
హన్మకొండ: కేసీఆర్‌ను ఓడిస్తేనే రాజ్యాంగానికి రక్షణ అని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ అన్నారు. రాజ్యాంగాన్ని అవమానిస్తూ సీఎం కేసీఆర్ మాట్లాడటాన్ని నిరసిస్తూ గురువారం హనుమకొండలోని అంబేడ్కర్ విగ్రహం ఎదుట ఎమ్మార్పీఎస్, మహాజన సోషలిస్టు పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. ధర్నానుద్దేశించి మంద కృష్ణమాదిగ మాట్లాడుతూ భారత రాజ్యాంగాన్ని అవమానపరిచిన సీఎం కేసీఆర్ 48 గంటల్లో క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.