nandini sidda reddy
-
రికార్డ్ నెలకొల్పిన ‘ప్రపంచ మహిళా తెలుగు కవితా మహోత్సవం’
హైదరాబాద్: "డాక్టర్ సి.నారాయణరెడ్డి వంశీ విజ్ఞాన పీఠం" "శ్రీ సాంస్కృతిక కళాసారథి" సింగపూర్, "సాహితీ కిరణం" మాసపత్రిక సంయుక్త ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా మూడు రోజుల పాటు, అంతర్జాల వేదిక పై 17 దేశాల నుండి పాల్గొన్న 250మంది కవయిత్రులతో అద్వితీయంగా నిర్వహించబడిన "ప్రపంచ మహిళ తెలుగు కవితా మహోత్సవం" ప్రపంచ స్థాయిలో రికార్డ్ నెలకొల్పింది. కార్యక్రమం ముఖ్య నిర్వాహకులు డాక్టర్ వంశీ రామరాజు మాట్లాడుతూ.. "అంతర్జాలం ద్వారా ఎన్నో సాహిత్య కార్యక్రమాలు నిర్వహింపబడుతున్నా కూడా, కేవలం మహిళల కోసం ప్రత్యేకంగా ఒక కార్యక్రమం నిర్వహించాలనే ఉద్దేశంతో మహిళా కవయిత్రులకు ప్రోత్సాహాన్ని ఇచ్చే విధంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగిందని, అనూహ్యమైన స్పందన వచ్చి 17 దేశాలనుండి 250 మంది కవయిత్రులు కేవలం వారం రోజుల్లో ముందుకొచ్చి కార్యక్రమంలో పాల్గొన్నారని, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ వారు తమ ప్రయత్నానికి ప్రత్యేక అభినందనలు తెలిపారని, తమ ప్రయత్నానికి మరింత తృప్తిని ఇస్తూ ఈ కార్యక్రమం "తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్" వారిచే రికార్డు చేయబడిందని" తెలియజేస్తూ తన ఆనందాన్ని, కృతజ్ఞత వ్యక్తం చేశారు. 23, 24, 25 తేదీలలో జరిగిన ఈ అంతర్జాల కార్యక్రమంలో మొదటిరోజు భువనచంద్ర, డాక్టర్ నందివాడ అనంతలక్ష్మి; రెండవ రోజు డాక్టర్ నందిని సిధారెడ్డి, డాక్టర్ ముదిగంటి సుజాత రెడ్డి; మూడవరోజు డాక్టర్ సుద్దాల అశోక్ తేజ, మామిడి హరికృష్ణ, 'శ్రీ సాంస్కృతిక కళాసారథి' అధ్యక్షుడు కవుటూరు రత్నకుమార్, 'సాహితీ కిరణం' మాసపత్రిక సంపాదకులు శ్రీ పొత్తూరి సుబ్బారావు, వివిధ దేశాలలోని తెలుగు సంస్థల అధ్యక్షులు పలు ప్రముఖ రచయిత్రులు పాల్గొన్నారు. రాధికా మంగిపూడి (సింగపూర్), జుర్రు చెన్నయ్య (హైదరాబాద్), జయ పీసపాటి (హాంకాంగ్), రాధిక నోరి (అమెరికా), కార్యక్రమ వ్యాఖ్యాతలుగా వ్యవహరించి ఆసక్తికరంగా కార్యక్రమాన్ని ముందుకు నడిపించారు. భారత్, అమెరికా, సింగపూర్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, యూ కె, ఖతార్ మొదలైన 17 దేశాల నుండి ఆయా ప్రాంతాలలో పేరుపొందిన 250 మంది రచయిత్రులు వారి దేశ కాలమానాలకు అనుగుణమైన సమయాలలో విచ్చేసి తమ కవితలను ఈ వేదికపై పంచుకున్నారు. ఉగాది కవితలు, ఛందోబద్ధ రచనలు, సామాజిక స్పృహ ఉండే అంశాలు మొదలైన వివిధ కోణాల నుండి వైవిధ్యభరితమైన అంశాలను ఎన్నుకొని అందంగా మలచిన కవితలతో కవయిత్రులందరూ రాణించడం విశేషంగా ఆకర్షించింది. చదవండి: ప్రవాసాంధ్రుల్లారా ఆపత్కాలంలో ఏపీకి అండగా నిలవండి -
చేపచిలుక ఎగిరిపోయింది
తెలుగు పలుకుబడి మీంచి చేపచిలుక ఎగిరిపోయింది. అది నీటిపుట్టలో ఈదులాడిన చేప కావచ్చు. అమ్మచెట్టు మీద వాలిన చిలుక కావచ్చు. ఈదటం, ఎగరటం, అలరించటం తెలిసిన చేప చిలుక అక్షర ప్రపంచం మీద అలిగి వెళ్ళిపోయింది. సర్దుబాటు చేసుకో లేని తత్వం, చిరుగాలి తాకిడికి చలించిపోయే సున్ని తత్వం, హృదయాల చుట్టూ ఆత్మీయంగా అల్లుకుపోయే అరుదైన వ్యక్తిత్వం, అక్షరాన్ని సకలావయవాలతో ప్రేమించే మనస్తత్వం, అన్నీ కలిస్తే దేవిప్రియ. అరుదైన పేరు. అరుదైన కవి. అంతేసమంగా పాత్రికేయుడు. గాలి రంగు గుర్తించిన కవి రంగులు వెదుక్కుంటూ తిరుమలగిరి స్వర్గవాటిక దగ్గరి గాలిలో కలిసి ఎగిరిపోయాడు. తనకు తొందరగా దగ్గరవటం తెలియదు. దగ్గరయితే ఎన్ని అసంతృప్తులున్నా దూరమవటం కూడా తెలియదు. డెబ్బయ్యో దశకం నడిమి కాలంలో పేరు వినటం. సిద్ది పేటలో ముగ్గురు మిత్రులం ‘దివిటి’ సంకలనం ఆవిష్క రణ కోసం శివారెడ్డిగారిని కలిశాము. నేనొక్కణ్ణే కాదు, నాతోపాటు దేవిప్రియను తీసుకొస్తాను, ఆయనే సభాధ్య క్షుడు అని ఆదేశించాడు. సిద్దిపేట బస్టాండులో మొదటి సారి ఆయన్ను చూడటం. మెల్లగా మాట్లాడినా గట్టిగా పట్టుకుంటాడు. మెత్తగా కనిపించినా కటువుగా పలుకు తుంటాడు. క్రమంగా ఒక భావంలా, ఒక వాక్యంలా, స్నేహంగా అల్లుకుపోతాడు. పేద రికం తెలిసిన కవి. జీవితంలో ఎన్నెన్నో కలలు కన్న కవి. పుల్లా పుల్లా తెచ్చి గూడు అల్లుకున్న పిట్ట పనితనాన్ని ఇష్టపడే బాల్య మన స్తత్వం. పల్నాడు రోషం ఏదో లోలోపల ఇమిడే ఉంటుంది. కృష్ణా తీరమే అయినా తడితాకక ఎండి పోయిన రాళ్ళూ రప్పల ప్రాంతం వినుకొండ బొల్లాపల్లిలో కన్నుతెర చిన మనిషి, తెలంగాణలో సంచ రించటం, బావి తవ్వితే బండ తప్ప నీళ్ళు పడని మా బందారం దాకా విస్తరించటం హృదయ బంధమే కదా– అది ఒడవని అక్షర బంధం కదా. మా ఊరికి రావట మేనా? మా కుటుంబం, మా బాపుతో, మంజీరా మిత్రులతో కలిసి వరిచేల గట్లమీద తిరుగాడే ఆత్మీయత దేవిప్రియ. మా బాపు ఆసుపత్రిలో మరణశయ్య మీద ఉన్నపుడు చలించి కవిత్వం రాసేటంత బంధమేదో తను అనుభవించేది. వాకిలి, ఇల్లు, మను షులు, చేలు, ఇసిరెలు, ఏవో ఇంకేవో దేవిప్రియ తలపుల్లో ఏ ఆరడిపెట్టాయో మా అవ్వ చనిపోయినప్పుడు ఆరోగ్యం సరిగా లేకున్నా వచ్చి కంటనీరు పెట్టుకున్నాడు. నీరులేని ప్రాంతాల, జీవితాల గోస తెలిసినవాడు కనుకనే నీటిని ప్రేమించాడు, మనసుల్ని ప్రేమించాడు, ఆయన కవిత్వమే నీటిపుట్ట. మంజీరా రచయితల సంఘంతో, కవుల్తో, కార్యకర్తలతో, మిత్రుల్తో అట్లా వాగులా కలిసిపోవటం ఆర్తి ఏదైనా మాకందరికీ స్ఫూర్తి. ప్రజాతంత్ర సంపాదకత్వం దేవిప్రియ జీవితంలో మరుపురాని మజిలీ. తర్వాత ఎన్ని పెద్ద పత్రికల్లో అయినా పనిచేసి ఉండవచ్చు, కొత్త ఒరవడులు పెట్టి ఉండవచ్చు. ప్రజాతంత్ర ఎప్పటికీ గుర్తుండే ప్రయోగం. శ్రీశ్రీ ఆత్మకథ ‘అనంతం’ రచనకు కారణం దేవిప్రియే. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి మిత్రులందరం వారం వారం ఇష్టంగా ఎదురుచూసేవారం. ప్రజాతంత్రలోనే అల్లం రాజయ్యను చదువుకున్నం. కంఠమనేని రాధాకృష్ణమూర్తి, శ్రీకంఠమూర్తి, సీహెచ్ మధు కథలు తిరిగి తిరిగి చదు వుకునేవాళ్లం. ఈవారం కవిత ఎప్పటికప్పుడు సంచల నమే. ఆ పేజీ ప్రత్యేకం చంద్ర బొమ్మలు, ప్రత్యేకమైన ఛాయాచిత్రాలు, అదొక గొప్ప అనుభవం. కవిత అందులో అచ్చుకావటానికి కల కనేవాళ్లం. ఏదో మేమేనా? సినారె లాంటి మహాకవులు కూడా ఆ పేజీ ప్రచురణ కోసం కలగనటం నాకు తెలుసు. సినారెకు దేవిప్రియంటే చాలా ఇష్టముండేది. దేవిప్రియతో శివారెడ్డితో సాయంత్రాలు గుర్తుండే అనుభవాలు. కృష్ణా హోటల్ గార్డన్ రెస్టారెంట్లో సాయంత్రాలు సాహితీ మిత్రుల చర్చలు, పలవరింతలు వింటూ పరవశించేవాళ్లం. ‘అడివీ, నువ్వంటే నాకిష్టం, విల్లనంబులు ఏరి ఉంచు ఏదో ఒకరోజు వాటినే ఆశ్ర యిస్తాను’. దేవిప్రియ కవిత ఎంత ఉత్సాహపర్చేదో? నిజమే– సూర్యుడు ఎప్పుడూ ఒకలాగే ఉండడు. అప్పుడ ప్పుడు వీపుమీద బరువులు మోసే హమాలీలా ఉంటాడు అని దేవిప్రియ ఊహిస్తే ఆలోచనేదో ఆశయమేదో విచ్చు కునేది. స్త్రీవాదం అంకురించకముందే కమలాదాస్ ఆత్మ కథ సీరియల్‌గా ప్రచురించి సంచలనం రేకెత్తించిన ప్రత్యే కత దేవిప్రియదే. ‘కవిత్వాన్ని సామాన్యంగానూ, అసామాన్యంగానూ చెప్పగలవాడే కవి’ దేవిప్రియ ప్రకటించాడు. కవిత్వానికి వరదగుడి కంటే ఎక్కువ రంగులు వేయగలవాడే కవి అన్నాడు. దేవిప్రియ నమ్మినట్లుగానే సామాన్యంగా, అసా మాన్యంగా రాయగల నైపుణ్యం, సింగిడి కంటే ఎక్కువ రంగులు వేయగల కౌశలం ఆయన కవిత్వంలో గుర్తించ వచ్చు. ‘నాకు రెండు నిధులున్నాయి. నాలుక మీద కవిత్వం, తలమీద దారిద్య్రం. నాకు రెండు విధులు న్నాయి. కవిత్వ నిత్యనిబద్ధం, దారిద్య్ర విముక్తి యుద్ధం. అంత సామాన్యంగా, అసామాన్యంగా రాయటం దేవిప్రియకు ఇష్టం. పచ్చపచ్చటి ఉద్యానవనాల్లో సంచ రించినంత సుతారంగా వెచ్చ వెచ్చటి రక్త జలపాతాల సాహచ ర్యంలో సేదతీరగలడు. పద్యం రాసిన ప్రతిసారీ ఇప్పటికీ భస్మమై మళ్లీ రూపొందే విద్య ఆయనకు బాగా తెలుసు. పదాల అర్థం, పదాల అందం, పదాల పదును సంపూర్ణంగా ఎరిగిన కవి. పదం మీదే కాదు, పద్యం మీద ఆయనకు పట్టు ఎక్కువ. ఇన్షా అల్లాహ్ శతకం రాశాడు. సమాజానంద స్వామి చతురో క్తులు రాశాడు. ఆ రోజుల్లో ‘రన్నింగ్ కామెంటరీ’కి మాస్ ఫాలోయింగ్ ఉండేది. ఆటోవాలాల దగ్గరనుంచి అధికార రాజకీయ నేతల దాకా అభిమానం సంపాదించుకున్నాడు. హాస్యం, వ్యంగ్యం వైభవోపేతంగా పండించేవాడు. ‘కవి గారూ ఇలా రండి. మాటున్నది మీతో అర్థం కాకున్నది మీరు మానవులో కోతో’ అని చమక్కులు వేసేవాడు. ఎంత చమత్కారో కవిత్వం పట్ల అంత సీరియస్ తత్వం. దేవిప్రియ కవిత్వంలో దుఃఖం, వేదన, సంఘర్షణ ఎంతో అంతకుమించి సౌందర్యం, స్వాప్నికత, తాత్వికత ఒదిగిపోయేవి. ఇష్టం పుడితే ఏదైనా సాధించాల్సిందే. ప్రేమిస్తే ఏదైనా పంచాల్సిందే. తప్పనిసరయి ప్రతిరోజూ అవే దుస్తులు వేసుకుంటుంటే కొత్తబట్టలు పెట్టిన ప్రేమ దేవిప్రియ. వెనకాముందూ చూడకుండా చైనీస్ రెస్టారెంట్ల రుచి చూపించిందాయన అభిరుచి. ఇష్టంగా ప్రేమించాడు అంతే ఇష్టంగా కోపించాడు. అలాంటి ఇష్టంతోనే నాకొక వాక్యం తగిలించాడు. మందారం కనిపెంచిన బందారం అని. ప్రేమాస్పదుడు, అక్షరం మీద ప్రేమతో అంత రంగాలు శోధించిన కవి, ఆత్మీయుల అంతరంగాలు జయించిన కవి దేవిప్రియ అనుబంధాల్లో, అక్షరాల్లో, జ్ఞాపకాల్లో అమరుడై వెలుగుతుంటాడు. వ్యాసకర్త నందిని సిధారెడ్డి తెలంగాణ సాహిత్య అకాడమీ అధ్యక్షుడు -
చికాగోలో సాహితీ మిత్రుల సమ్మేళనం
చికాగో: ప్రస్తుత కాలంలో వస్తువులకే ప్రాధాన్యత ఇస్తూ.. మానవ సంబంధాలకు విలువ ఇవ్వకూడదనే విధంగా సమాజం తయారైందని ప్రముఖ కవి, తెలంగాణ సాహిత్య అకాడమీ అధ్యక్షుడు నందిని సిద్దారెడ్డి వ్యాఖ్యానించారు. చికాగో సబర్బ్ ఓక్ బ్రూక్ పబ్లిక్ లైబ్రరీలో ‘చికాగో సాహితీ మిత్రులు’ పేరుతో శనివారం నిర్వహించిన సాహిత్య సభలో సిద్దారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పలకరింపులు తగ్గిపోతూ.. ప్రక్కనున్న వారి గురించి ఆలోచించలేని సమాజాన్ని మనం తయారు చేసుకుంటున్నామని అన్నారు. ఈ ధోరణి చాలా ప్రమాదకరమైని సిద్దారెడ్డి అభిప్రాయపడ్డారు. వేమన, గురజాడ, శ్రీశ్రీలు తెలుగులో రాసిన రచనల్లోని సారాన్ని ఒక తత్వంలాగా ఆయన వివరించారు. ఈ కార్యక్రమాన్ని ‘చికాగో సాహితీ మిత్రుల సంఘం’ నిర్వాహకులు మెట్టుపల్లి జయదేవ్, తిమ్మాపురం ప్రకాష్, ఆపూరి హరినాథ్ బాబులు నిర్వహించారు. అయితే ఈ సభకు డాక్టర్ జంపాల చౌదరి అధ్యక్షత వహించారు. ప్రముఖ రచయిత్రి మల్లేశ్వరి మాట్లాడుతూ.. తన నవల ‘నీల’ రాయడానికి గల నేపథ్యాన్ని, నిజమైన సంఘటనలను ఆ నవలలో కొన్ని చోట్ల ఎలా పొందుపరిచారో ఆ విధానాన్ని వివరించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర సాహిత్య అకాడమి సభ్యులు నవీన్ వాసిరెడ్డి ప్రసంగిస్తూ.. తెలుగు సాహిత్యానికి ఉన్న విశాలమైన స్థానాన్ని తాను కేంద్ర సాహిత్య అకాడమీకి సభ్యునిగా ఎంపిక అయ్యాక దగ్గరగా చూశానని తెలిపారు. అదేవిధంగా తెలుగు కథ పరిణామం గురించి మాట్లాడారు. సభా అధ్యక్షుడు జంపాల చౌదరి మాట్లాడుతూ.. తెలుగు సాహిత్యానికి తాను చేసిన సేవలను వివరించారు. నవలా సాహిత్యానికి బహుమతులను ఎంపిక చేయడంలో తాను ఎదుర్కొన్న అనుభవాలను పంచుకున్నారు. ఈ సమావేశ నిర్వహణకు వసతులు ఏర్పాటు చేసిన మెట్టుపల్లి శారద, బూచుపల్లి రాము, పాతకోట ప్రభాకర్ తదితరులకు సాహిత్య సంస్థ తరుపున ప్రకాష్ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాటా డైరక్టర్ లింగారెడ్డిగారి వెంకటరెడ్డి , నాటా రీజనల్ కో ఆర్డినేటర్ లక్ష్మినారాయణ పాల్గొన్నారు. వీరితోపాటు ఇతర తెలుగు సంఘాల నాయకులు.. అప్పలనేని పద్మారావు, కటికి ఉమా, కానూరి జగదీష్, నందుల మురళి తదితర ప్రముఖులు పాల్గొన్నారు. -
ఘనంగా నిత్యాన్వేషణం పుస్తకావిష్కరణ..
సాక్షి, హైదరాబాద్: ఆచార్య వెలుదండ నిత్యానందరావు రచించిన ‘నిత్యాన్వేషణం’ (సాహిత్య దీర్ఘవ్యాస సమాహారం) గ్రంథ ఆవిష్కరణ సభ ఘనంగా జరిగింది. రవీంద్రభారతి కాన్ఫరెన్స్ హాల్లో మంగళవారం సాయంత్రం డాక్టర్ కేవీ రమణ సభాధ్యక్షత జరిగిన ఈ కార్యక్రమంలో ‘నిత్యాన్వేషణం’ గ్రంథాన్ని తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ నందిని సిధారెడ్డి ఆవిష్కరించారు. భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో ‘మూసీ’ సాహిత్య ధ్వార ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి డాక్టర్ మామిడి హరికృష్ణ, ఆచార్య డీ రవీందర్, ఆచార్య డీ సూర్యా ధనుంజయ్ విశిష్ట ఆతిథులుగా హాజరయ్యారు. విశ్రాంత ప్రధానోపాధ్యాయులు లక్కరాజు రవీందర్ కృతిని స్వీకరించారు. వక్తలు మాట్లాడుతూ నిత్యాన్వేషణ సాగిస్తూ తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసేలా అద్భుతమైన సాహిత్య వ్యాసాలను నిత్యానందరావు వెలువరించారని, ఆయన నిరంతర సాహిత్య కృషికి, పరిశీలనా, అనుశీలనా దృష్టికి ‘నిత్యాన్వేషణం’ గ్రంథం నిదర్శనమని కొనియాడారు. -
రారండోయ్
తెలంగాణ సాహిత్య అకాడమి నెలనెలా ‘కావ్య పరిమళం’లో భాగంగా నవంబర్ 9న సా.6 గం. కు పల్లా దుర్గయ్య ‘గంగిరెద్దు’ కావ్యంపై డాక్టర్ జి.బాలశ్రీనివాసమూర్తి ప్రసంగిస్తారు. వేదిక: రవీంద్రభారతి కాన్ఫరెన్స్ హాల్. అధ్యక్షత: నందిని సిధారెడ్డి. దేవిప్రియ ‘బహుముఖ’(కవిత్వం, పత్రికారచన, వ్యక్తిత్వ విశ్లేషణల సమాహారం) ఆవిష్కరణ నవంబర్ 10న సాయంత్రం 6 గంటలకు సమాగమం హాల్, రెండో అంతస్తు, ది ప్లాజా, పర్యాటక భవన్, బేగంపేట, హైదరాబాద్‌లో జరగనుంది. ఆవిష్కర్త: ప్రకాశ్ రాజ్. ఇ–బుక్ ఆవిష్కర్త: పల్లా రాజేశ్వరరెడ్డి. అధ్యక్షత: కె.రామచంద్రమూర్తి. నిర్వహణ: సాహితీ మిత్రులు. పి.సత్యవతి ఇంగ్లిష్ పుస్తకం ‘హేర్ ఐ యామ్’, అనువదించిన పుస్తకం ‘పలు రామాయణాలు’ ప్రచురణ అయిన సందర్భంగా ‘మీట్ టుగెదర్’ నవంబర్ 11న ఉదయం 10:30కు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరగనుంది. సీతా సుధాకర్ ‘పూనాలో పూచిన నానీలు’ ఆవిష్కరణ నవంబర్ 11న ఉదయం 10:30కు కొరటాల మీటింగ్ హాల్, బ్రాడీపేట, గుంటూరులో జరగనుంది. ఆవిష్కర్త: ఎన్.గోపి. నిర్వహణ: ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘం. ‘ఈ సంవత్సరం నుండి ఒక్కో సంవత్సరం వరుసగా కథ, కవిత, నవల, సాహిత్య వ్యక్తిత్వం అంశాలపై విశేష ప్రతిభ కనబర్చిన సాహిత్యవేత్తలకు’ ఇవ్వదలచిన రామా చంద్రమౌళి సాహిత్య పురస్కారాన్ని కథా ప్రక్రియకుగానూ ఎ.ఎన్.జగన్నాథశర్మకు నవంబర్ 25న వరంగల్‌లో ప్రదానం చేయనున్నారు. ముఖ్య అతిథులు: కె.శివారెడ్డి, తనికెళ్ల భరణి. కామిశెట్టి జాతీయ పురస్కారం–2018కి గానూ 2015, 16, 17ల్లో ముద్రించబడిన సాహిత్య వ్యాస సంపుటాలను ఆహ్వానించగా, వచ్చిన వాటిలోంచి డాక్టర్ ఎస్.రఘు ‘సమన్వయ’ ఎంపికైనట్టు కామిశెట్టి సాహిత్య వేదిక (భద్రాచలం) అధ్యక్షులు తెలియజేస్తున్నారు. విజేతకు ఈ నెలలో జరిగే కార్యక్రమంలో రూ.10,116 ప్రదానం చేస్తారు. -
నందిని కవిత్వం సమాజ హితం
సాక్షి, హైదరాబాద్: నందిని సిధారెడ్డి కవిత్వమైనా, మనస్తత్వమైనా సమాజ హితమేనని ఆపద్ధర్మ మంత్రి హరీశ్‌రావు అన్నారు. తెలంగాణ అస్తిత్వం, సాహిత్య వికాసంలో ఆయన కృషి విస్మరించలేమన్నారు. తెలుగు విశ్వవిద్యాలయంలో గురువారం తెలంగాణ భాషా సాంస్కృతిక మండలి ఆధ్వర్యంలో తెలంగాణ సాహిత్య అకాడమీ అధ్యక్షులు డాక్టర్ నందిని సిధారెడ్డి సాహిత్య ప్రస్థానంపై రూపొందించిన ‘మందారం’సంపుటిని మంత్రి హరీష్‌రావు ఆవిష్కరించారు. నిరాడంబరమైన జీవితంలో పుస్తకాలతోనే సహచర్యం చేసిన సిధారెడ్డి తాను ఎదగడంతో పాటు ఇతరులను ప్రోత్సహించారని హరీశ్‌రావు తెలిపారు. నిర్మొహమాటంగా మాట్లాడే సిధారెడ్డి కేసీఆర్‌కు అత్యంత ఇష్టుడని తెలిపారు. అధ్యక్షత వహించిన ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి మాట్లాడుతూ సిధారెడ్డి కవిత్వం అప్పటికప్పుడు సంఘ టనలపై రాసే సాహిత్యం కాదని, వెతల నుంచి తపనతో కవిత్వాన్ని రాశారని ప్రశంసించారు. ప్రముఖ కవి డాక్టర్ కె.శివారెడ్డి మాట్లాడుతూ, కవిత్వం వ్యక్తిత్వాన్ని రూపొందిస్తుందని ఇందుకు ఉదాహరణ నందిని సిధారెడ్డి అన్నారు. సీఎం కార్యాలయ ప్రత్యేక అధికారి దేశపతి శ్రీనివాస్ మాట్లాడుతూ.. జీవన తాత్వికత తెలిసినవాడు, తెలంగాణ గ్రామీణ వాతావరణం లోని నిసర్గ సౌందర్యాన్ని ఆవిష్కరించినవాడు నందిని అని అన్నారు. తెలుగు వర్సిటీ వీసీ ఆచార్య ఎస్వీ సత్యనారాయణ విశ్వవిద్యాలయం తరఫున నందిని మాతృమూర్తి రత్నమ్మను, సతీమణి మల్లీశ్వరిని సత్కరించారు. సదస్సులో సిధారెడ్డి సాహిత్యంపై ప్రముఖులు ప్రసంగించారు. సంస్థస్థాపకుడు ఘంటా జలంధర్‌రెడ్డి, శాసనమండలి సభ్యులు పాతూరి, పూర్వ శాసనసభ్యుడు రామలింగారెడ్డి, పార్లమెంట్ సభ్యుడు బీబీ పాటిల్ పాల్గొన్నారు. అనంతరం సాయంత్రం ఇందిరా పరాశరం నృత్య దర్శకత్వంలో నందిని రచించిన ‘నా తెలంగాణ కోటి రతనాల వీణ’నృత్యరూ పకాన్ని కనులపండువగా ప్రదర్శించారు. -
‘తెలంగాణ నడువలో అతనొక తెగువైన నడక’
ఒకరకంగా కాలానికి పట్టిన అద్దం కవిత్వం అంటారు. ఆయా కాలమాన పరిస్థితుల్ని ప్రతిబింబించే కవిత్వంతో ఓ పార్శ్వం నుంచి చరిత్రను లిఖిస్తూ వెళ్తారు కవులు. అందుకేనేమో సాహిత్యం విస్తృతార్థంలో చరిత్రే అంటారు. ఈ మాటను రుజువుపరి చేదిగా ఉంటుంది నందిని సిధారెడ్డి కవిత్వం. నాలుగుదశాబ్దా లకు పైబడిన కాలంలో ఆయన వెలువరించిన వచన కవిత్వం తెలుగునాట సగటు మనిషి బతుకు ఎలా సాగుతోందో ఇట్టే బోధపరుస్తుంది. ఆయన వెలువరించిన ఏ పుస్తకం, ఏ శీర్షిక, ఏ కవిత, అందులో ఏ చిన్న ఖండిక తీసుకున్నా... మనిషి జీవితపు ఏదో పార్శ్వం మనకు తగులుతూనే ఉంటుంది. ఒకింత మెత్తగా, ఒకింత గరుకుగా! ఓసారి మిట్టమధ్యాహ్నపు సూరీ డంత వేడిగా, ఇంకోసారి కార్తీకమాసపు తొలిపొద్దు కిరణాలంత వెచ్చగా, ఇంకా ఒకోసారి రివ్వున వీచే శీతగాలిలా, మరోమారు డిసెంబరు చివరిపాదం నడిరాతిరి ఎముకల్ని కొరికేంత చలిగా తగులుతుంటుంది. ఏం రాసినా... మనిషి, ఆతని జీవితం, ఊరు, రైతు, పంటపొలాలు, ధాన్యం, మార్కెట్లు, రాజ్యం–రాక్ష సత్వం, సర్కార్లు, వారి వ్యవస్థలు, అందులోని మనుషులు, ఆర్తి–ఆరాటాలు, అణచివేత–పోరాటాలు... ఇలా ఎంతసేపూ ఆయన మనసు వీటిచుట్టే తిరగాడుతుంది. బహిర్–అంతర్ సంఘర్షణల ఆనవాళ్లు పట్టిస్తూనే ఉంటుంది. మట్టి పొరల నుంచి మెలమెల్లగా లేచే భావనలు.. ఓ దశలో సరిహద్దులన ధిగమించి ఆకాశమంత ఎత్తెదిగి ఆరుస్తాయి. వాస్తవికత, హేతు బద్ధత ప్రధానంగా కనిపించే తన కవిత్వంలో అడుగడుగునా నిజం– నిజాయితీ, ఆరళ్లు–పోరాటాలు, కలలు–కడగండ్లు తగు లుతూనే ఉంటాయి. ఆయనే చెప్పినట్టు ఒకసారి అక్షరమై, ఇంకోమారు నదిౖయె, మరొకమారు తీగై, వెన్నెలై, కన్నీరై... ఇలా సాగిపోతూనే ఉంటాడు తప్ప కవి ఎక్కడా నిలిచిపోడు. ‘కవిత్వం వేడుక కాదు, గాయాల గొంతుక’ అని తనకు తాను నిర్వచించుకొని మరీ కర్తవ్యదీక్షతో సాగుతాడు. కృత్రిమ విల యాలకు, కాళ్లకింద కర్కశంగా సామాన్యుని నలిపే రాజ్యపు అంగాల దాష్టీకాలకు బాధ పడతాడే తప్ప భయపడడు. ‘... కవిత్వం ఊట మీద లాఠీ వేలాడుతూంది’ అంటూనే ‘... మరింత గట్టిగా నిర్భయంగా కలలు కన్నంత స్వేచ్ఛగా కవిత్వం రాయాల్సి ఉంది’ అనడమే పంథా ప్రకటన! స్థానిక మాండలిక భాషా పదాలు అతికించినట్టు కాకుండా అలవోకగా సిధా రెడ్డి కవితాఝరిలో ఒదిగిపోతాయి. ఇచ్చంత్రం, పడావు, అంజుమన్ బ్యాంకు, బుగులు, మనాది వంటి మాటలు అస్తిత్వపు బలమైన జాడలు గానే కాక నిండైన అభివ్యక్తికి పాదుల్లా నిలుస్తాయి. అర్ర, మాసిక, అచ్చుకట్టు, దస్కత్, అల్కుపిడచ, గీర, నువద్దె, నిగురాన్, తండ్లాట వంటి పదాలు, తనకు తెలుసు కనుక కవి వాడుతున్నట్టు కాకుండా అక్కడ అదే సరిపోయే పదం అనిపించేంత సహజంగా ఒదిగిపోవడ మొక భాషాసౌరభం! బలమైన భావా లకు అతికే పదాలతో బంధ మల్లడం వల్లే కవిత్వం మాటల కూర్పు దశ దాటి... దృశ్యమానమయింది. ఉన్నపళంగా ఊరు ఖాళీ చేయ(వలసి రావ)డం... ఎంత దయనీయమో! కళ్లకు కట్టి నట్టు, గుండె లోతుల్లో చేయూడ్చి దేవినట్టు ‘ఉసురు’ కవితలో చెబుతాడు. అది పెద్ద ప్రాజెక్టులు కట్టేటప్పుడు నీట మునిగే ఊరు ఖాళీ చేయడమైనా, పూట గడవక పొట్టకూటి కోసం వల సవెళ్లడమైనా, పిల్లలకు నక్సలైట్ ముద్రేసే పోలీసు వేధింపుల్ని తట్టుకోలేకైనా... కారణమేదైనా బలవంతంగా ఊరిడిచి వెళ్లాల్సి వస్తే! ఎవరికైనా ఎలా ఉంటుందో చెబుతూ, ‘‘ఇల్లు ఖాళీ చేసి నంత సునాయాసంగా జీవితం ఖాళీ చేయలేం! ఇల్లు ఖాళీ చేసినంత సుతారంగా ఊరు కూడా ఖాళీ చేయలేం!... అన్నీ అయి తలచిక్కులు తీసిన అమ్మఒడి ఖాళీ చేయడమంటే సన్నటి గునపంతో గుండెను తవ్వుతు న్నట్టుంటది. నేరమూ ఉండదు, నెత్తురూ మిగలదు’’ ఎంత గొప్ప భావుకత! కష్టాలను, కన్నీళ్లను అంత సహ జంగా, గుండెకు తాకేలా చెబుతాడన్న మాటే గాని ఎక్కడా మనోధైర్యాన్ని జార నీయకపోవడం సిధారెడ్డి ప్రత్యేకత. భవి ష్యత్తును ఆశావహంగా చూపుతాడు. అవ సరమైతే తప్పని తరుణోపాయాల సంకే తాలిస్తాడు. అందులో ఓ హెచ్చరికా తొంగి చూస్తుంది. ‘‘నాకు నిశ్శబ్దం నిశ్శ బ్దం కాదు మౌనంగా ఉన్న కంచు! నిస్పృహ నిస్పృహ కాదు పొదుగులో ఉన్న గుడ్డు’’ అనడం, భవిష్యత్తుపై భరో సాయే! ‘గోడకు వేలాడే తుపాకీ కూడా మౌనంగానే ఉంటుంద’నేది హెచ్చరిక. రాజ్యం గ్రహించాల్సిన ప్రాపంచిక సత్యాలూ ఉన్నాయనే భావాల్నీ దాచుకోకపోవడం విశేషం! ‘‘ఎంత అద్భుతమైన గంధపు చెక్కయినా సరే, మండితే ఎర్రటి నిప్పే అవుతుంది’’ అన్నది అసాధారణ అభివ్యక్తి. వీరుడు వింటి నారి సంధించడాన్ని గొప్పగా సమర్థిస్తాడు. ‘చీకటితో యుద్ధానికి వెళ్లిన కొడుకు రాత్రికి రాత్రి బూడిదయిన కలల జలతారు.. తల్లడిల్లుతున్న తల్లికి ఎవరు జవాబుదారీ? .. జరి గింది హత్యో? కాదో? విచ్చుకున్న తురాయిపూలు చెబు తాయి.. తలపండిన కొంగలు మాత్రం తపోభంగాల కథలే మళ్లీ మళ్లీ వల్లిస్తాయి... స్వప్నం గాలానికి చిక్కిన చేపయినపుడు, విశ్వాసం కంపించిన భూమయినపుడు, విషాదమే మోయాల్సి వస్తే తప్పేదేముంది? తల్లడిల్లేతల్లి శపించక చేసేదేముంది? ... విజయం కోసం వింటిని సంధించక వీరునికి దారేముంది?’అని ప్రశ్నవుతాడు. మారుమూల పల్లె నుంచి పట్నం మీదుగా నగరా నికి సాగిన జ్ఞానతృష్ణ సిధారెడ్డి. రాజధాని నగరంలో, మేటి విశ్వ విద్యాలయపు వినువీధుల్లో భాషను, దానికి మించి భావాలను పరిపుష్టం చేసుకుని పల్లెకు వెనుదిరిగిన భూమిపుత్రుడాతడు. ఒకే పుటుక పుట్టిన మనుషుల మధ్య అంతరాలను జీర్ణించు కోలేక, చలించి కవితైనాడు. సాహితీవంతెన కట్టేందుకు యత్నిం చాడు. దశాబ్దాల కిందటే, ‘విపణి వీధి వేయి కోరల రాకాసి, విపణి వీధి నూరు బారల ఉరితాడు’ అన్నాడు. కనబడకుండానే కవిత్వమంతటా తొంగి చూస్తాడు తానే ఒక ప్రశ్నై! పలు పుస్తకాలుగా విస్తరించిన నందిని సిధారెడ్డి కవిత్వాన్ని సూత్రబద్ధం చేసే అంశం మనిషి ఆర్తి. మనిషి మనుగడ, ఒడి దొడుకులు, ఆశ–నిరాశలు, ఊరు–ఊరుమ్మడి బతుకులు.. ఇదే పూలదండలో ఒదిగిన దారం! పచ్చి నిజాలే ముడిసరుకు. కఠోర వాస్తవాలే వస్తువు. గొంతెత్తడం సాహితీ ధర్మం! ఎక్కడా అంధవిశ్వాసాలు, మూఢనమ్మకాల జాడే ఉండదు. ‘సరదా పడటానికి ఒక్కరోజు చీకటి కాదు సర్దుకుపోవడానికి ఒక్కనాటి చావు కాదు..’ అని జీవితాన్ని నెమరేస్తాడు. అలా అని నిరాశ చెందడు. తనకు తన కలలే వస్తాయంటూ ‘నేల నిద్ర లేచినట్టు అలుకుబోనం చేసి మొలక చల్లినట్టు అవి మొలచి సేనై ఊగి నట్టు’ ఆశావహ దృక్పథాన్ని కలగంటాడు. తెలంగాణ ఏర్పడ టానికి ఒకటిన్నర దశాబ్దాల ముందరే ‘నాగేటి చాల్లల్ల నా తెలం గాణ నా తెలంగాణ, నవ్వేటి బతుకులు నా తెలంగాణ నా తెలం గాణ’ అని గొంతెత్తి పాడిన పాట సిధారెడ్డి. ‘శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్టితాత్ స్వధర్మే నిధనమ్ శ్రేయః..’ అని గీతలో కృష్ణుడు చెప్పినట్టు సిధారెడ్డి స్వధర్మాన్ని నిష్టతో, కవిత్వమే ఊపిరిగా ఆచరించారు. ‘మనది కాని జీవితంలో మన మేమీ రాయలేము’(తలవంచని గీతం) అంటాడు. తన మట్టిని, తన నేలను, తన గాలిని, తన సేలను... ఇలా అన్నీ తనవే వస్తు వుగా కవిత్వం అల్లిన యోగి. తానే చెప్పినట్టు ఆయన, ఆయన కవిత్వం ‘‘అలల రెప్పల కింద కలలు దాచుకున్న కడలి’’ (రేపటినుంచి నగరంలో ‘డా‘‘ నందిని సిధారెడ్డి కవిత్వ జీవన ప్రస్థానం’ రెండు రోజుల జాతీయ సదస్సు సందర్భంగా) – సవ్యసాచి -
రేపటి నుంచి చరిత్ర, సాహిత్యాలపై సదస్సు
సాక్షి, హైదరాబాద్: చరిత్ర, సాహిత్యాలపై ఈ నెల 23 నుంచి రెండ్రోజుల పాటు రవీంద్రభారతిలో జాతీయ సదస్సు నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర సాహిత్య అకాడమీ చైర్మన్ నందిని సిధారెడ్డి తెలిపారు. చర్రితలో చీకటి కోణాలను వెలుగులోకి తెచ్చేందుకు రాష్ట్ర సాహిత్య అకాడమీ, వారధి సంయుక్తంగా దీనిని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. బుధవారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. కాకతీయుల నుంచి అసఫ్‌జాహిల వరకు రాష్ట్ర చరిత్ర, సంస్కృతి, భాష, సాహిత్యం అనే అంశాలపై సదస్సు జరుగుతుందన్నారు. నాణేల ఆధారంగా తెలంగాణ చరిత్రను పరిశోధకులు రాజారెడ్డి, మనం మరిచిన తెలంగాణ చరిత్రపై జితేంద్రబాబు, కాకతీయుల నాటి లిపి విశేషాలు, లేఖన సంప్రదాయాలపై ఉమామహేశ్వర శాస్త్రి పత్ర సమర్పణ చేస్తారన్నారు. ప్రముఖ చరిత్రకారులు సూర్యకుమార్ కాకతీయుల కొత్త శాసనాలపై, ఆచార్య ఎం. సుజాతరెడ్డి కుతుబ్షాహి కాలం నాటి తెలుగు భాషా వికాసంపై, స్వతంత్ర కాకతీయ పాలకుల వివరాలపై శ్రీనివాసులు పత్ర సమర్పణ చేస్తారన్నారు. సదస్సు ఉదయం 10 నుంచి సాయంత్రం 5.30 వరకు జరుగుతుందన్నారు. సమావేశంలో సాహిత్య అకాడమీ కార్యదర్శి ఏనుగు నరసింహారెడ్డి పాల్గొన్నారు. -
ఎన్ని తీర్లుగ మాట్లాడినా తెలుగు తెలుగే
తెలుగు సాహిత్య చరిత్రలో తెలంగాణ స్థానాన్ని సుస్థిరం చేయడం, ఇప్పటి తరాన్ని తెలుగు భాష పట్ల ఆకర్షితులను చేయడమనే రెండు ప్రధాన లక్ష్యాలు ప్రపంచ తెలుగు మహాసభల ద్వారా నెరవేరగలవని మహాసభల కోర్ కమిటీ అధ్యక్షులు, తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ నందిని సిధారెడ్డి చెబుతున్నారు. డిసెంబర్ 15–19 వరకు హైదరాబాద్‌లో జరగనున్న ఈ ఉత్సవం నేపథ్యంలో సిధారెడ్డితో సాక్షి సాహిత్యం ప్రతినిధి జరిపిన ప్రత్యేక సంభాషణ: ఇప్పటికిప్పుడు మీ మనసుకు ఎలావుంది? కొంత ఇబ్బందిగానేవుంది. చేయబోయే పనిలో సాహిత్య ప్రధానమైనదానికంటే నిర్వహణ ప్రధానమైనది ఎక్కువ. ఇలాంటిది నాకు కొత్త. పైగా ఇంత పెద్ద వ్యవహారాన్ని నడిపిన అనుభవం లేదు. అందుకే నా కవిహృదయానికి కొంచెం ఇబ్బందిగానేవుంది. మరి దీన్ని ఎలా అధిగమిస్తున్నారు? మంజీరా రచయితల సంఘం, తెలంగాణ రచయితల వేదిక, తెలంగాణ రచయితల సంఘం నడిపిన అనుభవం ఉన్నది కాబట్టి, సభలు నిర్వహించడం నాకు మరీ దూరమైన పనేమీ కాదు. పైగా తెలంగాణ ముఖ్యమంత్రి పట్టుదలగా ఉన్నారు. కోర్ కమిటీలోని దేశపతి (శ్రీనివాస్)గానీ, రమణాచారిగానీ, మిగతా సభ్యులుగానీ అందరూ పూర్తిగా సహకరిస్తున్నారు కాబట్టి మహాసభలను విజయవంతం చేయగలమనే నమ్మకం ఉంది. 1975లో మొదటి ప్రపంచ మహాసభలు హైదరాబాద్‌లో జరిగిన నలభై ఏళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు హైదరాబాద్‌లో జరుగుతున్నాయి. వీటిని వాటికి కొనసాగింపుగా చూడాలా? వాటికి కొనసాగింపు అనవలసిన అవసరం లేదు. ఇవి తెలంగాణలో జరుగుతున్న తొలి మహాసభలుగానే చూడాలి. ఎందుకంటే ఆ మహాసభలను జరపడంలో అంతర్లీనంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను కాపాడుకోవడం అనే ప్రత్యేకమైన మోటిఫ్ ఉంది. 1969, 70ల నాటి ప్రత్యేక తెలంగాణ ఉద్యమం, 1972,73 నాటి జై ఆంధ్ర ఉద్యమం, మలిదశ తెలంగాణ ఉద్యమం ఊపందుకున్నప్పుడు ప్రాంతీయ భేదాలు సమసిపోవాలనే ఉద్దేశంతో వాటి నిర్వహణ జరిగింది. అది తప్పా ఒప్పా అన్న చర్చలోకి ఇప్పుడు వెళ్లడం లేదు. ‘తెలుగు జాతి మనది నిండుగ వెలుగు జాతి మనది’ లాంటి సినిమా పాటలు కూడా దాన్ని ప్రతిబింబిస్తూనే వచ్చాయి. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అదే పాట రాసిన సినారెను ‘ఇప్పుడు మీ అభిప్రాయం ఏమైనా మారిందా సార్?’ అని నేను అడిగాను: ‘తెలుగు జాతి మనది రెండుగ వెలుగు జాతి మనది’ అన్నారు. తెలుగు భాషా సాహిత్య సాంస్కృతిక వికాసానికి తెలంగాణ వైపు నుంచి కూడా గణించదగిన కృషి జరిగింది; తెలుగుకు తొలి ప్రాతిపదిక, భూమిక తెలంగాణ నుంచి వచ్చాయన్న విషయాన్ని తెలుగు సాహిత్య చరిత్రలో నమోదు చేయడమనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం సంకల్పించిన మహాసభలివి. ప్రాతిపదిక, భూమిక గురించి మరింత చెప్పండి... కరీంనగర్ జిల్లా రామగిరి ఖిల్లాలో నారన, గోపన అనే గోపరాజుల నాణేలు దొరికాయి. వీళ్లు క్రీ.పూ.600–400 కాలానికి చెందినవారని నాణేల పరిశోధకుడు ఠాకూర్ రాజారామ్‌సింగ్ నిర్ధారించారు. నారన, గోపనల్లోని అన అన్నది తెలుగు అన్నే. ఇప్పటికీ చూడండి– తిక్కన, పోతన, వేమన పేర్లు మనకున్నాయి. దీనివల్ల మన తెలుగు ఉనికి సుమారు 2,500 ఏళ్ల ముందుకు పోయింది. అలాగే శాతవాహనులు క్రీ.పూ.200– క్రీ.శ.200 కాలంలో ఈ ప్రాంతాన్ని పాలించారు. ఇందులో హాలుడు క్రీ.శ.2వ శతాబ్దం వాడు. ఆయన ప్రాకృతంలో సంకలనం చేసిన గాథాసప్తశతిలో అత్త లాంటి తెలుగు మాటలున్నాయని తిరుమల రామచంద్ర నిరూపించారు. అగ్గి అనే తెలుగు మాటకు దీర్ఘమిచ్చి అగ్గీ అంటే అది ప్రాకృతం అయినట్టుగా కూడా మనకు ఆధారాలున్నాయి. ఒకవేళ భాష అంతా సాహిత్యం కాదు అనుకున్నా కూడా, క్రీ.శ.947 నాటి జినవల్లభుడు వేయించిన కురిక్యాల శాసనంలో పంపన రాసిన మూడు తెలుగు కందపద్యాలు దొరికాయి. పంపన తెలుగులో జినేంద్ర పురాణం రాశాడు. కన్నడంలో విక్రమార్జున విజయం రాశాడు. దాన్నే పంపభారతం అనీ అంటారు. ఇది 11వ శతాబ్దానికి చెందిన నన్నయ కంటే 150–200 ఏళ్ల ముందు సంగతి! వీటిన్నింటివల్ల కూడా తెలంగాణలో తెలుగు ఉనికి బలంగా ఉన్నదని నిరూపితమవుతోంది. అంతెందుకు, తెలుంగు గణం తెలుంగణం అయ్యి, తెలంగాణం అయ్యిందని ఒక అభిప్రాయం. తెలుంగు ఆణెము(ప్రాంతం) తెలంగాణ అని మరో అభిప్రాయం. మహాసభల్లో ఎంతమంది పాల్గొంటారని అంచనా? సుమారు 30 దేశాల నుంచి 500 మంది విదేశీ ప్రతినిధులు, ఆంధ్రప్రదేశ్ సహా 15 రాష్ట్రాల నుంచి 1,500 మంది తెలుగు సాహిత్యాభిమానులు, తెలంగాణ తో కలుపుకొని మొత్తంగా 6000–8000 మంది ఉండొచ్చు. ఆంధ్రప్రదేశ్ సాహిత్యవేత్తలతో ఎలా వ్యవహరిస్తున్నారు? వాళ్ల స్పందన? వాళ్లు కూడా పాల్గొనడానికి చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఏ శషభిషలు లేకుండా భాషాసాహిత్య ప్రేమికులందరూ పాల్గొనబోతున్నారు. సాహిత్య అకాడమీ పురస్కారం పొందిన రచయితలందరూ పాల్గొనేలా చూస్తున్నాం. తెలుగు భాష పరిరక్షణ కోసం కృషి చేస్తున్న సంఘాల ప్రతినిధులను కూడా ఆహ్వానిస్తున్నాం. కొంతమంది తెలంగాణ వాళ్ల నుంచే ‘వాళ్లను పిలుసుడు ఏంది’ అన్న వ్యతిరేకత వస్తోంది. కానీ అక్కడి ప్రముఖులందరినీ పాల్గొనేలా చేయాలనే సంకల్పంతో ఉన్నాం. ప్రతినిధులకు ఎట్లాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? వాళ్లు దిగగానే ఒక కిట్ ఇస్తాం. అందులో వాళ్ల పాస్, ప్రోగ్రామ్ షెడ్యూల్, ఫుడ్ కూపన్స్ ఉంటాయి. వచ్చినవారందరికీ భోజనం ఏర్పాటు వేదిక దగ్గరే ఉంటుంది. వాళ్లు రావడానికి, బసకు వెళ్లడానికీ రవాణా సౌకర్యం ఉంటుంది. మొబైల్ టాయ్లెట్లు కూడా ఉంటాయి. ఇందులో మూడు రకాలవాళ్లున్నారు: ఇన్వైటెడ్ గెస్ట్స్. వీళ్లు రచయితలు, కళాకారులు. ఇన్వైటెడ్ డెలిగేట్స్. వీళ్లు సంఘాల ప్రతినిధులు. రిజిస్టర్డ్ డెలిగేట్స్. వీళ్లు స్వచ్ఛందంగా పాల్గొనేవాళ్లు. వారి వారి స్థాయిని బట్టి, కోరుకున్నదాన్ని బట్టి ఏర్పాట్లు ఉంటాయి. సామాన్యులు ఎంతమేరకు పాల్గొనవచ్చు? అసలు పాల్గొనవచ్చా? నిరభ్యంతరంగా పాల్గొనవచ్చు. అయితే రిజిస్ట్రేషన్ చేసుకుంటే మంచిది. భోజనానికిగానీ సౌకర్యానికిగానీ బాగుంటుంది. లేకపోయినా గ్యాలెరీల్లో ఉండి వారు అన్ని చర్చలనూ వినొచ్చు, అన్ని ప్రదర్శనలనూ చూడొచ్చు. భోజనం కూడా వేదిక బయట సబ్సిడీకి అందించేలా వ్యాపారస్థులను ఒప్పిస్తున్నాం. సభల సందర్భంగా జరుగుతున్న ప్రచురణలు? మరుగునపడిన తెలంగాణ వైతాళికుల మీద తెలుగు అకాడమీ 70 మోనోగ్రాఫ్‌లు ప్రచురిస్తోంది. భాష, సాహిత్యాలకు సంబంధించి సాహిత్య అకాడమీ 10 పుస్తకాలు వెలువరిస్తోంది. సాంస్కృతిక శాఖ 8 పుస్తకాలు తెస్తోంది. తెలుగు విశ్వవిద్యాలయం ఒక ప్రత్యేక సంచిక వెలువరిస్తోంది. తెలంగాణ, పాలపిట్టలు కూడా ప్రత్యేక సంచికలకు సిద్ధమవుతున్నాయి. హెల్ప్‌లైన్ లాంటిది ఏమైనా ఏర్పాటు చేస్తున్నారా? ఈ సాహిత్య అకాడెమీ నంబర్లను సందేహాలున్నవారు సంప్రదించవచ్చు. 040–29703142/52. దానికంటే ముఖ్యంగా బస్టాండుల్లో, రైల్వే స్టేషన్లలో కియోస్క్ మిషన్లు ఉంటాయి. ప్రధాన కూడళ్లలో డిజిటల్ డిస్ప్లేలు ఉంటాయి. వాటిల్లో జరగబోయే కార్యక్రమాల సమాచారం వస్తుంది. దానికి అనుగుణంగా పాల్గొనాల్సిన కార్యక్రమాన్ని ఎంపిక చేసుకోవచ్చు. మహాసభల ఎనిమిది ఆశయాల్లో ఒకటి: ‘ఆధునిక సమాజ అవసరాలకు అనుగుణంగా తెలుగును అభివృద్ధి చేయడానికి సభలు మార్గదర్శనం చేస్తాయి. అన్ని రంగాలలో వ్యవహారాలు తెలుగులో జరిగేందుకు బాటలు పడతాయి’. ఒకవైపు ఆంగ్లమాధ్యమాన్ని ప్రభుత్వమే ప్రోత్సహిస్తున్నప్పుడు నిర్మాణాత్మకంగా ఈ సమస్యను ఎట్లా చూడాలి? ప్రభుత్వం ప్రజానుకూలమైన పాలన చేయాలి. సాధారణ ప్రజానీకం, శ్రామిక వర్గ సంతానం కూడా ప్రైవేటు ఇంగ్లిష్ మీడియం బడుల్లో చదివిస్తున్నారు. అప్పుడు ప్రభుత్వ విద్యాసంస్థల్ని కాపాడుకోవాల్సిన తప్పనిసరి పరిస్థితి వచ్చింది. అందరూ ఇంగ్లిష్ మీడియం వైపు ఎందుకు మళ్లుతున్నారు? ఇంగ్లిష్ వస్తే ఉద్యోగాలు వస్తాయని బలంగా ముద్రపడింది. ఎవరికీ ప్రత్యేకంగా భాష మీద ప్రేమ వుండదు. జీవితం మీద ప్రేమ వుంటుంది. ఆ జీవితాన్ని నిలుపుకోవాలంటే ఉద్యోగం కావాలి. ఆ ఉద్యోగం కోసం ఇంగ్లిష్. వాళ్లకు ఇంగ్లిష్ మీద ప్రేమ లేదు, తెలుగు మీద ప్రేమ లేదు. ఐఐటీ పెద్ద చదువు, ఎంఏ తెలుగు పనికిరానిదైంది. ఐఐటీలో పెద్ద శాలరీ వస్తుంది. శాలరీ ఎక్కువున్నవాళ్లు ఎక్కువ గౌరవం పొందుతారు. ఇదంతా కూడా ఉద్యోగ కల్పన మీద ఆధారపడిన అంశం. అందుకే ప్రభుత్వం సాధారణ ప్రజానీకంతో వ్యవహరించే ఉద్యోగులందరికీ తెలుగు రావాలనే నిబంధన పెడుతోంది. అప్పుడే కదా వాళ్ల సమస్యలు బాగా అర్థం చేసుకో గలుగుతారు. రెండోది: తెలుగు పండిత్‌ల కోసం పదివేలకు పైగా ఉద్యోగాల కల్పన చేయబోతోంది. అలాగే, భాష అనేది ఉద్యోగానికి సంబంధించినదే కాదు. భాషతో వ్యక్తిత్వ నిర్మాణం జరగుతుంది. కాబట్టి, తెలుగును రక్షించాలంటే భాషకు సంబంధించిన చైతన్యం కూడా ప్రచారం కావాలి. ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ తెలుగు వేరే, మిగతా తెలుగు వేరే అన్న వాదనలు, చర్చలు జరిగాయి. ఒకవిధంగా తెలంగాణ తెలుగు వేరే అనే నమ్మించడానికి ప్రయత్నం జరిగింది. ఇప్పుడు దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఒక అవమానం నుంచి, తృణీకరణలోంచి, మీది తెలుగు కాదు అన్న విపరీతవాదనలోంచి ఉప్పొంగినది తెలంగాణ ఉద్యమం. అలాంటి స్థితిలో ఇంకొక చివరిదాకా వెళ్లి మా భాష వేరే అని మాట్లాడాల్సిన అవసరం ఏర్పడింది. అదొక భావోద్వేగపూరిత ప్రకటన. ఇప్పడు తెలంగాణ ఏర్పడ్డాక ఎవరూ భాషమీద ఆధిపత్యం చేయడానికి కుదరదు. ఆ ఉద్వేగ దశను దాటిపోయినం కాబట్టి, తెలంగాణలో తెలుగు ముద్రను బలంగా వినిపించాల్సిన సమయం వచ్చింది. ఎన్ని ప్రాంతాల్లో, ఎన్ని తీర్లుగ మాట్లాడినా తెలుగు తెలుగే. తమిళనాడు, మహారాష్ట్ర, కోస్తా, రాయలసీమ అంతటావున్నది తెలుగే. ఇవన్నీ సమన్వయం జరిగితేనే అసలు తెలుగు బయటికి వస్తుంది. ఊదు గాలది పేరు లెవ్వది అని ఒక సామెత. పనిగాదు, అని అర్థం. దీన్ని వ్యాప్తిలోకి తీసుకుపోతే అందరూ వాడుకోగలుగుతారు కదా! తెలంగాణ పదాలు, నుడికారాలు, జాతీయాలు, సామెతలను సముచిత స్థానంలో నిలబెడితే తెలుగు భాష మరింత వికసిస్తుంది. నలభై ఏళ్ల తర్వాత.. 2500 ఏళ్ల ‘తెలుగు వెన్నెల సోన మన తెలంగాణ’ అంటూ హైదరాబాద్ వేదికగా 2017 ప్రపంచ తెలుగు మహాసభలు డిసెంబర్ 15–19 వరకు జరగనున్నాయి. 1975లో మొదటి ప్రపంచ మహాసభలు హైదరాబాద్‌లో జరిగాయి. తర్వాత 1981లో మలేషియా రాజధాని కౌలాలంపూర్‌లోనూ, 1990లో మారిషస్‌లోనూ జరిగాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2012లో తిరుపతిలో జరిగిన తర్వాత మళ్లీ నలభై ఏళ్లకు హైదరాబాద్‌లో జరుగుతున్నాయి. ప్రస్తుత మహాసభలు ప్రకటించుకున్న ఎనిమిది ఆశయాలు: ⇒ప్రపంచ తెలుగు మహాసభల ద్వారా తెలంగాణ జాతి ఖ్యాతి ప్రపంచానికి విదితమౌతుంది. ⇒తెలుగు భాషాభివృద్ధిలో తెలంగాణ సాహిత్యమూర్తుల కృషికి తగిన గౌరవం లభిస్తుంది. వారి మహత్తర సేవలను ఈ సభలు ప్రపంచానికి చాటుతాయి. ⇒తెలంగాణ కళా వైభవం సభలలో సాక్షాత్కరిస్తుంది. ⇒వివిధ దేశాలలో, వివిధ రాష్ట్రాలలో స్థిరపడిన తెలుగు భాషాభిమానులందరి మధ్య సుహృద్భావ సంబంధాలు నెలకొంటాయి. ప్రత్యేక ప్రచురణలు తెలంగాణ దృక్పథంతో నూతన అధ్యాయానికి తెరతీస్తాయి. ⇒సదస్సులు నూతన రీతులకు నాంది పలుకుతాయి. ⇒ఆధునిక సమాజ అవసరాలకు అనుగుణంగా తెలుగును అభివృద్ధి చేయడానికి సభలు మార్గదర్శనం చేస్తాయి. అన్ని రంగాలలో వ్యవహారాలు తెలుగులో జరిగేందుకు బాటలు పడతాయి. ⇒కొత్త తరానికి సాహిత్య స్ఫూర్తిని అందిస్తాయి. ⇒తెలంగాణ ప్రజలలో సాహిత్య సాంస్కృతిక ఉత్తేజం వెల్లివిరుస్తుంది. ఎల్బీ ప్రధాన వేదిక ఎల్బీ స్టేడియం తెలుగు మహాసభల ప్రధాన వేదిక. ఇన్డోర్, ఔట్‌డోర్ స్టేడియాల్లో కార్యక్రమాలు జరుగుతాయి. రవీంద్రభారతిలో మూడు వేదికలు. ఇంకా తెలుగు యూనివర్సిటీ ఆడిటోరియం, ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియం ఉంటాయి. అదనంగా లలితకళా తోరణమా? పీపుల్స్ ప్లాజా? అన్నది ఇంకా నిర్ణయం జరగాల్సివుంది. లైవ్ ప్రదర్శనలకు పీపుల్స్ ప్లాజా అయితే బాగుంటుందని అనుకుంటున్నారు. -
తెలంగాణ సాహిత్యం ‘ప్రత్యేకం’
* ఉద్యమం, రాష్ట్ర ఏర్పాటులో కీలకపాత్ర * పోటీ పరీక్షల్లో వచ్చే ప్రశ్నల సరళిపై నిశిత పరిశీలన అవసరం * తెలుగు సాహిత్యంపై నందిని సిధారెడ్డి ఇంటర్వ్యూ * సాహిత్యంలో ప్రశ్నలు ఎలా అడిగారన్న అవగాహనతో జవాబులు రాయాలని సూచన తెలంగాణ ఉద్యమంలో సాహిత్యానికి ఉన్న పాత్ర ప్రత్యేకమైంది. సాహిత్యంతోపాటు సంస్కృతి, కళలు ప్రజలను ఏకం చేసి ఉద్యమం వైపు నడిపించాయి, ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకునేలా తోడ్పడ్డాయి. ఈ నేపథ్యంలో కొత్త రాష్ట్రంలో ఉద్యోగులుగా చేరబోయే వారికి తెలంగాణ సాహిత్యం, సంస్కృతి, కళలు, పాటల ప్రాధాన్యం తెలిసి ఉండాలి. అందుకే టీఎస్పీఎస్సీ వివిధ ఉద్యోగాల భర్తీకి నిర్వహించే పరీక్షల్లో వీటిపై కచ్చితంగా ప్రశ్నలు ఉంటాయి. ఉద్యమ సమయంలో సాహిత్యంతో చైతన్యం తెచ్చిన వారిలో నందిని సిధారెడ్డి ఒకరు. ‘నాగేటి సాళ్లల్లో నా తెలంగాణ..’ వంటి పాటలు, రచనలతో ఉద్యమానికి చేదోడుగా నిలిచిన ఆయన టీఎస్పీఎస్సీ సిలబస్ కమిటీలో సభ్యుడిగా ఉన్నారు. పోటీ పరీక్షలకు సిలబస్‌ను ప్రకటించిన నేపథ్యంలో సాహిత్యం విషయంలో అభ్యర్థులు ఎలా సిద్ధం కావాలన్న అంశాలపై నందిని సిధారెడ్డి ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూ విశేషాలు... సాక్షి, హైదరాబాద్: కొత్త రాష్ట్రంలో ఉద్యోగంలోకి వచ్చే వారికి తెలంగాణ ఉద్యమ సమయం, అంతకుముందు తెలంగాణ సాహిత్య చరిత్ర తదితర అంశాలపై అవగాహన ఉండాలన్నదే ప్రతి ఒక్కరి ఉద్దేశం. ప్రధానంగా గ్రూప్-1 జనరల్‌స్టడీస్‌లో 11వ అంశంగా, గ్రూప్-2 జనరల్ స్టడీస్‌లో 7వ అంశంగా ‘సొసైటీ కల్చర్ హెరిటేజ్ ఆర్ట్స్ అండ్ లిటరేచర్ ఆఫ్ తెలంగాణ’ గురించి ఉంటుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ సాహిత్యాన్ని ప్రత్యేకంగా చదువుకోవాలి. అభ్యర్థులు దృష్టి సారించాల్సిన ప్రధాన అంశాలివి.. సంస్కృతి: ఒక జాతి జీవన విధానమే సంస్కృతి. ఆచార వ్యవహారాలు వేషభాషలు, అలవాట్లు, పండుగలు, వేడుకలు. సుఖదుఃఖాలు, భావోద్వేగాలు, కళలు, సాహిత్యం మతం, రాజకీయాలు అన్నింటి మౌలిక అంశాలు సంస్కృతిలో ఉంటాయి. తెలంగాణ సాహిత్యం, భాష: భాషకు సంబంధించిన చర్చను సంస్కృతిలో భాగంగా అధ్యయనం చేయా లి. తెలుగు మౌలిక స్వరూపం తెలంగాణ భాషలోనే ఉంది. అనేక శాసనాలు దీనిని చెబుతున్నాయి. తెలంగాణ అనే పదం ఆధారంగానే ఏర్పడింది తెలుగు. ఆదివాసులైన గోండుల మూల పురుషుడికి నలుగు రు కొడుకులు. వారు టేకం, మాసం, పూనం, తెలిం గం. నాలుగో కొడుకు తెలింగం. అతని సంతతిగా ఉన్నవారే తెలుంగులు లేదా తెలంగాణ వారు. తెలుంగు ఆధారంగానే ఇక్కడ ఏర్పడిన సంతతికి తెలుంగణం అనే పేరుంది. 15వ శతాబ్దానికి సంబంధించిన ఒక శాసనంలో తెలంగాణపురం అనే ప్రస్తావ న ఉంది. దాని ఆధారంగానే తెలంగాణ అనేది తెలు గు యొక్క ప్రాతినిధ్యాన్ని సూచిస్తుందని అర్థం చేసుకోవాలి. ఈ అంశాలను కచ్చితంగా తెలుసుకోవాలి. కళలు: ఇప్పుడు కళలన్నీ (జానపద కళలు, సంప్రదాయ కళలు) బతికి ఉన్న ప్రాంతం ఏదంటే తెలంగాణ అనే చెప్పాలి. తెలంగాణలో జానపద కళకు ఎంత ప్రాధాన్యం ఉందో ఉద్యమ కాలంలో కళలకు అంతే ప్రాధాన్యం ఉంది. 18 ఏళ్ల ఉద్యమకాలంలో విసృ్తతంగా ప్రజల్లో నానింది గానకళ. పాట అనేది తెలంగాణ ప్రజల ప్రతి మూలమలుపులో, ప్రజల భావోద్వేగాల్లో ఉంది. ఉద్యమానికి పాట ప్రక్రియ వేదికగా నిలిచింది. దీనిని గమనంలోకి తీసుకోవాలి. తెలంగాణలో శిల్పకళ బాగా వర్ధిల్లింది. రామప్ప అనే శిల్పి పేరున దేవాలయమే ఉంది. ఆయన చెక్కిన నాగిని శిల్పం, ఒక స్త్రీ కాలికి ముల్లు గుచ్చితే తీస్తున్నట్లు చెక్కిన శిల్పం అరుదైనవి. అలాగే వేయి స్తంభాల గుడి, కాకతీయుల కాలపు కళాతోరణం ఇక్కడి శిల్పకళకు ప్రతీకగా చెప్పవచ్చు. అంతర్జాతీయ ఖ్యాతి చెందిన చిత్రకారులు ఇక్కడి వారే. కాపు రాజయ్య, లక్ష్మాగౌడ్, వైకుంఠం, పీటీ రెడ్డి వంటి వారు ఎంతో ఆదరాభిమానాలు పొందారు. ఇంకా వెలుగు చూడాల్సిన పెయింట్స్ అనేక గుహల్లో ఉన్నాయి. వాటిపై పరిశోధన, అన్వేషణ జరగాలి. సాహిత్యం: శాతవాహనుల కాలానికి సంబంధించి ప్రాకృత సాహిత్యం, అనంతర దశలో చాళుక్య యుగంలో సంస్కృత సాహిత్యం, కాకతీయులకు ముందు దశలో ఉన్న కుర్క్యాల సాహిత్యం ఉన్నాయి. 946 సంవత్సరానికి సంబంధించిన కుర్క్యాల శాసనంలో సాహిత్యం పరిఢవిల్లినట్లు ఉంది. అందులో మూడు కంద పద్యాలు ఉన్నాయి. నన్నయ కంటే ముందు యుగానిదీ శాసనం. నన్నయ మహాభారతం రచన కంటే ముందే ఇక్కడ పద్య రచన ఉన్నట్లు ఈ శాసనం చెబుతోంది. నన్నయ-సోమన మధ్య తేడా..: ఇక కాకతీయుల యుగం నాటిది శైవ సాహిత్యం. పాల్కురికి సోమన తెలంగాణకు సంబంధించిన ఆదికవి. స్థానికంగా జీవించిన శైవభక్తుల కథలను ఆయన సాహిత్యానికి వస్తువుగా స్వీకరించారు. నన్నయ్యది అనువాద సాహిత్యమైతే సోమనది స్వతంత్ర సాహిత్యం. ఇక్కడ జానపద సాహిత్యం ఎంత విస్తృతంగా ఉందో ఆయ న రచనల్లో పేర్కొన్నారు. ఆయన రాసిన వృశాధిప శతకం తెలుగులోనే మొదటి శతకం. అయితే అభ్యర్థు లు పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేపుడు సాధారణంగా ఆదికవి ఎవరని అడిగితే నన్నయ అనే రాయాలి. తెలంగాణ ఆదికవి ఎవరు? లేదా మన ఆదికవి ఎవరని అడిగితే సోమనాథుడు అని రాయాలి. యుగ విభజన ఎలా చేయాలంటే..: తెలుగు సాహిత్యం అధ్యయనంలో సోమనాథుని కేంద్రంగా సాహిత్య యుగ విభజన చేయాలి. 1.సోమనకు పూర్వయుగ సాహిత్యం, పరిశీలన; 2.సోమన యుగ సాహిత్యం; 3.బమ్మెర పోతన యుగం సాహిత్యం; 4.కురవి గోపరాజు యుగ సాహిత్యంగా విభజన చేసుకొని చదువుకోవాలి. సోమన యుగ సాహిత్యం తె నుగు భాషలో, దేశీ చందస్సులో (ద్విపద సాహిత్యంలో) ఉండగా... పోతన సంస్కృతాన్ని తెలుగును కలిపి మధ్యేమార్గంలో కవిత్వాన్ని రాశారు. ఇక కురవి గోపరాజు యుగంలో చాలా సాహిత్యం వచ్చింది. ఇది కుతుబ్‌షాహీల పరిపాలనకు సంబంధించింది. ఈ కాలంలోనే తెలుగులో అచ్చతెనుగు కావ్యం వచ్చింది. అది పొన్నగంటి తెలగన రాసిన యయాతి చరిత్ర. గోపరాజు సింహాసన ద్వాత్రింశిక అనే కావ్యం రాశారు. అలాగే అద్దంకి గంగాధర కవి తపతి సంహరణోపాఖ్యానం రాశారు. మల్లారెడ్డి రాజుగా ఉండి షట్చక్రవర్తి చరిత్ర రాశారు. ఆధునిక సాహిత్యం: ఆధునిక సాహిత్యాన్ని ప్రత్యేకంగా అధ్యయనం చేయాలి. 19వ శతాబ్ది అనంతరం కాలం అంతా ఆధునిక సాహిత్యం. 20వ శతాబ్దంలో ప్రపంచవ్యాప్తంగా అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. తెలంగాణ చరిత్ర అనేక మలుపులు తిరిగిం ది. ఈ శతాబ్దంలోనే తెలంగాణలో కథ, నవల, వచన కవిత, పాట, పద్యం, నాటకం, వ్యాసం, విమర్శ, ఆత్మకథలు, గేయ కవిత వచ్చాయి. మిగతా ప్రాంతా ల్లో లేనట్లుగా ఇక్కడ సామాజిక ఉద్యమాలు విరివిగా జరగడం వల్ల సాహిత్యం దానిని ప్రతిఫలించింది. తొలి ఉద్యమంలో...: నిజాం రాచరిక పాలనకు వ్యతిరేకంగా ప్రజలు సాయుధ ఉద్యమం చేశారు. అది సాహిత్యంలో ప్రతిబింబించింది. వీటిని చిత్రిస్తూ సురవరం ప్రతాపరెడ్డి పలు రచనలు రాశారు. అలాగే నిజాం ఆంధ్రలో తెలుగు కవులు పూజ్యం అని ముడుంబై రాఘవాచార్యులు అనే పండితుడు పేర్కొంటే సురవరం ప్రతాపరెడ్డి స్పందించి ఇక్కడి తెలుగు కవులు రాసిన 354 కవితలను సేకరించి గోలుకొండ కవుల పేరుతో సంచిక వేశారు. అయితే దీనిని తెలుగు సాహిత్య చరిత్రలో పేర్కొనలేదు. ఇది ఆంధ్రా కవుల వివక్షకు నిదర్శనం. ఇక వట్టికోట ఆళ్వారు స్వామి ప్రజల మనిషి, గంగు లాంటి నవలలు రాశారు. దాశరథి రంగాచార్యులు జానపదం, మోదుగుపూలు నవలలు రాశారు. నెల్లూరు కేశవస్వామి యుగాంతం వంటి కథ రాశారు. ఆవుల పిచ్చయ్య కథలు, దాశరథి కథలు రాశారు. కవితలు: దాశరథి రాసిన అగ్నిధార, కాళోజీ రాసిన నా గొడవ, సుద్దాల హన్మంతు పాటలు, బండి యాదగిరి (బండెనుక బండి కట్టి) వంటివన్నీ అప్పటి పోరాటాన్ని చిత్రించాయి. 1950లలో విశాలాంధ్ర సాహిత్యం: ఇక తరువాతి కాలంలో తెలుగు వాళ్లకు ఒక రాష్ట్రం ఉండాలనే ఉద్యమం నడిచింది. అందులో తెలంగాణ ప్రజలు రెండు భాగాలుగా ఆలోచించారు. విశాలాంధ్ర సాహిత్యం వచ్చింది. దాశరథి రాసిన మహాంధ్రోదయం, వనమామలై వరదాచర్యులు రాసిన కవిత్వాలు వచ్చాయి. దేవులపల్లి రామానుజరావు రాసిన వ్యాసాలు విశాలాంధ్ర వైపు నడిపించాయి. 1969లో రెండో ఉద్యమం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ ప్రజలు పడిన ఇబ్బందులు, వివక్ష, అణ చివేత, అన్యాయానికి వ్యతిరేకంగా 1969లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం వచ్చింది. ఇందులో సాహిత్యం, పాటలు వచ్చాయి. ఈ సమయంలో ప్రజలకు అండగా నిలిచి అన్ని భావోద్వేగాలను ప్రకటించిన కవి కాళోజీ నారాయణరావు. భాషా సాహిత్యాన్ని ప్రశ్నిస్తూ అనేక కవితలు రాశారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని సమర్థించారు. విశాలాంధ్రవాదం నుంచి ప్రత్యేకవాదంపైకి వచ్చారు. విప్లవోద్యమం: ఆ తరువాత విప్లవోద్యమం. మూడు దశాబ్దాలపాటు విప్లవోద్యమం ప్రధానంగా సాగింది. ఇది మూడో పెద్ద సామాజిక ఉద్యమం. ఈ సమయంలో చాలా సాహిత్యం వచ్చింది. చెరబండరాజు, వరవరరావు వంటి వారు జైలు జీవితం అనుభవిస్తూ సాహిత్యం సృష్టించారు. గూడ అంజయ్య (ఊరు మనదిరా), గద్దర్ (సిరిమల్లే చెట్టుకింద లచ్చుమమ్మా) వంటి పాటలు విసృ్తతంగా ప్రజా బాహుళ్యంలోకి వెళ్లాయి. వరవరరావు రాసిన భవిష్యత్తు చిత్రపటం కవిత సంపుటిని అప్పటి ప్రభుత్వం నిషేధించింది కూడా. సంస్కృతి: సంస్కృతులు, పండుగల్లో తెలంగాణ ముద్ర ఉన్న వాటిపై దృష్టిపెట్టాలి. బతుకమ్మ, బోనాలు, పీరీలు, దసరా వంటివి తెలుసుకోవాలి. పీరీల పండుగ ముస్లింలది అయినా హిందువులు ఆడుతారు. మత సామరస్యం, ఐక్యత. సహజీవనానికి ఇది ప్రతీక. ఇక్కడ ఎక్కువగా తిరుగుబాట్లు, ఉద్యమాలు ఉన్నాయి. ఇవన్నీ సంస్కృతిలో భాగమే. ఎలా చదవాలంటే... సిలబస్‌పై అవగాహన తెచ్చుకోవాలి, తరువాత కావాల్సిన సమాచారం, గ్రంథాలను సేకరించుకోవాలి. వాటి ప్రత్యేకతలను గుర్తించి చదువుకోవాలి. సాహిత్యం, చరిత్ర, సంస్కృతి ఏ అంశమైనా వాటి ప్రత్యేకతలను గుర్తించాలి. ప్రత్యేకతలపైనే ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు తొలి రచనను ప్రత్యేక అంశంగా భావించవచ్చు. కొన్నిసార్లు ఉద్యమ ప్రతిబింబంగా ఉన్న రచనలను ప్రత్యేకంగా భావించవచ్చు. కొన్నిసార్లు వస్తురూపాల మేళవింపు ప్రాచుర్యాన్ని ప్రత్యేకంగా భావించ వచ్చు. ఉదాహరణకు తడకమళ్ల కృష్ణారావు 1860లో రాసిన కంబుకందర చరిత్ర తెలంగాణ మొదటి నవల అంటాం. కాని దానికి నవల లక్షణాలు లేవన్న వాదన వచ్చింది. అయినా తెలంగాణ మొదటి నవలగా దానినే పేర్కొంటాం. అయితే నవలల్లో పరిణతి పొందిన నవల ఏదంటే వట్టికోట ఆళ్వారుస్వామి రాసిన ప్రజలమనిషి. నవలల్లో ప్రత్యేకమైన శిల్పాన్ని సాధించిన వ్యక్తిగా అంపశయ్య నవీన్ ‘అంపశయ్య’ను చెప్పవచ్చు. హాస్టల్ విద్యార్థి ఒకరోజు దినచర్యలను చైతన్య స్రవంతి శిల్పంలో నవీన్ రాసిన నవల అంపశయ్య. అలాంటి ప్రత్యేకతను గుర్తించాలి. మలిదశ ఉద్యమం అందరి కళ్ల ముందు జరిగిందీ, తెలంగాణ కలసాకారమైందీ మలి దశ ఉద్యమంతోనే. ఈ సమయంలో వచ్చిన అల్లం రాజయ్య కథలు, తుమ్మేటి రఘోత్తమరెడ్డి కథ, బీఎస్ రాములు కథలు, సాహు కథలు ప్రత్యేకంగా చదువుకోవాలి. ఆ సమయంలోనే వచ్చిన కొమురం భీం నవలా ముఖ్యమైందే. ఈ మలిదశ ఉద్యమంలో సాహిత్యం కీలక పాత్ర పోషించింది. గోరటి వెంకన్న, గద్దర్, సిధారెడ్డి, గూడ అంజయ్య, అంద్శైమొదలైనవాళ్లు తెలంగాణ ఉద్యమాన్ని పదును పెట్టే పాటలు అందించారు. సుంకిరెడ్డి నారాయణరెడ్డి సంపాదకత్వంలో వచ్చిన మత్తడి, పొక్కిలి, వేముగంటి మురళీకృష్ణ మునుము రచనలు ఉద్యమాలకు ప్రతిబింబంగా నిలిచాయి. అందుబాటులో ఉన్న పుస్తకాలు.. సాహిత్యంలో: ముదిగంటి సుజాతారెడ్డి రాసిన తెలంగాణ సాహిత్య చరిత్ర. ఎస్సీ రామారావు రాసిన తెలంగాణ సాహిత్య చరిత్ర, తూర్పు మల్లారెడ్డి సంపాదకత్వంలో వచ్చిన తెలంగాణ సాహిత్యం జీవిత చిత్రణం. సంస్కృతికి సంబంధించి: ఇగురం-తెలంగాణ భాష సాంస్కృతిక వ్యాసాలు. వట్టికోట ఆళ్వారుస్వామి సంకలనం చేసిన తెలంగాణం - తెలంగాణ సంస్కృతి సాంస్కృతిక ప్రచురించిన ఆర్ట్ ఎట్ తెలంగాణ పుస్తకాలు చదవొచ్చు. -
విద్యారంగంపై విషం
సిద్దిపేట అర్బన్: దేశ వికాసానికి మూలమైన విద్యపై విషం చిమ్ముతున్నారని సంఘటిత పోరాటంతో అడ్డుకోకుంటే ప్రమాదమని తెలంగాణ రచయితల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నందిని సిధారెడ్డి హెచ్చరించారు. సిద్దిపేట ఎన్జీఓ భవన్లో సోమవారం రాత్రి విద్యా పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ విద్యారంగంలో విలువలు మంటగలిసి పోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యలో వ్యాపారీకరణ పెరుగుతోందన్నారు. పాలకుల బాధ్యతా రాహిత్యం వల్ల ఏర్పడుతున్న సంక్షోభాన్ని ఎదుర్కోవాలన్నారు. ప్రభుత్వ యాజమాన్యంలోనే విద్యా రంగం ఉండాలన్నారు. టీవీ, సినిమాల ప్రభావం విద్యార్థులను శాసించే స్థాయికి ఎదగడం సరికాదన్నారు. హైదరాబాద్ యునివర్సిటీ ప్రొఫెసర్ కె. లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ప్రశ్నించలేని వారు మేధావులు కాదన్నారు. పెట్టుబడి దారులు విద్యను ధ్వంసం చేస్తున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం విద్యను కాషాయీకరణ దిశగా మళ్లించడం సరికాదన్నారు. అమెరికా, యూరప్‌లో కామన్ స్కూల్ విద్య కొనసాగుతుండగా ఇక్కడెందుకు అమలు కావడం లేదన్నారు. తెలంగాణ రాష్ట్రంలో నాలుగు లక్షల మంది బాల కార్మికులను విద్యా స్రవంతిలో కలపాలన్నారు. 71 శాతం ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్లు సరిగా లేరని, 76 శాతం పాఠశాలల్లో గదులు సరిగా లేవన్నారు. కాంట్రాకుటు బోధన ప్రమాదకరమన్నారు. ప్రభుత్వం అందరికి సమాన విద్యను అమలు చేస్తేనే సమసమాజం ఏర్పడుతుందన్నారు. సమావేశానికి విద్యా పరిరక్షణ కమిటీ జిల్లా కన్వీనర్ తిరుపతిరెడ్డి అధ్యక్షత వహించగా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ స్వాగతం పలికారు. సభలో గురుకుల పాఠశాలల సంఘం అధ్యక్షుడు రవిచంద్రన్, రాష్ట్ర ఉన్నత విద్యా మండలి సభ్యులు పాపయ్య, జేఏసీ పశ్చిమ జిల్లా కన్వీనర్ అశోక్‌కుమార్, పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడు గౌతం ప్రసాద్, కార్యదర్శి యాదగిరి, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు స్టాలిన్, డీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కిష్టప్ప, జేవైఎల్ రాష్ట్ర అధ్యక్షుడు అన్వేష్, టీపీఎఫ్ రాష్ట్ర నేతలు సత్తయ్య, నర్సింలు తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు సిద్దిపేట హైస్కూల్ నుంచి మెదక్ రోడ్డు, పాతబస్టాండ్, సుభాష్‌రోడ్, మెయిన్ రోడ్ల మీదుగా భారీ ర్యాలీ నిర్వహించారు. -
కొందరు కేంద్ర మంత్రులు.. అమెరికా ఏజెంట్లు
* చిదంబరం వల్లే ఆర్థిక వ్యవస్థ ఛిన్నాభిన్నం * మతతత్వాన్ని ప్రేరేపిస్తున్న నరేంద్రమోడీ * హెచ్‌సీయూ ప్రొఫెసర్ జి.హరగోపాల్ జమ్మికుంట, న్యూస్‌లైన్: చిదంబరం, కపిల్‌సిబాల్, కమల్‌నాథ్‌తో పాటు మరికొంత మంది కేంద్ర మంత్రులు అమెరికా ఏజెంట్లుగా పనిచేస్తున్నారని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ జి.హరగోపాల్ ఆరోపించారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో రెండు రోజులుగా జరుగుతున్న డీటీఎఫ్ జిల్లా విద్యా మహాసభల్లో సోమవారం ఆయన ‘ప్రజాస్వామ్యం, స్వాలంబన’ అనే అంశం పై ప్రసంగించారు. స్వాలంబన అనే భావనను అత్యుత్తమ స్థాయికి తీసుకువచ్చిన మహోత్తమ వ్యక్తి గాంధీజీ అని చెప్పారు. నాల్గవ పంచవర్ష ప్రణాళికలో ఇందిరాగాంధీ దేశం పూర్తిస్థాయిలో స్వాలంబన సాధిస్తుందని పేర్కొనగా, ప్రపంచబ్యాంకు అభ్యంతరం చెప్పడంతో ఆ ప్రణాళిక లక్ష్యాన్ని మార్చాల్సి వచ్చిందని చెప్పారు. దేశం గట్టిగా నిలబడి మాట్లాడి ప్రశ్నిస్తే స్వాలంబన వస్తుంది కానీ, అమెరికా ఆదేశాల ప్రకారం నడుస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్థిక వ్యవస్థ మొత్తం చిదంబరం వల్లనే ఛిన్నాభిన్నమైందని ఆరోపించారు. పాలకులకు ఆర్థిక జాతీయవాదం ఉండాలి కానీ.. సాంస్కృతిక జాతీయవాదం కాదన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో దేశంలో కాంగ్రెస్ పార్టీ గెలువడం కష్టతరమని హరగోపాల్ అభిప్రాయపడ్డారు. భావి భారత ప్రధానిగా ప్రచారం చేసుకుంటున్న మోడీ మతతత్వాన్ని ప్రేరేపిస్తున్నారన్నారు. ప్రజల పోరాటాలే రాజకీయాల్ని మారుస్తాయని, దేశంలోనే తెలంగాణ ప్రజలకు ప్రజాస్వామ్య సంస్కృతి ఎక్కువని పేర్కొన్నారు. ‘తెలంగాణలో సాహితోద్యమాలు’ అనే అంశం పై రచయితల వేదిక వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ నందిని సిధారెడ్డి ప్రసంగించారు.