హనుమకొండ : సంతానం లేని దంపతులకు సంతాన భాగ్యం కల్పిస్తూ వారి కళ్ళల్లో ఆనందాన్ని అందిస్తుంది ఒయాసిస్ ఫెర్టిలిటీ సెంటర్ అని డాక్టర్ జలగం కావ్య రావు అన్నారు. హనుమకొండ బ్రాంచ్ మొదటి వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డాక్టర్ కావ్య రావు, డాక్టర్ కృష్ణ చైతన్య, డాక్టర్ అంజనీ దేవి, డాక్టర్ విజయలక్ష్మి, డాక్టర్ భోజరాజు రోహిత్, డాక్టర్ ప్రసన్నలు హాజరయ్యారు.
ఈ సందర్భంగా డాక్టర్ కావ్య రావు మాట్లాడుతూ భారతదేశంలోనే ప్రముఖ ఫెర్టిలిటీ కేర్ ప్రొవైడర్ అయిన ఒయాసిస్ ఫెర్టిలిటీ, హన్మకొండ ఫెర్టిలిటీ సెంటర్, 2017 నుండి ప్రజలకు సేవలందిస్తున్న వరంగల్ శాఖ వారసత్వాన్ని అందిపుచ్చుకుంటూతన మొదటి వార్షికోత్సవాన్ని వేడుకగా చేసుకుంది. జంటలు సంతానోత్పత్తి సవాళ్లను అధిగమించడానికి, అధునాతన, సైన్స్ ఆధారిత చికిత్సల ద్వారా వారి తల్లిదండ్రులవ్వాలనే వారి కలలను నెరవేర్చుకోవడానికి ఒయాసిస్ ఫెర్టిలిటీ తిరుగులేని నిబద్ధతను ఈ మైలురాయి చాటిచెబుతుంది. ఒయాసిస్ ఫెర్టిలిటీ కోఫౌండర్ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ దుర్గా జి. రావు, కిరణ్ లకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు.
ఒయాసిస్ ఫెర్టిలిటీ సైన్ టిఫిక్హెడ్, క్లినికల్ ఎంబ్రియాలజిస్ట్ డాక్టర్ కృష్ణ చైతన్య మంత్రవాది గౌరవ అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఒయాసిస్ ఫెర్టిలిటీ సైన్ టిఫిక్ హెడ్ అండ్ క్లినికల్ ఎంబ్రియాలజిస్ట్ డాక్టర్ కృష్ణ చైతన్య మంత్రవాది మాట్లాడుతూ ఒయాసిస్ ఫెర్టిలిటీ సెంటర్ ద్వారా తల్లిదండ్రులవ్వాలనే కలను సాధించడంలో ఎన్నో జంటలకు సహాయం చేశాం.
అంతేగాకుండా, మా ఫెర్టిలిటీ కేర్ సేవలు ఎగ్, మరియు స్పెర్మ్ ఫ్రీజింగ్ వసతి ద్వారా భార్య భర్తలు లేదా నేటి తరం వారు వారి భవిష్యత్తు కోసం సంతానోత్పత్తిని కాపాడుకునే ఎంపికను అందించడం ద్వారా కుటుంబ ప్రణాళిక గురించి అవగాహనతో కూడిన నిర్ణయాలు తీసుకునేలా వారికి సాధికారికత ఇస్తాయి అని అన్నారు. వయస్సు, మెడికల్ హిస్టరీ, జీవనశైలికి సంబంధించిన అనుకూలీకరించిన సంతానోత్పత్తి పరిష్కారాలను అందించడం ద్వారా హన్మకొండ కేంద్రం ఒక సంవత్సరంలోపుగానే ఫెర్టిలిటీ వైద్యంలో అగ్రగామిగా మారింది.
ఈ మైలురాయి సాధించడంపై ఒయాసిస్ ఫెర్టిలిటీ రీజినల్ మెడికల్ హెడ్ ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ డాక్టర్ జలగం కావ్యరావు మాట్లాడుతూ హన్మకొండలోని ఒయాసిస్ ఫెర్టిలిటీ ప్రారంభమైనప్పటి నుండి ప్రపంచ స్థాయి సంతానోత్పత్తి చికిత్సలకు మాత్రమే కాకుండా పునరుత్పత్తి ఆరోగ్యంపై అవగాహన పెంపొందించడానికి కట్టుబడి ఉంది. ఈ చికిత్సల్లో 70% విజయం సాధించడం మా క్లినికల్ నైపుణ్యాన్ని ప్రతిబింబిస్తుంది. ఇప్పటివరకు సుమారు 6000 మంది జంటలకి సంతాన సాఫల్యత అందించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా వైయాసిస్ ఫెర్టిలిటీ సెంటర్ ద్వారా సంతానం పొందిన ఆయా దంపతుల కుటుంబాలు పిల్లలు హాజరవ్వడంతో వారి అనుభవాలను ఆనందాన్ని అందరితో పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో ఒయాసిస్ ఫెర్టిలిటీ సెంటర్ వైద్యులు సిబ్బంది, పిల్లలు, తల్లి తండ్రులు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment