
సాక్షి, వరంగల్ : ఓ ఉన్మాది చేతిలో యువతి దారుణ హత్యకు గురైన సంఘటన శుక్రవారం వరంగల్ అర్బన్ ప్రాంతంలో చోటుచేసుకుంది. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. హన్మకొండ రాంనగర్‌లో షాహిద్ అనే యువకుడు...ఓ యువతిని గొంతుకోసి చంపాడు. హత్య చేసిన అనంతరం నిందితుడు షాహిద్ పోలీసులకు లొంగిపోయాడు. మరోవైపు క్లూస్ టీమ్ ఆధారాలు సేకరిస్తోంది. మృతురాలు హారతిగా గుర్తించారు. కాగా గత కొంతకాలంగా షాహిద్‌కు హారతికి మధ్య గొడవలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ప్రియురాలు హారతి తనను నిర్లక్ష్యం చేస్తోందనే అనుమానంతోనే అతడు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment