గిరిజన ప్రాంతాల్లో ప్రబలుతున్న వ్యాధులపై ప్రజలకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పిస్తేనే తగ్గించవచ్చని జాతీయ కీటక జని త రోగ నియంత్రణ కార్యక్రమం (ఎన్‌వీబీడీసీపీ) రాష్ట్ర అదనపు సంచాలకులు చంపానాయక్ అ న్నారు
ఉట్నూర్, న్యూస్‌లైన్ : గిరిజన ప్రాంతాల్లో ప్రబలుతున్న వ్యాధులపై ప్రజలకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పిస్తేనే తగ్గించవచ్చని జాతీయ కీటక జని త రోగ నియంత్రణ కార్యక్రమం (ఎన్‌వీబీడీసీపీ) రాష్ట్ర అదనపు సంచాలకులు చంపానాయక్ అ న్నారు. కేబీ ప్రాంగణంలో మూ డు రోజులుగా వైద్యసిబ్బందికి నిర్వహిస్తున్న ఎన్‌వీబీడీసీపీ శిక్షణ కార్యక్రమాన్ని శుక్రవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వర్షాకాలం వ చ్చిందంటే పారిశుధ్యం, శానిటేష న్ లోపించి వ్యాధి కారక జీవులు వృద్ధి చెందుతాయన్నారు.
దోమ ల నివారణకు బెటైక్ స్ప్రే చేయిం చాలన్నారు. జ్వర బాధితులకు మలేరియా పరీక్షలు జరపాలని, పాజిటివ్ అని తేలితే వెంటనే చికి త్స అందించాలని సూచించారు. వారి వివరాలు సేకరించి తర్వాతి రోజుల్లోనూ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీయాలని పేర్కొన్నారు. గ్రామాల్లో మురుగు నీటి కాల్వలు లేకుండా చర్యలు చేపట్టాలన్నారు. తాగునీటి వనరుల్లో ఎప్పకప్పుడు క్లోరినేషన్ చేయాలని సూచించా రు. కార్యక్రమంలో మలేరియాధికారి అల్హం రవి, ఎన్‌వీబీడీసీపీ ఉప సంచాలకులు రత్నా జోసెఫ్, కీటక జనిత వ్యాధుల నివారణ అవగాహన అధికారి నరహరి, 17 క్లస్టర్ల సబ్ యూనిట్ అధికారులు, ఎంటీసీలు తదితరులు పాల్గొన్నారు.