సాక్షి, హైదరాబాద్/కమలాపూర్: సీఎం కేసీఆర్ ఇచ్చిన ‘బీజేపీ ముక్త్ భారత్’’పిలుపు హాస్యాస్ప దంగా ఉందని బీజేపీ జాతీయ ప్రధాన కార్య దర్శి, ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి తరుణ్ ఛుగ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వాస్తవానికి ‘కేసీఆర్ ముక్త్ తెలంగాణ’ కావాలని రాష్ట్ర ప్రజలు నిర్ణయించుకున్నారని అన్నారు.
‘కేసీఆర్‌కు రోజులు దగ్గరపడ్డాయి. ఆయనలో నిరాశ, నిస్పృహ పతాకస్థా యికి చేరుకున్నాయి. అందుకే ముక్త్.. ముక్త్ అంటూ పిచ్చికూతలు కూస్తు న్నారు’ అని ధ్వజమెత్తారు. సీఎం కేసీఆర్ ఎంఐఎంకు భయపడుతున్నారని, కేసీఆర్ కారు స్టీరింగ్ ఆ పార్టీ చేతిలో ఉందని తరుణ్ ఛుగ్ విమర్శించారు. హనుమకొండ జిల్లా కమలాపూర్‌లో శనివారం జరిగిన హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తండ్రి ఈటల మల్లయ్య సంస్మరణసభలో పాల్గొన్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహిస్తామని చెప్పిన కేసీఆర్ ఈ ఎనిమిదేళ్లలో ఏనాడూ దాని గురించి మాట్లాడలేదన్నారు.
చదవండి: టీఆర్‌ఎస్ ఇలానే ఉంటే సార్వత్రిక ఎన్నికల్లోనూ మద్దతు
Comments
Please login to add a commentAdd a comment