ఈ సంక్రాంతికి థియేటర్లో మెగాస్టార్ సందడి మొదలైంది. డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో చిరంజీవి 154వగా చిత్రంగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ వాల్తేరు వీరయ్యా. ఈ మూవీ నేడు శుక్రవారం(జనవరి 13న) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలైన తొలి షో నుంచి ఈ చిత్రం పాజిటివ్ టాక్‌ను తెచ్చుకుంది. మాస్, యాక్షన్, కామెడీతో రూపొందిన ఈ మూవీ మెగా ఫ్యాన్స్‌లో థియేటర్లో పూనకాలు తెప్పిస్తుంది. చిరు మాస్‌లుక్‌కు మాస్ మాహారాజా రవితేజ యాక్షన్ జోడి అయితే ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చేప్పనక్కర్లేదు.
చదవండి: కర్ణాటకలో మెగాస్టార్ క్రేజ్ చూశారా? బ్యాండ్ బాజాలతో ఫ్యాన్స్ రచ్చ, వీడియో వైరల్
వారిద్దరి సీన్స్ వచ్చినప్పుడు థియేటర్లో ఫ్యాన్స్ రచ్చ చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం వెండితెరపై మాస్ క్రేజ్‌తో దూసుకుపోతున్న ఈ మూవీ ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి. ఇకపోతే ప్రస్తుతం థియేటర్లో సందడి చేసిన చిత్రాలు ఓటీటీలో అలరిస్తున్న సంగతి తెలిసిందే. ఏ మూవీ అయిన థియేట్రికల్ రిలీజ్ అనంతరం ఓటీటీలో స్ట్రీమింగ్ అవ్వాల్సిందే. ఇక వాల్తేరు వీరయ్య మూవీ కూడా ఇప్పటికే ఓటీటీ పార్ట్‌నర్‌ను లాక్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ తాజా బజ్ ప్రకారం వాల్తేరు వీరయ్య డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ ఇండియా సొంతం చేసుకున్నట్లు సమాచారం.
చదవండి: Waltair Veerayya Review: ‘వాల్తేరు వీరయ్య’ మూవీ రివ్యూ
భారీ ధరకు ఈ మూవీని నెట్‌ఫ్లిక్స్ లాక్ చేసుకుందని తెలుస్తోంది. అయితే మూవీ స్ట్రీమింగ్ డేట్ మత్రాం ఇంకా ఖరారు కాలేదు. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానుందని తెలుస్తోంది. ఇక సినిమా బాక్సాఫీసు రిజల్ట్‌ను బట్టి మూవీ ఓటీటీకి ఎప్పుడు వస్తుందనేది డిసైడ్ అవుతుంది. ఇక మెగా చిత్రమైన వాల్తేరు వీరయ్య మాత్రం థియేట్రికల్ రిలీజ్‌కు 6 నుంచి 8 వారాల అంటే రెండు నెలల తర్వాతే ఓటీటీకి రానుందని తెలుస్తోంది. అంటే ఫిబ్రవరి రెండో వారం లేదా చివరి వారంలో ఈ చిత్రం ఓటీటీ స్ట్రీమింగ్ ఉండోచ్చని అంటున్నారు. కాగా మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించిన ఈ చిత్రంలో శృతి హాసన్ హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రానికి దేవివ్రీ ప్రసాద్ సంగీత అందించాడు.
Comments
Please login to add a commentAdd a comment