పుస్తకంగా ‘ఆచ్చీ’ జీవితగాధ | Padma singh Isaac life story book released | Sakshi
Sakshi News home page

పుస్తకంగా ‘ఆచ్చీ’ జీవితగాధ

Published Thu, Dec 22 2016 4:34 AM | Last Updated on Mon, Sep 4 2017 11:17 PM

Padma singh Isaac life story book released

కొరుక్కుపేట(చెన్నై): ప్రముఖ మసాల ఉత్పత్తి సంస్థ ఆచ్చీ వ్యవస్థాపకుడు ఏడీ పద్మాసింగ్‌ ఐజక్‌ జీవిత గాథను పుస్తకం రూపంలో తీసుకొచ్చారు. తోల్వియై రుసియింగల్‌.. వెట్రియయ్‌ రసియింగల్‌ (ఓటమిని స్వీకరిద్దాం... గెలుపును ఆస్వాదిద్దాం) పేరుతో ఈ పుస్తకాన్ని ఎస్‌.బాలఅముదా రచించారు. తమిళనాడు కేంద్రంగా ప్రపంచ వ్యాప్తంగా ఆచ్చీ సంస్థ ఉత్పత్తులకు మంచి ఆదరణ ఉంది. ఈ సంస్థకు వ్యవస్థాపక చైర్మన్‌గా ఏడీ.పద్మాసింగ్‌ ఐజక్‌ వ్యవహరిస్తున్నారు.

ఓటమి నుంచి గెలుపు అంచులకు ఎదిగిన ఆయన జీవితం మరెందరికో మార్గదర్శకం కావాలన్న ఉద్దేశంతో ఈ పుస్తకాన్ని అముదా సిద్ధం చేసినట్లు అముదా తెలిపారు. తమిళంలోనే కాకుండా, ఈ పుస్తకాన్ని ఆంగ్లంలోనూ అనువదించారు. చెన్నైలోని ఓ హోటల్‌లో మంగళవారం రాత్రి జరిగిన కార్యక్రమంలో పుస్తకాన్ని(తమిళం) తమిళనాడు విద్యాశాఖ మంత్రి కే.పాండియరాజన్, ఆంగ్ల వర్షెన్‌ వీజీపీ గ్రూప్‌ ప్రతినిధి డాక్టర్‌ వీజీ సంతోషం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పద్మాసింగ్‌ ఐజక్, ఆయన భార్య తెల్మా ఐజక్, కుమారుడు అశ్విన్‌పాండియన్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement