పర్యాటకులను ఆకర్షిస్తున్న గిరిప్రియ వంతెన
సాక్షి, సీలేరు: ప్రకృతి కాంతకు ఎన్నెన్ని హోయలో.. పదము కదిపితే ఎన్నెన్ని లయలో.. అందమైన భానోదయాలు.. ఆహ్లాదకరమైన సాయంత్రాలు.. పచ్చని కొండల్ని పెనవేసుకుపోయిన మంచు తెరలు.. ధవళ కాంతులతో మెరిసిపోయే జలపాతాలు.. సెలయేళ్లు.. అడుగడుగునా అందాలు ఆవిష్కృతమయ్యే ఆ మనోహర లోకం విశాఖ మన్యం. శీతాకాలం కావడంతో సీలేరు పరిసర ప్రాంతాల్లో దట్టంగా కురుస్తున్న మంచువానతో ప్రకృతి కనువిందు చేస్తోంది. తెల్లవారుజామున సూర్యోదయం నుంచి సాయంత్రం సంధ్యవేళ వరకు ప్రకృతి ఆవిష్కరించే అందాలు పర్యాటకుల్ని పరవశింపజేస్తున్నాయి.
సాయంత్రం సంధ్య వేళ బలిమెల జలాశయం
సీలేరు గుంటవాడ, బలిమెల జలాశయాల్లో పడమటి సంధ్యారాగం మధురాతి మధురం. ఆంధ్రా–ఒడిశా సరిహద్దుల్లో డుడుమ జలపాతం మైమరపిస్తే.. రెండు కొండల మధ్య నుంచి పొగమంచు పర్యాటకులను ఆహా్వనిస్తుంటుంది. అదే సమీప ప్రాంతంలో గిరిప్రియ వంతెన కూడా కనువిందు చేస్తుంది. శీతాకాలం కావడంతో రాష్ట్రం నలుమూలల నుంచి ఇక్కడి ప్రకృతి అందాలను వీక్షించేందుకు పర్యాటకులు అధిక సంఖ్యలో తరలి వస్తున్నారు.
సీలేరులో అందమైన శుభోదయం
తెల్లారుజామున మంచు తెరల్లో సీలేరు జలాశయం
డుడుమ జలపాతం వద్ద మంచు అందాలు
Comments
Please login to add a commentAdd a comment