సాక్షి, హైదరాబాద్: సీనియర్ పాత్రికేయుడు, ‘సాక్షి’ దినపత్రికలో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా పని చేస్తున్న పట్నాయకుని వెంకటేశ్వరరావు రచించిన ‘వీఆర్ గుండెచప్పుళ్లు’ కవితా సంపుటిని బంజారాహిల్స్‌లోని ‘సాక్షి’ ప్రధాన కార్యాలయంలో ఎడిటర్ వి.మురళి ఆవిష్కరించారు. కార్యక్రమంలో సాక్షి ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ దిలీప్‌రెడ్డి, అసోసియేట్ ఎడిటర్ రాజమహేందర్‌రెడ్డి, క్వాలిటీసెల్ ఇన్‌చార్జి శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మనిషి దైనందిన జీవితంలోని అనేక పరిణామాలపై వెంకటేశ్వర్‌రావు ఎప్పటికప్పుడు స్పందిస్తూ అక్షరీకరించారు. ఇటీవల అనంతపురంలో జరిగిన కవి సమ్మేళనంలో ఆయన రాసిన ‘ఉరితాడు వరిస్తానంటావేంటి’ కవిత ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment