ఎస్‌ఎస్ తాడ్వాయి: ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క సన్నిధిలో గుడిమెలిగె పండుగను బుధవారం ఘనంగా నిర్వహించారు. ఉదయం పూజారులు సమ్మక్క గుడిని శుభ్రం చేశారు. పూజారుల ఆడపడుచులు అమ్మవారి శక్తిపీఠం గద్దెను పవిత్ర పుట్టమట్టితో అలికి పసుపు, కుంకుమతో అలంకరించారు. రంగవల్లికలు వేశారు. పూజారులు అడవి నుంచి తీసుకొచ్చిన ఎట్టిగడ్డిని సమ్మక్క గుడి ఈశాన్య దిశలో కొక్కర కృష్ణయ్య చేతుల మీదుగా పెట్టారు. గుడిమెలిగె పండుగతో మహాజాతరకు నాంది పలికారు. కాగా, సమ్మక్క–సారలమ్మను దర్శించుకునేందుకు బుధవారం మేడారానికి భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment