
సాక్షి, హన్మకొండ: టెన్త్ హిందీ పేపర్ లీక్ కేసులో బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌కు ఊరట లభించింది. బండి సంజయ్ బెయిల్ రద్దు పిటిషన్‌ను హన్మకొండ కోర్టు కొట్టివేసింది. కాగా బండి సంజయ్‌కు మంజూరు చేసిన బెయిల్‌ను రద్దు చేయాలని కోరుతూ పోలీసులు ఈనెల 17న హన్మకొండ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై గురువారం కోర్టు విచారణ చేపట్టింది.
బెయిల్ మంజూరు చేసిన సమయంలో చేసిన సూచనలను బండి సంజయ్ ఉల్లంఘించారని పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదించారు. విచారణకు సహకరించడం లేదని తెలిపారు. ప్రాసిక్యూషన్ వాదనలతో విబేధించిన మెజిస్ట్రేట్.. బండి సంజయ్ బెయిల్ రద్దు పిటిషన్‌ను కొట్టివేస్తూ తీర్పునిచ్చింది.
చదవండి: వారికే టికెట్లు.. సిట్టింగ్ ఎమ్మెల్యేలకు కేసీఆర్ హెచ్చరిక!
Comments
Please login to add a commentAdd a comment