చాంగ్ భళా
కూచిపూడి నాట్య భంగిమలతో అచ్చమైన భారతీయాన్ని ఆవిష్కరించారు విదేశీయులు. గచ్చిబౌలి హెచ్‌సీయూలో మంగళవారం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. స్టడీ ఇండియా ప్రోగ్రామ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ఫెస్ట్‌లో కోర్సు పూర్తి చేసుకున్న విదేశీ విద్యార్థినులు నాట్యంతో పాటు సితార ప్లే చేశారు. భారతీయ గీతాలు ఆలపించి, హిందీ కవితలు వినిపించి అబ్బుర పరిచారు. జపాన్, సౌదీ, అమెరికా, జర్మనీ, స్వీడన్, ఇరాన్‌లకు చెందిన 200 మంది తమ టాలెంట్ చూపి ఆకట్టుకున్నారు.
- సెంట్రల్ యూనివర్సిటీ