Tribal MLAs
-
సీఎం వైఎస్ జగన్‌ను కలిసిన గిరిజన ప్రాంత ఎమ్మెల్యేలు
-
సీఎం వైఎస్ జగన్‌ను కలిసిన గిరిజన ప్రాంత ఎమ్మెల్యేలు
సాక్షి, అమరావతి: శాసనసభలో సీఎం కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని సోమవారం అసెంబ్లీలో గిరిజన ప్రాంత ఎమ్మెల్యేలు కలిశారు. గిరిజన ప్రాంతాల అభివృద్ధి కార్యక్రమాలపై సీఎంతో చర్చించారు. ఉప ముఖ్యమంత్రి (గిరిజన సంక్షేమశాఖ) పాముల పుష్పశ్రీవాణి, సాలూరు ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర, పాలకొండ ఎమ్మెల్యే విశ్వసరాయి కళావతి, రంపచోడవరం ఎమ్మెల్యే నాగులాపల్లి ధనలక్ష్మి, పాడేరు ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి, అరకు ఎమ్మెల్యే శెట్టి ఫల్గుణ, పాతపట్నం ఎమ్మెల్యే రెడ్డి శాంతి హాజరయ్యారు. చదవండి: అనుచిత ప్రవర్తన.. స్పీకర్‌పై పేపర్లు విసిరిన టీడీపీ సభ్యులు -
గిరిజన ప్రాంతాల్లోని సమస్యల్ని వెంటనే పరిష్కరించాలి: సీఎం జగన్
సాక్షి, అమరావతి: గిరిజన ఎమ్మెల్యేల నియోజక వర్గాల్లో అభివృద్ధిపనులు, స్థానిక సమస్యలను పరిష్కరించాలని కోరుతూ.. డిప్యూటి సీఎం పుష్పశ్రీవాణి, గిరిజన ఎమ్మెల్యేలు పీడిక రాజన్న దొర, తెల్లం బాలరాజు, విశ్వసరాయి కళావతి, తదితరులు శాసన సభలోని కార్యాలయంలో.. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిశారు. దీనిపై స్పందించిన సీఎం జగన్.. గిరిజన ప్రాంతాల అభివృద్ధికి అవసరమైన అన్నిచర్యలు తీసుకోవాలని సీఎంవో అధికారును ఆదేశించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న రోడ్లు, బ్రిడ్జిల నిర్మాణానికి సంబంధించిన అంశాలు, కరోనా సమయంలో ఆగిపోయిన రోడ్ల నిర్మాణం,ఎత్తైన కొండ ప్రాంతాల్లో నిర్మిస్తున్న రహదారులను మెషిన్స్ ద్వారా చేయడానికి అవసరమైన అనుమతులు, కొండ ప్రాంతాల్లోకి వెళ్లేందుకు అవసరమైన రైస్ వ్యాన్స్, మెరుగైన ఇంటర్నెట్ సౌకర్యం వంటి పలు అంశాలను సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లారు. అదేవిధంగా... జీవో నంబర్ 3 పై న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ అధికారులను సూచించారు. షెడ్యూల్డ్ ఏరియాలో చేర్చని గ్రామాలను కూడా చేర్చడం కొరకు.. రానున్న అసెంబ్లీలో సమావేశాలలో తీర్మానం చేయనున్నట్లు సీఎం జగన్ వెల్లడించారు. కాగా, గిరిజన ప్రాంతాల్లోని సమస్యలన్నింటిని వెంటనే పరిష్కరించాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. -
ఆంధ్రజ్యోతిపై కేసు వేస్తాం
వైఎస్సార్సీపీ గిరిజన ఎమ్మెల్యేల మండిపాటు ఘసాక్షి ప్రతినిధి, విశాఖపట్నం/పాలకొండ రూరల్/కురుపాం : ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి రామ్‌నాథ్ కోవింద్ పరిచయ కార్యక్రమంలో ప్రతిపక్ష నేత, వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి దళిత, గిరిజన ఎమ్మెల్యేలపై ఆగ్రహం ప్రదర్శించారంటూ ఆంధ్రజ్యోతి పత్రికలో బుధవారం వచ్చిన కథనంపై వైఎస్సార్సీపీ గిరిజన ఎమ్మెల్యేలు తీవ్రంగా మండిపడ్డారు. దళితుడైన రామ్‌నాథ్ కోవింద్‌కు జగన్ పాదాభివందనం చేయడం కూడా ఆ పత్రిక సహించలేకపోయిందని, అందుకే ఇంతలా విషం కక్కిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. క్షమాపణలు చెప్పకపోతే ఆ పత్రికపై ఎస్సీ, ఎస్టీ కేసు వేస్తామని హెచ్చరించారు. ఇంత అన్యాయంగా, దారుణంగా అబద్ధాలు ఎలా రాస్తారని పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి, పాలకొండ, కురుపాం ఎమ్మెల్యేలు కళావతి, పుష్పశ్రీవాణి ప్రశ్నించారు. బుధవారం వారు వేర్వేరుగా మీడియాతో మాట్లాడారు. రాష్ట్రపతి అభ్యర్థి రామ్‌నాథ్ కోవింద్ కు తమను పేరు పేరునా జగన్ పరిచయం చేశారని ఆమె తెలిపారు. జగనే వెంకయ్యను కలవమన్నారు కేంద్రమంత్రి వెంకయ్యనాయుడుతో తాము ఫొటోలు దిగడాన్ని జగన్ జీర్ణించుకోలేకపోయారని రాయడం దుర్మార్గమని ఈశ్వరి అన్నారు. గిరిజన టీచర్లకూ ఏకీకృత సర్వీస్ రూల్స్ వర్తింపు కోరుతూ వెంకయ్యకు వినతిపత్రం ఇవ్వాలా వద్దా అని తాము సంశయించి.. ఇదే విషయం అధినేత జగన్ దృష్టికి తీసుకువెళ్తే, వెంకయ్యనాయుడు గారికి ఇవ్వండమ్మా అని ఆయనే పురమాయించారని చెప్పారు.