
నయీంనగర్: గణపతి లడ్డూను ఓ పెంపుడు శునకం దక్కించుకుంది. హనుమకొండ 54వ డివిజన్ కేయూ రోడ్ డబ్బాల్ జంక్షన్ వద్ద హనుమాన్ గజానన మండలి సభ్యులు గణపతి నవరాత్రుల లడ్డూకు లక్కీడ్రా నిర్వహించారు. ఇందులో స్థానికుడు పొలాల వాణి, రాజేశ్ కుటుంబ సభ్యులందరి పేర్లను రాసి డ్రాలో వేశారు. వారి పెంపుడు శునకం సోని పేరుతోనూ చీటీ వేశారు. సోమవారం నిర్వహించిన లక్కీ డ్రాలో శునకానికి లడ్డూ దక్కడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment