
సాక్షి, అమరావతి: గిరిజన సంక్షేమశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి గిరిజన గ్రామాల హెల్త్ వర్కర్ల వేతనాలు 400 నుండి 4 వేలకు పెంచుతూ తొలి సంతకం చేసింది. ఈ కార్యక్రమంలో మంత్రి బొత్స సత్యనారాయణ, ఎమ్మెల్యేలు కోలగట్ల, భాగ్యలక్ష్మి, జోగరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. 'గిరిజన సంక్షేమ శాఖ లో పారదర్శకమయున పాలన అందించి, జగన్మోహన్ రెడ్డి నమ్మకాన్ని నిలబెట్టుకుంటా' అన్నారు. గిరిజనులకి ఇచ్చిన ప్రతి ప్రభుత్వ పథకాన్ని, హామీని నెరవేర్చి గిరిజనుల ఆత్మ గౌరవాన్ని, ఆత్మ విశ్వాసాన్ని పెంపొందిస్తామన్నారు. గిరిజన ప్రాంతంలో విద్యావకాశాలు మెరుగుపర్చి, గిరిజన ఆడ పిల్లలకి వైఎస్సార్ పెళ్లికానుక కింద లక్ష రూపాయలు అందిస్తామన్నారు. గతంలో చంద్రబాబు గిరిజనులని అంటరాని వారిగా చూసి మంత్రి పదవి ఇవ్వలేదని, గిరిజనులని ఉప ముఖ్యమంత్రి చేసిన జగన్మోహన్ రెడ్డి చరిత్రలో నిలిచిపోతారన్నారు.
Comments
Please login to add a commentAdd a comment