Chiranjeevi Waltair Veerayya Movie streaming on Netflix OTT - Sakshi
Sakshi News home page

Waltair Veerayya OTT Streaming: ఓటీటీకి వచ్చేసిన ‘వాల్తేరు వీరయ్య’, అర్థరాత్రి నుంచే స్ట్రీమింగ్‌, ఎక్కడో తెలుసా?

Published Mon, Feb 27 2023 9:57 AM | Last Updated on Mon, Feb 27 2023 10:17 AM

OTT: Chiranjeevi Waltair Veerayya Movie Now Streaming On Netflix - Sakshi

మెగాస్టార్ చిరంజీవి, శృతిహాసన్ జంటగా నటించిన చిత్రం‘వాల్తేరు వీరయ్య’. సంక్రాంతి కానుకగా థియేటర్లలో విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. బాబీ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. కేవలం మూడు రోజుల్లోనే వాల్తేరు వీరయ్య వందకోట్లు కలెక్ట్‌ చేసి బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. మాస్ మహారాజా రవితేజ కీలకపాత్ర పోషించిన ఈ చిత్రంలో శృతి హాసన్‌ హీరోయిన్‌గా నటించింది. బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపించిన ఈ చిత్ర ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది.

చదవండి: నటుడిపై వేధింపులు.. మహిళా డైరెక్టర్‌ అరెస్ట్‌

వాల్తేరు వీరయ్య సినిమా డిజిటల్‌ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. థియేట్రికల్‌ రన్‌ పూర్తికావడంతో ఇవాళ (ఫిబ్రవరి 27) అర్దరాత్రి నుంచే ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చింది. మరోవైపు థియేటర్లలో బాక్సాఫీస్‌ రికార్డులు బద్దలు కొట్టిన వాల్తేరు వీరయ్య ఓటీటీలో ఎలాంటి రికార్డులు సృష్టిస్తాందో చూడాలి. కాగా మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మాతలు నవీన్ యెర్నేని , వై రవిశంకర్‌ నిర్మించిన ఈచిత్రంలో ప్రకాశ్‌ రాజ్‌, బాబీ సింహా, కేథరిన్ థ్రెసా, రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిషోర్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement