వాల్తేరు వీరయ్య సక్సెస్ మీట్‌లో తొక్కిసలాట | Waltair Veerayya Success Meet at the success meet at Hanumakonda | Sakshi
Sakshi News home page

Waltair Veerayya: వాల్తేరు వీరయ్య సక్సెస్ మీట్‌లో తొక్కిసలాట

Published Sat, Jan 28 2023 7:17 PM | Last Updated on Sat, Jan 28 2023 7:40 PM

Waltair Veerayya Success Meet at the success meet at Hanumakonda - Sakshi

మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య సక్సెస్ మీట్‌లో అపశృతి చోటు చేసుకుంది. హనుమకొండలో జరుగుతున్న సక్సెస్ మీట్‌లో తొక్కిసలాట జరిగింది. ఈ సంఘటనలో పలువురు మెగా అభిమానులకు గాయాలయ్యాయి. అందరూ ఒక్కసారిగా గేటు తోసుకుని రావడంతో ఈ సంఘటన జరిగినట్లు తెలుస్తోంది. చిరంజీవి అభిమానులు, పోలీసులకు మధ్య తీవ్ర తోపులాట జరిగినట్లు సమాచారం.  వీరయ్య విజయ విహారం పేరిట వాల్తేరు వీరయ్య చిత్రబృందం హనుమకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ గ్రౌండ్స్‌లో సక్సెస్ మీట్ నిర్వహిస్తున్నారు. 

(ఇది చదవండి: వాల్తేరు వీరయ్య విలన్‌ బాబీ సింహా మనోడే!)

కాగా.. ఈ సంక్రాంతికి బాక్సాఫీసు వద్ద కలెక్షన్స్‌తో దూసుకెళ్తోంది వాల్తేరు వీరయ్య. భారీ అంచనాల మధ్య సంక్రాంతి కానుకగా శుక్రవారం(జనవరి 13న) ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా డైరెక్టర్‌ బాబీ దర్శకత్వంతో తెరకెక్కిన ఈ సినిమా మాస్‌ హిట్‌ను అందుకుంది. విడుదలైన తొలి షో నుంచే ఈ మూవీ పాజిటివ్‌ తెచ్చుకుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement