ప్రైవేటు సెక్యూరిటీలోకి గిరిజనులు: క్యాప్సీ
హైదరాబాద్: ప్రైవేటు సెక్యూరిటీ రంగం ఇప్పుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని గిరిజన ప్రాంతాలపై దృష్టిసారించింది. సెక్యూరిటీ గార్డులుగా గిరిజన యువతను నియమించుకుంటామని సెంట్రల్ అసోసియేషన్ ఆఫ్ ప్రైవేట్ సెక్యూరిటీ ఇండస్ట్రీ (కా్యిప్సీ) చైర్మన్ కున్వర్ విక్రమ్ సింగ్ తెలిపారు. గిరిజనుల్లో చక్కని పనితనం ఉందని అన్నారు. ప్రైవేటు గార్డులకు పెరుగుతున్న డిమాండ్ నేపథ్యంలో మానవ వనరుల కొరతను అధిగమించొచ్చని తెలిపారు. క్యాప్సి పైలట్ ప్రాజెక్టు కింద వందలాది మంది జార్ఖండ్ యువతులకు శిక్షణ ఇచ్చినట్టు చెప్పారు. కేంద్ర ప్రభుత్వ స్టార్ పథకం కింద సుమారు 30,000 మంది గిరిజన యువత శిక్షణ పొందారని పేర్కొన్నారు.