tribal welfare minister
-
ఎప్పుడు ఏం చేయాలో ఆయనకు బాగా తెలుసు : ఎంపీ
సాక్షి, మహబూబాబాద్ : ఆర్టీసీ కార్మికులు యూనియన్ నాయకుల ఉచ్చులో పడవద్దని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ విజఒప్తి చేశారు. మంగళవారం స్థానిక ఆర్అండ్బి అతిథి గృహంలో ఎంపీ మాలోతు కవితతో కలిసి ప్రెస్మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ‘తెలంగాణలో 91 కార్పొరేషన్లు ఉన్నాయి. ఒక్క ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తే అనేక సమస్యలు వస్తాయి. 5100 ప్రైవేటు బస్సులను ప్రవేశపెట్టింది ప్రజల ఇబ్బందులు తొలగించడానికే. గత ప్రభుత్వాలు చిరుద్యోగుల విషయంలో చేసిన అనేక తప్పులను సవరించి వారికి జీతాలు పెంచిన గొప్ప వ్యక్తి కేసీఆర్. సమ్మె చేయడానికి ఇది సరైన సమయ కాదు. నేటితో కార్మికులకు ఇచ్చిన గడువు ముగుస్తుంది. కార్మికులు వెంటనే విధుల్లో చేరాలి. ప్రజల మద్దతు ఆర్టీసీ కార్మికులకు లేదు అనడానికి హుజూర్నగర్ ఉప ఎన్నికలే నిదర్శనం. సీఎం ఎక్కడో ఉండి పిలుపునిచ్చినా ప్రజలు 43 వేల భారీ మెజార్టీతో గెలిపించారు. బీజేపీ రోడ్ల మీద చిల్లర రాజకీయాలు చేస్తోంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న ఏ రాష్ట్రంలోనూ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయలేదు. తహసీల్దార్ విజయారెడ్డి హత్యను ఖండిస్తున్నా. దోషులను కఠినంగా శిక్షిస్తామ’ని వెల్లడించారు. ఎంపీ కవిత మాట్లాడుతూ.. ఎంతో అనుభవం ఉన్న సీఎం కేసీఆరకు రాష్ట్ర ప్రజలకు ఎప్పుడు ఏం చేయాలో తెలుసని అభిప్రాయపడ్డారు. అశ్వత్థామ రెడ్డి కార్మికుల పుణ్యమా అని హైలెట్ అవుతున్నాడని విమర్శించారు. కేసీఆర్ పార్టీలను చూసి పనిచెయ్యడు. ప్రజలను చూసి పని చేస్తాడని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ బిందు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు ఇతర నాయకులు పాల్గొన్నారు. -
వైఎస్ జగన్ చరిత్రలో నిలిచిపోతారు: పుష్పశ్రీవాణి
సాక్షి, అమరావతి : గిరిజన శాఖ మంత్రిగా డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె ....గిరిజన గ్రామాల్లో ఆరోగ్య కార్యకర్తల వేతనాలను రూ.400 నుంచి రూ.4వేలకు పెంచుతూ తొలి సంతకం చేశారు. గిరిజన ప్రాంతాల్లో మార్కెట్ యార్డుల అభివృద్ధికి రూ.19 కోట్లు విడుదల చేస్తూ ఆమె రెండో సంతకం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. 'గిరిజన సంక్షేమ శాఖ లో పారదర్శక పాలన అందించి, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నమ్మకాన్ని నిలబెట్టుకుంటా' అన్నారు. గిరిజనులకి ఇచ్చిన ప్రతి ప్రభుత్వ పథకాన్ని, హామీని నెరవేర్చి గిరిజనుల ఆత్మ గౌరవాన్ని, ఆత్మ విశ్వాసాన్ని పెంపొందిస్తామన్నారు. గిరిజన ప్రాంతంలో విద్యావకాశాలు మెరుగుపరిచి, గిరిజన ఆడపిల్లలకి వైఎస్సార్ పెళ్లికానుక కింద లక్ష రూపాయలు అందిస్తామన్నారు. గతంలో చంద్రబాబు గిరిజనులని అంటరాని వారిగా చూసి మంత్రి పదవి ఇవ్వలేదని, గిరిజనులని ఉప ముఖ్యమంత్రి చేసిన జగన్మోహన్రెడ్డి చరిత్రలో నిలిచిపోతారన్నారు. -
గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా పుష్పశ్రీవాణి బాధ్యతల స్వీకరణ
-
హెల్త్ వర్కర్ల వేతనాలు 400 నుంచి 4 వేలకు పెంపు
సాక్షి, అమరావతి: గిరిజన సంక్షేమశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి గిరిజన గ్రామాల హెల్త్ వర్కర్ల వేతనాలు 400 నుండి 4 వేలకు పెంచుతూ తొలి సంతకం చేసింది. ఈ కార్యక్రమంలో మంత్రి బొత్స సత్యనారాయణ, ఎమ్మెల్యేలు కోలగట్ల, భాగ్యలక్ష్మి, జోగరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. 'గిరిజన సంక్షేమ శాఖ లో పారదర్శకమయున పాలన అందించి, జగన్మోహన్ రెడ్డి నమ్మకాన్ని నిలబెట్టుకుంటా' అన్నారు. గిరిజనులకి ఇచ్చిన ప్రతి ప్రభుత్వ పథకాన్ని, హామీని నెరవేర్చి గిరిజనుల ఆత్మ గౌరవాన్ని, ఆత్మ విశ్వాసాన్ని పెంపొందిస్తామన్నారు. గిరిజన ప్రాంతంలో విద్యావకాశాలు మెరుగుపర్చి, గిరిజన ఆడ పిల్లలకి వైఎస్సార్ పెళ్లికానుక కింద లక్ష రూపాయలు అందిస్తామన్నారు. గతంలో చంద్రబాబు గిరిజనులని అంటరాని వారిగా చూసి మంత్రి పదవి ఇవ్వలేదని, గిరిజనులని ఉప ముఖ్యమంత్రి చేసిన జగన్మోహన్ రెడ్డి చరిత్రలో నిలిచిపోతారన్నారు. -
గిరిజనుల అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం: రావెల
హైదరాబాద్: గిరిజనుల అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంఘిక, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్ బాబు స్పష్టం చేశారు. గిరిజనుల అభివృద్ధిని గత ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేశాయని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలోని మరిన్ని గ్రామాలను షెడ్యూల్ గ్రామాలల్లో కలపాలని యోచిస్తున్నట్లు చెప్పారు. అందుకు సంబంధించిన ప్రక్రియపై కేంద్రంలో సంప్రదించి ఓ నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. అది కూడా సాధ్యమైనంత త్వరగా ఆ ప్రక్రియను చేపట్టనున్నట్లు రావెల కిషోర్ బాబు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభలో గిరిజనుల సమస్యలపై ప్రభుత్వం ఏ చర్యలు తీసుకుంటుందో తెలపాలంటూ ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు రావెల కిషోర్ బాబుపై విధంగా సమాధానం ఇచ్చారు.