వరంగల్ క్రైం/ఎంజీఎం: తనకు దక్కనిది.. మరెవరికీ దక్కొదని భావించిన ఓ ప్రేమికుడు.. ప్రియురాలి గొంతు కోసి హత్య చేశాడు. వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో శుక్రవారం హత్యకు గురైన హారతి కేసు వివరాలను పోలీసు కమిషనర్ విశ్వనాథ రవీందర్ శనివారం మీడియాకు వెల్లడించారు. కాజీపేట విష్ణుపురికి చెందిన షాహిద్ అలి యాస్ చోటు(24) 2016లో హన్మకొండ హంటర్ రోడ్డులోని ఓ ప్రైవేట్ డిగ్రీ కళాశాలలో డిగ్రీ పూర్తి చేశాడు. అదే కళాశాలలో చదివిన హారతితో ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారింది. 6 నెలల క్రితం హన్మకొండలోని క్రాంతినగర్‌లో గది అద్దెకు తీసుకున్నాడు. ఈ గదికి హారతి కూడా వచ్చి వెళ్లేది.
(చదవండి : మరో ఉన్మాది)
ఈ క్రమంలో హారతి వరంగల్ శివనగర్‌కు చెందిన మరో యువకుడితో చనువుగా ఉండటం.. షాహిద్‌ను దూ రంగా ఉంచుతుండటంతో అతను కోపం పెంచుకున్నాడు. శివనగర్ యువకుడి అడ్రస్ కనుక్కొని షాహిద్ మాట్లాడగా తాను, హారతి ప్రేమించుకుంటున్నామని చెప్పాడు. ఈ విషయాన్ని తట్టుకోలేని షాహిద్ హారతిని హత్య చేశాడు. నింది తుడు షాహిద్‌పై అత్యాచా రం, హత్యతో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ సెక్షన్ల కింది కేసు నమోదు చేసినట్లు సీపీ వెల్లడించారు. హారతి మృతదేహానికి శనివారం ఎంజీఎం ఆస్పత్రి మార్చురీలో పోస్టుమార్టం పూర్తి చేశారు. నిందితుడిని ఉరి తీయాలంటూ మృతురాలి కుటుంబ సభ్యులు, బంధువులు డిమాండ్ చేశారు.
(చదవండి : ప్రాణం ఖరీదు ఐదు రూపాయలు..)
రోదిస్తున్న హారతి తల్లి , నిందితుడు షాహిద్ (ఫైల్)
కలవాలని మెసేజ్ పంపి..
శుక్రవారం కలుసుకుందామని హారతి సెల్‌ఫోన్‌కు షాహిద్ మెసేజ్ పంపాడు. దీంతో మధ్యాహ్నం హారతి మూడుచింతల్ వద్దకు రాగా.. అద్దె గదికి తీసుకెళ్లాడు. అక్కడ ఇద్దరి మధ్య మాటామాటా పెరగడంతో పాటు హారతి తనను మర్చిపోవాలని, తాను శివనగర్ యువకుడిని వివా హం చేసుకుంటానంటూ చెప్పింది. ఆ సమయంలో కోపమొచ్చినా నమ్మకంగా నటిం చాడు. హారతిని లొంగదీసుకుని శారీరకంగా కలిశాడు. తర్వాత కీచైన్ కత్తితో గొంతుకోసి హత్య చేశాడు. తర్వాత సుబేదారి పోలీసు స్టేషన్ వెళ్లి లొంగిపోయాడు. పోలీసులు ద్విచక్ర వాహనం, రక్తం మరకలతో ఉన్న బట్టలు, కత్తిని స్వాధీనం చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment