
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి ఎస్టీ అని విచారణ కమిటీ తేల్చింది. ఆమె ఎస్టీ కొండదొర కులానికి చెందినవారని నిర్థారించింది. పొందుపరిచిన కులం నిజమేనని డీఎల్‌ఎస్‌సీ ప్రకటించింది. కాగా, ఉప ముఖ్యమంత్రి శ్రీవాణి కులంపై లాయర్ రేగు మహేష్ పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. దీనిపై విచారణ జరిపిన కోర్టు విచారణ జరపాలని ప.గో.జిల్లా డీఎల్‌ఎస్‌సీకి సూచించింది. విచారణ నివేదికను జిల్లా కలెక్టర్‌కు ఇవ్వాలని ఆదేశించింది. కోర్టు సూచనతో డీఎల్‌ఎస్‌సీ ఛైర్మన్ పుష్ప శ్రీవాణి కులంపై జిల్లా స్థాయి నిర్థారణ కమిటీ ఆధ్వర్యంలో విచారణ జరిపారు. శ్రీవాణి నిజమైన ఎస్టీ కొండదొర కులస్తురాలని విచారణలో తేలింది. నివేదిక ఆధారంగా కలెక్టర్ కార్తికేయ మిశ్రా ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment