అవార్డు రావడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది
సీఎంకు పురస్కారంపై జీవన్‌రెడ్డి ఎద్దేవా
సాక్షి, జగిత్యాల: సీఎం కేసీఆర్‌కు అగ్రికల్చర్ లీడర్ షిప్ పురస్కారం రావడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని సీఎల్పీ ఉపనేత తాటిపర్తి జీవన్‌రెడ్డి అన్నారు. ఆదివారం జగిత్యాలలో ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణలో పెట్టుబడులు లేక.. పంటకు గిట్టుబాటు ధర లభించక.. పంట రుణాలు.. రుణమాఫీ అందక వ్యవసాయ రంగం కుదేలైందన్నా రు. అయినప్పటికీ కేసీఆర్‌ను కేంద్ర పురస్కారానికి ఎంపిక చేయడాన్ని పరిశీలిస్తే.. దేశంలోని మిగతా రాష్ట్రాల్లో కేంద్ర వ్యవసాయ విధానం అమలు తీరు ఎలా ఉందో అర్థమవుతోందన్నారు. పంటకు గిట్టుబా టు ధర కల్పించాల్సిన బాధ్యత కేంద్రాని దన్నారు.
వైఎస్‌ఆర్ సీఎంగా ఉన్న సమయంలో రైతులకు ఉచిత విద్యుత్.. మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఐకేపీ కొనుగోలు కేంద్రాల ఏర్పాటు.. సకాలంలో రుణాలు చెల్లించిన రైతులకు రూ.5 వేల ప్రోత్సాహకం.. పప్పు దినుసులకు రూ. 200, వరికి రూ. 50 బోనస్ కల్పించి రైతులకు భరోసా ఇచ్చామని గుర్తు చేశారు.