గిరిజనుల అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం: రావెల | Tribal Areas Will Be Developed by Chandrababu Govt, says Ravela Kishore babu | Sakshi
Sakshi News home page

గిరిజనుల అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం: రావెల

Published Sat, Aug 23 2014 10:07 AM | Last Updated on Sat, Mar 23 2019 8:59 PM

గిరిజనుల అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం: రావెల - Sakshi

గిరిజనుల అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం: రావెల

హైదరాబాద్: గిరిజనుల అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంఘిక, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్ బాబు స్పష్టం చేశారు. గిరిజనుల అభివృద్ధిని గత ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేశాయని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలోని మరిన్ని గ్రామాలను షెడ్యూల్ గ్రామాలల్లో కలపాలని యోచిస్తున్నట్లు చెప్పారు.

అందుకు సంబంధించిన ప్రక్రియపై కేంద్రంలో సంప్రదించి ఓ నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. అది కూడా సాధ్యమైనంత త్వరగా ఆ ప్రక్రియను చేపట్టనున్నట్లు రావెల కిషోర్ బాబు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభలో గిరిజనుల సమస్యలపై ప్రభుత్వం ఏ చర్యలు తీసుకుంటుందో తెలపాలంటూ ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు రావెల కిషోర్ బాబుపై విధంగా సమాధానం ఇచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement