
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో అధికార టీఆర్‌ఎస్ పార్టీని ఎలాగైనా ఓడించాలని చేతులు కలిపిన కాంగ్రెస్, టీడీపీలకు ఎన్నికల ఫలితాలు షాకిచ్చాయి. హోరా హోరీగా ఫలితాలొస్తాయని చివరి వరకు ఆశగా ఎదురు చూసిన ప్రజాకూటమి నేతలకు ఎన్నికల ఫలితాలు మింగుడు పడటం లేదు. బద్ద శత్రువులైన కాంగ్రెస్, టీడీపీల దోస్తీని తెలంగాణ ప్రజలు తిరస్కరించారు.
తెలుగు దేశం పార్టీ ప్రజాకూటమిలో కలిసి ఇతర పార్టీ నేతల గెలిచే అవకాశాలను సైతం దెబ్బతీసిందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై సోషల్ మీడియాలో వ్యంగ్యస్త్రాలు సంధిస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. చంద్రబాబుపై నెటిజన్ల క్రియేటివిటీ నవ్వులు పూయిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment