తెలంగాణ సాహిత్య అకాడమి నెలనెలా ‘కావ్య పరిమళం’లో భాగంగా నవంబర్ 9న సా.6 గం. కు పల్లా దుర్గయ్య ‘గంగిరెద్దు’ కావ్యంపై డాక్టర్ జి.బాలశ్రీనివాసమూర్తి ప్రసంగిస్తారు. వేదిక: రవీంద్రభారతి కాన్ఫరెన్స్ హాల్. అధ్యక్షత: నందిని సిధారెడ్డి. దేవిప్రియ ‘బహుముఖ’(కవిత్వం, పత్రికారచన, వ్యక్తిత్వ విశ్లేషణల సమాహారం) ఆవిష్కరణ నవంబర్ 10న సాయంత్రం 6 గంటలకు సమాగమం హాల్, రెండో అంతస్తు, ది ప్లాజా, పర్యాటక భవన్, బేగంపేట, హైదరాబాద్‌లో జరగనుంది. ఆవిష్కర్త: ప్రకాశ్ రాజ్. ఇ–బుక్ ఆవిష్కర్త: పల్లా రాజేశ్వరరెడ్డి. అధ్యక్షత: కె.రామచంద్రమూర్తి. నిర్వహణ: సాహితీ మిత్రులు. పి.సత్యవతి ఇంగ్లిష్ పుస్తకం ‘హేర్ ఐ యామ్’, అనువదించిన పుస్తకం ‘పలు రామాయణాలు’ ప్రచురణ అయిన సందర్భంగా ‘మీట్ టుగెదర్’ నవంబర్ 11న ఉదయం 10:30కు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరగనుంది. సీతా సుధాకర్ ‘పూనాలో పూచిన నానీలు’ ఆవిష్కరణ నవంబర్ 11న ఉదయం 10:30కు కొరటాల మీటింగ్ హాల్, బ్రాడీపేట, గుంటూరులో జరగనుంది.
ఆవిష్కర్త: ఎన్.గోపి. నిర్వహణ: ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘం. ‘ఈ సంవత్సరం నుండి ఒక్కో సంవత్సరం వరుసగా కథ, కవిత, నవల, సాహిత్య వ్యక్తిత్వం అంశాలపై విశేష ప్రతిభ కనబర్చిన సాహిత్యవేత్తలకు’ ఇవ్వదలచిన రామా చంద్రమౌళి సాహిత్య పురస్కారాన్ని కథా ప్రక్రియకుగానూ ఎ.ఎన్.జగన్నాథశర్మకు నవంబర్ 25న వరంగల్‌లో ప్రదానం చేయనున్నారు. ముఖ్య అతిథులు: కె.శివారెడ్డి, తనికెళ్ల భరణి. కామిశెట్టి జాతీయ పురస్కారం–2018కి గానూ 2015, 16, 17ల్లో ముద్రించబడిన సాహిత్య వ్యాస సంపుటాలను ఆహ్వానించగా, వచ్చిన వాటిలోంచి డాక్టర్ ఎస్.రఘు ‘సమన్వయ’ ఎంపికైనట్టు కామిశెట్టి సాహిత్య వేదిక (భద్రాచలం) అధ్యక్షులు తెలియజేస్తున్నారు. విజేతకు ఈ నెలలో జరిగే కార్యక్రమంలో రూ.10,116 ప్రదానం చేస్తారు.
Comments
Please login to add a commentAdd a comment