మేడారం జాతర సందర్భంగా ఆదివారం సమ్మక్క–సారక్క గద్దెకు తరలివచ్చిన భక్తులు
తెలంగాణ కుంభమేళా.. వనదేవతల జాతర ఇప్పటికే భక్తజనంతో పోటెత్తుతోంది. ఈ నెల 16నుంచి 19వ తేదీ వరకు జాతర జరగనుంది. ఈ నాలుగు రోజుల పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి సొంత వాహనాల్లో వస్తుంటారు. ట్రాఫిక్‌ను దృష్టిలో పెట్టుకుని పోలీసులు పోయేదారి.. వచ్చేదారి అంటూ వన్‌వే చేశారు. జాతరకు భక్తులు ఎక్కువగా అటవీ ప్రాంతంలోని చిన్నచిన్న పల్లెల మీదుగా వెళ్లాల్సి ఉంటుంది. వాహనాల పార్కింగ్, తిరుగు ప్రయాణం ఎలా అన్న అనుమానాలు చాలామందిలో ఉంటాయి. భక్తుల అవసరార్థం.. ప్రయాణం సాఫీగా సాగేందుకు పోలీసులు రూట్‌మ్యాప్‌ను విడుదల చేశారు. ఆ మ్యాప్‌ను మరింత సరళతరం చేసి ‘సాక్షి’ మీకు అందిస్తోంది.
– సాక్షిప్రతినిధి, వరంగల్
హైదరాబాద్..
హైదరాబాద్ నుంచి మేడారం వెళ్లే భక్తులు నేషనల్ హైవే–163 ద్వారా జనగామ మీదుగా రఘునాథపల్లి, స్టేషన్‌ఘన్‌పూర్, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ సమీపంలో భువనగిరి–ఆరెపల్లి బైపాస్ ఎక్కాలి. ఆరెపల్లి నుంచి నేరుగా ఆత్మకూరు, మల్లంపల్లి, ములుగు, పస్రా.. నార్లాపూర్ నుంచి మేడారం చేరుకుంటారు. తిరుగు ప్రయాణంలో బయ్యక్కపేట, దూదేకులపల్లి, భూపాలపల్లి, రేగొండ, పరకాల, గూడెప్పాడ్, హనుమకొండ మీదుగా వెళ్లాలి.
పార్కింగ్ : నార్లాపూర్
ఖమ్మం, నర్సంపేట, ఇల్లెందు, మానుకోట
ఖమ్మం, ఇల్లెందు, మహబూబాబాద్,నర్సంపేట, మల్లంపల్లి , పస్రా నుంచి నార్లాపూర్ చేరుకోవాల్సి ఉంటుంది. వీరు తిరుగు ప్రయాణంలో బయ్యక్కపేట, రేగొండ, పరకాల మీదుగా గుడెప్పాడు, వరంగల్ నుంచి పోవాల్సి ఉంటుంది.
పార్కింగ్ : వెంగ్లాపూర్, నార్లాపూర్
ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్
హుజూరాబాద్, పరకాల, రేగొండ, గణపురం, వెంకటాపురం(ఎం), జగాలపల్లి క్రాస్ నుంచి పస్రా మీదుగా మేడారం చేరుకుంటారు. తిరుగు ప్రయాణంలో బయ్యక్కపేట, భూపాలపల్లి, గారెపల్లి నుంచి మంథని, గోదావరిఖని, మంచిర్యాల నుంచి ఆదిలాబాద్ చేరుకుంటారు.
పార్కింగ్ : నార్లాపూర్, కొత్తూరు
లింగాల, గుండాల
ఇల్లెందు, రొంపేడు, గంగారం,
పూనుగొండ్ల, లింగాల, పస్రా, నార్లాపూర్, మేడారం చేరుకోవాల్సి ఉంటుంది. వీరు తిరుగు ప్రయాణంలో బయ్యక్కపేట, దూదేకులపల్లి, పరకాల, రేగొండ మీదుగా గూడెప్పాడ్, వరంగల్ నుంచి నర్సంపేట చేరుకోవాల్సి ఉంటుంది.
పార్కింగ్ : వెంగ్లాపూర్
రామగుండం, మంథని
రామగుండం, గోదావరిఖని, మంథని, కాటారం, గారెపల్లి ఎడమవైపు నుంచి కాల్వపల్లి మీదుగా మేడారం చేరుకుంటారు. తిరుగు ప్రయాణంలో వచ్చిన రూట్‌లోనే వెళ్లాలి.
పార్కింగ్ : కాల్వపల్లి, నార్లాపూర్
కాళేశ్వరం, మహారాష్ట్ర..
కరీంనగర్, కాళేశ్వరం ఆపై ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలు కాటారం, పెగడపల్లి, కాల్వ పల్లి మీదుగా ఊరట్టం చేరుకోవాలి. తిరుగు ప్రయాణంలో బయ్యక్కపేట, దూదేకులపల్లి మీదుగా కరీంనగర్ చేరుకోవాలి.
పార్కింగ్ : ఊరట్టం
వాజేడు, ఛత్తీస్‌గఢ్ వెంకటాపురం(కె)
ఛత్తీస్‌గఢ్ నుంచి వచ్చే ప్రైవేటు వాహనాలు వాజేడు, జగన్నాథపురం నుంచి ఏటూరునాగారం, చిన్నబోయినపల్లి, కొండాయి, మల్యాల, ఊరట్టం నుంచి మేడారం చేరుకోవాల్సి ఉంది. తిరుగు ప్రయాణంలో వచ్చిన రూట్‌మీదుగా వెళ్లాలి.
పార్కింగ్ : ఊరట్టం
మణుగూరు, భద్రాచలం, కొత్తగూడెం
కొత్తగూడెం, పాల్వంచ, మణుగూరు, మంగపేట, ఏటూరునాగారం నుంచి చిన్నబోయినపల్లి, కొండాయి, ఊరట్టం వరకు ప్రైవేటు వాహనాల్లో చేరుకోవాలి. అదే మార్గంలో తిరుగు ప్రయాణం చేయాల్సి ఉంది. ఈ రూట్‌లో ఏదైనా ట్రాఫిక్ సమస్య వస్తే అత్యవసరంగా ఏటూరునాగారం జెడ్పీహెచ్‌ఎస్ పార్కింగ్ ప్రాంతాన్ని చేరుకోవాల్సి ఉంటుంది.
పార్కింగ్ : ఊరట్టం
ఆర్టీసీ బస్సులు హనుమకొండ, ములుగు రోడ్డు, గూడెప్పాడ్, పస్రా, తాడ్వాయి నుంచి నేరుగా మేడారం వెళ్తాయి. ప్రైవేట్ వాహనాలు మాత్రం పస్రానుంచి నార్లాపూర్, మేడారం వెళ్లాలి. తాడ్వాయి మీదుగా అనుమతి లేదు. పొరపాటున వెళ్లినా వెనక్కి పంపుతారు.
తిరుగు ప్రయాణం
మేడారం నుంచి తిరిగి వరంగల్ ఆపై ప్రాంతాలకు వెళ్లే వాహనాలు నార్లాపూర్ క్రాస్, బయ్యక్కపేట, కమలాపురం క్రాస్, భూపాలపల్లి, పరకాల, అంబాల క్రాస్, కిట్స్ కాలేజీ, వరంగల్ బైపాస్, పెండ్యాల మీదుగా తిరిగి వెళ్లాల్సి ఉంటుంది. (క్లిక్: మేడారానికి పోటెత్తిన భక్తులు.. ఫొటోలు)
అందుబాటులో హెలికాప్టర్ సేవలు
మేడారం జాతరకు వచ్చే భక్తుల కోసం పర్యాటక శాఖ హెలికాప్టర్ సేవలు అందుబాటులోకి తీసుకువచ్చింది. బెంగళూరుకు చెందిన తుంబి ఏవియేషన్ సంస్థ ట్యాక్సీ హెలికాప్టర్‌ను నడుపుతోంది. ఈ సేవలు సోమవారం నుంచి ప్రారంభమవుతాయి. కాజీపేటలోని సేయింట్ గాబ్రియల్ స్కూల్ గ్రౌండ్ నుంచి మేడారం వరకు సేవలందిస్తోంది.
చార్జీలు ఇలా..
ఒక్కో ప్రయాణికుడికి (అప్ అండ్ డౌన్) రూ.19,999
జాతరలో ఏరియల్ వ్యూ రైడ్ ఒక్కొక్కరికి రూ.3,700
బుకింగ్ ఇలా..
హెలికాప్టర్ టికెట్ బుకింగ్, ఇతర వివరాల కోసం
94003 99999, 98805 05905 సెల్‌నంబర్లలో లేదా info@helitaxi.com ద్వారా చేసుకోవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment