గిరిజనేతరుల రుణమాఫీకి వంద కోట్లు: సీఎం | loan waiver scheme to be applicable for Tribals, says KCR | Sakshi
Sakshi News home page

గిరిజనేతరుల రుణమాఫీకి వంద కోట్లు: సీఎం

Published Tue, Nov 11 2014 2:08 AM | Last Updated on Wed, Aug 15 2018 9:22 PM

గిరిజనేతరుల రుణమాఫీకి వంద కోట్లు: సీఎం - Sakshi

గిరిజనేతరుల రుణమాఫీకి వంద కోట్లు: సీఎం

సాక్షి, హైదరాబాద్: ఖమ్మం, వరంగల్, ఆదిలాబాద్  జిల్లాల్లోని గిరిజన ప్రాంతాల్లో ఉండే గిరిజనేతరులకు రుణమాఫీ వర్తింప చేస్తామని, అందుకోసం  రూ. 100 కోట్లు కేటాయిస్తానని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు హామీయిచ్చారు. సోమవారం అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో టీడీపీ సభ్యుడు సండ్ర వెంకటవీరయ్య అడిగిన ప్రశ్నకు సీఎం ఈ హామీ ఇచ్చారు. బంగారం రుణాలకు గాను ప్రభుత్వం డబ్బు చెల్లించినా బ్యాంకులు ఆ బంగారాన్ని ఆడపడుచులకు ఇవ్వడంలేదని రేవంత్‌రెడ్డి (టీడీపీ) చెప్పగా, విడిపించే ప్రయత్నం చేస్తామని కేసీఆర్ బదులిచ్చారు. సమావేశాలు ముగిసేలోగా కరవు మండలాలను ప్రకటిస్తామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement