ఆరోగ్య అవగాహన సదస్సులను ఏర్పాటు చేస్తోంది. మూడేళ్లుగా ఆత్మశక్తి ట్రస్ట్ ద్వారా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్న ప్రవాసిని మారుమూల గ్రామాల్లోని దాదాపు 21 వేల మంది గిరిజనుల్లో ఆరోగ్య స్పృహ కల్పిస్తోంది. గిరిజన గ్రామాలు కొండకోనల్లో ఉంటాయి. వాటికి చేరుకోవాలంటే కాలువలు, కొండగట్లు, రాళ్లూ రప్పలు, ముళ్ల పొదలు.. దాటుకుంటూ ప్రయాణించాలి. అలా ప్రవాసిని రోజూ కొన్ని మైళ్ల దూరం నడుస్తూనే గిరిజనులను కలుసుకుంటుంది. ఎలాంటి రవాణా సదుపాయాలు లేని ఈ ప్రాంతాల్లో పనిచేయడం తనకు కష్టమని ప్రవాసినికి తెలుసు. కానీ, వీటి గురించి పట్టించుకోలేదు ప్రవాసిని. గిరిజనులు నేటికీ మొరటైన సాంప్రదాయ వైద్యపద్ధతులనే అనుసరిస్తున్నారు. ఆరోగ్య వృద్ధి లేక ఇబ్బందులు పడుతున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని తన సేవలను విస్తరించింది. గిరిజన, ఇతర అట్టడుగు వర్గాలకు కరోనా మహమ్మారి మరిన్ని సమస్యలను సృష్టించింది. దీంతో ప్రవాసిని పాత్ర గతంలో కంటే మరింత ముఖ్యమైంది. ఆరోగ్య పథకాల పట్ల అవగాహన గిరిజన ప్రాంతాల పరిస్థితి గురించి ప్రవాసిని వివరిస్తూ –‘పోషకాహార లోపం వారికి అన్నిరకాల ఆరోగ్యసమస్యలకు మూలమైంది. ఆరోగ్య సదుపాయాలు లేకపోవడం వల్ల తల్లీ పిల్లల మరణాల రేటు పెంచుతోంద’ని వివరిస్తుంది. 2018 లో లాభాపేక్షలేని ఆత్మశక్తి ట్రస్టు ద్వారా తన సేవలను అందించడానికి సిద్ధపడింది ప్రవాసిని. మూడునెలలు ఆ సంస్థలో పనిచేసిన తర్వాత పోషకాహారం లేని మారుమూల గ్రామాల ప్రజలకు చేరువకావడానికి ఆసక్తి చూపించింది. అప్పటి నుండి ‘హెల్త్ యానిమేటర్‌గా’గా పనిచేస్తోంది. శిక్షణ పొందిన ఆరోగ్య కార్యకర్తగా గిరిజనులకు కావల్సిన ఔషధాలను అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకాల్లో గిరిజనులు భాగం పంచుకునే లా చేస్తోంది. కష్టపడలేక మధ్యలోనే సేవలను ఆపేసే కొందరిలా కాకుండా ఇష్టంతో తన పనిని కొనసాగిస్తోంది. ప్రతి రోజూ 2–3 గ్రామాలను సందర్శించి ఇల్లిల్లూ తిరిగి ఆరోగ్య సంరక్షణ చేపడుతోంది. తుడిబంధ బ్లాకులో 76 మంది పురుషులు, 37 మంది మహిళలను గ్రామ కార్యకర్తలు గా ఆరోగ్య పరిరక్షకులుగా తయారు చేసింది. కష్టం తీరింది.. ‘ఈ గిరిజన ప్రాంతాల మహిళలు, బాలికలు తమ ఆరోగ్య సమస్యలను పంచుకోవడానికి వెనకాడతారు. కానీ, నాతో ఎలాంటి జంకు లేకుండా పంచుకుంటారు. దీని వల్ల వారి అవసరాలను తెలుసుకోవడానికి, సరైన మార్గం చూపడానికి నాకు వీలవుతుంది’ అని చెబుతుంది ప్రవాసిని. ‘గతంలో జ్వరం వచ్చి ప్రాథమిక ఆరోగ్యకేంద్రానికి వెళ్లాలంటే పదేసి కిలోమీటర్లు నడవాల్సి వచ్చేది. దీనికి 200 నుంచి 500 రూపాయలు ఖర్చు కూడా అయ్యేది. ఎంతో కష్టపడి ఆసుపత్రి కి వెళ్లినా అక్కడ సిబ్బంది ఉండేవాళ్లు కాదు. ఇప్పుడు ప్రవాసిని ద్వారా మాకు ఆ కష్టం తీరింది. చిన్న చిన్న జబ్బులకు మందులు అందుబాటులో ఉండటంతో త్వరగా కోలుకోగలుగుతున్నాం’ అని గుమా గ్రామ పంచాయితీ సర్పంచ్ సుస్మిత వివరిస్తారు. ఈ ప్రాంతాల్లో 102, 108 అంబులెన్స్ సర్వీసులు అందుబాటులో లేవు. అందుకే జబ్బులు ముదరకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకునేలా వారిలో అవగాహన కల్పించడంతోపాటు బాల్య వివాహాలు, రుతు శుభ్రతకు సంబంధించిన అంశాలపై ప్రజలను చైతన్యవంతులను చేస్తోంది. పోషకాహారం ఆవశ్యకత గురించి చెబుతూ పెరటి తోటల పెంపకాన్ని ప్రోత్సహిస్తోంది. ప్రవాసిని లాంటి మహిళలు ఈ సమాజానికి ఎంతో మంది అవసరం. ఇలాంటి వారి వల్లే గ్రామాల అభివృద్ధి మెరుగుపడుతుంది. ఆదివాసీలతో ప్రవాసినీ భట్నాగర్ -
ప్రకృతి కాంతకు ఎన్నెన్ని హొయలో..
సాక్షి, సీలేరు: ప్రకృతి కాంతకు ఎన్నెన్ని హోయలో.. పదము కదిపితే ఎన్నెన్ని లయలో.. అందమైన భానోదయాలు.. ఆహ్లాదకరమైన సాయంత్రాలు.. పచ్చని కొండల్ని పెనవేసుకుపోయిన మంచు తెరలు.. ధవళ కాంతులతో మెరిసిపోయే జలపాతాలు.. సెలయేళ్లు.. అడుగడుగునా అందాలు ఆవిష్కృతమయ్యే ఆ మనోహర లోకం విశాఖ మన్యం. శీతాకాలం కావడంతో సీలేరు పరిసర ప్రాంతాల్లో దట్టంగా కురుస్తున్న మంచువానతో ప్రకృతి కనువిందు చేస్తోంది. తెల్లవారుజామున సూర్యోదయం నుంచి సాయంత్రం సంధ్యవేళ వరకు ప్రకృతి ఆవిష్కరించే అందాలు పర్యాటకుల్ని పరవశింపజేస్తున్నాయి. సాయంత్రం సంధ్య వేళ బలిమెల జలాశయం సీలేరు గుంటవాడ, బలిమెల జలాశయాల్లో పడమటి సంధ్యారాగం మధురాతి మధురం. ఆంధ్రా–ఒడిశా సరిహద్దుల్లో డుడుమ జలపాతం మైమరపిస్తే.. రెండు కొండల మధ్య నుంచి పొగమంచు పర్యాటకులను ఆహా్వనిస్తుంటుంది. అదే సమీప ప్రాంతంలో గిరిప్రియ వంతెన కూడా కనువిందు చేస్తుంది. శీతాకాలం కావడంతో రాష్ట్రం నలుమూలల నుంచి ఇక్కడి ప్రకృతి అందాలను వీక్షించేందుకు పర్యాటకులు అధిక సంఖ్యలో తరలి వస్తున్నారు. సీలేరులో అందమైన శుభోదయం తెల్లారుజామున మంచు తెరల్లో సీలేరు జలాశయం డుడుమ జలపాతం వద్ద మంచు అందాలు -
గిరిజన ప్రాంతాలు: ఏపీ సర్కారు కీలక నిర్ణయం
-
నిధులు ఫిట్.. విధులు సూపర్ హిట్
శ్రీకాకుళం పాత బస్టాండ్: జిల్లాలోని గ్రామాల్లో మౌలిక వసతులు మెరుగవుతున్నాయి. అభివృద్ధి పనులు కూడా వేగం పుంజుకున్నాయి. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం గ్రామాల పాలిట వరదాయినిగా మారింది. రెండేళ్లుగా జిల్లాలో ఉపాధి హామీ పనులు విస్తారంగా జరగడంతో వేతనదారుల సంఖ్య పెరిగింది. దీంతో పాటుగా మెటీరియల్ కాంపోనెంట్ నగదు కూడా పెరుగుతూ వచ్చింది. గత ఆర్థిక సంవత్సరంలో వేతన నగదు రూ. 480 కోట్లు చెల్లించగా, జిల్లాలో 5,50,000 మంది వేతన దారులకు పని దినాలు కల్పించారు. జిల్లా మొత్తం ఆర్థిక సంవత్సరంలో 2,42,00,000 పని దినాలు కల్పించారు. మెటీరియల్ కాంపోనెంటు నిధులు రూ.296 కోట్లు సాధించారు. ఈ ఏడాది ఇప్పటికే జిల్లాలో ఉపాధి పనుల్లో చాలా వరకు లక్ష్యాలు సాధించారు. ఇప్పటికే రూ.480.05 కోట్లకు చేరారు. అలాగే మెటీరియల్ కాంపోనెంట్ నిధులు రూ.296.77 కోట్లకి చేరాయి. ఈ ఏడాది గ్రామాల్లో పనులు చేసేందుకు ఈ కాంపోనెంట్ నిధులు కేటాయించారు. ఈ డబ్బుతోనే అన్ని శాఖల్లో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇంకా ఈ ఆర్థిక సంవత్సరం మరో మూడు నెలలు ఉన్నందున మరిన్ని పనులు జరిగే అవకాశం ఉందని జిల్లా నీటి యాజమాన్య సంస్థ అధికారులు చెబుతున్నారు. ముమ్మరంగా పనులు.. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పనుల ద్వారా వచ్చిన మెటీరియల్ కాంపోనెంట్ నిధులతో సీసీ రోడ్లు (487 కిలోమీటర్లు) వేసేందుకు పనులు జరుగుతున్నాయి. అంగన్వాడీ భవన నిర్మాణానికి 272 భవనాలు, గ్రామ పంచాయతీ భవనాలు 21, సచివాలయ భవనాలు 812, మండల మహిళా సమాఖ్యకు 3 భవనాలు, బీటీ రోడ్లు 130.24 కిలోమీటర్ల వరకు.. ఇలా మొత్తం రూ. 451.87కోట్లు ఖర్చు చేశారు. గ్రామీణ నీటి సరఫరా విభాగంలో ఒక్కో నియోజకవర్గానికి రూ.11.5 కోట్లు మంజూరు చేశారు. సర్వశిక్ష అభియాన్‌లో వివిధ పాఠశాలలకు ప్రహరీలు నిర్మించేందుకు రూ.30 కోట్లు కేటాయించారు. పశు సంవర్ధక శాఖలో 4025 మినీ గోకులాలు, గృహ నిర్మాణ సంస్థకు సంబంధించి 7475 వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం, గిరిజన సంక్షేమం పరిధిలో 39 కాంపౌండ్ వాల్స్, 29 రోడ్లు (అన్ కనెక్టెడ్ హేబిటేషన్ రోడ్లు), 26 డబ్ల్యూఎంబీ రోడ్లకు నిధులు కేటాయించారు. మూడు నెలల గడువు ఉంది ఇప్పటికే గత ఏడాది కంటే వేతనదారుల పనులు, మెటీరియల్ కాంపోనెంట్ నిధుల సమీకరణ ఎక్కువగా సాధించాం. ఇంకా ఈ ఆర్థిక సంవత్సరం ముగియడానికి గడువు మూడు నెలలు ఉంది. ఈ ఏడాది వేతనదారులు మెటీరియల్ కాంపోనెంట్ నిధులు రూ.వెయ్యి కోట్లు సాధించే దిశ గా పనులు చేస్తున్నారు. ఎన్ఆర్ఈజీఎస్ సిబ్బంది, అనుబంధ శాఖల సమన్వయంతో మ రింత ప్రగతి సాధించే దిశగా ప్రయత్నాలు చేస్తు న్నాం. గత ఏడాది పనులకు గాను జాతీయ అవార్డు రావడంతో ఈ శాఖ, ఇతర అనుబంధ శాఖల ఉద్యోగుల్లో మరింత ఉత్సాహం, నమ్మకం వచ్చింది. – హెచ్.కూర్మారావు, పీడీ, జిల్లా నీటియాజమాన్య సంస్థ, శ్రీకాకుళం -
మన్యం గజగజ!
పాడేరు/అరకులోయ: విశాఖ మన్యంలో చలిగాలు లు ప్రారంభమయ్యాయి. దీపావళి తరువాత ఏజెన్సీలో ఉష్ణోగ్రతలు మారుతున్నాయి. గత రెండు రోజుల నుంచి పగటి ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతున్నాయి. ఆర్ధరాత్రి నుంచి పొగమంచు దట్టంగాకురుస్తోంది. ఉదయం 9 గంటల వరకు సూర్యోదయం అవ్వని పరిస్థితితో ప్రజలకు ఇబ్బందులు ప్రారంభమయ్యాయి. వేకువజాము, సాయంత్రం వేళల్లో చలిగాలులు వీస్తున్నాయి. సోమవారం పాడేరుకు సమీపంలోని మినుమూలూరు కేంద్ర కాఫీబోర్డు వద్ద 16 డిగ్రీలు, చింతపల్లి వ్యవసాయ పరిశోధన స్థానంలో 16.5, అరకులోయ కాఫీబోర్డు వద్ద 17డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఆర్ధరాత్రి నుంచి ఉదయం తొమ్మిది గంటల వరకు పొగమంచు దట్టంగా కురిసింది. అనంతగిరి, పాడేరు, చింతపల్లి, దారకొండ ఘాట్‌రోడ్లలో వాహన చోదకులు పొగమంచుతో ఇబ్బందులు పడ్డారు. అలాగే వ్యవసాయ పనులకు వెళ్లేవారు, వారపుసంతలకు వెళ్లే గిరిజనులు మంచుతో అవస్థలు పడ్డారు. పాడేరు.అరకులోయ ప్రాంతాలలో ఉదయం 9 గంటలకు మంచుతెరలు వీడి సూర్యోదయం అయ్యింది. అరకు, లంబసింగి ప్రాంతాలలో పర్యటించే పర్యాటకులు మంచు అందాలను ఆస్వాదీస్తున్నారు. -
అభివృద్ధికి బాట
-
చీకటి గిరుల్లో వెలుగు రేఖలు..
ఆ ఊళ్లు కాకులు దూరని కారడవులో.. చీమలు దూరని చిట్టడవులో కావు. మన్యంలో మండల కేంద్రాలకు కూతవేటు దూరంలోని గిరిజన పల్లెలు. ఆ గ్రామాల వారు ఇప్పటికీ సూర్యుడి వెలుగు తప్ప విద్యుత్ వెలుగులు ఎరుగని పరిస్థితి. ‘విద్యుత్ స్తంభాలు మేమే వేసుకుంటాం. మేమే మోసుకుని కొండపైకి తెచ్చుకుంటాం. మా గ్రామాలకు విద్యుత్ లైన్లు ఇవ్వండయ్యా’ అని వారంతా ఎన్నిసార్లు మొత్తుకున్నా గత పాలకులెవరూ పట్టించుకోలేదు. ప్రాణాలు అరచేత పెట్టుకుని చీకట్లోనే బతుకీడుస్తున్న ఆ అడవి బిడ్డల కష్టాలు త్వరలోనే తీరబోతున్నాయ్. గిరిజన గూడేలకు త్వరలో విద్యుత్ లైన్లు రానున్నాయ్. రహదారులకు నోచుకోనున్నాయ్. ఆరోగ్య కార్యకర్తలూ అందుబాటులోకి రానున్నారు. మారుమూల గిరిజన పల్లెల్లో సౌకర్యాలు కల్పించేదిశగా వైఎస్ జగన్ ప్రభుత్వం శరవేగంగా అడుగులు వేస్తోంది. సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: మన్యంలోని పల్లెలు, తండాల్లో గిరిపుత్రుల స్థితిగతులను పరిశీలించేందుకు ‘సాక్షి’ క్షేత్ర స్థాయిలో పర్యటించింది. మండల కేంద్రమైన గూడెం కొత్తవీధి (జీకే వీధి) గ్రామానికి 12 కిలోమీటర్ల దూరంలో.. అదే పంచాయతీ పరిధిలోని కొమ్ము సంపంగి గ్రామంలోని పరిస్థితుల్ని గమనించింది. అక్కడ 24 కుటుంబాలు.. చిన్నాపెద్దా.. ముసలీముతకా కలిపి మొత్తంగా 86 మంది ఆదివాసీలు నివశిస్తున్నారు. ఆ గ్రామానికి చేరుకోవాలంటే జీకే వీధి నుంచి పందిరాయి కొత్తగూడెంకు 6 కిలోమీటర్ల రహదారి మార్గం ఉంది. వాగులు, ఎత్తైన కొండలు గల ఆ రహదారి మార్గంలో కేవలం ద్విచక్ర వాహనాలే అతికష్టం మీద వెళ్తాయి. అక్కడి నుంచి 6 కిలోమీటర్లు నడక దారిన కొండలు దిగి వెళితే కొమ్ము సంపంగి పల్లె వస్తుంది. అగ్గిపెట్టె కావాలన్నా 6 కిలోమీటర్ల దూరంలో చిన్న బడ్డీ కొట్టు ఉన్న పామురాయి గ్రామం వెళ్లాల్సిందే. రేషన్ తీసుకోవాలంటే 10 కిలోమీటర్ల దూరంలోని పాతవీధి పల్లెలో ఉన్న డిపోకి వెళ్లాలి. అంగన్వాడీ కేంద్రమైతే 9 కిలోమీటర్ల దూరంలోని కంపమాని పాకలు అనే గ్రామంలో ఉంది. ఇన్ని కిలోమీటర్లు ప్రయాణించేందుకు కనీసం కాలిబాట కూడా లేదు. ఆ ఊళ్లో మూడు గుర్రాలున్నాయి. అవే ఆ గ్రామస్తులందరి ప్రయాణ అవసరాలను తీరుస్తాయి. 11 మండలాల్లో.. వందలాదిగా.. ఈ పరిస్థితి ఒక్క కొమ్ము సంపంగి పల్లెలోని కాదు. కనీస వసతులకు నోచుకోని తండాలు, పల్లెలు, నివాస ప్రాంతాలు విశాఖ మన్యంలోని 11 మండలాల్లో వందల్లో ఉన్నాయి. సరైన రహదారుల్లేని పల్లెలు 1,500కు పైగానే ఉన్నాయి. విద్యుత్ సౌకర్యం లేని పల్లెలు వందకుపైగా ఉన్నాయి. జీకే వీధి మండలంలోనే కొత్తపాలెం, నూతిబంద, గునుకురాయి, మూలగరువు, కొయ్యూరు మండలం రెమ్మలపాలెం, రేవులకోట, కంఠారం, మండపల్లి, పుట్టకోట, జోతులమామిడి, లేతమర్రి, వెదురులంక, జి.మాడుగుల మండలం ఓలిమామిడి, అనంతగిరి మండలం కొత్తవలస, దాయర్తీ, చీమిడివలస గ్రామాలతోపాటు వీటి చుట్టుపక్కల తండాల్లో విద్యుత్ సౌకర్యం లేదు. అప్పట్లో గాలి దీపాలు పెట్టారు మూడేళ్ల క్రితం టీడీపీ ప్రభుత్వం దీనదయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ జ్యోతి యువజన పథకం (డీడీయూజేవై) కింద గాలిలో దీపాల్లాంటి స్టాండ్ ఎలోన్ సిస్టమ్ సోలార్ లైట్లను కొన్ని గ్రామాల్లో ఏర్పాటు చేసింది. 288 గ్రామాల్లో రూ.69 కోట్ల వ్యయంతో సోలార్ లైట్లు బిగించగా.. కొద్దిరోజులకే పాడైపోయాయి. ఈ పనుల పేరిట టీడీపీ నాయకులు రూ.కోట్లు దోచుకున్నారే తప్ప వెలుగులు మాత్రం రాలేదు. కొత్త సర్కారుతో వెలుగు ఇన్నేళ్లూ సమస్యలతో సహవాసం చేస్తూ చీకట్లోనే ప్రాణాలొడ్డి బతుకుతున్న గిరిజనులకు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ పగ్గాలు చేపట్టడంతో వెలుగు వచ్చినట్టయింది. మూడు నెలలుగా మారుమూల మన్యం పల్లెలపై అధికారులు దృష్టి సారించారు. కనీస సౌకర్యాల కల్పనకు శరవేగంగా చర్యలు చేపడుతున్నారు. నేరుగా ఆ పల్లెలు, తండాలకు లైన్లు వేసి విద్యుత్ సరఫరా చేసేందుకు చర్యలు చేపట్టారు. ప్రపంచ బ్యాంక్ నిధులతో అన్ని గ్రిడ్లను కలిపి విద్యుత్ సౌకర్యం కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని ఈపీడీసీఎల్ ఎస్ఈ టీవీ సూర్యప్రకాష్ ‘సాక్షి ప్రతినిధి’కి తెలిపారు. ఇందుకు తొలి దశగా రూ.32 కోట్లు విడుదలయ్యాయని, త్వరలోనే పనులు చేపడతామని వెల్లడించారు. ఇప్పటివరకు గిరిజనులు రేషన్ కోసం కిలోమీటర్లు నడవాల్సిన దుస్థితి నెలకొంది. వలంటీర్ల వ్యవస్థ ద్వారా నేరుగా వారి ఇళ్లకే సరుకులు పంపిణీ చేసే ఏర్పాట్లు చేస్తున్నామని పాడేరు ఇన్చార్జి కలెక్టర్, ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి డీకే బాలాజీ వెల్లడించారు. నెలలు నిండిన గర్భిణుల కోసం అరకులో నెలన్నర క్రితం ప్రత్యేక హాస్టల్ ఏర్పాటు చేశామని, ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంలను గిరిజనులకు అందుబాటులో ఉంచుతున్నామని డీఎంహెచ్‌వో డాక్టర్ సనపల తిరుపతిరావు చెప్పారు. విశాఖ జిల్లా గూడెం కొత్తవీధి పరిధిలోని కొమ్ము సంపంగి గ్రామానికి చెందిన ఈ గిరిజన మహిళ పేరు సుందరి పేంగు. ఈ మధ్యే ఓటు వేసేందుకు ఆమె కొండ దిగి బాహ్య ప్రపంచంలోకి వచ్చింది. ఇందుకోసం ఆమె 6 కిలోమీటర్ల మేర అడవి గుట్టల వెంట నడిచింది. ఆ తరువాత వాగులు, ఎత్తైన కొండల మధ్య కాలిబాట మార్గంలో మరో 6 కిలోమీటర్లు ప్రయాణించింది. ఈ పరిస్థితి ఆమెకు మాత్రమే పరిమితం కాదు. విశాఖ గిరిజన తండాల్లోని అడవి బిడ్డలంతా కనీస సౌకర్యాలకు దూరంగా బతుకుతున్నారు. దుర్భర జీవితాన్ని అనుభవిస్తున్నారు. ఆమెను కదిలించగా.. ‘ఏళ్ల నుంచి కొండల మధ్య సీకట్లోనే బతుకుతున్నామయ్యా. అగ్గి డబ్బా కావాలన్నా మూడు మైళ్లు నడిసెళ్లాల. మా గూడెంలో ఏం దొరకవ్. మొన్నటిదాకా సర్కారోళ్లెవరూ రాలే. కొత్త పెబుత్వం వచ్చిందిగా.. మూడు నెలల్నుంచి అధికారులొత్తన్నారు. త్వరలో కరెంటిత్తామంటున్నారు. రోడ్లు ఏత్తామంటున్నారు. రేషన్ బియ్యం కూడా ఇంటికే తెచ్చిత్తారంట. మొత్తాన్ని ఇన్నేళ్లకి మా బతుకుల్లో వెలుగు వత్తాందంటే సంతోషమే గదా’ అని చెప్పుకొచ్చింది. కాన్పు అయినా..పాము కాటైనా..నాటు వైద్యమే ఇక ఏఎన్ఎంలు ఆ పల్లెకి వచ్చే సాహసం చేయలేదు. దీంతో పాము కరిచినా.. గర్భిణులు కాన్పుకైనా నాటు వైద్యంతోనే సరిపెట్టేస్తారు. పరిస్థితి విషమిస్తే అప్పటికప్పుడు డోలీ కట్టి 10 కిలోమీటర్ల దూరం నడిచి వెళితే గానీ రోడ్డు మార్గం రాదు. ఈలోగా ప్రాణం దైవాధీనమే. పిల్లలు చదువుకోవాలంటే 6 కి.మీ. దూరంలోని పామురాయి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో చేర్పించాలి. ఆ పల్లెలో 25 మంది చిన్న పిల్లలుంటే.. కేవలం నలుగుర్ని మాత్రమే పామురాయిలో తెలిసిన వారి ఇళ్లల్లో ఉంచి చదివిస్తున్నారు. రహదారుల నిర్మాణంపై దృష్టి విశాఖ మన్యంలోని తండాలు, పల్లెల్లో నివసిస్తున్న గిరిపుత్రుల ప్రధాన సమస్య రహదారులే. రోడ్లు బాగుంటే సగం సమస్యలు తీరినట్టే. అందుకే రోడ్ల నిర్మాణంపై సీరియస్‌గా దృష్టి సారించాం. విశాఖ ఏజెన్సీలో దాదాపు 1,500 నివాస ప్రాంతాల్లో సరైన రహదారుల్లేవు. ఉపాధి హామీ పథకం కింద రోడ్ల నిర్మాణం చేపడతాం.త్వరలోనే నిధులు రానున్నాయి. అన్ని విభాగాల అధికారులు, సిబ్బందిని క్షేత్రస్థాయిలో పర్యటించేలా ఆదేశాలు జారీ చేస్తాం. – డీకే బాలాజీ, ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి, ఇన్చార్జి సబ్ కలెక్టర్, పాడేరు -
గిరిజన గోడు ఎవరికి పట్టదా?
-
గిరిజనం వద్దకే వైద్య పరీక్షలు!
సాక్షి, హైదరాబాద్: గిరిజనుల వైద్యంపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోంది. ఏజెన్సీ ప్రాంతాల్లో మొబైల్ డయాగ్నొస్టిక్స్ ల్యాబ్‌లు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. గిరిజన ప్రాంత ప్రజలకు అన్ని రకాల రక్త, మూత్ర పరీక్షలు చేసేలా చర్యలు తీసుకుంటోంది. ఇందుకోసం అధునాతన యంత్రాలను కొనుగోలు చేసి మొబైల్ వాహనాల్లో గిరిజన ప్రాంతాలకే వెళ్లి పరీక్షలు నిర్వహించాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ నిర్ణయం తీసుకుంది. ఆ శాఖ మంత్రి ఈటల రాజేందర్ ఆధ్వర్యంలో అధికారులు ఇప్పటికే యంత్రాలను పరిశీలించారు. ఒక్కొక్కటి రూ.40 లక్షల వ్యయంతో 12 నుంచి 15 అత్యాధునిక యంత్రాలు కొనుగోలు చేయడానికి వైద్యారోగ్యశాఖ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. తెలంగాణ వచ్చాక గిరిజన వైద్యానికి పెద్దపీట గతంలో గిరిజన గ్రామాల్లో ప్రజలు అనారోగ్యం బారిన పడితే సరైన వైద్యం అందకపోవడంతో మరణాల సంఖ్య కూడా అధికంగా ఉండేది. వర్షాలు ప్రారంభమైతే మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ, అతిసారం వంటి వ్యాధులు గిరిజనుల పాలిట శాపంగా మారేవి. ఈ నేపథ్యంలో తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రభుత్వం గిరిజన వైద్యానికి పెద్దపీట వేసింది. క్షేత్రస్థాయిలో సిబ్బంది వైద్యసేవలను మెరుగుపర్చడంతో పాటు ప్రభావిత ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించడంతో వ్యాధుల నివారణ సాధ్యమైంది. గత మూడేళ్లుగా గిరిజన గూడేల్లోని మలేరియా మరణాలకు బ్రేక్ పడింది. ఏటా వందల సంఖ్యలో ఉండే మరణాలను పూర్తిగా నివారించగలిగింది. ప్రాథమిక దశలోనే వ్యాధులను నిర్ధారించి చికిత్సలు చేయడంతో ఏజెన్సీలో గిరిజనులకు మెరుగైన వైద్యసేవలు అందించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగా పలు వ్యాధులకు కారణమయ్యే దోమకాటుకు గురికాకుండా గిరిజన ప్రజలకు దోమతెరలు పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అలాగే వ్యాధులను ముందుగానే నిర్ధారించేందుకు డయాగ్నొస్టిక్స్ సెంటర్లను వారి చెంతకే తీసుకెళ్లనున్నారు. ప్రస్తుతం అధికారులు ఎంపిక చేసిన యంత్రం సాయంతో ఒక్కసారే 200 మందికి సంబంధించిన రక్త నమూనాలకు గంట వ్యవధిలోనే వివిధ రకాల పరీక్షలు నిర్వహించవచ్చు. ప్రతి గ్రామంలో నెలకు కనీసం ఒకసారి ఈ యంత్రాల సాయంతో ప్రతి ఒక్కరికీ ఆరోగ్య పరీక్షలు చేయనున్నారు. ప్రస్తుతం గిరిజన ప్రాంతాల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నప్పటికీ, అక్కడ అవసరమైన రోగ నిర్ధారణ యంత్రాలు లేవు. ఏదైనా రోగం వస్తే, అది ముదిరే వరకు గిరిజనులు ఆస్పత్రులకు రావడంలేదు. దీంతో ప్రాణ నష్టం జరుగుతోంది. ప్రస్తుతం వర్షాకాలం కావడంతో విష జ్వరాలు, వైరస్లు విజృంభించే ప్రమాదముంది. ఈ నేపథ్యంలో వీలైనంత త్వరగా మొబైల్ ల్యాబ్‌లు అందుబాటులోకి తీసుకురావాలని మంత్రి ఈటల రాజేందర్ అధికారులకు సూచించారు. -
మన్యంలో కొండెక్కని అక్షరం!
సాక్షి, విశాఖపట్నం : మన్యంలో బడి ముఖం చూడని చిన్నారులు వందల సంఖ్యలో దర్శనమిస్తున్నారు. అక్షరం అక్కడ మచ్చుకైనా కనిపించదు. చిట్టిచేతులతో అక్షరాలు దిద్దాల్సిన పిల్లలు అడవి బాటపడుతున్నారు. గత సర్కార్ పాలనలో కొత్త పాఠశాలలను ఏర్పాటు చేయకపోవడంతో పిల్లలు అక్షర జ్ఞానానికి నోచుకోలేదు. బడి ముఖం చూడని చిన్నారుల మాదిరిగానే మధ్యలో బడి మానేసినవారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. వేసవి సెలవుల అనంతరం పాఠశాలలు తెరిచేటప్పుడు, సెలవులకు ముందు మాత్రం డ్రాపౌట్లపై సిబ్బంది సర్వే చేసి అధికారులకు నివేదికలు ఇస్తారు. తరువాత ఆ విషయాన్ని మరచిపోతున్నారు. మళ్లీ అదే సర్వేలు.. అవే నివేదికలు. వారిని పాఠశాలకు తీసుకువచ్చే పరిస్థితి లేదు. ఇక పాఠశాలలు లేని గ్రామాలు కొన్నింటిని ఎంపిక చేసుకుని సెప్టెంబర్ లేదా అక్టోబర్‌లో ఎన్‌ఆర్‌ఎస్‌టీ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. మార్చిలో మూసేస్తున్నారు. దీంతో పిల్లలు చదువుకు దూరమవుతున్నారు. గిరిజన ప్రాంతాల్లో నేటికీ చాలామంది చదువుకు దూరంగానే ఉన్నారు. గత ప్రభుత్వం విద్యాశాఖను పూర్తిగా నిర్లక్ష్యం చేయడంతో పరిస్థితి మరీ ఘోరంగా తయారైంది. మూడు సంవత్సరాల కిందట విద్యాశాఖ నిర్వహించిన సర్వేలో మన్యంలో అసలు బడిముఖం చూడని పిల్లలు ఏడు వేలు దాటి ఉన్నట్టు తేలింది. అయితే వారిని బడిలో చేర్పించడం ఎలా అనేది మాత్రం అధికారులు తేల్చలేకపోయారు. చిన్నపిల్లలను గ్రామాలకు దూరంగా ఉన్న పాఠశాలలకు పంపించేందుకు తల్లిదండ్రులు అంగీకరించడం లేదు. అడవిలో కట్టెలు ఏరుతున్న డ్రాపౌటు పిల్లలు దీంతో బడికి వెళ్లాల్సిన చిన్నారులు తల్లిదండ్రులతో అడవికి వెళ్లడం, వ్యవసాయం చేయడం, పశువుల కాపర్లుగా మారిపోతున్నారు. కొన్ని చిన్న గ్రామాలుగా ఉంటే మరికొన్ని పెద్ద గ్రామాలుగా ఉన్నాయి. పెద్ద గ్రామాల్లో బడి ఈడు కలిగిన పిల్లలు 15 మంది వరకు ఉంటున్నారు. వారిని దూరంగా ఉన్న ప్రాంతాలకు బడికి పంపడం లేదు. ఆశ్రమ పాఠశాలల్లో మూడో తరగతి నుంచి చేర్చుకుంటున్నారు. అయితే ఒకటి రెండు తరగతులు చదివేందుకు వీలులేకుండా పోయింది. ఆ ఒకటి రెండు తరగతులు చదివేందుకు ఉపాధ్యాయులను వేయాలని కోరుతోన్నా స్పందించడంలేదు. ఏటా ఎన్‌ఆర్‌ఎస్‌టీసీ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. ఆరు నెలల తరువాత వాటిని ఎత్తేస్తున్నారు. ఆ పాఠశాలలు నడిపే సమయంలో విద్యార్థులకు భోజనం పెట్టడం లేదు. విద్యార్థులపై వివక్ష మారుమూల ప్రాంతాల్లో అధికంగా జీపీఎస్ (టీడబ్ల్యూ) మండల పరిషత్ ప్రాథమికక పాఠశాలలుంటాయి. రెండింటిలోను చదివేది గిరిజన విద్యార్థులే. అయినా అధికారులు మండల పరిషత్ పాఠశాలపై వివక్షత చూపుతున్నారనే విమర్శలున్నాయి. జీపీఎస్ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు బ్యాగ్‌లు, పుస్తకాలు, నోట్ పుస్తకాలు, బూట్లు, అందజేస్తున్నారు. మండల పరిషత్ విద్యార్థులకు అలాంటివి ఏమి అందించడం లేదు. దీనిపై అధికారులు చెప్పే సమాధానం విచిత్రంగా ఉంటుంది. జీపీఎస్ పాఠశాలలు గిరిజన సంక్షేమ శాఖ పరిధిలో ఉన్నాయని, మండల పరిషత్ పాఠశాలలు వారికి సంబంధం లేదంటున్నారు. కాని చదివేది పేద విద్యార్థులన్న వాస్తవాన్ని విద్యాశాఖాధికారులు మరచిపోతున్నారు. గడచిన రెండేళ్లుగా ఈ వివక్ష కొనసాగుతోంది. -
‘అరణ్య’ రోదన..
పాల్వంచరూరల్: చెట్టు.. పుట్ట... పశువులు.. అడవి సంపదే సర్వస్వంగా బతికే ఆదివాసీలు వారంతా. ప్రపంచం సాంకేతికంగా అభివృద్ధి చెందుతున్నా.. ఆ ఆదివాసీ గూడెంలో మాత్రం కనీసం విద్యుత్ సౌకర్యం కూడా లేదు. నేటికీ చీకటిలోనే బతుకీడుస్తున్న గిరిజనులు.. నీటి కోసం కూడా కిలోమీటర్ల దూరం కాలినడకన వెళ్లాల్సిందే. ఏజెన్సీ ప్రాంత అభివృద్ధికి కోట్లు ఖర్చు చేస్తున్నామని చెపుతున్న పాలకులకు ఇలాంటి ఆదివాసీ గూడేలు ఎందుకు కనిపించడం లేదని పలువురు ప్రశ్నిస్తున్నారు. చివరకు ఆదివాసీ గిరిజనుల కోసమే ఏర్పాటు చేసిన సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ(ఐటీడీఏ) కూడా వీరి గురించి పట్టించుకోకపోవడం గమనార్హం. పాలకులు, అధికారుల నిర్లక్ష్యం, చిన్నచూపుతో తమ సమస్యలను పట్టించుకునే నాథుడే లేడని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏళ్ల తరబడి ఆదివాసీ గూడేల్లో ఉంటున్న వీరి జీవనశైలిలో ఏ మాత్రం మార్పు రావడం లేదు. నిరక్షరాస్యత, అమాయకత్వంతో అరణ్యంలో కాపురం చేస్తూ అభివృద్ధి పథకాలకు నోచుకోక దుర్భర జీవితం గడుపుతున్నారు. ఇంతటి దీనావస్థలో ఉన్న గిరిజన గూడెం చిరుతానిపాడు. జిల్లా కేంద్రం కొత్తగూడేనికి 34 కిలో మీటర్ల దూరంలో గల ఈ గూడెం.. పాల్వంచ మండలంలోని దట్టమైన అటవీ ప్రాంతంలో ఉంటుంది. ఛత్తీస్‌గఢ్ నుంచి ఎన్నో ఏళ్ల క్రితం వలస వచ్చిన ఆదివాసీలు ఇక్కడ గుట్టల మధ్య నివసిస్తున్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న పథకాలు ఏ ఒక్కటీ వీరికి అందడం లేదు. ఇక్కడ 33 గిరిజన కుటుంబాల్లో 120 మంది నివాసం ఉంటున్నారు. తునికాకు, అటవీ ఉత్పత్తుల సేకరణతో పాటు వ్యవసాయ కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. గ్రామంలో ఒక్కో గిరిజనుడికి 20 నుంచి 30 వరకు తెల్ల పశువులు, గొర్రెలు, మేకలు ఉన్నాయి. ఆధార్‌కార్డులు, ఓటరు గుర్తింపు కార్డులు ఉన్నాయి కానీ రేషన్ కార్డులు మాత్రం ఇవ్వలేదు. విద్యుత్, తాగునీరు, రహదారి సౌకర్యాలు శూన్యం.. మండలంలోని బంజర పంచాయతీ నుంచి 3–4 కిలోమీటర్ల దూరంలో ఉన్న చిరుతానిపాడు గ్రామంలో నివాసం ఉంటున్న గిరిజనులకు ప్రభుత్వ పథకాలు అందడం లేదు. కనీస రహదారి సౌకర్యం కూడా లేదు. వర్షాకాలంలో అయితే చుట్టూ తిరిగి 5 కిలోమీటర్ల దూరం కాలినడకన వెళ్తే తప్ప పంచాయతీ కేంద్రానికి చేరుకోలేరు. ఇక విద్యుత్ సౌకర్యం లేక అంధకారంలో మగ్గుతున్నారు. తాగునీరు లేకపోవడంతో వర్షాకాలం, వేసవికాలంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వైద్యసేవలు అందని ద్రాక్షే... చిరుతానిపాడులోని గిరిజన ప్రజలకు వైద్య సౌకర్యం కూడా అందుబాటులో లేదు. దీంతో గ్రామంలో ఎవరికైనా జబ్బుచేస్తే మంచంతో కావడి కట్టుకుని నలుగురు వ్యక్తులు కలిసి 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉల్వనూరు అరోగ్య కేంద్రానికి వెళ్లాల్సిన దుస్థితి. కనీసం టీకాలు వేయడానికి కూడా గ్రామంలోకి వైద్యసిబ్బంది రారని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చేసేది లేక నాటు వైద్యంపైనే ఆధారపడుతున్నారు. గ్రామంలో చదువుకుంటున్నది ఇద్దరే.. ఈ గిరిజన పిల్లలు చదువుకోవాలంటే పాఠశాల లేదు. గ్రామంలోని 120 మందిలో కేవలం ఇద్దరు మాత్రమే చదువుకుంటున్నారు. వారిలో అక్కా చెల్లెళ్లు లక్ష్మి భద్రాచలం గిరిజన ఆశ్రమ కళాశాలలో ఇంటర్, కోసమ్మ ఉల్వనూరులోని ఆశ్రమ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నారు. వారు కూడా ఇతర ప్రాంతాలకు వెళుతున్నారు. ఇక మిగితా పిల్లలెవరూ చదువుపై అసక్తి చూపడం లేదు. తాగునీరు లేక పాట్లు.. చిరుతానిపాడు గ్రామంలో తాగునీరు సౌకర్యం లేదు. దీంతో గిరిజనులు వర్షకాలం, వేసవిలోకూడా గ్రామ సమీపంలో ఉన్న కుంటలు, వాగులు, వంకలో ప్రవహించే నీటినే తాగుతున్నారు. కలుషితంగా ఉండే ఆ నీటిని తాగడంతో అనారోగ్యాల పాలవుతున్నారు. కనీసం ఒక బోరు వేయడానికి కూడా అటవీశాఖ అధికారులు అంగీకరించడం లేదు. నిత్యావసర సరుకులకు 4 కిలోమీటర్లు... చిరుతానిపాడు గ్రామంలోని గిరిజనులకు అవసరమైన నిత్యావసర సరుకులు తెచ్చుకోవాలంటే నాలుగు కిలోమీటర్ల దూరంలోని ఉల్వనూరు గ్రామానికి నడిచి వెళ్లాల్సిందే. వారం, పది రోజులకు ఒకసారి వెళ్లి తాము సేకరించిన అటవీ ఉత్పత్తులను విక్రయించి నిత్యావసర సరుకులను తెచ్చుకుంటారు. గ్రామంలోని గిరిజనులకు ఒక్కరికి కూడా బ్యాంక్ ఎకౌంట్ లేదు. జీసీసీ సరుకులు కూడా అందని దుస్థితి నెలకొంది. పట్టించుకోని ప్రజాప్రతినిధులు, అధికారులు.. అటవీ ప్రాంతంలో అభివృద్దికి ఆమడదూరంలో జీవనం సాగిస్తున్న వలస ఆదివాసీ గిరిజన సమస్యలను ఇటు అధికారులు, అటు ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదు. గ్రామంలో ఉన్న ప్రజలకు ఓటరు గుర్తింపు కార్డులు, ఆధార్ కార్డులు ఉన్నాయి. ఎన్నికల్లో ఓట్లు వేయించుకునేందుకు మాత్రం నాయకులు తమపై కపట ప్రేమ చూపుతారని, ఆ తర్వాత గ్రామం వైపు కన్నెత్తి కూడా చూడరని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మాకు ప్రభుత్వ పథకాలంటే తెలియదు మా గ్రామంలో చాలావరకు ఓటరు కార్డులు, ఆధార్ కార్డులు ఉన్నాయి. మేము కూడా జనాభా లెక్కల్లో ఉన్నాం. కానీ ప్రభుత్వం అందించే ఏ ఒక్క పథకం కూడా మాకు రావడం లేదు. అసలు మా గ్రామంలో ఇంతవరకు ఎవరికీ బ్యాంకు ఖాతాలు లేవు. – జోగారాం, చిరుతానిపాడు ఐటీడీఏ కూడా పట్టించుకోవడం లేదు ఏళ్ల తరబడి ఇదే గూడెంలో నివాసం ఉంటున్నాం. అడవిని నమ్ముకుని బతుకుతున్నాం. అడవిలో చెట్ల నుంచి వచ్చే ఉత్పత్తులను అమ్ముకుని వచ్చిన డబ్బుతో అవసరమైన సరుకులు కొనుక్కుంటాం. ఆదివాసీ గిరిజనుల కోసం ఏర్పాటు చేసిన భద్రాచలం ఐటీడీఏ కూడా మా గోడు పట్టించుకోవడం లేదు. – లక్ష్మి, చిరుతానిపాడు మాపై చిన్నచూపు ఎందుకు..? ఆదివాసీ గ్రామంలో ఉంటున్న మాపై అధికారులు, నాయకులు చిన్నచూపు చూస్తున్నారు. గ్రామంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించడంలేదు. కనీసం రోడ్డు కూడా లేదంటే మేము ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నామో తెలుస్తుంది. మంచినీళ్లు లేక ఎండిన చెరువులో చెలిమలు తీసుకుని నీళ్లు తాగుతున్నాం. – కోవాసి మంగమ్మ, చిరుతానిపాడు -
‘బస్తర్’ మే సవాల్
మహారాష్ట్రలోని గడ్చిరోలి.. ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్.. గిరిజన నియోజకవర్గాలు. అటవీ హక్కుల చట్టంపైనే అన్ని కళ్లూ పెట్టుకున్నారు ఇక్కడి ఆదివాసీలు. భూమి హక్కులు కాపాడే వారికే ఓటేస్తామంటున్నారు. మరోవైపు మావోయిస్టులు ఇక్కడ ఎన్నికల్ని అడ్డుకునేందుకు బెదిరింపులకు, హింసాత్మక చర్యలకు పాల్పడుతున్నారు. మంగళవారం బస్తర్‌లోని దంతేవాడకు చెందిన బీజేపీ శాసనసభ్యుడు భీమా మాండవి కాన్వాయ్‌పై దాడి జరిపి, ఆయనతో సహా నలుగురు భద్రతా సిబ్బందిని కాల్చి చంపారు. దీంతో మరింత అప్రమత్తమైన ప్రభుత్వం బస్తర్‌లో 80 వేల భద్రతా బలగాలను, డ్రోన్లను మోహరించింది. భారీ ఏర్పాట్ల మధ్య నేడు ఈ రెండు నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగనున్నాయి. గడ్చిరోలిలో అటవీ హక్కుల చట్టం ప్రభావం మహారాష్ట్రలోని గడ్చిరోలి చిముర్ లోక్‌సభ నియోజకవర్గంలో బీజేపీ, కాంగ్రెస్ బలంగా ఢీకొంటున్నాయి. బీజేపీ సిట్టింగ్ ఎంపీ అశోక్ నేతే, కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ నామ్‌దేవ్ ఉసెంది మధ్య ప్రధాన పోటీ జరుగుతోంది. ఇద్దరూ మాజీ ఎమ్మెల్యేలే. మోదీకి వున్న జనాకర్షణ తమ అవకాశాలను మెరుగుపరుస్తుందని బీజేపీ భావిస్తుండగా, ఎన్సీపీ, సీపీఐ పొత్తుతో తాము గట్టెక్కగలమని కాంగ్రెస్ ఆశిస్తోంది. ఎటపల్లి – భమ్రాగర్ మైనింగ్ బెల్ట్‌లో పెసా, అటవీ హక్కుల చట్టాలు అమలు చేయకపోవడంపై ఇక్కడ ఆదివాసీలు తీవ్రంగా స్పందిస్తున్నారు. ఈ అంశం ఎన్నికల్లో కీలకం కానున్నదని గడ్చిరోలి మారుమూల ప్రాంతాల ప్రజలు చెబుతున్నారు. గిరిజనుల అటవీ హక్కులు పరిరక్షించకపోవడమనేది బీజేపీకి నష్టదాయకంగా పరిణమించగలదన్న అభిప్రాయం వినపడుతోంది. గడ్చిరోలిలో 90.85 శాతం మంది గ్రామీణులు. 30.50 శాతం మంది ఆదివాసీలు. అభివృద్ధి, మౌలిక సదుపాయాల పరంగా వెనుకబడిన గడ్చిరోలి ప్రజలు రైల్వే కనెక్టివిటీ కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. వీటిపై నేతే 2014లో ఓటర్లకు ఇచ్చిన వాగ్దానం నెరవేరకపోవడం, దీనికి తోడు ఆయన ఓ ఆర్థిక కుంభకోణంలో చిక్కుకోవడం అనే అంశాలు బీజేపీ విజయావకాశాలను దెబ్బతీయొచ్చని పరిశీలకులు భావిస్తున్నారు. 42 శాతం ఓబీసీల ఓట్లు ఇక్కడి అభ్యర్థి గెలుపోటములను ప్రభావితం చేయనున్నాయి. తమ రిజర్వేషన్ కోటాను 19 నుంచి 6 శాతానికి తగ్గించడంపై వీరు ఆగ్రహంతో వున్నారు. కోటాను పునరుద్ధరింపచేస్తామని రెండు ప్రధాన పార్టీల నేతలూ హామీలిచ్చారు. భూమి హక్కులే ‘బస్తర్’ ఎజెండా ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్‌లో భూమి హక్కే ప్రధాన ఎజెండా. అటవీ హక్కుల చట్టం కింద అడవులపై ఆధారపడి జీవించే హక్కు తమకు ఉందంటున్న ఆదివాసీలు.. తమ భూముల జోలికి రాబోమని ప్రకటించే వారికే ఓటు వేస్తామంటున్నారు. ‘జాతీయవాదం ఇక్కడ ఓట్లు రాల్చదు. జీవనాధారమైన భూమే మాకు అతి ముఖ్యం’ అంటున్నారు స్థానికులు. అడవుల్లో నివసించేందుకు అనర్హులైన ఆదివాసీలను దురాక్రమణదారులుగా గుర్తించి జూలై లోపు ఖాళీ చేయించాలని ఇటీవల సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. దీనిపై ఇక్కడి ఆదివాసీలు మండిపడుతున్నారు. ఇటీవల నిరసన ప్రదర్శనలు జరిపి, కరపత్రాలు పంచారు. ఏ ఒక్కరినీ అడవుల నుంచి ఖాళీ చేయించబోమని ముఖ్యమంత్రి భాగెల్ హామీ ఇచ్చిన తర్వాతే వారు శాంతించారు. మోదీ ప్రభుత్వం కోర్టులో ఆదివాసీల తరఫున తన వాదన సరిగా వినిపించలేకపోయిందని, వారి హక్కులకు రక్షణ కల్పించలేకపోయిందని కాంగ్రెస్ విమర్శిస్తోంది. కొంటా, బస్తర్, చిత్రకూట్, కొండగావ్, జగదల్పూర్, దంతేవాడ, బీజీపూర్, నారాయణపూర్ అనే ఎనిమిది అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్న బస్తర్ లోక్‌సభ నియోజకవర్గంలో ఎస్టీ జనాభా 70 శాతం. బీజేపీ తరఫున ఆ పార్టీ బస్తర్ జిల్లా నేత బైదురామ్ కశ్యప్.. కాంగ్రెస్ ఫైర్‌బ్రాండ్ లీడర్ దీపక్ బైజ్‌తో తలపడుతున్నారు. 1998 నుంచి బీజేపీ ఖాతాలో వున్న బస్తర్‌ను ఎలాగైనా చేజిక్కించుకోవాలనే పట్టుదలతో వున్న కాంగ్రెస్.. ఈసారి చిత్రకూట్ సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన దీపక్‌కు టికెట్ ఇచ్చింది. బీజేపీ అభ్యర్థి కంటే ఈ యువకుడికే ప్రజాదరణ ఎక్కువ వున్నట్టు స్థానికులు చెబుతున్నారు. గతంలో టాటా గ్రూప్ కోసం బీజేపీ ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న భూమిని తిరిగిచ్చేయడమనేది ఆదివాసీల్లో కాంగ్రెస్ ఆదరణకు దోహదపడగలదని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. బస్తర్ సిట్టింగ్ ఎంపీ దినేశ్ కశ్యప్‌పై స్థానికుల్లో చోటుచేసుకున్న వ్యతిరేకత కూడా కాంగ్రెస్‌కు అనుకూలంగా మారనుంది. పలు సమస్యలతో సతమతమవుతున్న నియోజకవర్గాన్ని ఎంపీ ఏనాడూ సందర్శించలేదని ఆదివాసీలు విమర్శిస్తున్నారు. కేంద్రంపై ఉన్న వ్యతిరేకతకు తోడు గత మూడు మాసాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం మెరుగైన పనితీరు కనబరచడం, ప్రత్యేకించి రుణమాఫీ అమలు చేయడం, బీజేపీ సర్కారు స్వాధీనం చేసుకున్న గిరిజనుల భూములను తిరిగివ్వడం వంటి చర్యలు తమకు లాభిస్తాయనే విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు కాంగ్రెస్ ప్రచార కమిటీ నేత కవసి లక్మా. మరోవైపు కేంద్రం అమలు చేస్తున్న పలు పథకాలపైనే బీజేపీ ఆశలు పెట్టుకుంది. నిరుడు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బస్తర్ లోక్‌సభ స్థానంలో దంతేవాడ మినహా మిగిలిన సీట్లను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ఎన్నికలకు ముందు దంతేవాడలో మావోయిస్టులు పేల్చిన మందు పాతరలో బీజేపీ ఎమ్మెల్యే భీమా మాండవి మృతి చెందారు. బీఎస్పీకి చెందిన ఆయుతు రామ్ మండవి, సీపీఐకి చెందిన రాము రామ్ మౌర్య సహా మొత్తం ఏడుగురు అభ్యర్థులు ఇక్కడ బరిలో వున్నారు. మొబైల్ ఫోన్లు వాడుకోగల పరిస్థితి కూడా ఈ నియోజకవర్గంలో అంతగా లేదు. రహదారులకు దగ్గరగా వుండే కొన్ని ఇళ్లలోనే ఇక్కడ టీవీలుంటాయి. బీజేపీ, కాంగ్రెస్లంటే ఇక్కడ పువ్వు, చేతి గుర్తులే. మావోయిస్టుల ఆదేశాల ప్రభావమే ఎక్కువ. మావోల బెదిరింపులు ఎన్నికలను బహిష్కరించాలంటూ మావోయిస్టులు ఏర్పాటు చేసిన బ్యానర్లను పోలీసులు కొన్ని ప్రాంతాల్లో తొలగించి, దగ్ధం చేశారు. మరోవైపు మావోల భయంతో అభ్యర్థులు భమ్రాగర్, సిరోంచ, అహేరి, ధనోరా, ఎటపల్లి సహా జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో ప్రచారానికి దూరంగా వున్నారు. బెదిరింపుల నేపథ్యంలో జనం ఎన్నికల సభలకు వచ్చే పరిస్థితి లేకుండా పోయిందంటున్నారు నేతే. ఉసెంది మారుమూల ప్రాంతాల్లో కొద్ది మేర ప్రచారం జరిపారు. మావోయిస్టుల హింసకు సంబంధించి ఇక్కడ 2014లో 15 కేసులు, 2009లో 18 కేసులు నమోదయ్యాయి. 2004లో ఎదురు కాల్పుల ఘటనలు సహా మొత్తం 23 హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. మందు పాతర పేలుళ్లలో ఇద్దరు పోలీసులు మరణించారు. గత ఏప్రిల్‌లో భద్రతా దళాలు కస్నాసుర్ గ్రామం వద్ద 40 మంది అనుమానిత మావోయిస్టులను మట్టుబెట్టాయి. ఇందుకు ప్రతీకారంగా మావోలు ఇన్ఫార్మర్లుగా ముద్ర వేసి, అరడజను మంది గ్రామస్తులను చంపేశారు. -
భయం నీడన బతుకులు
సాక్షి, బుట్టాయగూడెం : వర్షాకాలం వచ్చిందంటే ఏజెన్సీ ప్రాంతంలోని గిరిజనులు భయం నీడలో బతుకుతుంటారు. ఎత్తైన కొండలు, దట్టమైన అటవీప్రాంతం కావడంతో ఈ ప్రాంతంలో వర్షాలు ఎక్కువగా కురుస్తుంటాయి. కొద్దిపాటి వర్షం వచ్చినా కొండ వాగులు ఉధృతంగా పొంగుతుంటాయి. వాగులపై వంతెనల నిర్మాణాలు లేకపోవడంతో వర్షాకాలంలో గిరిజనులు ప్రయాణ బాధలు వర్ణనాతీతంగా మారతాయి. వాగులను దాటే ప్రయత్నంలో అనేక మంది మృతి చెందిన సంఘటనలు కూడా ఉన్నాయి. వర్షా కాలంలో ఎక్కువగా రెడ్డికోపల్లి సమీపంలోని కాలువ, కన్నారప్పాడు కాలువ, ముంజులూరు సమీపంలోని జారుడు కాలువ, రెడ్డిగొడ్డేరు సమీపంలోని జల్లేరు, వీరన్నపాలెం సమీపంలోని జల్లేరు వాగుతో పాటు అనేక కొండ వాగులు పొంగుతూ ఉంటాయి. గతంలో పట్టినపాలెం సమీపంలోని వాగు, ఇప్పలపాడు సమీపంలోని వాగు ప్రవాహంలో దాదాపు 30 మందికి పైగా కొట్టుకుపోయి మృతి చెందిన సంఘటనలు జరిగాయి. 2016 సెప్టెంబర్ 22న గోగుమిల్లికి చెందిన లింగారెడ్డి అనే గిరిజన యువకుడు ముంజులూరు సమీపంలోని కాలువలో కొట్టుకుపోయి మృతి చెందాడు. ఐదేళ్లుగా పట్టించుకోని చంద్రబాబు ప్రభుత్వం ఏటా గిరిజనులు పడే బాధలను నిర్మూలించడానికి 5 ఏళ్లుగా చంద్రబాబు పాలనలో కనీస ప్రయత్నం కూడా చెయ్యలేదని గిరిజనులు తీవ్రంగా విమర్శిస్తున్నారు. బుట్టాయగూడెం మండలం రామారావుపేట సెంటర్ నుంచి జంగారెడ్డిగూడెం వెళ్లే మార్గంలో ఒక బ్రిడ్జి మంజూరైందని అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే పాలకులు ప్రకటించారు. కొంతకాలం తర్వాత పనులు చేపట్టినా అవి నేటికీ సాగుతూనే ఉన్నాయి. ఎప్పటికి పూర్తవుతుందో చెప్పలేని పరిస్థితులు ఉన్నాయంటూ గిరిజనులు విమర్శిస్తున్నారు. గిరిజనుల వాగు కష్టాలు తీరాలంటే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తాను తప్పనిసరిగా కృషి చేస్తానని పోలవరం నియోజకవర్గ అభ్యర్థి తెల్లం బాలరాజు అన్నారు. రూ.26 కోట్లతో వంతెనలు నిర్మించిన వైఎస్ కొండ కాలువల ప్రవాహానికి గిరిజనులు మృతులను నివారించాలనే ఉద్ధేశంతో దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి రౌతుగూడెం, పడమర రేగులకుంట, గాడిదబోరు, బైనేరువాగుపై సుమారు రూ.26 కోట్లతో హైలెవెల్ బ్రిడ్జిలు నిర్మించారు. దీంతో బయటి ప్రాంతంలోని ప్రజలకు వాగుల ప్రవాహ కష్టాలు తప్పాయి. అయితే కొండ ప్రాంతంలోని గిరిజన గ్రామాల్లో మాత్రం వాగులపై బ్రిడ్జి నిర్మాణాలు లేకపోవడం వల్ల సుమారు 4 నెలల పాటు గిరిజనుల బాధలు వర్ణనాతీతంగా మారతాయి. వర్షాకాలంలో వాగుల ప్రవాహం వల్ల గిరిజనులకు బయట గ్రామాలతో సంబంధాలు కూడా తెగిపోతూ ఉంటాయి. దాదాపు ఏజెన్సీ ప్రాంతంలోని వేలేరుపాడు, కుక్కునూరు, బుట్టాయగూడెం, పోలవరం మండలాల్లో 60 గ్రామాలకు పైగా వాగుల బాధలు పడుతున్న గిరిజనులు ఉన్నారు. నిత్యం మూడు వాగులు దాటాలి మాది బుట్టాయగూడెం మండలం చెంచుగూడెం. మా గ్రామానికి చేరాలంటే మూడు వాగులు దాటాలి. వీరన్నపాలెం, ఇప్పలపాడు జల్లేరువారు, పట్టినపాలెం వాగు. ఈ వాగులు దాటితే కానీ మా ఇంటికి చేరలేం. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి పుణ్యమా అంటూ గతంలో నిర్మించిన బ్రిడ్జిల వల్ల వాగుల సమస్య తీరింది. మరికొన్ని ఉన్నాయి. వాటి నిర్మాణానికి కూడా కృషి చేయాలని కోరుకుంటున్నా. – బుద్ధుల జలపాలరాయుడు, చెంచుగూడెం, బుట్టాయగూడెం మండలం వంతెనలను నిర్మిస్తా నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వాగుల ప్రవాహంపై సంభవిస్తున్న మరణాల గురించి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి దృష్టికి తీసుకువెళ్లాను. వెనువెంటనే నాలుగు బ్రిడ్జిల నిర్మాణాలకు రూ.26 కోట్ల నిధులు మంజూరు చేశారు. పనులు కూడా పూర్తి చేశాం. ప్రధానమైన వాగు కష్టాలు తీర్చాం. ఈ ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చి తాను ఎమ్మెల్యే అయిన వెంటనే వాగుల పరిస్థితిపై నివేదిక తయారు చేసి సమస్య పరిష్కారానికి కృషి చేస్తా. – తెల్లం బాలరాజు, వైఎస్సార్ సీపీ అభ్యర్థి -
‘ఏజెన్సీ’ రహదారుల్లో నిధుల మేత
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఏజెన్సీ ప్రాంతాల్లో అంతర్గత రహదారులు లేక గిరిజనులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం గత నాలుగున్నరేళ్లుగా గిరిజన గ్రామాలకు పూర్తిస్థాయిలో ఒక్క రోడ్డు కూడా వేయలేదు. పూర్తి చేశామని చెబుతున్న రోడ్లపై మట్టిపోసి వదిలేశారు. కల్వర్టులు ధ్వంసమైనా పునర్నిర్మించిన దాఖలాలు లేవు. శ్రీకాకుళం జిల్లా పాలకొండ నియోజవర్గంలో గిరిజన ప్రాంతాల్లో రోడ్ల దుస్థితిని పరిశీలించిన ఎమ్మెల్యే కళావతి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అధికార టీడీపీ నాయకులు ఈ రోడ్ల కనెక్టివిటీ పేరుతో ప్రభుత్వ నిధులను దోచుకుంటున్నారని ఆమె ఆరోపించారు. ముక్కలు చేసి.. పనులు పంచి ఏజెన్సీలో గిరిజన గ్రామాలను కలుపుతూ లింక్ రోడ్ల(గ్రావెల్ రోడ్లు) నిర్మాణానికి ప్రభుత్వం రూ.734.96 కోట్లు కేటాయించింది. నిబంధనల ప్రకారం టెండర్లు పిలిచి, కాంట్రాక్టర్లకు పనులను అప్పగించాల్సి ఉండగా, ప్రభుత్వం ఆ విధానానికి స్వస్తి పలికింది. నామినేషన్ విధానంతో ప్రభుత్వ పెద్దలకు కావాల్సిన వారికే రోడ్ల నిర్మాణ పనులను కట్టబెట్టారు. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్(ఈఈ) స్థాయిలోనే పనులను ఆమోదించే విధంగా రోడ్ల పనులను ముక్కలు ముక్కలు చేశారు. విశాఖపట్నం జిల్లా అనంతగిరి మండలం బల్లుగూడ నుంచి పెదబెడ్డ మీదుగా గుమ్మ గిరిజన గూడెం వరకు 28.1 కిలోమీటర్ల రహదారి పనులను నాలుగు ముక్కలు చేసి, తెలుగుదేశం పార్టీ నాయకులకు నామినేషన్ విధానంలో అప్పగించారు. 7.9, 7.9, 2.4, 9.9 కిలోమీటర్లు.. ఇలా నాలుగు భాగాలుగా విభజించారు. 10 కిలోమీటర్ల లోపు రహదారుల పనులను మంజూరు చేసే అధికారం ఈఈకి ఉంటుంది. ఈ వెసులుబాటును అధికార పార్టీ నేతలు ఉపయోగించుకున్నారు. ఏజెన్సీలో రహదారుల నిర్మాణం కోసం విడుదల చేసిన రూ.734.96 కోట్ల నిధుల్లో 50 శాతానికి పైగా నిధులను కాంట్రాక్టర్ల ముసుగులోని టీడీపీ నేతలు, అధికారులు పంచుకుని తిన్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పనులన్నీ నాసిరకం రాష్ట్రంలో ఏజెన్సీ ఏరియాలో మొత్తం 1,224 లింక్ రోడ్ల పనులను చేపట్టి, 2,396.69 కిలోమీటర్ల మేర రోడ్లు నిర్మించనున్నట్లు టీడీపీ ప్రభుత్వం నాలుగేళ్ల క్రితం ప్రకటించింది. ఇప్పటివరకు 584 పనులను పూర్తిచేశామని, 1012.19 కిలోమీటర్ల పొడవున రహదారుల నిర్మాణం పూర్తయినట్లు చెబుతోంది. ఇందులో సగం రోడ్లు పనికి రాకుండా పోయాయని గిరిజనులు తెలిపారు. వర్షాకాలంలో పనులు చేపట్టారని, కొండ ప్రాంతాలు కావడం వల్ల చాలావరకు రోడ్లు కొట్టుకుపోయాయని వెల్లడించారు. ఇంకా 640 కిలోమీటర్ల మేర రోడ్లు పూర్తి చేయాల్సి ఉంది. ఇప్పటివరకు పూర్తయిన రోడ్లకు రూ.149.05 కోట్లు ఖర్చుచేశారు. ఈ నిధులన్నీ బూడిదలో పోసిన పన్నీరయ్యాయి. నాసిరకం రోడ్లు గిరిజనులకు ఏమాత్రం ఉపయోగపడడం లేదు. కొన్ని రహదారులు ఇంకా నిర్మాణ దశలోనే ఉన్నాయి. ఇప్పటికీ మొదలుపెట్టని రోడ్ల పనులు 151 ఉన్నాయి. 328.35 కిలోమీటర్ల మేర ఈ రోడ్లు వేయాల్సి ఉంది. ఇందుకోసం రూ.95.55 కోట్లు ఖర్చు చేయనున్నారు. రూ.25 కోట్లు ‘బ్లాస్టింగ్’ అధికార పార్టీ నాయకులు ఏజెన్సీలో బ్లాస్టింగ్ల పేరుతో ప్రజాధనం దోపిడీ చేస్తున్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో దాదాపు 50 చోట్ల రోడ్ల మధ్యన పెద్ద రాళ్లు ఉన్నాయని, వాటిని తొలగించాలంటే బ్లాస్టింగ్ చేయాల్సి ఉందని అధికారులపై ఒత్తిడి తెచ్చి, ప్రతిపాదనలు తయారు చేయించారు. ఈ ప్రతిపాదనలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. బ్లాస్లింగ్ల కోసం రూ.25 కోట్లు కేటాయించింది. రోడ్ల మధ్య ఎక్కడా పెద్దపెద్ద రాళ్లు లేవని గిరిజనులు పేర్కొంటున్నారు. బ్లాస్టింగ్లు చేయాల్సిన అవసరం లేదని, ప్రొక్లెయినర్లతో వాటిని తొలగించవచ్చని అంటున్నారు. అంటే రాళ్ల తొలగింపు పేరిట రూ.25 కోట్లు మింగేయడానికి అక్రమార్కులు స్కెచ్ వేసినట్లు స్పష్టమవుతోంది. -
గిరిజనులకు రుణాలు
ఏటూరునాగారం(వరంగల్): చిన్న చిన్న దుకాణాలు ఏర్పాటు చేసుకుని ఉపాధి పొందే గిరిజనులకు సబ్సిడీ రుణాలు అందకుండా తాత్సారం చేస్తూ బ్యాంకు అధికారులు ట్రైకార్ లక్ష్యాన్ని నీరు గారుస్తూ వస్తున్నారు. దీనిని గుర్తించిన గిరిజన సంక్షేమశాఖ ట్రైకార్ నుంచి నేరుగా రూ.50 వేల రుణాన్ని వంద శాతం సబ్సిడీ ద్వారా ఇవ్వాలని నిర్ణయించింది. ఒక్క రూపాయి కూడా గిరిజనులు వాటా ధనం, రుణం కిస్తీలు చెల్లించడం ఉండదు. ఈ మేరకు సెప్టెంబర్ 16న ఐటీడీఏకు స్పష్టమైన ఆదేశాలు వచ్చాయి. 2018–19 ట్రైకార్ వార్షిక యాక్షన్ ప్లాన్‌ను ఐటీడీఏ అధికారులు సిద్ధం చేసి కమిషనర్‌కు అందించనున్నారు. గతంలో యాక్షన్ ప్లాన్ రూ.1 లక్ష, రూ.50 వేల సబ్సిడీతో కూడిన రుణాల వివరాలు, పలు రకాల యూనిట్లతో తయారు చేసిన నివేదికను అందజేశారు. నూతనంగా రూ.50 వేలు.. వంద శాతం సబ్సిడీ బ్యాంకులతో సంబంధం లేకుండా నేరుగా వారి ఖాతాల్లో జమ వేసేందుకు ప్రభుత్వం నుంచి గిరిజన సంక్షేమశాఖ ఉత్తర్వులు వచ్చాయి. దీంతో మళ్లీ యాక్షన్ ప్లాన్‌లో మార్పులు చేర్పులు చేసి పంపించారు. నిరుపేదల్లో వెలుగులు రూ.50 వేలు.. వంద శాతం సబ్సిడీ రుణం నిరుపేదల్లో వెలుగు నింపనుంది. గిరిజనుడి బ్యాంకు ఖాతాలో రూ.50 వేలు జమ అయిన వెంటనే వాటిని డ్రా చేసుకుని దుకాణాలను ఏర్పాటు చేసుకుని కుటుంబాన్ని పోషించుకునే అవకాశం ఉంది. గతంలో బ్యాంకు వాటా ధనం 20 శాతం, లబ్ధిదారుడి వాటా ధనం 10 శాతం జమ చేసుకుని బ్యాంకు చుట్టూ తిరిగే వారు. కాళ్ల చెప్పులు అరిగిపోయినా కూడా రుణం వచ్చేది కాదు. లక్ష నుంచి ఐదు లక్షల వరకు యూనిట్ల వారీగా సబ్సిడీలను అందజేసింది. రూ.50 వేల వరకు వందశాతం సబ్సిడీని అమలు చేస్తూ మిగతా వాటి రుణాలను యథావిధిగా అమలు చేయనున్నారు. నేరుగా లబ్ధిదారుడు ఎంపీడీఓ కార్యాలయంలో రుణం కోసం దరఖాస్తు చేసుకోవాలి. అక్కడి నుంచి నేరుగా ఐటీడీఏ లాగిన్లోకి వచ్చి కలెక్టర్ అప్రూవల్తో కమిషనర్ నుంచి ట్రైకార్ ద్వారా నగదు లబ్ధిదారుడి బ్యాంకు ఖాతాలో జమ అవుతుంది. వంద శాతం సబ్సిడీతో చిన్న చిన్న దుకాణాలు ఏర్పాటు చేసుకునే గిరిజనులకు ఎంతగానో ఆసరాగా నిల్వనుంది. మొత్తం 1325 యూనిట్లకు రూ. 22,64,00,759 మంజూరయ్యాయి. లబ్ధిదారులు ఇందులో ఉన్న సెక్టార్ల వారీగా రూ.50 వేలకు లబ్ధిదారులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుడి ఆర్థిక స్థితిగతులను పరిగణనలోకి తీసుకుని, గ్రామ సభల్లో లబ్ధిదారులను ఎంపిక చేస్తారు. అనంతరం వారికి రుణాలు మంజూరవుతాయి. అసెంబ్లీ రద్దుతో ఆలస్యం అసెంబ్లీ రద్దు కావడం వల్ల ఎస్టీ కార్పొరేషన్ రుణాలను పొందే లబ్ధిదారులు అక్టోబర్‌లో లేదా ఎన్నికల పర్వం పూర్తి అయిన తర్వాతనే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని అధికారులు వెల్లడించారు. 2018లో దరఖాస్తు చేసుకున్న కొంతమంది ఖాతాల్లో మాత్రమే రుణాలు జమ అయ్యాయి. వాటిని పూర్తిగా లబ్ధిదారులకు అందజేసిన తర్వాతనే 2018–19 రుణాల దరఖాస్తులు స్వీకరించే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. అంతేకాకుండా గతంలో ఇచ్చిన రుణాలకు యుటిలైజ్ సర్టిఫికెట్ (యూసీ)లు కూడా ఇవ్వాలని గిరిజన సంక్షేమశాఖ ఐటీడీఏ అధికారులను ఆదేశించింది. వీటి ఆధారంగా ఎంత మంది రుణాలు సద్వినియోగం చేసుకున్నారని కమిషనర్ నిర్ధారించనున్నారు. 100 శాతం సబ్సిడీతో లాభం 100 శాతం సబ్సిడీపై రూ.50 వేల రుణాలు ఇవ్వడం వల్ల గిరిజన కుటుంబాలు బాగుపడుతాయి. ఇంటి ఆవరణలోనే షాపులను ఏర్పాటు చేసుకుని కుటుంబాన్ని పోషించుకునే ఆస్కారం ఉంటుంది. రుణాలను ఈ విధంగా ఇస్తే గిరిజనుల జీవితాలు బాగుపడుతాయి. బ్యాంకులతో లింక్ పెడితే ఒక్క రూపాయి కూడా లబ్ధిదారుడికి చేరకుండానే దళారులు మింగుతున్నారు. వంద శాతం సబ్సిడీ గిరిజనులకు ఉపయోగపడనుంది. ఆలం ప్రభాకర్, రాజన్నపేట, కన్నాయిగూడెం మండలం సద్వినియోగం చేసుకోవాలి.. కొత్తగా ప్రవేశపెట్టిన 100 శాతం రూ.50 వేల రుణం గిరిజనులకు లబ్ధి చేకూరనుంది. దాంతో కుటుంబాలు బాగుపడుతాయి. బ్యాంకు వాటాతో సంబంధం లేకుండా పూర్తి స్థాయి సబ్సిడీతో ఈ రుణం ఇవ్వనున్నాం. 2018–19 ఆర్థిక సంవత్సరంలో ఈ రుణాలు అందిస్తాం. లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలి. చక్రధర్‌రావు, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ఏటూరునాగారం -
ఆదివాసీ జోష్..
భద్రాచలం : ఆదివాసీ దినోత్సవం సందర్భంగా గురువారం జిల్లాలోని పలు ప్రాంతాల్లో వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. గిరిజనుల కొమ్ము, డప్పు నృత్యాలు, ఆట పాటలు అలరించాయి. పలువురు అధికారులు కూడా వారితో కలిసి వేసిన డ్యాన్స్‌లు ఆకట్టుకున్నాయి. భద్రాచలం ఐటీడీఏ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉత్సవాల్లో గిరిజనులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. అంబేడ్కర్ సెంటర్లో గల అమరవీరుల విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పీఓ పమెల సత్పథి మాట్లాడుతూ.. గిరిజనుల సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు ఐటీడీఏ ద్వారా తగిన కృషి చేస్తామని భరోసా ఇచ్చారు. చిన్నా, పెద్ద తేడా లేకుండా అందరూ వేడుకల్లో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. గిరిజనులు మాతృభాషపై మమకారం పెంచుకోవాలని, దాని అభివృద్ధి కోసం ఆ భాషలోనే మాట్లాడాలని సూచించారు. భద్రాద్రి జిల్లాలో గిరిజనులు ఎక్కువగా ఉన్నారని, వారికి విద్య, వైద్యం, అన్ని రకాల మౌలిక సౌకర్యాల కల్పనకు తగిన ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. భద్రాచలం ఎమ్మెల్యే సున్నం రాజయ్య మాట్లాడుతూ ఆదివాసీల హక్కుల పరిరక్షణకు అంతా ఏకమై ఉద్యమించాలన్నారు. ఆదివాసీల అభివృద్ధి కోసం అనేక చట్టాలు వచ్చినా, పాలకులు వాటిని చిత్తశుద్ధితో అమలు చేయకపోవటం శోచనీయమన్నారు. ఆదివాసీ ప్రాంతాల అభివృద్ధిపై పాలకులు చిన్నచూపు చూస్తున్నారని, స్పెషల్ డీఎస్సీ లేదని, జీవో నంబర్ 3 అమలను నిర్వీర్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అమరుల స్ఫూర్తితో పోరాటాలకు సన్నద్దం కావాలని పిలుపునిచ్చారు. గిరిజన సహకార సంస్థ డివిజనల్ మేనేజర్ కుంజా వాణి కోయభాషలో మాట్లాడి అందరినీ ఉత్సాహపరిచారు. అలరించిన అధికారుల నృత్యాలు.. ఆదివాసీ దినోత్సవం సందర్భంగా అంబేడ్కర్ సెంటర్లో జెండా ఆవిష్కరించారు. అమరుల విగ్రహాలతో పాటు, ఆదివాసీ జాతి అభివృద్ధికి మూల స్తంభాలుగా నిలిచిన ఆదివాసీ పెద్దల చిత్రపటాలను వేదిక వద్ద ఏర్పాటు చేసి, పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆదివాసీ అధికారులు, ఉద్యోగులు, మహిళా సంఘాల వారు కలసి నృత్యాలు చేశారు. కొమ్ము నృత్యాలు, రేల పాటలతో అంబేడ్కర్ సెంటర్ కోలాహలంగా మారింది. ఐటీడీఏ పీఓ పమెల సత్పథి, ఎమ్మెల్యే సున్నం రాజయ్య కూడా వారితో జత కలసి ఉత్తేజపరిచారు. కార్యక్రమంలో గిరిజన సంక్షేమ ఉప సంచాలకులు సీహెచ్ రామ్మూర్తి, ఏటీడీఓ జహీరుద్ధీన్, ఐటీడీఏ ఏపీఓ భీం, భద్రాచలం తహసీల్దార్ పీవీ రామకృష్ణ, ఏటీఓ రమణయ్య, కొండరెడ్ల సంక్షేమ సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు ముర్ల రమేష్, ఆదివాసీ సంఘాల సమన్వయ కర్త మడివి నెహ్రూ, టీఆర్ఎస్ నియోజకవర్గ ఇంచార్జి మానె రామకృష్ణ, వైఎస్సార్సీపీ జిల్లా నాయకురాలు దామెర్ల రేవతి తదితరులు పాల్గొన్నారు. -
గిరిజన ప్రాంతాల్లో ఆదర్శ పాఠశాలలు
సాక్షి, హైదరాబాద్: గిరిజన ప్రాంతాల్లోని ప్రాథమిక పాఠశాలలు కొత్త హంగులు అద్దుకుంటున్నాయి. కార్పొరేటు పాఠశాలలో ఉండే అన్ని రకాల సౌకర్యాలు వీటికి కల్పించేందుకు గిరిజన సంక్షేమ శాఖ కార్యాచరణ సిద్ధం చేసింది. ప్రస్తుతం ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజన సంక్షేమ శాఖ పరిధికి చెందిన 1,415 ప్రాథమిక పాఠశాలలున్నాయి. వీటిల్లో ఒకటి నుంచి ఐదో తరగతి వరకు విద్యాబోధన చేస్తున్నారు. రెగ్యులర్ టీచర్లతో నిర్వహిస్తున్నప్పటికీ ప్రస్తుతం ఈ స్కూళ్లలో పెద్దగా విద్యార్థుల సంఖ్య లేదు. వీటిని ఆదర్శ పాఠశాలలుగా తీర్చిదిద్దాలని గిరిజన సంక్షేమశాఖ నిర్ణయించింది. ప్రస్తుత విద్యా సంవత్సరంలో వంద పాఠశాలలను కార్పొరేటు స్థాయి హంగులతో మోడల్ ప్రైమరీ స్కూళ్లుగా తీర్చిదిద్దుతోంది. ఈ మేరకు ప్రభుత్వం ఆమోదించిన క్రమంలో క్షేత్రస్థాయిలో ఏర్పాట్లు చేసేందుకు సమాయత్తమవుతోంది. గిరిజన శాఖ రూపొందిస్తున్న ఈ మోడల్ ప్రైమరీ స్కూళ్లలో ఆంగ్ల మాధ్యమంలో బోధనతోపాటు వినోదాత్మక కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తోంది. బోధనేతర కార్యక్రమాల్లో క్రీడలు ఉండే విధంగా మౌలిక వసతులు కల్పిస్తోంది. ప్రతి స్కూళ్లో క్రీడాసామగ్రి, పరికరాలను అమర్చుతారు. ప్రతి పాఠశాలకు ప్రహరీ నిర్మించి ప్లే గ్రౌండ్ ఉండేలా ఏర్పాటు చేస్తారు. ఈ పాఠశాలలకు వచ్చే విద్యార్థులకు ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం వేళ స్నాక్స్ ఇవ్వనున్నారు. వీటిని గిరిజన సంక్షేమ శాఖ ద్వారా సరఫరా చేయనున్నారు. ప్రతి స్కూల్‌ను రంగులతో అలంకరించడం, బోధనకు సంబంధించిన అంశాలను గోడలపై పేయింట్ల రూపంలో పిల్లలకు అర్థమయ్యేలా ఏర్పాటు చేస్తారు. మొత్తంగా కార్పొరేటు స్కూళ్లకు దీటుగా వీటిని తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో గిరిజన సంక్షేమ శాఖ చర్యలు చేపడుతోంది. -
మంచమెక్కిన మన్యం
రాజవొమ్మంగి (రంపచోడవరం): తూర్పు మన్యం రాజవొమ్మంగిని మాతాశిశు మరణాలు పట్టి పీడిస్తున్నాయి. ఈ ఏడాదిలో ఇప్పటివరకు మూడు మాతా, మరో ఆరు శిశు మరణాలు సంభవించాయి. ఒక్క మే నెలలోనే ఓ నిండు గర్భిణి, మరో ముగ్గురు నవజాత శిశువులు మరణించారు. రక్తహీనత కారణంగా 8వ నెల గర్భిణి మృతశిశువుకు జన్మనీయడం గిరిజన ప్రాంతంలో తల్లిబిడ్డల ఆరోగ్య పరిస్థితిని తేటతెల్లం చేస్తుంది. గుక్కపెట్టి ఏడుస్తున్న బిడ్లను రాజవొమ్మంగి లేదా జడ్డంగి 24 గంటల తల్లీబిడ్డల ఆస్పత్రికి తీసుకువస్తుంటే.. అక్కడ చిన్నపిల్లల వైద్య నిపుణులు, అధునాతన వైద్య పరికరాలు, మందులు లేకపోవడంతో వారికి సకాలంలో వైద్యం అందడం లేదు. రాజవొమ్మంగి ఆస్పత్రిలోని వైద్యులు కాకినాడ జీజీహెచ్‌కు రిఫర్ చేస్తున్నారు. కాకినాడకు వారిని చేర్చేలోపుగా ప్రాణాలు విడుస్తున్నారు. లేదా చికిత్స పొందుతూ మరణిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో మన్యంలో వైద్య సేవలు ఏరీతిలో ఉన్నాయనేది ఇట్టే అర్థమవుతుంది. ప్రభుత్వ యంత్రాంగం స్పందించి మాతాశిశు మరణాలను అరికట్టేందుకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని గిరిజనులు కోరుతున్నారు. పరిస్థితి ఇలా ఉంటే ప్రభుత్వం ఏమీ పట్టనట్టు వ్యవహరించడం ఆందోళన కలిగిస్తోందని స్థానిక గిరిజన ప్రతినిధులు అంటున్నారు. ♦ ముర్లవానిపాలేనికి చెందిన పప్పుల లోవకుమారికి పుట్టిన 3 నెలల మగశిశువు మే 3వ తేదీన ఊపిరి అందక కాకినాడ జీజీహెచ్‌లో మరణించింది. ♦ మే 21వ తేదీన అప్పలరాజుపేట గ్రామానికి చెందిన 8 నెలల గర్భిణి చిన్ని ప్రేమజ్యోతి రాజవొమ్మంగి పీహెచ్సీలో తీవ్రమైన రక్తస్రావంతో మృత శిశువుకు జన్మనిచ్చింది. తీవ్ర రక్తహీనతతో బాధపడుతోన్న ఆమెను మే 9న పీహెచ్సీలో నిర్వహించిన జననీ సురక్ష యోజన వైద్య శిబిరంలో పరీక్షించారు. ఆమె కడుపులో బిడ్డకు ఎదుగుదల లేదని, వెంటనే పట్టణ ప్రాంతానికి వెళ్లి స్కానింగ్ చేయించుకోవాలని వైద్య నిపుణులు చెప్పారు. అయితే ఆమె కుటుంబానికి ఆర్థిక స్తోమత లేక స్కానింగ్ చేయించుకోలేదు. దీంతో కడుపులోనే బిడ్డ మరణించగా రెండు రోజుల తరువాత ఆమె మృత శిశువుకు జన్మనిచ్చింది. ♦ మే 28వ తేదీన మద్దికొండ సుగుణ అత్తవారి ఇల్లు వై.రామవరం మండలం చవిటిదిబ్బల నుంచి పుట్టిల్లు రాజవొమ్మంగి మండలం వాతంగి వచ్చింది. ఇంతలో ఆమె చిన్నారి తీవ్ర అస్వస్థతకు గురైతే జడ్డంగి 24 గంటల ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువెళ్లారు. అక్కడు వైద్య నిపుణులు అందుబాటులో లేకపోవడంతో కింది స్థాయి వైద్య సిబ్బంది కాకినాడకు రిఫర్ చేసింది. అతడు కాకినాడ జీజీహెచ్‌లో చికిత్స పొందుతూ చనిపోయాడు. ♦ మే 29వ తేదీనే మండలంలోని జి.కొత్తపల్లికి చెందిన నిండు గర్భిణి నందపు వెంకటలక్ష్మి కాకినాడలో చికిత్స పొందుతూ మరణించింది. అత్తిల్లు రంపచోడవరం సబ్‌ప్లాన్ ఏరియా బవురువాక గ్రామం నుంచి పుట్టిల్లు జి.కొత్తపల్లికి పురిటి కోసం వచ్చింది. పురిటినొప్పులతో గుర్రపు వాతం (ఫిట్స్) రావడంతో ఆమెను కుటుంబీకులు వెంటనే కాకినాడ జీజీహెచ్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. -
డోలీలకు చెక్ పడేనా ..!
కురుపాం: రహదారి సౌకర్యం లేని గిరిజన గ్రామాలకు బైక్ అంబులెన్స్ సౌకర్యం కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇప్పటివరకు గిరిజనుల్లో ఎవరికి ఏ కష్టం వచ్చినా డోలీల ద్వారా మైదాన ప్రాంతాలకు వచ్చి వైద్యసేవలు పొందేవారు. ఇకపై అలాంటి కష్టాలు ఉండకూడదని ప్రభుత్వం యోచిస్తోంది. రహదారులున్న గ్రామాలకు 108 వాహనం ద్వారా సేవలందిస్తుండగా, వాహనం వెళ్లలేని గ్రామాలకు బైక్ అంబులెన్స్ ద్వారా సేవలందించాలని అధికారులు, పాలకులు నిర్ణయించారు. ఇప్పటికే పశ్చిమగోదావరి జిల్లా బుట్టాయిగూడెం పరిధిలో బైక్ అంబులెన్స్ సేవలు అమలు చేయగా, సత్ఫలితాలు వచ్చాయి. జిల్లాలో కూడా ఇటువంటి సేవలు అందించాలని గిరిపుత్రులు కోరుతున్నారు. ఇక జిల్లా విషయానికొస్తే అధికారుల కృషి వల్ల ఏజెన్సీ ప్రాంతంలోని కొన్ని గ్రామాలకు రహదారి సౌకర్యం కలిగింది. అయినప్పటికీ కురుపాం, గుమ్మలక్ష్మీపురం, జియ్యమ్మవలస, కొమరాడ గిరిజన మండలాల్లో సుమారు 300 గిరిజన గూడలకు నేటికీ రహదారి సౌకర్యం లేదు. ఇటువంటి గ్రామాలకు బైక్ అంబులెన్స్ ద్వారా సేవలందిస్తే ఎన్నో అకాలమరణాలను నివారించవచ్చని పలువురు అభిప్రాయపడుతున్నారు. అనారోగ్యం సోకితే అంతే.. ఏజెన్సీలోని గిరిశిఖర గ్రామాల్లో ఎవరికి అనారోగ్యం సోకినా అంతే సంగతి. గర్భిణులు, బాలింతలు, వృద్ధులు, చిన్నారులకు సకాలంలో వైద్యసేవలందక ఎంతోమంది మృత్యువాత పడిన సందర్భాలున్నాయి. ఆయా గ్రామాలకు 108 వాహనం వెళ్లలేకపోవడంతో నలుగురు మనుషులు డోలీ కట్టి రోగిని అందులో కూర్చోబెట్టి మైదా న ప్రాంతంలోని ఆస్పత్రికి తీసుకువచ్చేవారు. సకాలంలో ఆస్పత్రికి రాకపోతే ఇక అంతే సంగతి. ఇటువంటి గ్రామాలకు బైక్ అంబు లెన్స్ సౌకర్యం కల్పిస్తే సుదూర ప్రాంతాల వారికి సకాలంలో వైద్యసేవలు అందుతాయి. ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పం దించి త్వరితగతిన ఏజెన్సీ ప్రాంతంలో బైక్ అంబులెన్స్ సేవలు అందించాలని అడవి బిడ్డలు కోరుతున్నారు. బైక్ అంబులెన్స్ సేవలు అందేలా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలి. రహదారి లేని గ్రామాలకు అంబులెన్స్ సకాలంలో చేరుకుని వైద్యసేవలు అందిస్తుంది. – ఆరిక గయామి, తిత్తిరి ఎంపీటీసీ సభ్యురాలు -
ఏజెన్సీలో ఆఫ్‌లైన్
సేవలను పునరుద్ధరించాలి.. గత 12 రోజుల నుంచి జిల్లాలో ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు. ఘర్షణ నేపథ్యంలో డేటా సేవలను జిల్లా స్థాయిలో నిలిపివేయడంతో సామాన్య ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తోంది. ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోలేపోతున్నాం. కరెంట్ అఫైర్స్, ఉద్యోగ నోఫికేషన్లు గురించి తెలుసుకోలేకపోతున్నాం. ఘర్షణలకు కారణమైన సోషల్ నెటవర్క్లను బ్లాక్ చేసి, ఇంటర్నెట్ పునరుద్ధరిస్తే సామాన్య ప్రజలకు, నిరుద్యోగులకు, విద్యార్థులకు, ఆన్లైన్ సెంటర్ల వారికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. వెంటనే ప్రభుత్వం, సంబంధిత అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకోవాలి. – ఎల్చల్‌వార్ లక్ష్మణ్, ఆదిలాబాద్ సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: సామాజిక మాధ్యమాల్లో వదంతులు వ్యాపించకుండా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ప్రజానీకాన్ని ఇబ్బందులకు గురిచేస్తోంది. ఆదివాసీలు, లంబాడా తెగల మధ్య రిజర్వేషన్ల విషయంలో తలెత్తిన వివాదం ముదిరి ఈనెల 15న ఉట్నూర్‌లో విధ్వంసానికి కారణమైంది. ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు చనిపోగా, సామాజిక మాధ్యమాల్లో హత్యలుగా ప్రచారం జరిగి, విధ్వంసానికి కారణమైందని భావించిన ప్రభుత్వం 15వ తేదీ అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలపై ఆంక్షలు విధించింది. ఏజెన్సీ ప్రాంతాల్లో బీఎస్ఎన్ఎల్ బ్రాడ్‌బాండ్ సర్వీస్‌లతో పాటు అన్ని ప్రైవేటు మొబైల్ కంపెనీల ఇంటర్నెట్ డేటా సర్వీస్‌లను నిలిపివేసింది. దీంతో ఆదిలాబాద్, ఆసిఫాబాద్ , మంచిర్యాల జిల్లాల పరిధిలోని ఏజెన్సీ మండలాల్లో 16వ తేదీ నుంచి నెట్ సర్వీస్ పూర్తిగా నిలిచిపోయింది. ఈనెల 23వ తేదీ వరకు ఆదిలాబాద్, మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూర్, మందమర్రి, బైంసా వంటి పట్టణాల్లో కూడా ఇబ్బంది ఎదురైనప్పటికీ, ప్రస్తుతం ఇంటర్నెట్ సేవలను పునరుద్ధరించారు. కానీ ఆసిఫాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లోని ఉట్నూర్, నార్నూర్, లింగాపూర్, సిర్పూర్(యు), ఇంద్రవెల్లి మండలాల్లో 13 రోజులుగా ఎలాంటి ఇంటర్నెట్ సేవలు ప్రజలకు అందడం లేదు. మంచిర్యాల జిల్లా జన్నారంలో ఈనెల 26న మరోసారి అల్లర్లు చెలరేగడంతో జన్నారం, కడెం, దండేపల్లి, లక్సెట్టిపేట మండలాల పరిధిలో మళ్లీ ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. దీంతో విద్యార్థులు, నిరుద్యోగులతో పాటు సాధారణ ప్రజానీకం కూడా ఈ పరిణామాలతో ఇబ్బంది పడుతున్నారు. కుమురం భీం జిల్లాలో సమస్య తీవ్రం ఈనెల 16 నుంచి ఏజెన్సీలో ఇంటర్నెట్ అందుబాటులో లేకపోవడంతో కుమురం భీం జిల్లాలో ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. మీ సేవ, ఈ సేవ, విద్య, వైద్యంతో పాటు ప్రభుత్వ కార్యాలయాలన్నింటా ఆన్లైన్తోనే ముడిపడి ఉండటంతో అనేక పనులు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. రవాణా కోసం బస్సు, రైల్వే, విమాన టికెట్ల బుకింగ్ నిలిచిపోయాయి. మీ సేవ కేంద్రాల్లో ఆధార్, కుల, ఆదాయ, భూ సంబంధ తదితర మార్పులు చేర్పులకు సంబందించి సేవలు అందడం లేదు. రవాణా కార్యాలయానికి నిత్యం వందలాది మంది లైసెన్స్, రెన్యూవల్, ఫిట్నెస్, పర్మిట్ ఇతర అనుమతుల కోసం వాహనదారులు వస్తుంటారు. ఆర్టీఏ కార్యాయలంలో నెట్ అందుబాటులో ఉన్నా... జిల్లా వ్యాప్తంగా నెట్ లేకపోవడంతో ఆన్లైన్లో స్లాట్ బుక్ చేసుకోవడం కుదరడం లేదు. దీంతో దరఖాస్తుదారుల సంఖ్య తగ్గిపోయింది. ఇంటర్నెట్ అందుబాటులో ఉన్న సమీప ప్రాంతాలకు వెళ్లి స్లాట్ బుక్ చేసుకుని వస్తున్నారు. జిల్లాలోని ఆసిఫాబాద్, బెజ్జూర్, సిర్పూర్(యు), కెరిమెరి, తిర్యాణి, దహేగాం, చింతలమానెపల్లి, కౌటాల, రెబ్బెన, వాంకిడి తదితర మండలాల్లో ప్రజలు ఇంటర్నెట్ సదుపాయం లేక ఇబ్బందులు పడుతున్నారు. కాగజ్‌నగర్ పట్టణంలో కూడా బీఎస్ఎన్ఎల్ మినహా ఇతర నెట్‌వర్క్‌ల బ్రాడ్‌బాండ్ రావడం లేదు. ప్రభుత్వ కార్యాలయాల్లోనూ తప్పని తిప్పలు జిల్లా కలెక్టరేట్ కార్యాలయాల్లోనూ ఇంటర్నెట్ సేవలు నిలిచిపోవడంతో ఫైళ్లన్ని పేరుకుపోతున్నాయి. కల్యాణలక్ష్మి బిల్లులు అప్లోడ్ చేయడం, ప్రభుత్వ ఉద్యోగుల, కింది స్థాయి సిబ్బంది జీతాలు, రెవెన్యూ శాఖలో భూ ప్రక్షాళనలో ఆన్లైన్లో మార్పులు చేర్పులు అన్ని స్తంభించిపోయాయి. ఇక ఉపాధిహామీ పథకంలో దినసరి కూలీల వేతాలు, పెన్షన్లు, ప్రతి రోజు ఇచ్చే నివేదికలు తదితరవన్ని ఆన్లైన్లో జరగాల్సి ఉన్నందున అన్నింటా జాప్యం జరుగుతోంది. మరోవైపు కేసీఆర్ కిట్లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో నమోదయ్యే గర్భిణుల వివరాలు, ప్రసూతి వివరాలు, ఆశ వర్కర్ల ఇన్సెంటివ్‌లు, సిబ్బంది జీతాలు నమోదు ప్రక్రియ ఆగిపోయిందని డీఎంహెచ్‌వో కార్యాలయ సిబ్బంది చెబుతున్నారు. ముంచుకొస్తున్న టీఆర్టీ గడువు.. మరో పక్క తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహిస్తున్న టీఆర్టీ (టీచర్ రిక్రూమెంట్ టెస్టు)కు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల 30 వరకే గడువు ఉంది. ఇంకా ఉమ్మడి ఆదిలాబాద్‌లో అనేకమంది దరఖాస్తు చేసుకోనివారు ఉన్నారు. అంతేకాక పాత టీఆర్టీ నోటిఫికేషన్ ప్రకారం దరఖాస్తు చేసుకున్నవారు కొత్త నోటిఫికేషన్ (పాతజిల్లా ప్రతిపాదికన జరిగే) ప్రకారం ఎడిట్ చేసుకోవల్సిన అభ్యర్థులు ఉన్నారు. కొందరు నెట్ వచ్చే ప్రాంతాలకు వెళ్లి దరఖాస్తు చేసుకంటున్నారు. వీరికోసం జిల్లా కేంద్రంలోని ఎమ్మార్వో ఆఫీసులో ప్రత్యేకంగా కంప్యూటర్ ఆపరేటర్‌ను నియమించినప్పటకీ బెజ్జూర్, పెంచికల్పేట్, దహేగం వంటి సుదూర ప్రాంతాల వారు ఇక్కడికి రావాలంటే ఎంతో కష్టం. బీఎస్ఎన్ఎల్ బ్రాడ్‌బాండ్‌తో ప్రభుత్వ కార్యాలయాల్లో... ఆదిలాబాద్, మంచిర్యాల జిల్లా ఏజెన్సీ మండల కేంద్రాల్లోని బ్యాంకులు, తహసీల్దార్, ఎంపీడీవో కార్యాలయాల్లో బీఎస్ఎన్ఎల్ బ్రాడ్‌బాండ్ కనెక్షన్‌తో సేవలు నడుస్తున్నాయి. ఆదిలాబాద్‌లో మీ సేవ సెంటర్లు అన్ని మండలాల్లో నడుస్తున్నట్లు సంబంధిత అధికారులు చెపుతున్నప్పటికీ, ఏజెన్సీల్లో సెంటర్లను తెరవడం కూడా లేదు. ప్రైవేటు మొబైల్ కంపెనీల బ్రాడ్‌బాండ్‌తో పనిచేసే కంప్యూటర్లు గానీ, మొబైల్ డేటాతో రూటర్‌తో నడిచే కంప్యూటర్లు పనిచేయడం లేదని పలు ప్రాంతాల్లో ఆందోళన చెందుతున్నారు. గిరాకే లేకుండా పోయింది జిల్లాలో రెండు వర్గాల మద్య ఏర్పడిన ఘర్షణల మూలంగా నెట్‌ను తొలగించటంతో షాపులో గిరాకే లేకుండా పోయింది. రోజంతా షాపులో ఉంటే రూ.100 కూడా రావటం లేదు. టీఆర్టీతో పాటు ఇతర ఉద్యోగాల కోసం ఆన్లైన్ లోనే దరఖాస్తు చేయాలి. నెట్ ఉంటేనే ఆన్లైన్ పనులు సాగుతాయి. అధికారులు ఎలాంటి సమాచారం లేకుండా గత 15 రోజులుగా నెట్ సేవలు తొలగించటంతో అనేక ఇబ్బందులకు గురవుతున్నాం. కనీసం ఎప్పటి వరకు పునరుద్ధరిస్తారనే విషయం కూడా తెలియటం లేదు. – మియ్యపురం రమేశ్ (నెట్‌సెంటర్ యజమాని) -
చిన్నారి పెళ్లి కూతుళ్లు
ఆదిలాబాద్: నిరక్షరాస్యత.. మూఢనమ్మకాలు.. పేదరికం కారణంగా ముక్కుపచ్చలారని బాలికలకు మూడు ‘ముళ్ల’ బంధం పడుతోంది. బంగారు భవిష్యత్‌ను బందీ చేస్తోంది. వివాహా మనే పసుపుతాడుతో వారి బాల్యం స్వేచ్ఛకు ఉరితాడు బిగుస్తోంది. ఆడపిల్లలు భారమనో.. పేదరికం కారణంగానో.. భారం దించుకోవా లనో.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని మైదాన, గిరిజన ప్రాంతాల్లో బాలికలకు తల్లిదండ్రులు పెళ్లి చేస్తున్నారు. బాల్య వివాహా ల కారణంగా ఆరోగ్య, సామాజిక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని గ్రహించలేకపోతున్నారు. శుక్రవారం తాంసి మండలంలో బాలిక నిశ్చితార్థాన్ని అధికారులు అడ్డుకున్నారు. ఆదిలాబాద్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రతి ఏడాది బాల్య వివాహాలు పెరిగిపోతున్నాయి. గత ఐదేళ్లలో 134 బాల్య వివాహాలను అడ్డుకున్నారు. ఇది అధికారికంగా మాత్రమే. అనధికారికంగా జరుగుతున్న ప్రతి ఏడాది 20 నుంచి 25 బాల్య వివాహాలు జరుగుతున్నాయి. ఒక్కో నెలలో మూడు నుంచి నాలుగు బాల్య వివాహాలు అడ్డుకున్న సంఘటనలూ ఉన్నాయి. 2016 ఫిబ్రవరిలో వారం రోజుల వ్యవధిలో నాలుగు బాల్య వివాహాలను అధికారులు అడ్డుకున్నారు. 2017 జూన్‌లో వారం రోజుల వ్యవధిలో మూడింటిని అడ్డుకున్నారు. గుట్టుచప్పుడు కాకుండా ఇంకా ఎన్నో వివాహాలు జరుగుతున్నాయి. మేనరికం పేరుతో చిన్నారులకు బలవంతుపు పెళ్లిళ్లు చేస్తుండగా, మరికొన్ని ఆర్థికంగా కుటుంబ పోషణ భారమై తమ పిల్లలకు పెళ్లిళ్లు చేస్తున్నారు. కొన్ని వివాహాల్లో అబ్బాయిలకు సైతం తక్కువ వయసు ఉన్నవారు ఉంటుండగా.., వృద్ధులకు సైతం బాలికలతో పెళ్లి చేస్తున్నారు. చట్ట ప్రకారం అమ్మాయిలకు 18 ఏళ్లు, అబ్బాయిలకు 21 ఏళ్లు దాటిన తర్వాతనే పెళ్లి చేయాలి. ఏజెన్సీ ప్రాంతాల్లోనే అధికం.. ఏజెన్సీ ప్రాంతాలైన ఆసిఫాబాద్, వాంకిడి, కెరమెరి, కుంటాల, సిర్పూర్, కాగాజ్నగర్, ఖానాపూర్, ఉట్నూర్, ముథోల్, నిర్మల్, తదితర గిరిజన ప్రాంతాల్లో బాల్య వివాహాలు గుట్టుగా సాగుతున్నట్లు తెలుస్తోంది. సమాజంలో ఆడపిల్లలకు ఉన్న అభద్రత భావాన్ని దృష్టిలో ఉంచుకొని తల్లిదండ్రులు బాల్య వివాహాల వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ఎంతో కొంత చదువుకోవాలని అనుకుంటున్న బాలికలకు బాల్య వివాహం చేస్తున్నారు. చిన్నతనంలో పెళ్లి చేయడం ద్వారా కట్నకానుకలు కూడా ఎక్కువగా ఇవ్వాల్సిన అవసరం రాదనే ఉద్దేశంతో ఈ పనిచేస్తున్నారు. పెళ్లి చేసి అత్తారింటికి పంపిస్తే తమ బాధ్యత తీరుతుందనే భావనలో ఉన్నారు. కానీ పెళ్లి తర్వాత వచ్చే సమస్యలపై ఏమాత్రం ఆలోచించడం లేదు. చట్టరీత్యా నేరం.. బాల్య వివాహాలు చట్టరీత్యా నేరం. బాలికను చేసుకునే అబ్బాయికి, బాల్య వివాహం చేసే తల్లిదండ్రులు, ప్రోత్సహించిన వారిపై, హాజరైన కుల పెద్దలు, మత పెద్దలు, పూజారులపై కూడా కేసులు నమోదు చేసి అరెస్టు చేసే అవకాశం ఉంది. 1929 నాటి బాల్య వివాహాల నిరోధక చట్టాన్ని ప్రభుత్వం 2006లో పటిష్టం చేసింది. 2007 నుంచి చట్టాన్ని పూర్తి స్థాయిలో అమల్లోకి తెచ్చింది. బాల్య వివాహాలకు సంబంధించి రెండేళ్ల జైలు శిక్షతోపాటు రూ.2 లక్షల జరిమానా విధించే అవకాశం ఉంటుంది. బాల్య వివాహాం జరిగిన రెండేళ్ల వరకు కూడా కేసు నమోదు చేసే అధికారం ఉంటుంది. కలెక్టర్, ఎస్పీతోపాటు ఆర్డీవో, ఎంపీడీవో, సీడీపీవో, తహసీల్దార్, వీఆర్వోలు, ఐసీపీఎస్, సీడబ్ల్యూసీ అధికారులు బాల్య వివాహాల నిరోధక అధికారులుగా ఉంటారు. గ్రామాల్లో ఉన్న అంగన్వాడీ కార్యకర్తలు బాల్య వివాహాలు జరుగుతున్నట్లుగా గుర్తిస్తే ఉన్నతాధికారులకు సమాచారం అందించాలి. హెల్ప్‌లైన్ సెంటర్ ఎత్తివేత..! ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని 1098 హెల్ప్‌లైన్ సెంటర్ గత నెల రోజులుగా మూతపడింది. బాల్య వివాహాలు, బాలికల రక్షణ కోసం హెల్ప్‌లైన్ సెంటర్ ఏర్పాటు చేశారు. ఆదిలాబాద్‌లో ఉన్న ఈ కేంద్రంలో ఎన్జీవో పరిధిలో పనిచేస్తున్న సిబ్బందికి వేతనాలు రావడం లేదని ఉద్యోగం మానేయడంతో హెల్ప్‌లైన్ సెంటర్‌ను ఎత్తివేశారు. ఈ సెంటర్లో ఏడుగురు సిబ్బంది పనిచేస్తుండేవారు. కోఆర్డినేటర్, ఇద్దరు కౌన్సెలర్లు, నలుగురు ఫీల్డ్ వర్కర్స్ ఉంటారు. ఈ నెంబర్‌కు వచ్చిన ఫోన్ సమాచారాన్ని సంబంధిత అధికారులకు తెలియజేయడంతోపాటు వీరు ప్రత్యేకంగా వచ్చిన ఫోన్ కాల్ సమాచారంపై ప్రత్యేక దృష్టి సారిస్తారు. 1098 నంబర్‌కు ఫోన్ చేస్తే నేరుగా చెన్నయ్‌కు వెళ్తుంది. అక్కడి నుంచి జిల్లాలో ఉన్న హెల్ప్‌లైన్ సెంటర్‌కు కనెక్ట్ చేస్తారు. ప్రస్తుతం సెంటర్ లేకపోవడంతో ఐసీపీఎస్ అధికారులకు సమాచారం అందిస్తున్నారు. సెంటర్‌కు ప్రత్యేక సిబ్బంది ఉంటే సదరు కేసుపై పూర్తి సమాచారం ఉంటుంది. కానీ ఐసీపీఎస్ అధికారులకు సమాచారం అందించడం వల్ల కొంత జాప్యం జరిగే అవకాశం ఉంటుంది. త్వరలో దీన్ని ప్రారంభించేందుకు జిల్లా కలెక్టర్‌కు ప్రతిపాదనలు పంపించినట్లు సీడబ్ల్యూసీ అధికారులు చెబుతున్నారు. డయల్ 100, 181 నంబర్లకు ఫోన్‌చేసి ఫిర్యాదు చేయవచ్చని పేర్కొంటున్నారు. బాలిక నిశ్చితార్థం అడ్డగింత తలమడుగు(బోథ్): తాంసి మండలం పొన్నారి గ్రామంలో శుక్రవారం బాలిక నిశ్చితార్థాన్ని అధికారులు అడ్డుకున్నారు. గ్రామంలో ఎనిమిది నెలలుగా ఉంటున్న ఓ యువకుడితో జైనథ్ మండలం గిమ్మ గ్రామానికి చెందిన పదో తరగతి బాలికకు పెళ్లి సంబంధం కుదిరింది. శుక్రవారం పొన్నారి గ్రామంలో నిశ్చితార్థానికి ఏర్పాట్లు చేశారు. సమాచారం అందుకున్న ఎస్సై రాజు, ఐసీడీఎస్ సూపర్వైజర్ నసీమున్నీసా గ్రామానికి చేరుకుని వివరాలు సేకరించారు. మైనర్‌కు పెళ్లి చేయడం చట్టరీత్యా నేరమని బాలిక తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. దీంతో పెళ్లి వయసు వచ్చాక పెళ్లి చేస్తామని బాలిక తల్లిదండ్రులు హామీనిచ్చారు. గ్రామపెద్దలు, ఎంపీటీసీ లక్ష్మి, రమణ, అంగన్వాడీ కార్యకర్తలు దేవమ్మ, గంగమ్మ, తదితరులు పాల్గొన్నారు. ఈ ఏడాది జరిగిన కొన్ని ఘటనలు జూన్ 17న నెన్నెల మండలం గుండ్లసోమారంలో రెవెన్యూ, ఐసీపీఎస్ అధికారులు 17 ఏళ్ల బాలికకు వివాహం చేస్తుండగా అడ్డుకున్నారు. ఇరువురు కుటుంబ సభ్యులకు కౌన్సెలింగ్ ఇచ్చి, బాలిక తల్లిదండ్రుల నుంచి ఒప్పంద పత్రం తీసుకున్నారు. జూన్ 18న నస్పూర్ మండలం శ్రీరాంపూర్‌లోని ప్రగతి మైదానంలో బాల్య వివాహాన్ని శిశు సంక్షేమ శాఖ అధికారులు అడ్డుకున్నారు. 16 ఏళ్ల బాలికకు వివాహం చేస్తున్నట్లు సమాచారం రావడంతో దాడులు చేసి ఇరువర్గాలకు కౌన్సెలింగ్ ఇచ్చారు. జూన్ 23న హజీపూర్ మండలం సబ్బెపల్లిలో ఓ బాలికకు వివాహం చేస్తున్నట్లు సమాచారం రావడంతో ఐసీపీఎస్, ఐసీడీఎస్, పోలీసులు సంయుక్తంగా దాడులు చేసి అడ్డుకున్నారు. తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చి బాలికను పాఠశాలలో చేర్పించారు. -
అడవి పందితో ఒళ్లు గగుర్పొడిచే..
సికావావో, ఇండోనేషియా : సాధారణంగా గొడవపడుతుంటే సర్దుమణిగేలా చేయడం మానవ నైజం. కానీ, అదే మనుషులు తమ వెర్రి ఆనందం కోసం వింత వినోదాల పేరిట అటవీ జంతువులకు పెంపుడు జంతువులకు ఘర్షణ పెట్టి వాటి మధ్య రక్తం ఏరులై పారుతున్నా చూసి ఆనందిస్తుంటే దానికి ఏమని పేరుపెట్టాలి. ఇండోనేషియాలోని పశ్చిమ జావా దీవుల్లో ప్రతి ఏడాది ఇదే తంతు జరుగుతుందట. వన్యమృగ ప్రేమికులు, సామాజిక ఉద్యమకారులు వద్దని వారిస్తున్నా అలాగే ఒక సంప్రదాయంగా చేస్తుంటారట. తమ పొలాలను నాశనం చేసే అడవి పందులను బంధించి ఓ చిన్న నీటి మడుగులో పెట్టి చుట్టూ కంచె ఏర్పాటుచేస్తారు. వెర్రెత్తిన కోపంతో ఉన్న కుక్కలకు, అడవి పందులకు మధ్య పోరాటం పెడతారు. ఇందుకోసం తమ కుక్కలకు ప్రత్యేకంగా తర్ఫీదునివ్వడంతోపాటు గెలిచే కుక్కలకు పెద్ద మొత్తంలో ప్రైజ్ మనీ కూడా ఇస్తుంటారు. ఇంకా చెప్పాలంటే అక్కడి వారు తమ కుక్కలను మన తెలుగు ప్రాంతాల్లో పందెం కోళ్లను మేపినట్లు మేపుతుంటారన్నమాట. అలా పెంచిన కుక్కలను రిజిస్ట్రేషన్ చేసుకొని వంతులవారిగా సీరియల్లో ఉండి అప్పటికే దెబ్బతిని ఉన్న అడవి పందులపైకి వదులుతారు. దాంతో వాటి మధ్య భీకర పోరు జరుగుతుంతూ చప్పట్లు విజిల్స్‌తో ఆనందిస్తుంటారు. ఈ పోరాటంలో పందులైనా చనిపోవచ్చు.. లేదా కుక్కలైనా చనిపోవచ్చు. ఏది చనిపోయినా వీరి కేరింతలు మాత్రం అస్సలు ఆగవు. దీనిపై ఎన్నిసార్లు సామాజిక ఉద్యమకారులు పోరాటం చేసిన ఫలితం లేకుండా పోయింది. 1960లో బోర్ ఫైటింగ్ పేరుతో బాంబూలు ఏర్పాటుచేసిన రాక్షస క్రీడ ఇప్పటికీ కొనసాగుతోంది. -
‘అమ్మ’కు ప్రాణం
సిద్దిపేటలో మహిళా జనాభే అధికం గణాంకాల ప్రకారం.. సిద్దిపేట జిల్లాలో మొత్తం 1.48 లక్షల మంది గిరిజనులు ఉన్నారు. ఇందులో 73 వేల మంది పురుషులు, 75 వేల మంది స్త్రీలు ఉన్నారు. బాలబాలికలూ ఇదే నిష్పత్తిలో ఉన్నట్లు అధికారిక నివేదికలు చెప్తున్నాయి. సాక్షి, హైదరాబాద్: ‘యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతి తత్ర దేవతా..’.. అంటే ఎక్కడైతే స్త్రీలు పూజించబడతారో అక్కడ దేవతలు కొలువుంటారని అర్థం. దీనిని ఆచరించేవాళ్లు తక్కువ. ఎక్కడ చూసినా మహిళలపై వివక్ష కనిపిస్తోంది. కానీ నాగరికపు పోకడ తెలియని గిరిపుత్రులు మాత్రం ఆడబిడ్డల పట్ల ఆదరణ కనబరుస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ‘‘హమా గర్యో ఏక్ బేటీ రతో లక్ష్మి.. భగవాన్ దినజకునో బేటీ (మన ఇంట్లో ఒక ఆడపిల్ల ఉంటేనే లక్ష్మి.. ఆడపిల్ల అంటే దేవుడు ఇచ్చిన బిడ్డ)’’.. అంటూ ఆదర్శంగా నిలుస్తున్నారు. కొడుకు కావాలన్న కోరికతో ఆడపిల్లను పురిట్లోనే చిదిమేస్తున్న సామాజిక ‘అనాగరికుల’ కళ్లు తెరిపిస్తున్నారు. దీంతో ఇటీవలి కాలంలో రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాల్లో స్త్రీల శాతం పెరుగుతూ వస్తోంది. పురుషులను మించి.. రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాలు, మారుమూల ప్రాంతా ల్లో గత దశాబ్దకాలంగా స్త్రీ, పురుషుల నిష్పత్తిలో తేడా తగ్గుతూ వస్తోంది. కొన్ని చోట్ల అయితే పురుషుల కన్నా స్త్రీల శాతం పెరగడం గమనార్హం. గిరిజనులు స్త్రీ, పురుష వివక్షను జయించడం, మగ పిల్లలే కావాలన్న వైఖరిని విడనాడడం, అసలు ఆడపిల్ల పుడితే అదృష్టమన్న భావన పెంపొందించుకోవడమే దీనికి కారణం. దీంతో రాష్ట్రంలో ఐదు జిల్లాల్లోని గిరిజనుల్లో పురు షుల కంటే మహిళా జనాభాయే ఎక్కువగా ఉండగా.. మిగతా జిల్లాల్లో పురుషులతో సమానంగా ఉన్నారు. ఇటీవల అధికారులు సేకరించిన లెక్కల ప్రకారం రాష్ట్రంలో మొత్తం 36.22 లక్షల మంది గిరిజనులు ఉన్నారు. ఇందులో 18.12 లక్షల మంది పురుషులు, 18.10 లక్షల మంది స్త్రీలు ఉన్నారు. గిరిజన బాలబాలికలూ ఇదే నిష్ప త్తిలో ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. మంచి ప్రయోజకులను చేస్తాం ‘‘హమారా తీన్ చార్వీన్ చారాలానే కేలేరే.. కష్టమ్ కరన్ జాదా సదువుల్ సదువారేచా.. (మా ముగ్గురు అమ్మాయిలను అబ్బాయిల్లాగానే పెంచుతున్నాం. కష్టపడైనా ఉన్నత చదువులు చదివిస్తున్నం..). ఆడపిల్లలైనా వారు మా కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉంటున్నారు. వారిని మేం ఏనాడూ భారంగా చూడలేదు. మంచి ప్రయోజకులను చేయాలనుకుంటున్నాం..’’ – గుగులోతు తులసీ మా ఇంటి దేవతలు ‘కూలీ కామ్ కరన్ హమార్ చార్వీన్.. గరేన్ దాడ్ కాడ్రేచా.. (రోజూ కూలీ పనిచేస్తూ మా అమ్మాయిలను, మా కుటుంబాన్ని పోషిం చుకుంటున్నాం).’ మాకు సంధ్య, శ్యామల, గౌతమి ముగ్గురు బిడ్డలు. వారే మా ఇంటి దేవతలు. వ్యవసాయం నీట మునిగి పోయింది. కూలీ పనులు చేసుకుంటూ మా బిడ్డలను చదివిస్తున్నాం..’’ – భూక్యా బుజ్జి ఆడపిల్లలు అయితే ఏంటి? ‘‘మార్ గరేవాలో పక్షవాతం రోగేతీ టాంగ్, హాత్ పడిగే.. ఏతీ హమార్ ఘర్ మై ఏక్ దాడ్ కామేన్నాజాంతో.. భుకేతీ సోయేర్ పరిస్థిత్. దిన దినమ్ కామ్ కరన్.. ఘర్ ఏళ్ళ దీస్రీ.. తీన్ చార్వీన్ సదువారీ.. (మా ఇంటి పెద్దాయనకు పక్షవాతంతో కాళ్లు చేతులు పడిపోయినయ్. రోజూ పనిచేస్తూ కుటుంబాన్ని వెల్లదీసుకుంటున్నా. మాకు ముగ్గురు ఆడపిల్లలు కరుణ, స్వప్న, అనూష ఉన్నారు. ఆడపిల్లలు అయితే ఏంటి. వాళ్లను బాగా చదివిస్తున్నా..’’ – గుగులోతు కమల మొత్తం గిరిజనులు 36.22 లక్షలు పురుషులు 18.12 లక్షలు మహిళలు 18.10 లక్షలు -
గిరిసీమల్లో రహదారిద్య్రం
సాక్షిప్రతినిధి విజయనగరం: జిల్లాలోని గిరిజన ప్రాంతాల్లో మూడేళ్లుగా రహదారులు అభివృద్ధికి నోచుకోవడం లేదు. కొత్త రోడ్ల నిర్మాణం జరగలేదు. నిధులున్నా ప్రతిపాదనలు సిద్ధంగా ఉన్నా, పాలకుల నిర్లక్ష్యం వల్ల నేటికి దారులు ఏర్పడలేదు. దీంతో గిరిజనులు ఇబ్బందులు పడుతూ అభివృద్ధికి దూరమవుతున్నారు. చదువు కోవడానికి వెళ్లలేక గిరిజన యువత నిరక్షరాస్యులుగానే మిగిలిపోతున్నారు. నెలకోసారి నిత్యవసర సరుకులు కొనుగోలు చేసుకునేందుకు కొండలు గుట్టలు ఎక్కి దిగి కిలోమీటర్ల దూరం నడిచి అవస్థలు పడుతున్నారు. సాలూరు నియోజకవర్గంలోని పలుగ్రామాలకు రహదారులకు ఉపాధిహామీ పథకం ద్వారా నిధులు మంజూరు చేశారు. ఆ పనులు సైతం పూర్తికాలేదు. మెంటాడ మండలంలో రూ. 4కోట్లతో జగన్నాథపురం, రెడ్డివానివలస, గజంగుడ్డివలస, మూలపాడు గ్రామాలకు ఈ ఏడాది మట్టిరోడ్ల నిర్మాణం చేపట్టారు. సోషల్ ఆడిట్లో పలు అవకతవకలు జరిగినట్టు గుర్తించడంతో పనులు నిలిచిపోయాయి. మక్కువ మండలంలో రూ.35కోట్ల రూపాయలతో 11 గ్రామాలకు రహదారులు మంజూరయ్యాయి. మూలవలస నుంచి కంజుపాక గ్రామానికి నిధులు మంజూరైనా అటవీశాఖ అడ్డంకులు కారణంగా పనులు నిలిచిపోయాయి. బాగుజోల నుంచి చిలకమెండంగి రోడ్డు పూర్తిగా రాళ్లు తేలి కనిపిస్తోంది. సాలూరు మండలంలోని పట్టుచెన్నేరు, పగలుచెన్నేరు, డెన్సరాయి, సంపంగిపాడు, కొదమ, జిల్లేడువలస తదితర గిరిశిఖర గ్రామాలకు ఇప్పటికీ రహదారి సౌకర్యం లేదు. మైదానప్రాంతంలోని పంచాయతీ కేంద్రమైన అన్నంరాజువలస గ్రామానికి, తోణాం పంచాయతీ మెట్టవలస, కొత్తవలస పంచాయతీలోని బుట్టిగానివలస, మరిపల్లి పంచాయతీలోని గడివలస ఇలా చాలా గ్రామాలకు వెళ్లాలంటే నరకమే. చందాలతో రోడ్ల నిర్మాణం అధికారులు, పాలకుల మీద నమ్మకం సన్నగిల్లి సాలూరు మండలంలోని పట్టుచెన్నేరు, పగలుచెన్నేరు గ్రామాల ప్రజలు ఇంటింటికీ చందాలు వేసుకుని, శ్రమదానం చేసి, వసూలైనసొమ్మును ఖర్చుచేసి రోడ్డును వేయించుకున్నారు. రూ. 49 లక్షలతో సాలూరు మండలం పసుపువానివలస నుంచి లోవవలసకు 1.2 కిమీ తారు రోడ్డు వేశారు. గ్రామానికి అరకిలోమీటరు దూరంలో పనులు నిలిపేశారు. పెదపధం పంచాయతీ దుక్కడవలస సమీపంలోని తామరకొండ వైపునకు 40 లక్షలతో సుమారు 800 మీటర్ల తారు రోడ్డు వేశారు. కొండ నుంచి కూతవేటు దూరంలోనున్న దుక్కడవలస గ్రామానికి రోడ్డు వేయలేదు. కొత్తవలస పంచాయతీలోని సుంకరిబంద చెరువుకు కంకర రోడ్డును ఐటీడీఏ నిధులతో వేశారు. పక్కనేవున్న బుట్టిగానివలసకు రోడ్డు వేయకపోవడం గమనార్హం. మక్కువ మండలంలోని మెండంగి, చిలకమెండంగి, బాగుజోల, బీరమాసి గ్రామాలకు చెందిన గిరిజనులు మైదాన ప్రాంతాలకు దూరంగా కొండల సమీపంలో నివశిస్తున్నారు. ఆయా గ్రామాల్లో కనీస మౌలిక సదుపాయాలు లేవు. కరకవలస గ్రామం నుంచి సుమారు 10 కిమీ దూరంలోవున్న మారిక గ్రామం వెళ్లాలంటే రాళ్లు–రప్పలు, ముళ్లు–తుప్పలు మద్య మూడుకొండలు ఎక్కిదిగాల్సిందే. -
గిరిజన గూడపై ఏనుగుల దాడి
ఎల్.ఎన్.పేట : మండలంలోని చొర్లంగి పంచాయతీ కొత్తవలస గిరిజన గ్రామంపై మంగళవారం అర్ధరాత్రి దాటిన తరువాత నాలుగు ఏనుగుల గుంపు దాడి చేశాయని అదే గ్రామానికి చెందిన బాధిత గిరిజనులు స్థానిక విలేకరులకు బుధవారం తెలిపారు. అందరూ నిద్రపోతున్న సమయంలో ఏనుగుల అరుపులు వినిపించి ఇళ్లనుంచి బయటకు వచ్చి చూశామని చెప్పారు. అప్పటికే గ్రామానికి సమీపంలోకి ఏనుగులు వచ్చాయని, భయంతో పరుగులు తీశామని, కొందరు శ్లాబు ఇళ్లు పైకి ఏక్కి భయం భయంగా రాత్రంతా గడిపామని తెలిపారు. గ్రామంలోకి వచ్చిన ఏనుగులు వీధుల్లో తిరగడంతో పాటు పాకలు పీకేశాయని ఆవేదన వ్యక్తం చేశారు. సవర జమ్మయ్య, సవర కురమయ్య, సవర కాంతారావు, సరవ అనపయ్యలతో పాటు మరికొందరికి చెందిన పాకలు పీకేయడం, దాచుకున్న ధాన్యం బస్తాలను కాలితో తొక్కేసి తినేశాయని బాధితులు వాపోయారు. గ్రామానికి సమీపంలో ఉన్న వరి పంటలను కూడా తొక్కేశాయని తెలిపారు. గత ఏడాది తమ గ్రామానికి కాస్త దూరం నుంచి ఏనుగులు వెళ్లిపోయాయని, ఇప్పుడు గ్రామంలోకే ప్రవేశించాయన్నారు. ఏనుగుల కారణంగా ఎప్పుడు ఎలాంటి ప్రమాదం జరుగుతుందోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్థానిక సర్పంచ్ మహాంతి సూర్యనారాయణ, ఎంపీటీసీ శివ్వాల కిశోర్‌బాబు సంఘటనా స్థలానికి వెళ్లి బాధితులతో మాట్లాడారు. -
పీడిస్తున్న ‘సికిల్‌సెల్’
- 35 మందికి ఎనీమియా లక్షణాలు - వైద్య నిపుణుల అధ్యయనం - సర్వేకు రెండు నెలల్లో కార్యాచరణ పాడేరు: గిరిజన ప్రాంతాల్లో సికిల్‌సెల్ ఎనీమియా కేసులను గుర్తించేందుకు వైద్య,ఆరోగ్యశాఖ చర్యలు చేపడుతోంది. ప్రస్తుతం దీని నివారణకు మందులు లేవు. రోగులకు అత్యవసరమైనప్పుడు రక్తం ఎక్కించి వారి జీవన ప్రమాణం పెంచగలుగుతున్నారు. మన్యంలో ఈ వ్యాధి వల్ల చాలా మరణాలు చోటుచేసుకుంటున్నాయి. ఏజెన్సీలో ప్రస్తుతం 35 మంది ఈ లక్షణాలతో బాధపడుతున్నట్టు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు గుర్తించారు. కాల పరిమితి మేరకు వీరి రక్తహీనత స్థాయిని పరిశీలించి పాడేరు, అరకు, చింతపల్లి ఆస్పత్రులలోని రక్త నిల్వ కేంద్రాల ద్వారా అవసరం అయినప్పుడు రక్తం ఎక్కిస్తున్నారు. గిరిజన ప్రాంతాల్లో రక్తహీనత వల్ల అనారోగ్యానికి గురవుతున్న వారి సంఖ్య ఎక్కువగా ఉంటోంది. గర్భిణులు, బాలింతలు ఈ లక్షణాలతో సతమతమవుతున్నా రు. ఈ కారణంగా తరచూ మాతా, శిశు మరణాలు సంభవిస్తున్నాయి. మన్యంలో పౌష్టికాహార లోపం కారణంగా తొమ్మిదేళ్లలోపు చిన్నారుల్లోనూ రక్తహీనత ఎక్కువగా ఉంటోంది. బాధితులకు అత్యవసరమైన ప్పుడు ఆస్పత్రిలో రక్తం ఎక్కించడంతోపాటు ఐరన్ మాత్రల పంపిణీ, ఇతర వైద్యసేవలను అందిస్తున్నారు. అయినప్పటికీ కొందరు కోలుకోలేకపోతున్నారు. దీంతో మన్యం నుంచి రక్తహీనతతో బాధపడుతున్న రోగులను విశాఖపట్నం కేజీహెచ్‌కు తరలిస్తున్నారు. ఇక్కడ కూడా వారి ఆరోగ్య పరిస్థితి మెరుగు కాకపోవడంతో వైద్య నిపుణులు దీనిపై అధ్యయనం చేసి ఎనీమియాతో బాధపడుతున్న రోగుల్లో కొడవలి ఆకారంగా ఉండే ఎర్రరక్తకణాలు ఉన్నట్టు గుర్తించారు. ఇది సికిల్‌సెల్ ఎనీమియా అని, వంశపారంపర్యంగా వస్తున్న వ్యాధిగా గుర్తించారు. ఏజెన్సీలో రక్తహీనతతో ఉన్న వారిని గుర్తించేందుకు క్షేత్రస్థాయిలో వైద్య ఆరోగ్యశాఖ ఇంటింటా సర్వే నిర్వహించనుంది. ఇటీవల హైదరాబాద్‌లో ఆరు జిల్లాల ఏడీఎంహెచ్‌వోలతో ఈ సర్వేపై కార్యచరణ కోసం వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక సమావేశం నిర్వహించింది. గిరిజన ప్రాంతాల్లో ఇందుకు ప్రత్యేకంగా డాక్టర్ల బృందాలను ఏర్పాటు చేయనున్నారు. ఎనీమియా రోగులకు సాలిబిలిటీ టెస్ట్ నిర్వహించడం, సర్వే నిర్వహించడంపై డాక్టర్ల బృందాలకు శిక్షణను ఇవ్వనున్నారు. ఎపిడమిక్ అనంతరం ఏజెన్సీలో రెండు నెలలపాటు ఈ సర్వే చేపట్టనున్నారు. -
‘కంతనపల్లి’ని కట్టొద్దు..
చెల్లప్ప కమిషన్‌ను రద్దు చేయూలి ఆదివాసీ ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ కొమురం నర్సయ్య ములుగు : 23 ఆదివాసీ గ్రామాలను జలసమాధి చేసే కంతనపల్లి ప్రాజెక్టును కట్టొద్దని ఆదివాసీ ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ కొమురం నర్సయ్య డిమాండ్ చేశారు. ప్రాజెక్టును కట్టడం ద్వారా ఆదివాసీలకు వచ్చే ప్రయోజనాలు ఏమీ లేవని... ఈ ప్రాజెక్టుతో వారి జీవితాలు అగాధంలోకి నెట్టివేయబడతాయని ఆవేదన వ్యక్తం చేశారు. ములుగు మండల కేంద్రంలోని ఆర్డీఓ కార్యాలయ ఆవరణలో శనివారం జరిగిన ఆదివాసీ సంఘాల సమావేశానికి ఆయన ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడారు. పీసా చట్టం-2011 ప్రకారం ఆదివాసీ ప్రాంతాల్లో భారీ ప్రాజెక్టులు నిర్మించదలుచుకుంటే ప్రభుత్వం ముందుగా ఆదివాసీ సంఘాలతో చర్చలు జరపాలన్నారు. అవేమి చేయకుండా ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయాలతో ముందుకు సాగడం ఆదివాసీ చట్టాలను అవమాన పరచడమేనన్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ముంపు గ్రామాల ప్రజలతో సత్వరమే చర్చలు జరపాలన్నారు. బంగారు తెలంగాణ అంటే ఆదివాసీలను జలసమాధి చేయడమేనా అని ప్రశ్నించారు. షెడ్యూల్డ్ ప్రాంతమైన ఏటూరునాగారం ప్రాంతాన్ని ప్రభుత్వం అభివృద్ధి చేయాలనుకుంటే ముందుగా సమ్మక్క-సారలమ్మ తల్లుల పేరుమీద అటానమస్ జిల్లా కౌన్సిల్‌ను ఏర్పాటు చేయాలని సూచించారు. ఎస్టీ జాబితాలో కైత లంబాడ, వాల్మీకి బోయలను కలపడానికి ప్రభుత్వం నియమించిన చెల్లప్ప కమిషన్‌ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఆదివాసీ సంఘాల నాయకులు పొడెం బాబు, పులిశె బాలక్రిష్ణ, ఆగబోయిన రవి, పడిగ నాగేశ్వర్రావు, చంద మహేష్, కొర్నిబెల్లి గణేష్, నల్లెబోయిన లక్ష్మణ్‌రావు, అర్రెం అచ్చుపటేల్, చంద రఘుపతిరావు, కాక నర్సింగరావు తదితరులు పాల్గొన్నారు. -
'పంచాయతీలుగా 1700 గిరిజన తండాలు'
కరీంనగర్: తెలంగాణ రాష్ట్రంలో ఐదు వందల పైచిలుకు జనాభా ఉన్న 17వందల గిరిజన తండాలను గ్రామపంచాయతీలుగా ఏర్పాటు చేయనున్నట్టు రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు తెలిపారు. కరీంనగర్ జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గుండారం, ఎర్రగడ్డ, బాబాయి చెరువు, వన్‌పల్లి తండాలలో రూ.5లక్షల వ్యయంతో నిర్మించతలపెట్టిన గిరిజన కమ్యూనిటీ భవనాలకు మంత్రి శనివారం శంకుస్థాపనలు చేశారు. ఎన్నికలకు ముందు సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు గిరిజనుల జీవితాల్లో వెలుగులు నింపడానికి పెద్ద మొత్తంలో ప్రత్యేక నిధులు కేటాయిస్తున్నట్లు తెలిపారు. ఎన్నికల మెనిపేస్టోలో ఇచ్చిన హామీలను వందశాతం నేరవేర్చేందుకు కేసీఆర్ సుముఖంగా ఉన్నారన్నారు. గిరిజనుల చిరకాల వాంఛ అయిన తండాలను ప్రత్యేక గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేస్తున్నట్ల్లు పేర్కొన్నారు. గిరిజనులకు విద్య, ఉపాధి రంగాల్లో 12శాతం రిజర్వేషన్లు అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఎస్టీ, ఎస్సీలకు కల్యాణలక్ష్మి ద్వారా రూ.51వేలను పెళ్లికి ముందే ఇచ్చుటకు అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చామన్నారు. అర్హత గల వారందరు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద నియోజకవర్గానికి రూ.25కోట్లు మంజూరు చేయగా.. అందులో ఎల్లారెడ్డిపేట మండలానికి రూ.8కోట్లు కేటాయించామన్నారు. వీటితో సీసీ రోడ్లు, కమ్యూనిటీ భవనాలు నిర్మిస్తామన్నారు. రూ.13కోట్లతో సిరిసిల్ల పట్టణాన్ని అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. (ఎల్లారెడ్డిపేట) -
నగరాల్లోనూ పౌష్టికాహార సమస్య
ఏకాత్మిక్ బాల్ వికాస్ సంస్థ సర్వేలో వెల్లడి సాక్షి, ముంబై: మొన్నటి వరకు గిరిజన ప్రాంతాలకే పరిమితమైన పౌష్టికాహర లోపం సమస్య ఇప్పుడు నగరాల్లో కూడా కనిపిస్తోంది. నగరాల్లో దాదాపు 17 శాతం పిల్లలు పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నట్లు ఆశ్చర్యకరమైన విషయం వెలుగులోకి వచ్చింది. రాష్ట్రంలోని వివిధ నగరాలలో 15.54 లక్షల మంది ఆరేళ్ల లోపు పిల్లలపై ఏకాత్మిక్ బాల్ వికాస్ సేవా సంస్థ ఆధ్వర్యంలో అధ్యయనం చేశారు. ఇందులో 10.62 లక్షల మంది పిల్లలు ఉండాల్సిన దానికంటే చాలా తక్కువ బరువున్నట్లు వెల్లడైంది. ఒకప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో, గిరిజన తండాల్లో ఈ సమస్య అధికరంగా కనిపించేది. ఇప్పుడు ప్రధాన నగరాల్లోని మురికివాడల్లో పేదరికం, అజ్ఞానం, నిరక్షరాస్యత, ఆరోగ్యంపై సరైన మార్గదర్శనం లేకపోవడంవల్ల పిల్లల్లో పౌష్టికాహార లోపం సమస్య ఎదురవుతోందని అధ్యయనంలో బయటపడింది. పౌష్టికాహార సమస్యను నిర్మూలించేందుకు ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చుచేస్తోంది. గ్రామీణ, గిరిజన ప్రాంత పేద ప్రజలకు మార్గదర్శనం చేసేందుకు ప్రభుత్వ వైద్యాధికారులను, ఆంగన్వాడీ కార్యకర్తలను పంపిస్తున్నారు. చిన్న వయసులోనే పెళ్లిళ్లు చేయవద్దని, వెంటనే పిల్లల్ని కనకూడదని, ఇద్దరు బిడ్డల మధ్య కనీసం మూడేళ్ల దూరం ఉండాలని బోధిస్తూ, గర్భిణులు తిసుకునే ఆహారం తదితరాలపై మార్గదర్శనం చేస్తున్నారు. నగరాల్లో ఈ సమస్య లేకపోవడంతో అందరి దృష్టి గ్రామీణ ప్రాంతాలపైనే ఉండేది. కానీ నగరాల్లో వెలుస్తున్న మురికివాడల్లోని పేద ప్రజల్లో ఈ సమస్య తీవ్రంగా కనిపిస్తుండడంతో ఆరోగ్య శాఖ ఆందోళనకు గురవుతోంది. రాష్ట్రంలోని మొదటి పది నగరాలలో మాలేగావ్, నాగపూర్, మాల్వణి (ముంబై), నాందేడ్, ఠాణే, షోలాపూర్ , ఇచల్కరంజీ, యవత్మాల్, పింప్రి, బల్లార్పూర్లో ఈ సమస్య ఉంది. ఇక్కడ ప్రస్తుతం 17 శాతం మంది పిల్లలు పౌష్టికాహరం లోపంతో ఉన్నారు. భవిష్యత్తులో ఇది మరింత తీవ్రమయ్యే ప్రమాదముందని ఏకాత్మిక్ బాల్‌వికాస్ సేవా సంస్థ హెచ్చరించింది. -
ప్రైవేటు సెక్యూరిటీలోకి గిరిజనులు: క్యాప్సీ
హైదరాబాద్: ప్రైవేటు సెక్యూరిటీ రంగం ఇప్పుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని గిరిజన ప్రాంతాలపై దృష్టిసారించింది. సెక్యూరిటీ గార్డులుగా గిరిజన యువతను నియమించుకుంటామని సెంట్రల్ అసోసియేషన్ ఆఫ్ ప్రైవేట్ సెక్యూరిటీ ఇండస్ట్రీ (కా్యిప్సీ) చైర్మన్ కున్వర్ విక్రమ్ సింగ్ తెలిపారు. గిరిజనుల్లో చక్కని పనితనం ఉందని అన్నారు. ప్రైవేటు గార్డులకు పెరుగుతున్న డిమాండ్ నేపథ్యంలో మానవ వనరుల కొరతను అధిగమించొచ్చని తెలిపారు. క్యాప్సి పైలట్ ప్రాజెక్టు కింద వందలాది మంది జార్ఖండ్ యువతులకు శిక్షణ ఇచ్చినట్టు చెప్పారు. కేంద్ర ప్రభుత్వ స్టార్ పథకం కింద సుమారు 30,000 మంది గిరిజన యువత శిక్షణ పొందారని పేర్కొన్నారు. -
గిరిజనేతరుల రుణమాఫీకి వంద కోట్లు: సీఎం
సాక్షి, హైదరాబాద్: ఖమ్మం, వరంగల్, ఆదిలాబాద్ జిల్లాల్లోని గిరిజన ప్రాంతాల్లో ఉండే గిరిజనేతరులకు రుణమాఫీ వర్తింప చేస్తామని, అందుకోసం రూ. 100 కోట్లు కేటాయిస్తానని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు హామీయిచ్చారు. సోమవారం అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో టీడీపీ సభ్యుడు సండ్ర వెంకటవీరయ్య అడిగిన ప్రశ్నకు సీఎం ఈ హామీ ఇచ్చారు. బంగారం రుణాలకు గాను ప్రభుత్వం డబ్బు చెల్లించినా బ్యాంకులు ఆ బంగారాన్ని ఆడపడుచులకు ఇవ్వడంలేదని రేవంత్‌రెడ్డి (టీడీపీ) చెప్పగా, విడిపించే ప్రయత్నం చేస్తామని కేసీఆర్ బదులిచ్చారు. సమావేశాలు ముగిసేలోగా కరవు మండలాలను ప్రకటిస్తామన్నారు. -
వీరి బతుకులింతేనా?
నారాయణఖేడ్ నియోజకవర్గంలోని కల్హేర్, కంగ్టి, మనూర్, పెద్దశంకరంపేట, నారాయణఖేడ్ మండలాల్లో 110 పంచాయతీలు ఉండగా 181 తండాలు ఉన్నాయి. ని యోజకవర్గంలోని తండాల్లో సుమారు 48 వేల జనాభా ఉంటుంది. చాలాచోట్ల మౌలిక వసతులు లేవనే చెప్పాలి. అంతర్గత రోడ్ల నిర్మాణం, ఇతర అభివృద్ధి పనులు చేపట్టకపోవడంతో తండాలన్నీ అభివృద్ధిలో వెనుకబడి పో యాయి. తండాలను ప్రత్యేక పంచాయతీలుగా ఏర్పాటు చేయాలనే డిమాండ్ ఉన్నా కార్యరూపం దాల్చడం లేదు. సౌకర్యాల జాడేది? సిర్గాపూర్, బాచేపల్లి, నాగధర్, మునిగేపల్లి, కడ్పల్, మాసాన్‌పల్లి, కల్హేర్ పంచాయతీల్లోని తండాల్లో సమస్యలు తిష్టవేశాయి. బీబీపేట జంలా తండాలో మంచి నీటి ట్యాంక్ నిర్మించి ఏళ్లు కావస్తున్న నిరుపయోగంగానే ఉంది. చాలాచోట్ల ఇంకా మట్టిరోడ్లు, పూరి గుడిసెలు దర్శనమిస్తున్నాయి. సిర్గాపూర్‌తోపాటు తదితర తండాలు ఇప్పటికీ విద్యుత్ సౌకర్యానికి నోచుకోలేదు. ఇళ్లల్లో ఇప్పటికీ కిరోసిన్ దీపాలనే ఉపయోగిస్తున్నారు. తాగునీటికి కటకటే.. తాగు నీటికి కోసం గిరిజనులు అనేక అవస్థలు పడుతున్నారు. కొన్ని తండాల్లో మంచి నీటి ట్యాంకులు నిర్మించినా బోరు, పైపులైన్ లేకపోవడంతో వృధాగా పడి ఉన్నాయి. గిరిజనులు నీటి కోసం వ్యవసాయ బోర్ల వద్దకు పరుగులు పెడుతున్నారు. పంపుల వద్ద బురద గుంటలు ఉండడంతో నీరు కలుషితం అవుతున్నాయి. ఫలితంగా వారు తరచూ రోగాల బారిన పడుతున్నారు. గతంలో ఎంతో మంది డయేరియా, ఇతర వ్యాధుల బారిన పడిన సందర్భాలున్నాయి. విద్య.. మిథ్యే.. తండాల్లో పాఠశాలలు ఉన్నా అవి సరిగా తెరుచుకోవడం లేదు. మెజార్టీ పాఠశాలలు ఏకోపాధ్యాయులు పనిచేస్తున్నారు. ఇందులో చాలామంది తరచూ డుమ్మాలు కోడుతున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఫలితంగా గిరిజనులు నిరక్షరాస్యులుగా మిలిగిపోతున్నారు. ప్రభుత్వ వైద్యం గగనమే.. తండాల వాసులకు ప్రభుత్వ వైద్యం గగనంగా మారింది. ఆరోగ్య సిబ్బంది తండాలకు వెళ్లడంలో నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నారు. 104 వైద్య సేవలు అందడం లేదని ఆయా తండా వాసులు ఆరోపిస్తున్నారు. ఇటివలే నాగధర్ రాంచందర్ తండాల్లో గిరిజనులు డయేరియాతో మంచం పట్టిన సంఘటనలు చోటుచేసుకున్న విషయం తెల్సిందే. రాకపోకలకు తప్పని ఇబ్బందులు మెజార్టీ తండాల్లో మట్టిరోడ్లే దర్శనమిస్తున్నాయి. కల్హేర్ పోమ్యానాయక్ తండా, సిర్గాపూర్ జంలా తండా, గైర్హాన్ తండా, మాసాన్‌పల్లి రత్ననాయక్ తండా, బుగ్యనాయక్ తదితర తండాలకు రోడ్డు సౌకర్యం లేక గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎన్నికలప్పుడు వచ్చే నాయకులు ఆ తర్వాత తండాల వైపు కన్నెత్తి చూడడం లేదు. వ్యక్తిగత మరుగుదొడ్లు కరువే.. తండాల్లో వ్యక్తిగత మరుగుదొడ్లు లేకపోవడంతో రాత్రి వేళల్లో బహిర్భూమికి బయటకు వెళ్తున్నారు. ఆరుబయటే తడకలు వేసి స్నానపు గదులుగా వినియోగిస్తున్నారు. మురికి కాలువలు లేకపోవడంతో ఆ నీరంతా వీధుల్లోనే ఉండిపోతుంది. ఇళ్ల ముందే పెంట కుప్పలు పేరుకుపోతున్నాయి. వర్షాకాలంలోనైతే పరిస్థితి భయానకంగా ఉంటుందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. కనీసం ఉపాధి పనులు సైతం లభించక ఎంతోమంది వలస బాట పడుతున్నారు. తండాలను పంచాయతీలుగా ఏర్పాటు చేస్తే అభివృద్ధి బాటపట్టవచ్చని గిరిజనులు భావిస్తున్నారు. అయితే ఈ విషయాన్ని పట్టించుకునే వారే కరువయ్యారు. -
ఒడి నుంచే మాయం
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: గిరిజన తండాలే లక్ష్యంగా జిల్లాలో శిశు విక్రయ ముఠాలు పనిచేస్తున్నాయి. జిల్లాలో ఇటీవల వెలుగు చూసిన ఆడ శిశువు విక్రయ ఘటన అనుమానాలకు ఊతమిస్తోంది. ఏడాదిన్నర కాలంలో డజను శిశు విక్రయ ఘటనలు వెలుగు చూడగా, ఇందులో తొమ్మిది ఆడ శిశువులు ఉన్నాయి. ఈ 8 శిశువులు కూడా తండాలకు చెందిన వే కావడం చూస్తే తండాల్లో శిశు విక్రయ ముఠాల కార్యకలాపాలు ఎలా సాగుతున్నాయో తెలుసుకోవచ్చు. విక్రయ ఘటనలు వెలుగు చూసినప్పుడు హడావుడి చేసే సంబంధిత అధికారులు ఆ తర్వాత శిశు విక్రయాల సంగతి మరచిపోతున్నారు. మరోవైపు ఏ ఒక్క ఘటనలోనూ పోలీసు కేసు నమోదు కాకపోవడంతో శిశు విక్రయాల పెరుగుదలకు కారణంగా తెలుస్తోంది. ఈఏడాదిలో తొమ్మిది శిశువు విక్రయ ఘటనలు కేవలం నర్సాపూర్ నియోజకవర్గం పరిధిలోనే చోటు చేసుకున్నాయి. ఈ నియోజవర్గం నుంచి సాక్షాత్తూ స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సునీతారెడ్డి ప్రాతినిథ్యం వహిస్తుండగా, శిశు విక్రయాలను అరికట్టే దిశలో ప్రభుత్వం చేపట్టిన పైలట్ కార్యక్రమం ఇదే నియోజకవర్గం పరిధిలోని కౌడిపల్లిలో అమలవుతుండడం గమనార్హం. గతంలోనూ ఇదే నియోజకవర్గం కేంద్రంగా గర్భసంచి ఆపరేషన్ల రాకెట్ గుట్టు రట్టయింది. పేదరికం, నిరక్షరాస్యత, అవగాహన లోపం కారణంగా శిశు విక్రయాలు సాగుతున్నట్లు అధికారులు కారణాలను వల్లె వేస్తున్నారు. విక్రయాలకు గురైన శిశువులను స్వాధీనం చేసుకుని తిరిగి తల్లిదండ్రులకు అప్పగించడంతోనే అధికారులు సరిపెడుతున్నారు. విక్రయ ఘటనలపై లోతైన విచారణ జరగడం లేదు. ఇప్పటి వరకు ఏ ఒక్క ఘటనకు సంబంధించి పోలీసు కేసు నమోదు కాకపోవడం గమనార్హం. శిశు విక్రయ ముఠా పనే? తాజాగా నర్సాపూర్ మండలంలో వెలుగు చూసిన శిశు విక్రయ ఘటనపైనా అధికారుల స్పందన మొక్కుబడిగా ఉందనే ఆరోపణలు వస్తున్నాయి. ఓ ఆర్టీసీ ఉద్యోగి భార్య మధ్యవర్తిగా వ్యవహరించగా, శిశువు నాలుగు చేతులు మారింది. తల్లి ఒడి నుంచి తప్పించిన శిశువును తిరిగి కర్నూలు జిల్లాలో స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. అయితే సమగ్ర బాలల సంరక్షణ పథకం (ఐసీపీఎస్) అధికారులు మాత్రం సంగారెడ్డిలోనే శిశువు దొరికిందని చెప్తున్నారు. తమ వంతు తప్పు లేకుండా చూసేందుకు పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వారు సిద్ధమయ్యారు. పూర్తి వివరాలు ఉంటేనే ఫిర్యాదు స్వీకరిస్తామని నర్సాపూర్ పోలీసులు తేల్చి చెప్పడంతో ఐసీపీఎస్ అధికారులు నివేదిక సిద్ధం చేస్తున్నారు. జిల్లా మహిళాభివృద్ధి సంస్థ, జిల్లా బాలల సంరక్షణ సంస్థ ఆధ్వర్యంలో పలు పథకాలు, కార్యక్రమాలు అమలవుతున్నా విక్రయాలు, చట్టబద్ధత లేని దత్తత వంటి ఘటనలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. అవగాహన కల్పిస్తాం గ్రామ స్థాయిలో బాలల పరిరక్షణ కమిటీలు ఏర్పాటు చేస్తాం. నర్సాపూర్ నియోజకవర్గం పరిధిలో గిరిజన తండాల్లో కళాజాత ద్వారా శిశు విక్రయ ఘటన లు చోటు చేసుకోకుండా ప్రజలను చైతన్యవంతులను చేస్తాం. అక్రమంగా శిశువులను అమ్మేవారిపై, కొనుగోలు వారిపై చట్టబద్ధంగా కేసులు నమోదు చేస్తాం. -రత్నం, ఐసీపీఎస్ -
నిధులు స్వాహా!
బెజ్జూర్, న్యూస్‌లైన్ : విద్యార్థులకు బోధన చేయాల్సిన గురువులే అక్రమాలకు పాల్పడుతున్నారు. అందినకాడికి దండుకుంటున్నారు. 2011-12 సంవత్సరానికి బెజ్జూర్ మండలంలోని పర్దాన్‌గూడ, తొర్రం గూడ, అందుగూలగూడ, బారెగూడ గిరిజన గ్రామాలకు అదనపు తరగతి గదుల నిర్మాణం కోసం నిధులు మంజూరయ్యాయి. ఒక్కో పాఠశాలకు రూ.4 లక్షల చొప్పున రూ.16 లక్షలు ఆయా ప్రధానోపాధ్యాయుల ఖాతాలో ఆర్వీఎం అధికారులు జమ చేశారు. ఈ నిధులతో కాంట్రాక్టర్ సహకారంతో అదనపు తరగతి గదుల నిర్మాణం చేపట్టాలి. కానీ, అందుగూలగూడ పాఠశాలలో కేవలం డోర్లెవల్ వరకు నిర్మాణం చేపట్టగా, మిగతా పాఠశాలల్లో అసలు నిర్మాణాలు చేపట్టలేదు. హెచ్ఎంలు మాత్రం రూ.13 లక్షలు డ్రా చేశారు. తొర్రంగూడ పాఠశాల ఖాతా నంబర్ 62080933418 నుంచి అక్టోబర్ 23, 2012న రూ.లక్ష, నవంబర్ 6, 2012న రూ.60 వేలు, నవంబర్ 12, 2012న రూ.32 వేలు డ్రా చేసినట్లు ఉంది. పర్దాన్‌గూడ పాఠశాలలో నిర్మాణాలు లేకుండానే రూ.2,387,50 నిధులు డ్రా చేశా రు. ఈ పాఠశాలలో కేవలం 17 మంది విద్యార్థులకు మండల పరిషత్, గిరిజన పాఠశాలు రెండు ఉండగా ఇద్దరు ఉపాధ్యాయులు ఉండడం గమనార్హం. మళ్లీ అదనపు గది నిర్మాణానికి నిధులు మంజూరు కావ డం అనుమానాలకు తావిస్తుంది. అందుగూలగూడలో రూ.2.50 లక్షలు, బారెగూడలో రూ.3 లక్షలు డ్రా చేసినట్లు సమాచారం. నిధులు డ్రా చేసి సంవత్సరం గడుస్తున్నా అధికారుల చర్యలు తీసుకోకపోవడం పలు అనుమానాలకు తావు ఇస్తుందనే విమర్శలు ఉన్నాయి. కాగా, నిధులు జమ అయిన సందర్భంలో ఎస్ఎంసీ కమిటీలు లేకపోవడతో డబ్బులు సదరు పాఠశాల ఖాతాలో జమ చేశారు. రెండు పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు జయింట్ అకౌంట్ ఇవ్వడంతో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా పర్దాన్‌గూడ పాఠశాల హెచ్ఎం మూడు పాఠశాలకు జాయింట్ ఖాతా ఉండటంతో అక్రమాలు చోటుచేసుకున్నట్లు తెలుస్తుంది. ఈ విషయమై స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎం ఉద్దవ్‌ను వివరణ కోరగా నిధులు డ్రా చేసిన ప్రధానోపాధ్యాయుల వేతనాలు నిలిపివేయాలని ఎంఈవో లేఖ ఇచ్చినట్లు తెలిపారు. ఈ విషయమై ఉన్నతాధికారులకు నివేదికలు అంద జేస్తానని తెలిపారు. సంబంధిత ఆర్వీఎం డీఈ మహేందర్‌ను వివరణ కోరగా ఈ విషయం మా దృష్టికి వచ్చిందని విచారణ చేపడుతామన్నారు. రూ.60 వేలు, నవంబర్ 12, 2012న రూ.32 వేలు డ్రా చేసినట్లు ఉంది. పర్దాన్‌గూడ పాఠశాలలో నిర్మాణాలు లేకుండానే రూ.2,387,50 నిధులు డ్రా చేశా రు. ఈ పాఠశాలలో కేవలం 17 మంది విద్యార్థులకు మండల పరిషత్, గిరిజన పాఠశాలు రెండు ఉండగా ఇద్దరు ఉపాధ్యాయులు ఉండడం గమనార్హం. మళ్లీ అదనపు గది నిర్మాణానికి నిధులు మంజూరు కావ డం అనుమానాలకు తావిస్తుంది. అందుగూలగూడలో రూ.2.50 లక్షలు, బారెగూడలో రూ.3 లక్షలు డ్రా చేసినట్లు సమాచారం. నిధులు డ్రా చేసి సంవత్సరం గడుస్తున్నా అధికారుల చర్యలు తీసుకోకపోవడం పలు అనుమానాలకు తావు ఇస్తుందనే విమర్శలు ఉన్నాయి. కాగా, నిధులు జమ అయిన సందర్భంలో ఎస్ఎంసీ కమిటీలు లేకపోవడతో డబ్బులు సదరు పాఠశాల ఖాతాలో జమ చేశారు. రెండు పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు జయింట్ అకౌంట్ ఇవ్వడంతో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా పర్దాన్‌గూడ పాఠశాల హెచ్ఎం మూడు పాఠశాలకు జాయింట్ ఖాతా ఉండటంతో అక్రమాలు చోటుచేసుకున్నట్లు తెలుస్తుంది. ఈ విషయమై స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎం ఉద్దవ్‌ను వివరణ కోరగా నిధులు డ్రా చేసిన ప్రధానోపాధ్యాయుల వేతనాలు నిలిపివేయాలని ఎంఈవో లేఖ ఇచ్చినట్లు తెలిపారు. ఈ విషయమై ఉన్నతాధికారులకు నివేదికలు అంద జేస్తానని తెలిపారు. సంబంధిత ఆర్వీఎం డీఈ మహేందర్‌ను వివరణ కోరగా ఈ విషయం మా దృష్టికి వచ్చిందని విచారణ చేపడుతామన్నారు. -
ద్రోన్ దాడులకు పాకిస్థాన్ గ్రీన్‌సిగ్నల్!
ఐక్యరాజ్యసమితి/ఇస్లామాబాద్: పాకిస్థాన్‌లోని అరాచక గిరిజన ప్రాంతాల్లో అమెరికా నిఘా సంస్థ సీఐఏ ద్రోన్ డాడులకు ఆ దేశ సైనిక ప్రభుత్వమే ఆమోదం తెలిపిందా? ఐక్యరాజ్యసమితి నివేదిక ఒకటి అవుననే సమాధానం ఇస్తోంది. ఇందుకు బలమైన సాక్ష్యాధారాలు కూడా ఉన్నట్లు ఆ నివేదిక కుండబద్ధలు కొడుతోంది. ఉగ్రవాదంపై పోరాటంలో మానవహక్కులు, ప్రాథమిక స్వేచ్ఛ పరిరక్షణ, ప్రోత్సాహంపై ఐక్యరాజ్యసమితి ప్రత్యేకంగా నియమించిన బెన్ ఎమ్మర్సన్ అధ్యయనం చేశారు. 2004-08 మధ్యకాలంలో పాక్ గిరిజన ప్రాంతాల్లో జరిగిన ద్రోన్ దాడులకు ఆ దేశ సైనిక ఉన్నతాధికారులతో పాటు ప్రభుత్వ ఆమోదం కూడా ఉందని తన నివేదికలో ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు 24 పేజీల నివేదికను ఆయన రూపొందించారు. ఇటీవల అమెరికా అధ్యక్షుడు ఒబామాతో భేటీ అయిన పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ తమ భూభాగంలో ద్రోన్ దాడులను ఆపాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలోనే ఇలాంటి దాడులకు పాక్ ప్రభుత్వమే అనుమతిచ్చిన విషయం వెలుగుచూసింది. ఒబామా, షరీఫ్‌ల భేటీ నేపథ్యంలో పాక్ గిరిజన ప్రాంతాల్లో ద్రోన్ దాడులు నిలిచిపోతాయని ఆ దేశం ఆశిస్తోంది. అంతర్జాతీయ నేర న్యాయస్థానం దృష్టికి ఈ దాడుల విషయం తీసుకెళ్లే అం శాన్ని పాక్ విదేశాంగ ప్రతినిధి తోసిపుచ్చారు. -
గిరిజన ప్రాంతాల్లో లీజుల రద్దు
సాక్షి, హైదరాబాద్: గిరిజన ప్రాంతాల్లో ఇప్పటివరకు మంజూరు చేసిన మైనింగ్ లీజులను పునఃసమీక్షించి వాటన్నింటినీ వెంటనే రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్ గిరిజన సలహా మండలి (ఏపీటీఏసీ) రాష్ట్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. గిరిజన సంక్షేమ మంత్రి పసుపులేటి బాలరాజు నేతృత్వంలో మంగళవారం జరిగిన టీఏసీ సమావేశంలో ఈ మేరకు ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించారు. సమావేశానికి గిరిజన ఎమ్మెల్యేలు ఆత్రం సక్కు, ఊకె అబ్బయ్య, కుంజా సత్యవతి, ధనసరి అనసూయ, రాజన్నదొర, సత్యనారాయణరెడ్డి, మిత్రసేన, నిమ్మక సుగ్రీవులు, నగేశ్ హాజరయ్యారు. గిరిజన ప్రాంతాల్లోని బాక్సైట్, లేటరైట్ మైనింగ్ లీజు లపై వాడివేడి చర్చ జరిగింది. అధికారులు గిరిజన హక్కులను కాలరాస్తూ.. లీజుల పేరిట భూములిచ్చి బినామీలు దోచుకునేందుకు దోహదపడుతున్నారని ఎమ్మెల్యేలు సక్కు, అబ్బయ్య, రాజన్నదొర ఆరోపించారు. లీజు కింద వస్తున్న రాయల్టీ ఎవరి అభివృద్ధి కోసం ఖర్చు పెడుతున్నారని ప్రశ్నించారు. లీజులన్నింటినీ రద్దు చేయాలని కేంద్ర మంత్రి కిశోర్‌చంద్రదేవ్ స్వయంగా లేఖ రాశాక కూడా లీజుకు అనుమతి ఎందుకిచ్చారని నిలదీశారు. మైనింగ్ లీజులకు 5 కిలోమీటర్ల పరిధిలో గిరిజన ఆవాసాలే లేవని అధికారులు చెబుతున్న మాటల్లో వాస్తవం లేదన్నారు. ఖనిజాల తవ్వకాలకోసం బినామీలకు లీజుకివ్వకుండా స్థానిక గిరిజనులను ప్రోత్సహించి, వారితో పరిశ్రమలు పెట్టించి ఉపాధి కల్పించేలా చర్యలు ఎందుకు తీసుకోవట్లేదని ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో సభ్యులందరి ఏకగ్రీవ ఆమోదంతో గిరిజన ప్రాంతాల్లోని లీజుల న్నింటినీ రద్దు చేయాలని సమావేశం తీర్మానించింది. సబ్‌ప్లాన్ పనుల్లో ఎమ్మెల్యేలకు ప్రాధాన్యం.. ఎస్టీ ఉపప్రణాళిక చట్టం కాంట్రాక్టర్లకు చుట్టంగా మారిందని సభ్యులు ధ్వజమెత్తారు. స్థానిక ఎమ్మెల్యేల ప్రమేయం లేకుండా పనుల ప్రతిపాదనలను పంపి వాటికి ఆమోదం తెలుపుతున్నారని పేర్కొన్నారు. ఇక నుంచి సబ్‌ప్లాన్ కింద చేపట్టే పనుల్లో స్థానిక ఎమ్మెల్యేలకు ప్రాధాన్యం ఇవ్వాలని, వారి సిఫారసు మేరకే పనుల ప్రతిపాదనలు రూపొందించాలంటూ తీర్మానించారు. ఇక ‘మందుల’ కులాన్ని ఎస్టీల జాబితా లో చేర్చాలనే అధికారుల ప్రతిపాదనను సమావేశం నిర్ద్వంద్వంగా తిరస్కరించింది. ముందు ఎస్టీలలో ఉన్న గిరిజనుల జీవన పరిస్థితులు చక్కదిద్దాకే, కొత్త కులాలను చే ర్చే విషయం ఆలోచిద్దామని సభ్యులు చెప్పారు. సభ్యుల అభిప్రాయాలతో మంత్రి కూడా ఏకీభవించడంతో మందుల కులాన్ని ఎస్టీ జాబితాలో చేర్చేందుకు అంగీకరించవద్దని, మున్ముందు ఇలాంటి ప్రతిపాదనలను ప్రోత్సహించవద్దని తీర్మానించారు. ఎమ్మెల్యేలు సత్యవతి రాథోడ్, సుమన్‌రాథోడ్, తెల్లం బాలరాజును కూడా ప్రత్యేక ఆహ్వానితులుగా టీఏసీ సమావేశాలకు అహ్వానించాలని తీర్మానించారు. గిరిజన హక్కులు కాలరాస్తున్నారు: బాలరాజు సమావేశానంతరం మంత్రి బాలరాజు మీడియాతో మాట్లాడుతూ.. గిరిజనుల భవిష్యత్తు తరాల ప్రయోజనాలదృష్ట్యా గిరిజన ప్రాంతాల్లోని మైనింగ్ లీజుల ను రద్దు చేయాలని తీరానించినట్లు చెప్పారు. రాష్ట్రం లో గిరిజన అభివృద్ధి మండలి ఏర్పాటు చేయాలని, జీసీసీ ఉద్యోగులందరినీ ప్రభుత్వ ఉద్యోగులుగా గు ర్తించాలని, 800 గ్రామాలను షెడ్యూలు ఏరియాలో నోటిఫై చేయాలని కూడా తీర్మానించినట్లు చెప్పారు. -
పోడు భూములకు పట్టాలిచ్చేంత వరకు.. పోరాటం సాగించాలి
ఖమ్మం కలెక్టరేట్, న్యూస్‌లైన్: పోడు భూములకు పట్టాలు ఇచ్చేంతవరకు పోరాటం సాగించాలని కొత్తగూడెం ఎమ్మెల్యే, సీపీఐ శాసన సభాపక్ష ఉప నేత కూనంనేని సాంబశివరావు కోరారు. గిరిజనులు సాగు చేసుకుంటున్న పోడు భూములకు పట్టాలివ్వాలని, పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, ఐటీసీకి భూకేటాయింపు రద్దు చేయాలని తదితర డిమాండ్లతో సీపీఐ ఆధ్వర్యంలో ఖమ్మంలో శనివారం ప్రదర్శన, కలెక్టరేట్ ఎదుట ధర్నా జరి గాయి. ధర్నానుద్దేశించి కూనంనేని మాట్లాడుతూ.. ‘పోడు భూములు లాక్కోవడానికి అధికారులు వస్తే తిరగబడండి. కేసులైనా అవుతాయి.. భూములైనా దక్కుతాయి’ అన్నారు. ‘జానెడు జాగా కోసం నిరుపేదలు ఉద్యమిస్తున్నా, పోడు భూములకు పట్టాలు కావాలని 50వేల మంది గిరిజనులు ఆందోళన కొనసాగిస్తున్నా ప్రభుత్వం ఏమాత్రం స్పందించడం లేదు. అదే సమయంలో.. ఐటీసీ వంటి బడా కంపెనీలకు వేల ఎకరాల భూములను అక్రమంగా కట్టబెడుతోంది’ అని ధ్వజమెత్తారు. పోడు భూముల్లో గిరిజనులు సాగు చేసిన పంటలను అటవీ అధికారులు ధ్వంసం చేస్తున్నారని విమర్శించారు. భూములను కాపాడుకునేందుకు తిరగబడాలని కోరారు. ‘పోడు భూముల నుంచి గిరిజనులను తొలగించేందుకుగాను అటవీ శాఖాధికారులకు తుపాకులు ఇచ్చేందుకు ప్రభుత్వం చట్టం తెస్తుందట. తుపాకులతో పాకిస్తాన్, అమెరికాపై యుద్ధం చేయలేని ప్రభుత్వం.. పేదలపై ప్రతాపం చూపిస్తుందట’ అని ఎద్దేవా చేశారు. ‘మీకు తుపాకులు ఉంటే.. మాకు ధైర్యం ఉంది. మీకు జైలు ఉంటే... దానిని బద్దలు కొట్టే దమ్ము మాకుంది’ అని ఉద్వేగంగా అన్నారు. తెలంగాణ సాధన కోసం సీపీఐ రంగంలోకి దిగిన తర్వాతనే ప్రజల్లో ఒక విశ్వాసం ఏర్పడిందని అన్నా రు. తెలంగాణ ఏర్పడిన తరువాత కూడా అందరికీ ఉద్యోగాలు, నీరు, పరిశ్రమలు, ఉపాధి, పోడు భూ ములకు పట్టాలు, ఇళ్ల స్థలాలు, విద్యావకాశాలు వచ్చేలా సీపీఐ పోరాడుతుందని అన్నారు. పార్టీ జిల్లా కార్యదర్శి భాగం హేమంతరావు, కార్యదర్శివర్గ సభ్యులు మహ్మద్ మౌలానా, యర్రా బాబు, పోటు కళావతి తదితరులు కూడా మాట్లాడారు. ధర్నా అనంతరం, జిల్లా రెవెన్యూ అధికారి శివ శ్రీని వాస్కు నాయకులు వినతిపత్రం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు అయోధ్య, జాన్మి యా, జితేందర్‌రెడ్డి, మేకల సంగయ్య, జక్కుల లక్ష్మ య్య, పోటు ప్రసాద్, మండె వీరహనుమంతరావు, యలమద్ది కృష్ణ, మహ్మద్ సలాం, మేకల శ్రీనివాస్, సైదా, లక్ష్మీకుమా రి, తాటి వెంకటేశ్వర్లు, నరసింహా రావు, కర్ణకుమార్, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. -
పోడు... పోరు
కొత్తగూడెం, న్యూస్‌లైన్: కామ్రేడ్లు కదం తొక్కారు. పోడు భూములపై గిరిజనులకు హక్కులు కల్పించాలంటూ నినదించారు. కొత్తగూడెంలో శుక్రవారం భారీ ర్యాలీ నిర్వహించారు. సుమారు మూడు వేల మంది ఈ నిరసన ప్రదర్శనలో పాల్గొన్నారు. మార్కెట్ యార్డు నుంచి ప్రారంభమైన ర్యాలీ పట్టణంలోని ప్రధాన రహదారి మీదుగా సాగింది. ఆర్డీఓ కార్యాలయానికి చేరుకున్న నిరసనకారులు అక్కడ ధర్నా నిర్వహించారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిద్ధి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ పోడు సాగుదారులపై నిర్భందాలు నిలిపివేయాలని డిమాండ్ చేశారు. లేదంటే ప్రతిఘటన తప్పదని హెచ్చరించారు. రాష్ట్రంలో 70 లక్షల ఎకరాల మిగులు భూమి ఉందని, దీనిని నిరుపేదలకు పంపిణీ చేయాలని అన్నారు. కోనేరు కమిటీ సిపారసులను అమలు చేయాలన్నారు. అడ్డూఅదుపు లేకుండా నిత్యావసర వస్తువుల ధరలు పెంచుతూ ప్రభుత్వం సామాన్యులపై పెనుభారం వేస్తోందని విమర్శించారు.ప్రజలు సంఘటితంగా ఉద్యమించి హక్కులను సాధించుకోవాలన్నారు. కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ అడవిని నమ్ముకుని బతుకుతున్న గిరిజనులకు పోడు భూములు సాగు చేసుకునే హక్కు ఉందన్నారు. పోడు భూముల్లో సాగుచేసే వారికే హక్కు పత్రాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పోడు చేసే వారిపై అటవీ, పోలీస్, రెవెన్యూ శాఖల అధికారులు అక్రమ కేసులు బనాయిస్తున్నారని విమర్శించారు. దున్నేవాడిదే భూమి అనే నినాదంతో సీపీఐ పోరాడుతోందన్నారు. గిరిజనులను పోడుభూమి నుంచి ఎవ్వరూ విడదీయలేరన్నారు. తుపాకులు పట్టుకుని వచ్చినా గిరిజనులను ఏమీ చేయలేరన్నారు. ఎన్ని కేసులు పెట్టినా పేదవారికి తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. పోలీసులకు, తూటాలకు భయపడేది లేదన్నారు. తెలంగాణ ఏర్పాటును కేంద్ర కేబినేట్ ఆమోదించడం హర్షణీయమన్నారు. రానున్న ఎన్నికలు ప్రత్యేక రాష్ట్రంలోనే జరుగుతాయన్నారు. వెయ్యి మంది బలిదాలు చేసిన తర్వాతే కాంగ్రెస్‌కు కన్నువిప్పు కలిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు తెలంగాణ గుర్తుకొచ్చిందని వ్యాఖ్యానించారు. పోరాటాల ద్వారానే తెలంగాణ వచ్చిందని, కాంగ్రెస్ ఇచ్చిందేమీ లేదని అన్నారు. వితంతువులకు, వికలాంగులకు రూ.3 వేలు పింఛన్ అందించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి భాగం హేమంతరావు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి తాటి వెంకటేశ్వర్లు, సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి ఎస్.కె.సాబీర్‌పాషా, ఏపూరి బ్రహ్మం, దొండపాటి రమేష్, మునీర్, డీసీసీబీ డెరైక్టర్ మండే వీరహనుమంతరావు, బరిగెల సాయిలు, బందెల నర్సయ్య, సలిగంటి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
అవగాహనతోనే వ్యాధులు దూరం
ఉట్నూర్, న్యూస్‌లైన్ : గిరిజన ప్రాంతాల్లో ప్రబలుతున్న వ్యాధులపై ప్రజలకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పిస్తేనే తగ్గించవచ్చని జాతీయ కీటక జని త రోగ నియంత్రణ కార్యక్రమం (ఎన్వీబీడీసీపీ) రాష్ట్ర అదనపు సంచాలకులు చంపానాయక్ అ న్నారు. కేబీ ప్రాంగణంలో మూ డు రోజులుగా వైద్యసిబ్బందికి నిర్వహిస్తున్న ఎన్వీబీడీసీపీ శిక్షణ కార్యక్రమాన్ని శుక్రవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వర్షాకాలం వ చ్చిందంటే పారిశుధ్యం, శానిటేష న్ లోపించి వ్యాధి కారక జీవులు వృద్ధి చెందుతాయన్నారు. దోమ ల నివారణకు బెటైక్ స్ప్రే చేయిం చాలన్నారు. జ్వర బాధితులకు మలేరియా పరీక్షలు జరపాలని, పాజిటివ్ అని తేలితే వెంటనే చికి త్స అందించాలని సూచించారు. వారి వివరాలు సేకరించి తర్వాతి రోజుల్లోనూ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీయాలని పేర్కొన్నారు. గ్రామాల్లో మురుగు నీటి కాల్వలు లేకుండా చర్యలు చేపట్టాలన్నారు. తాగునీటి వనరుల్లో ఎప్పకప్పుడు క్లోరినేషన్ చేయాలని సూచించా రు. కార్యక్రమంలో మలేరియాధికారి అల్హం రవి, ఎన్వీబీడీసీపీ ఉప సంచాలకులు రత్నా జోసెఫ్, కీటక జనిత వ్యాధుల నివారణ అవగాహన అధికారి నరహరి, 17 క్లస్టర్ల సబ్ యూనిట్ అధికారులు, ఎంటీసీలు తదితరులు పాల్గొన్నారు.