ఖమ్మం కలెక్టరేట్, న్యూస్‌లైన్: పోడు భూములకు పట్టాలు ఇచ్చేంతవరకు పోరాటం సాగించాలని కొత్తగూడెం ఎమ్మెల్యే, సీపీఐ శాసన సభాపక్ష ఉప నేత కూనంనేని సాంబశివరావు కోరారు. గిరిజనులు సాగు చేసుకుంటున్న పోడు భూములకు పట్టాలివ్వాలని, పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, ఐటీసీకి భూకేటాయింపు రద్దు చేయాలని తదితర డిమాండ్లతో సీపీఐ ఆధ్వర్యంలో ఖమ్మంలో శనివారం ప్రదర్శన, కలెక్టరేట్ ఎదుట ధర్నా జరి గాయి. ధర్నానుద్దేశించి కూనంనేని మాట్లాడుతూ.. ‘పోడు భూములు లాక్కోవడానికి అధికారులు వస్తే తిరగబడండి. కేసులైనా అవుతాయి.. భూములైనా దక్కుతాయి’ అన్నారు. ‘జానెడు జాగా కోసం నిరుపేదలు ఉద్యమిస్తున్నా, పోడు భూములకు పట్టాలు కావాలని 50వేల మంది గిరిజనులు ఆందోళన కొనసాగిస్తున్నా ప్రభుత్వం ఏమాత్రం స్పందించడం లేదు.
అదే సమయంలో.. ఐటీసీ వంటి బడా కంపెనీలకు వేల ఎకరాల భూములను అక్రమంగా కట్టబెడుతోంది’ అని ధ్వజమెత్తారు. పోడు భూముల్లో గిరిజనులు సాగు చేసిన పంటలను అటవీ అధికారులు ధ్వంసం చేస్తున్నారని విమర్శించారు. భూములను కాపాడుకునేందుకు తిరగబడాలని కోరారు. ‘పోడు భూముల నుంచి గిరిజనులను తొలగించేందుకుగాను అటవీ శాఖాధికారులకు తుపాకులు ఇచ్చేందుకు ప్రభుత్వం చట్టం తెస్తుందట. తుపాకులతో పాకిస్తాన్, అమెరికాపై యుద్ధం చేయలేని ప్రభుత్వం.. పేదలపై ప్రతాపం చూపిస్తుందట’ అని ఎద్దేవా చేశారు. ‘మీకు తుపాకులు ఉంటే.. మాకు ధైర్యం ఉంది. మీకు జైలు ఉంటే... దానిని బద్దలు కొట్టే దమ్ము మాకుంది’ అని ఉద్వేగంగా అన్నారు.
తెలంగాణ సాధన కోసం సీపీఐ రంగంలోకి దిగిన తర్వాతనే ప్రజల్లో ఒక విశ్వాసం ఏర్పడిందని అన్నా రు. తెలంగాణ ఏర్పడిన తరువాత కూడా అందరికీ ఉద్యోగాలు, నీరు, పరిశ్రమలు, ఉపాధి, పోడు భూ ములకు పట్టాలు, ఇళ్ల స్థలాలు, విద్యావకాశాలు వచ్చేలా సీపీఐ పోరాడుతుందని అన్నారు. పార్టీ జిల్లా కార్యదర్శి భాగం హేమంతరావు, కార్యదర్శివర్గ సభ్యులు మహ్మద్ మౌలానా, యర్రా బాబు, పోటు కళావతి తదితరులు కూడా మాట్లాడారు. ధర్నా అనంతరం, జిల్లా రెవెన్యూ అధికారి శివ శ్రీని వాస్‌కు నాయకులు వినతిపత్రం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు అయోధ్య, జాన్‌మి యా, జితేందర్‌రెడ్డి, మేకల సంగయ్య, జక్కుల లక్ష్మ య్య, పోటు ప్రసాద్, మండె వీరహనుమంతరావు, యలమద్ది కృష్ణ, మహ్మద్ సలాం, మేకల శ్రీనివాస్, సైదా, లక్ష్మీకుమా రి, తాటి వెంకటేశ్వర్లు, నరసింహా రావు, కర్ణకుమార్, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
పోడు భూములకు పట్టాలిచ్చేంత వరకు.. పోరాటం సాగించాలి
Published Sun, Oct 6 2013 5:13 AM | Last Updated on Fri, Sep 1 2017 11:22 PM
Advertisement