Shahid
-
పాకిస్తాన్ ‘ఆణిముత్యం’.. ఎవరికీ తెలియని షాహిద్ ఖాన్ సక్సెస్ స్టోరీ!
భారత్‌తో విడిపోయాక పాకిస్తాన్ ప్రత్యేక దేశంగా ఏర్పడింది. అయితే నాటి నుంచి పాక్ ఆర్థిక పరిస్థితి ఏనాడూ సుస్థిరంగా ఉన్న దాఖలాలు లేవు. కరోనా కాలం అనంతరం పాక్ పరిస్థితి మరింత దయనీయంగా తయారయ్యింది. అనంతరం వచ్చిన వరదలు పాకిస్తాన్‌ను అతలాకుతలం చేశాయి. ఇటువంటి పరిస్థితుల నేపధ్యంలో పాక్ అధిక ధరలతో అట్టుడికిపోతోంది. నిరుద్యోగం, ఆర్థిక సంక్షోభం పాకిస్తాన్‌ను కబ్జా చేశాయి. అయితే ఇన్ని ప్రతికూలతల మధ్య ‘పాకిస్తాన్ రిచెస్ట్ మ్యాన్’ కథ అందరికీ స్ఫూర్తినిస్తుంది. ఇంజినీరుగా కెరియర్ ప్రారంభం పాకిస్తాన్‌కు చెందిన షాహిద్ ఖాన్ 1950, జూలై 18న లాహోర్‌లో జన్మించారు. కొంతకాలం పాక్‌లోనే ఉండిన ఆయన అనంతదం అమెరికాకు వెళ్లారు. తిరిగి ఇప్పుడు పాకిస్తాన్‌కు వచ్చి స్థిర నివాసం ఏర్పరుచుకున్నారు. ఇంజినీరుగా ఆయన తన కెరియర్ ప్రారంభించారు. షాహిద్ ఖాన్ 1980లో తన మాజీ యజమాని నుండి ఆటో విడిభాగాల సరఫరా సంస్థ ‘ఫ్లెక్స్ ఎన్ గేట్’ను కొనుగోలు చేశారు. అప్పటి నుంచి నిరంతర ప్రగతి బాటలో ముందుకు సాగుతున్నారు. ఫోర్బ్స్ కోటీశ్వరుల జాబితాలో స్థానం మీడియా దగ్గరున్న సమాచారం ప్రకారం షాహిద్ ఖాన్ విజయంలో వన్ పీస్ ట్రక్ బంపర్‌కు సంబంధించిన డిజైన్ కీలకంగా మారింది. ఫోర్బ్స్ కోటీశ్వరుల జాబితాలో చేరిన షాహిద్ ఖాన్‌కు చెందిన కంపెనీకి ప్రపంచవ్యాప్తంగా 69 ప్లాంట్స్ ఉన్నాయి. వీటిలో 26 వేలకుపైగా సిబ్బంది పనిచేస్తున్నారు. షాహిద్ ఖాన్ ఎన్ఎఫ్ఎల్కు చెందిన జాక్సన్విల్లే జాగ్వార్‌కు కూడా యజమాని. 2012లో ఆయన దీనిని కొనుగోలు చేశారు. దీనితో పాటు అతనికి యూకేలో ఒక ఫుట్‌బాల్ కంపెనీ కూడా ఉంది. ఆటోపార్ట్స్ తయారీ కంపెనీతో.. షాహిద్ ఖాన్‌కు చెందిన కంపెనీ ఆటోపార్ట్స్ను తయారు చేసి, విక్రయిస్తుంటుంది. ఇదే అతనికి వచ్చే ఆదాయంలో అత్యంత కీలకమైనది. ఫోర్బ్స్ అందించిన రియల్ టైమ్ బిలియనీర్స్ రిపోర్టును అనుసరించి షాహిద్ ఖాన్ మొత్తం ఆస్తి 12.1 బిలియన్ డాలర్లు. షాహిద్ ఖాన్ పాకిస్తాన్‌లోని ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. తన 16 ఏళ్ల వయసులో కేవలం 500 డాలర్లతో అమెరికా చేరుకున్నారు. అక్కడ తన వ్యాపార విజయంతో వేల కోట్ల విలువైన సామ్రాజ్యాన్ని స్థాపించారు. చదువుకునే సమయంలో కష్టాలు షాహిద్‌ఖాన్ అమెరికాలోని ఇలినాయిస్ విశ్వవిద్యాలయంలో చదువుకున్నారు. గతంలో షాహిద్ ఖాన్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాను అమెరికాలో చదువుకునే సమయంలో డిష్వాషర్ పని కూడా చేశానని తెలిపారు. 1971లో షాహిద్ ఖాన్ ఇంజినీరింగ్ పూర్తి చేశారు. 1999లో మెకానికల్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ విభాగం షాహిద్ ఖాన్‌ను విశిష్ట పూర్వ విద్యార్థిగా గుర్తించి, ఘనంగా సన్మానించింది. ఇది కూడా చదవండి: భార్యను 12 ఏళ్లుగా ‘టార్చర్ రూమ్’లో బంధించి.. ఘోరానికి పరాకాష్ట! -
రాజాధి రాజ... రాజ గంభీర... విరాట్ మహారాజా
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టూల్స్ పాపులర్ అయిన తరువాత ఆర్టిస్ట్‌లకు కంటినిండా పనిదొరికింది. తమ క్రియేటివిటీకి ఏఐ ఆర్ట్‌ను జత చేస్తూ ఎన్నో ఆశ్చర్యాలను ఆవిష్కరిస్తున్నారు. తాజాగా డిజిటల్ క్రియేటర్ షాహీద్ సృష్టించిన విరాట్ కోహ్లీ ‘దశావతారం’ ఏఐ ఇమేజ్‌లు వైరల్ అవుతున్నాయి. కామెంట్ సెక్షన్లో బోలెడు ‘హార్ట్’ ఇమోజీలు కనిపిస్తున్నాయి. ఆస్ట్రోనాట్, ఫుట్‌బాల్ ప్లేయర్, డాక్టర్, మ్యూజిషియన్, సోల్జర్, ఫైటర్ పైలట్, పోలీస్, మహారాజా... ఇలా రకరకాల గెటప్‌లలో విరాట్ కనిపిస్తాడు. ‘ఇంతకీ విరాట్ ఏ గెటప్‌లో బాగున్నాడు?’ అనే విషయానికి వస్తే.... నెటిజనులలో అత్యధికులు ‘మహారాజా’ గెటప్‌కు ఓటు వేశారు. View this post on Instagram A post shared by SK MD ABU SAHID (@sahixd) -
ఇట్లుంటరన్నమాట!
మనం చిన్నప్పుడు ఎలా ఉన్నామో చూడడానికి ఫొటో ఆల్బమ్‌లు ఉన్నాయి. మరి వయసు పైబడిన తరువాత ఎలా ఉంటామో చూడడానికి ఏమీలేవు. ‘ఎందుకు లేవు’ అంటూ రంగంలోకి దిగాడు ఏఐ ఆర్టిస్ట్ షాహిద్. ‘మిడ్‌జర్నీ’ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించి బాలీవుడ్ అందాల కథానాయికలు దీపిక పదుకోణ్, కత్రినా కైఫ్, ఐశ్వర్యరాయ్, అనుష్క శర్మ.. .మొదలైన వారిని బామ్మలుగా మార్చేశాడు. ‘వావ్ రే వావ్’ అంటూ ఈ ఫొటోలు నెట్లో బాగా వైరల్ అయ్యాయి. ఈ ఫోటోలను చూసి కొందరు తత్వంలోకి దిగి ఇలా అన్నారు... ‘భౌతిక అందం అశాశ్వతం. అంతఃసౌందర్యమే శాశ్వతం’ -
కోవిడ్ ప్యానెల్ నుంచి తప్పుకున్న సీనియర్ వైరాలజిస్ట్
న్యూఢిల్లీ: కరోనా వైరస్‌కు చెందిన వివిధ వేరియంట్లను గుర్తించేందుకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన శాస్త్రీయ సలహా బృందం నుంచి సీనియర్ వైరాలజిస్ట్ షాహీద్ జమీల్ తప్పుకున్నారు. కోవిడ్ రెండో దశను అరికట్టే విషయంలో కేంద్రం తీసుకొన్న నిర్ణయాలను ప్రశ్నించిన కొద్ది రోజులకే ఆయన ఈ నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది. జమీల్ ఇండియన్ సార్స్-కోవ్-2 జినోమిక్ సీక్వెన్సింగ్ కన్సార్టియం (ఐఎన్ఎస్ఏసీఓజీ) లో సభ్యుడిగా ఉన్నారు. రాజీనామా అనంతరం ‘నేను సరైన నిర్ణయమే తీసుకున్నా.. కానీ దీనిపై మాట్లాడటానికి ఇంకేం లేదు. రాజీనామాపై ఎటువంటి కారణాలు చెప్పాల్సిన అవసరం లేదు.’ అని రాయిటర్స్ వార్తా సంస్థకు తెలిపారు. కాగా ఈ అంశంపై డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ సెక్రెటరీ రేణూ స్వరూప్ స్పందించడానికి విముఖత చూపారు. ఇక ఇటీవల ‘భారత్‌లోని శాస్త్రవేత్తలు సాక్ష్యాధారిత విధాన రూపకల్పనకు మొండి వైఖరితో కూడిన ప్రతిస్పందనను ఎదుర్కొంటున్నారని డాక్టర్ జమీల్ న్యూయార్క్ టైమ్స్‌కు రాసిన ఆర్టికల్‌లో పేర్కొన్నారు. దేశంలో కోవిడ్ నిర్వహణ ముఖ్యంగా తక్కువ సంఖ్యలో టెస్టింగ్, వ్యాక్సినేషన్, వ్యాక్సిన్ కొరత, హెల్త్ కేర్ వర్క్ ఫోర్స్ అతి తక్కువ స్థాయిలో ఉండడం వంటి కారణాలే భారత్‌లో కోవిడ్ వ్యాప్తికి దోహదపడుతున్నాయని విమర్శించారు. ఈ చర్యలన్నింటికీ భారతదేశంలోని తన తోటి శాస్త్రవేత్తలలో విస్తృత మద్దతు ఉంది. కానీ వారు సాక్ష్యాధారిత విధాన రూపకల్పనకు మొండి పట్టుదలను ఎదుర్కొంటున్నారుని వ్యాఖ్యానించారు. ఇదే అంశంపై ప్రధాన మంత్రికి ఏప్రిల్ 30న 800 మంది భారతీయ శాస్త్రవేత్తలు విజ్ఙప్తి చేసినట్లు తెలిపారు. భారత్‌లో మహమ్మారి నియంత్రణలో లేనందున డేటా ఆధారంగా నిర్ణయం తీసుకోవడం మరో ప్రమాదమేనని, మహమ్మారిని అదుపు చేయలేకపోతే శాశ్వత మచ్చగా మిగిలిపోతుందన్నారు. తమ పరిశోధనల ఫలితాలపై ప్రభుత్వం పెద్దగా దృష్టిపెట్టకపోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు. చదవండి: కరోనా వచ్చి పోయినా జలుబు తగ్గట్లేదు.. బ్లాక్ ఫంగసా? -
తనకు దక్కదని.. మరెవరికీ దక్కొద్దని..
వరంగల్ క్రైం/ఎంజీఎం: తనకు దక్కనిది.. మరెవరికీ దక్కొదని భావించిన ఓ ప్రేమికుడు.. ప్రియురాలి గొంతు కోసి హత్య చేశాడు. వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో శుక్రవారం హత్యకు గురైన హారతి కేసు వివరాలను పోలీసు కమిషనర్ విశ్వనాథ రవీందర్ శనివారం మీడియాకు వెల్లడించారు. కాజీపేట విష్ణుపురికి చెందిన షాహిద్ అలి యాస్ చోటు(24) 2016లో హన్మకొండ హంటర్ రోడ్డులోని ఓ ప్రైవేట్ డిగ్రీ కళాశాలలో డిగ్రీ పూర్తి చేశాడు. అదే కళాశాలలో చదివిన హారతితో ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారింది. 6 నెలల క్రితం హన్మకొండలోని క్రాంతినగర్‌లో గది అద్దెకు తీసుకున్నాడు. ఈ గదికి హారతి కూడా వచ్చి వెళ్లేది. (చదవండి : మరో ఉన్మాది) ఈ క్రమంలో హారతి వరంగల్ శివనగర్‌కు చెందిన మరో యువకుడితో చనువుగా ఉండటం.. షాహిద్‌ను దూ రంగా ఉంచుతుండటంతో అతను కోపం పెంచుకున్నాడు. శివనగర్ యువకుడి అడ్రస్ కనుక్కొని షాహిద్ మాట్లాడగా తాను, హారతి ప్రేమించుకుంటున్నామని చెప్పాడు. ఈ విషయాన్ని తట్టుకోలేని షాహిద్ హారతిని హత్య చేశాడు. నింది తుడు షాహిద్‌పై అత్యాచా రం, హత్యతో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ సెక్షన్ల కింది కేసు నమోదు చేసినట్లు సీపీ వెల్లడించారు. హారతి మృతదేహానికి శనివారం ఎంజీఎం ఆస్పత్రి మార్చురీలో పోస్టుమార్టం పూర్తి చేశారు. నిందితుడిని ఉరి తీయాలంటూ మృతురాలి కుటుంబ సభ్యులు, బంధువులు డిమాండ్ చేశారు. (చదవండి : ప్రాణం ఖరీదు ఐదు రూపాయలు..) రోదిస్తున్న హారతి తల్లి , నిందితుడు షాహిద్ (ఫైల్) కలవాలని మెసేజ్ పంపి.. శుక్రవారం కలుసుకుందామని హారతి సెల్‌ఫోన్‌కు షాహిద్ మెసేజ్ పంపాడు. దీంతో మధ్యాహ్నం హారతి మూడుచింతల్ వద్దకు రాగా.. అద్దె గదికి తీసుకెళ్లాడు. అక్కడ ఇద్దరి మధ్య మాటామాటా పెరగడంతో పాటు హారతి తనను మర్చిపోవాలని, తాను శివనగర్ యువకుడిని వివా హం చేసుకుంటానంటూ చెప్పింది. ఆ సమయంలో కోపమొచ్చినా నమ్మకంగా నటిం చాడు. హారతిని లొంగదీసుకుని శారీరకంగా కలిశాడు. తర్వాత కీచైన్ కత్తితో గొంతుకోసి హత్య చేశాడు. తర్వాత సుబేదారి పోలీసు స్టేషన్ వెళ్లి లొంగిపోయాడు. పోలీసులు ద్విచక్ర వాహనం, రక్తం మరకలతో ఉన్న బట్టలు, కత్తిని స్వాధీనం చేసుకున్నారు. -
యువతి గొంతు కోసి హత్య చేసిన యువకుడు
-
మరో ఉన్మాది
సాక్షి, వరంగల్: తాను ప్రేమించిన యువతి మరొకరితో సన్నిహితంగా ఉంటోందన్న కోపంతో ఓ ఉన్మాది ఆ యువతి ప్రాణాలు తీశాడు. కత్తితో గొంతు కోసి పాశవికంగా చంపేశాడు. రక్తం మడుగులో కొట్టుకుంటున్నా కనికరించకుండా అక్కడి నుంచి చక్కగా ఇంటికి వెళ్లి స్నానం చేసి మరీ పోలీసులకు స్వయంగా లొంగిపోయాడు. ఈ దారుణమైన ఘటన వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలోని రాంనగర్ పరిధి క్రాంతినగర్‌లో శుక్రవారం సాయంత్రం జరిగింది. ఇరువురి మధ్య వాగ్వాదం పెద్దగా మారి ఆ యువతి హత్యకు దారి తీసిందని పోలీసులు చెబుతున్నారు. యువతి హారతి డిగ్రీలో క్లాస్మేట్స్.. హన్మకొండ లష్కర్ సింగారానికి చెందిన మునిగాల ప్రదీప్– రేణుక దంపతులకు ముగ్గురు సంతానం. పెద్ద కూతురికి వివాహం కాగా, కుమారుడు ప్రణీత్ నాలుగేళ్ల కిందట రాంపూర్ సమీపంలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. చిన్న కూతురు హారతి (27). ఆమె తండ్రి ప్రదీప్.. స్టేషన్‌ఘన్‌పూర్‌లోని పాలిటెక్నిక్ కాలేజీలో అటెండర్‌గా కాంట్రాక్టు పద్ధతిపై పనిచేస్తున్నాడు. హారతి డిగ్రీ పూర్తిచేసి స్థానికంగా ఓ కాలేజీలో ప్రస్తుతం ఎంబీఏ చదువుతోంది. హన్మకొండ హంటర్ రోడ్డులోని మాస్టర్జీ కాలేజీలో డిగ్రీ చదువుతుండగా.. కాజీపేట విష్ణుపురికి చెందిన ఎండీ షాహిద్ (28)తో పరిచయం ఏర్పడింది. ఇద్దరూ ఎలక్ట్రానిక్స్ గ్రూప్‌లో డిగ్రీ పూర్తి చేశారు. కాలేజీ రోజుల్లోనే ఇద్దరి మధ్య పరిచయం ప్రేమగా మారినట్లు తెలుస్తోంది. షాహిద్ డిగ్రీ ఫెయిల్ కావడంతో కాజీపేటలో తన తండ్రి నిర్వహిస్తున్న మటన్షాపులోనే పనిచేస్తున్నాడు. రోదిస్తున్న హారతి తల్లి , నిందితుడు షాహిద్ (ఫైల్) అద్దె గదికి పిలిపించి.. రాంనగర్లో షాహిద్ గదిని అద్దెకు తీసుకున్నాడు. హారతి సోదరి నివాసముంటున్న ఇంటి సమీపంలోనే ఆరు నెలల కింద షాహిద్ ఓ గదిలో అద్దెకు దిగాడు. ఆ గదికి నెలలో రెండు, మూడు సార్లు మాత్రమే వచ్చి పోయేవాడని ఇరుగుపొరుగు వారు చెబుతున్నారు. అద్దె మాత్రం నెలనెలా చెల్లించేవాడు. ఈ గదికే శుక్రవారం మధ్యాహ్నం ఫోన్ చేసి హారతిని పిలిపించాడు. ఆ తర్వాత ఇరువురి మధ్య గొడవ చోటు చేసుకున్నట్లు సంఘటనా స్థలాన్ని పరిశీలిస్తే తెలుస్తోంది. ముందుగానే షాహిద్ దగ్గర మటన్ కత్తి ఉండటంతో ప్లాన్ ప్రకారమే హత్య చేసి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ఆ కత్తితోనే హారతి గొంతు కోశాడు. ఆమె రక్తపు మడుగులో కొట్టుకుంటుండగానే గదికి తాళం వేసి బయటికి వెళ్లిపోయాడు. ఆ ఇంటికి రెండు గేట్లు ఉన్నాయి. ముందువైపు ఉన్న గేటులో నుంచి కాకుండా హత్య చేశాక పక్క ఉన్న మరో గేటులో నుంచి నిందితుడు వెళ్లిపోయాడు. సెంట్రల్ జైలుకు.. ఆపై సుబేదారి పీఎస్‌కు హారతిని హత్య చేసిన షాహిద్.. చక్కగా విష్ణుపురిలోని తన ఇంటికి వెళ్లి స్నానం చేసి.. వేరే దుస్తులు మార్చుకున్నాడు. అనంతరం ఆటోలో వరంగల్‌లోని సెంట్రల్ జైలుకు వెళ్లాడు. అక్కడి సిబ్బందిని కలసి హత్య చేసినట్లు చెప్పగా.. తాము అదుపులోకి తీసుకోబోమని.. సుబేదారి పోలీసుల వద్దకు వెళ్లాలని సూచించినట్లు తెలిసింది. దీంతో మళ్లీ వేరే ఆటోలో సుబేదారి పోలీసుస్టేషన్‌కు వచ్చి పోలీసులకు లొంగిపోయాడు. తాను హత్య చేసిన విషయాన్ని చెప్పడంతో పాటు కత్తి, గది తాళాలు అప్పగించాడు. దీంతో పోలీసులు షాహిద్‌ను తీసుకుని హత్య జరిగిన గది వద్దకు వెళ్లారు. గది తాళం తీసి చూసే సరికి రక్తపు మడుగులో హారతి శవంగా పడిఉంది. కాగా, హారతి హత్యకు గురైనట్లు తెలుసుకున్న కుటుంబసభ్యులు ఘటనాస్థలికి చేరుకుని కన్నీరు మున్నీరుగా విలపించారు. ఎవరి నుంచో ఫోన్ రాగానే ‘బయటకు వెళ్లొస్తాను’అని చెప్పి వెళ్లిన తమ కుమార్తె శవంగా మారడంతో తల్లి రోదనలు స్థానికులను కంటతడి పెట్టించింది. హారతి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వరంగల్‌లోని ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. సంక్రాంతి తర్వాత యువతి పెళ్లి.. హత్యకు గురైన హారతికి సంక్రాంతి పండుగ తర్వాత వివాహం జరగాల్సి ఉంది. వరంగల్‌కే చెందిన ఓ యువకుడితో ఆమె పెళ్లి నిశ్చయమైంది. ఇంతలోనే హత్యకు గురి కావడంతో రెండు కుటుంబాలు విషాదంలో మునిగాయి. కాగా, వేరే యువకుడితో సన్నిహితంగా ఉండటం.. వేరే యువకుడితో పెళ్లి నిశ్చయం కావడంతో కోపాన్ని పెంచుకున్న షాహిద్.. తాను ప్రేమించిన యువతి తనకు దక్కకుండా పోతుందన్న కోపంతో ఈ ఘాతుకానికి పాల్పడ్డట్లు నిందితుడు చెబుతున్నాడు. ఆ ఇల్లు ఏఆర్ ఎస్సైది.. ఇళ్లు అద్దెకు ఇచ్చే విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు ఎంతగా చెప్పినా వినిపించుకోవట్లేదని ఈ ఘటనతో మరోసారి అర్థమవుతోంది. నిందితుడు షాహిద్ అద్దెకు తీసుకున్న ఇళ్లు పోలీసు కమిషనరేట్‌లో పనిచేసే నర్సింగరావుది. ప్రస్తుతం ఆయన శిక్షణలో ఉన్నారు. షాహిద్ అద్దెకు తీసుకున్న గదిలో ఒక ఫ్యాన్, ఒక టీపాయ్, ఒక దుప్పటి మాత్రమే ఉన్నాయి. 6 నెలలుగా కిరాయికి ఉంటూ.. నెలలో ఒకట్రెండు సార్లు వచ్చి పోతున్నా ఎన్నడూ అతడిని ప్రశ్నించిన సందర్భాలు లేనట్లు తెలిసింది. కాగా, తాను ప్రేమించిన హారతి ఇటీవల మరో యువకుడితో సన్నిహితంగా ఉండటం వల్లే తాను హత్య చేసినట్లు నిందితుడు పోలీసులకు చెప్పినట్లు సమాచారం. ఘటనా స్థలాన్ని పరిశీలించి మంత్రి ఎర్రబెల్లి యువతి హత్య జరిగిన విషయం తెలియగానే మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, చీఫ్ వినయ్‌భాస్కర్ ఘటనా స్థలాన్ని సందర్శించారు. హత్యకు సంబంధించిన వివరాలు తెలుసుకోవడంతో పాటు యువతి కుటుంబసభ్యులను ఓదార్చారు. నిందితుడికి కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. వరంగల్ పోలీస్ కమిషనర్ వి.రవీందర్ కూడా ఘటనాస్థలికి చేరుకుని వివరాలు తెలుసుకున్నారు. -
ప్రియురాలి గొంతుకోసి చంపిన యువకుడు
సాక్షి, వరంగల్ : ఓ ఉన్మాది చేతిలో యువతి దారుణ హత్యకు గురైన సంఘటన శుక్రవారం వరంగల్ అర్బన్ ప్రాంతంలో చోటుచేసుకుంది. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. హన్మకొండ రాంనగర్లో షాహిద్ అనే యువకుడు...ఓ యువతిని గొంతుకోసి చంపాడు. హత్య చేసిన అనంతరం నిందితుడు షాహిద్ పోలీసులకు లొంగిపోయాడు. మరోవైపు క్లూస్ టీమ్ ఆధారాలు సేకరిస్తోంది. మృతురాలు హారతిగా గుర్తించారు. కాగా గత కొంతకాలంగా షాహిద్‌కు హారతికి మధ్య గొడవలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ప్రియురాలు హారతి తనను నిర్లక్ష్యం చేస్తోందనే అనుమానంతోనే అతడు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
యువతి గొంతుకోసి చంపిన యువకుడు
-
షాహిద్ మృతదేహం లభ్యం
సాక్షి, కమలాపురం : కమలాపురం పట్టణం దర్గా వీధికి చెందిన షేక్ షాహిద్ (10) మృత దేహం లభ్యమయ్యింది. ఈ నెల 13వ తేదీన పట్టణ శివారులోని పెన్నా నదిలో నీట మునిగిన ఘటనలో ఒకరు మృతి చెందిగా మరో ముగ్గురు చిన్నారులు గల్లంతైన విషయం విధితమే. వారిలో షాహిద్ అనే బాలుని మృతదేహం గురువారం వల్లూరు మండలం చెరువుకిందిపల్లె సమీపంలో ఉన్న పెన్నా నదిలో లభ్యమైనట్లు ఎర్రగుంట్ల రూరల్ సీఐ కొండారెడ్డి తెలిపారు. కాగా అక్కడే పోస్ట్‌మార్టం నిర్వహించి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు సీఐ తెలిపారు. ‘‘నిన్ను కళ్లారా చూసేందుకు కూడా వీలు లేకుండా పోయిందే చిన్నా అంటూ’’తల్లిదండ్రులు ఖాదరు, సాబిరీన్‌లు మృతదేహంపై పడి బోరున విలపించారు. బాలుడి మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. కాగా మరో బాలుడు జాకీర్ మృతదేహం దొరకాల్సి ఉంది. మృతదేహం ఆచూకీ లభించక పోవడంతో జాకీర్ తల్లిదండ్రులతో పాటు గ్రామస్తులు సైతం ఆందోళన చెందుతున్నారు. డీఎస్పీ పరిశీలన గల్లంతైన చిన్నారుల కోసం చేపట్టిన గాలింపు చర్యలను కడప డీఎస్పీ సూర్య నారాయణ పర్యవేక్షించారు. గురువారం వల్లూరు మండంలోని చెరువుకిందిపల్లె, ఆదినిమ్మాయపల్లె ప్రాంతాల్లో డీఎస్పీ పర్యటించారు. రిస్క్యూ టీంకు సలహాలు, సూచనలు ఇచ్చారు. కాగా షాహిద్ మృతదేహానికి పోస్ట్‌మార్టం నిర్వహించే వరకు డీఎస్పీ అక్కడే ఉన్నారు.నీటిపై తేలియాడుతున్న షాహిద్ మృతదేహం -
‘షహీద్’ అనాలా, ‘మార్టైర్’ అనాలా!?
సాక్షివెబ్ ప్రత్యేకం: పుల్వామా ఉగ్ర దాడిలో మరణించిన సైనికులకు షహీద్ లేదా మార్టైర్ హోదాను కల్పించాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇటీవల కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన విశయం తెల్సిందే. సైన్యంలో అలాంటి హోదా లేదని మోదీ ప్రభుత్వం స్పష్టం చేసినప్పటికీ పుల్వామా దాడిలో మరణించిన సైనికుల గురించి మోదీ ప్రస్తావించినప్పుడల్లా వారిని ‘షహీద్’ అని అంటున్నారు. గతంతో భారత సైనికులు మరణించినప్పుడు ‘మార్టైర్’ అని వ్యవహరించారుగానీ ‘షహీద్’ అని వ్యవహరించలేదు. అయితే బ్రిటీష్ పాలకులకు వ్యతిరేకంగా పోరాడి ప్రాణాలు కోల్పోయిన వారిని ‘షహీద్’గా వ్యవరించారు. అందుకు ఉదాహరణ భారత స్వాతంత్య్ర సమర యోధుడు ‘షహీద్ భగత్ సింగ్’. ఆయన గురించి 1965లో ‘షహీద్’ పేరిట మనోజ్ కుమార్ నటించిన, 2002లో బాబీ డియోల్ నటించిన ‘షహీద్’ సినిమాలు వచ్చాయి. షహీద్ అనే పదం హిందీ పదంగా, మార్టైర్ పదం ఇంగ్లీషు పదంగా నేడు చెలామణి అవుతోంది. తెలుగులో ఈ పదాలకు ‘అమర వీరుడు’గా వ్యవహరిస్తున్నారు. తెలుగు వ్యవహారంలో ఇది మంచి పదమేగానీ సమానార్థం కాదు. ‘షహీద్’ పదం అరబిక్ నుంచి రాగా, ‘మార్టైర్ అనే పదం గ్రీకు మూలం నుంచి వచ్చింది. ఈ రెండు పదాలకు సమానార్థం సాక్షి. ఆది నుంచి ఇస్లాం మతంతో షాహిద్, క్రైస్తవ మతంతో మార్టైర్ అనే పదాలు అల్లుకు పోయాయి. ‘మార్టైర్’ పరిణామ క్రమం ‘ఆక్స్ఫర్డ్ డిక్షనరీ ఆఫ్ క్రిస్టియన్ చర్చి’ ప్రకారం మార్టైర్ అంటే ‘సాక్షి’ అని అర్థం. క్రైస్తవంలో ప్రధాన మత బోధకుడిని, ఏసు క్రీస్తు ప్రధాన అనుచరులను మార్టైర్ గా పేర్కొనే వారు. అంటే మత బోధనల్లో ఉన్న అంశాలకు సంబంధించి ఆయన ప్రత్యక్ష సాక్షి అనే అర్థంలోనే అలా పిలిచేవారు. మత ప్రచారం కోసం ఎవరైనా మరణిస్తే లేదా ప్రాణాలర్పిస్తే వారి మార్టైర్ గా వ్యవహరించడం కాలక్రమంలో వచ్చింది. క్రైస్తవ మతాన్ని వ్యతిరేకించే నాటి రోమన్లు క్రైస్తవ ప్రచారకులపైకి సింహాలను వదిలేవారు. వాటి చేతుల్లో మరణించిన వారిని మారై్టర్స్గా పిలిచేవారు. ‘బైబిల్’ రెండో భాగమైన ‘న్యూ టెస్టామెంట్’లో మార్టైర్ గురించి ఎక్కువగా ఉంది. మార్టైర్ అంటే మరణించిన వారికన్నా, ప్రధాన మత బోధకులనే అలా ఎక్కువగా వ్యవహించడం అందులో కనిపిస్తుంది. షహీద్ పరిణామ క్రమం అరబిక్ మూలం నుంచి వచ్చిన ‘షహీద్’ సమానార్థం ‘సాక్షి’యే అయినప్పటికీ మత ప్రచారంలో భాగంగా ప్రాణాలను కోల్పోయిన వారినే ‘షహీద్’లుగా ఎక్కువగా పేర్కొంటున్నారు. ‘ఖురాన్’లో సాక్షి అనే అర్థంలోనే షహీద్ పదాలను వాడారు. ముస్లింలలో ముఖ్యంగా షియా తెగవారు మరణించిన వారిని ‘షహీద్’లుగా పేర్కొంటున్నారు. ఖలీఫా రాజ్య స్థాపన కోసం మరణించే వారంతా వారి దృష్టిలో షహీద్లే. ‘హుతాత్మా’ అంటే ఏమిటీ ? షాహిద్, మార్టైర్ అనే రెండు పదాలు కూడా రెండు మతాలకు సంబంధించినవి కావడం వల్ల దేశ రక్షణ కోసం ప్రాణాలు అర్పించే సైనికులను ఎట్టి పరిస్థితుల్లో ఈ రెండు పదాలతో పిలవరాదని ‘హిందూత్వ’ వ్యవస్థాపకుడు వినాయక్ దామోదర్ సావర్కర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. అమర వీరుడు అనే అర్థంలో మరాఠీ మూలం నుంచి ‘హుతాత్మ’ అనే సంస్కృత పదాన్ని కాయిన్ చేశారు. దక్షిణ ముంబైలో అమర వీరుల స్మారక స్థూపానికి ‘హుతాత్మ చౌక్’ అని పేరు పెట్టారు. ప్రపంచ చరిత్రలో కోకొల్లలు భారత దేశం సెక్యులర్ దేశమని, సెక్కులర్ దేశాన్ని రక్షిస్తున్న సైనికులు మరణిస్తే ‘మార్టైర్’ పదాన్ని ఉపయోగించరాదని 2017లో సీనియర్ జర్నలిస్ట్ కరణ్ థాపర్ వాదించారు. కానీ ప్రపంచ చరిత్రలో స్వాతంత్య్రం కోసం పోరాడి ప్రాణాలు అర్పించిన వారిని మార్టైర్స్గా పేర్కొనడం ఉంది. 19వ శతాబ్దంలో ఆస్ట్రేలియా రాజ్యంలో స్వాతంత్య్రం కోసం పోరాడి ప్రాణాలర్పించిన హంగేరియన్లను, 20వ శతాబ్దంలో బ్రిటీష్ పాలకుల నుంచి స్వాతంత్రం కోసం పోరాడిన ఐరిష్ అమర వీరులను మార్టైర్స్గా వ్యవహరించారు. అమెరికా అధ్యక్షుడిగా పనిచేసిన అభ్రహాం లింకన్ హత్య తర్వాత పది రోజులకు ఆయన నిజమైన దేశభక్తుడైనందున ఆయనకు మార్టైర్ హోదా కల్పించాలంటూ ‘న్యూయార్క్ టైమ్స్’ డిమాండ్ చేసింది. మార్టిన్ లూథర్ కింగ్‌ను ‘అహింసా మార్టైర్’గా వాషింఘ్టన్ పోస్ట్ వ్యవహరించింది. మన సైన్యం ఏమంటుంది ? మన భారత దేశ సైనిక పరిభాషలో దేశం కోసం మరణించిన సైనికులను ‘బాటిల్ క్యాజువాలిటీ లేదా ఆపరేషన్స్ క్యాజువాలిటీ’ అని వ్యవహరిస్తున్నారు. అంతకుమించి ఎలాంటి విశేషణాలు వాడడం లేదు. (గమనిక: అమర వీరులను సావర్కర్ సూచించినట్లు ‘హుతాత్మలు’గా వ్యవహరించాలంటూ హిందూత్వ వాదులు సోషల్ మీడియాలో డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో మరింత స్పష్టత కోసం ఈ వ్యాసం) -
బిడ్డను దత్తత తీసుకోవాలనుకుంటున్న నటి!
::: ప్రముఖ అమెరికన్ నటి, బిజినెస్‌ఉమన్, ఫ్యాషన్ డిజైనర్, గాయని, అవివాహిత.. లిండ్సే లోహన్ (32) తన తొలిబిడ్డగా ఎవరినైనా దత్తతు తీసుకోవాలనుకుంటున్నారు! ఇటీవల టర్కీ వెళ్లినప్పుడు అక్కడి సిరియా శరణార్థుల పిల్లలను చూశాక తనకు ఈ ఆలోచన వచ్చినట్లు ఆమె ప్రకటించారు ::: కొన్నేళ్లుగా వాషింగ్టన్ డీసీలో ఉంటూ.. స్థానికులతో పరిచయాలు, రాజకీయ పార్టీలలో పలుకుబడి పెంచుకుని అమెరికా వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతోందన్న ఆరోపణలపై 29 ఏళ్ల రష్యన్ యువతి మరియా బుతీనాను యు.ఎస్. ప్రభుత్వం అరెస్ట్ చేసింది. అమెరికన్ యూనివర్సి టీలో చదివిన మరియాను ‘రైట్ టు బేర్ ఆర్మ్’ అనే రష్యన్ ప్రో–గన్ సంస్థ వ్యవస్థాపకురాలిగా గుర్తించిన పోలీసులు ఆమెకు, యు.ఎస్.లోని రష్యన్ సెంట్రల్ బ్యాంకు అత్యున్నత స్థాయి అధికారులకు మధ్య ఉన్న సంబంధాలపై ఆరా తీస్తున్నారు ::: కేంద్ర ప్రభుత్వం మాట ఇచ్చిన ప్రకారం ఇకనైనా తన భర్త పేరు మీద నేషనల్ చాంపియన్‌షిప్‌ను ప్రారంభించకపోతే ఆయనకు వచ్చిన పద్మశ్రీ, అర్జున అవార్డులతో పాటు మిగతావాటినీ ప్రభుత్వానికి తిరిగి ఇచ్చేస్తానని దివంగత హాకీ క్రీడాకారుడు మొహమ్మద్ షాహిద్ సతీమణి పర్వీన్ హెచ్చరించారు. రెండేళ్ల క్రితం షాహిద్ మరణించినప్పుడు ఆయన పేరు మీద నేషనల్ చాంపియన్ షిప్‌ను ఏర్పాటు చేయడంతో పాటు, ఒక స్టేడియంను కూడా నిర్మిస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం ఇంత వరకు ఆ హామీని నెరవేర్చకపోవడంపై పర్వీన్ తీవ్రమైన అసంతృప్తితో ఉండడంతో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఆదిత్యానాథ్ ఆదేశాలపై కొందరు అధికారులు హుటాహుటిన ఆమెను ఇంటికి వెళ్లి మరీ కలిసి.. సంబంధిత శాఖలు ఆ పనిలోనే ఉన్నట్లు వివరణ ఇచ్చారు ::: జూలై 18న (నిన్న బుధవారం) ప్రారంభమై, ఆగస్టు 10 వరకు జరుగనున్న పార్లమెంటు వర్షాకాల సమావేశాలలో మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం కోసం జరిగే ప్రయత్నాలలో కాంగ్రెస్, బీజేపీల మధ్య వాగ్వాదాలు నెలకొనే వాతావరణం కనిపిస్తోంది. ఇరవై రెండేళ్ల క్రితం వాజపేయి ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్ బిల్లు ఇప్పటి వరకు చట్టంగా రూపుదాల్చకపోవడానికి కారణం.. కాంగ్రెస్‌కు, ఆ పార్టీ మిత్రపక్షాలకు చిత్తశుద్ధి లేకపోవడమేనని బీజేపీ ఆరోపిస్తుండగా.. పార్లమెంటులో మెజారిటీ ఉంచుకుని కూడా గత నాలుగేళ్ల సమావేశాలలో బిల్లు ఆమోదం కోసం మీరెందుకు చిత్తశుద్ధితో ప్రయత్నించలేకపోయారని కాంగ్రెస్ ప్రశ్నిస్తోంది. హైదరాబాద్ నగరంలో మహిళల, బాలల భద్రతకు, రక్షణకు ‘షీ’ టీమ్‌లు, భరోసా సెంటర్లు తీసుకుంటున్న చర్యలను యు.ఎస్. కాన్సులేట్ జనరల్ కేథరీన్ హడ్డా ప్రశంసించారు. కేథరీన్ మంగళవారం నాడు హైదరాబాద్‌లోని షీ టీమ్‌లను, భరోసా సెంటర్లను సందర్శించినప్పుడు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్, అడిషనల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (క్రైమ్స్ అండ్ సిట్).. మహిళలపై నేరాలకు అడ్డుకట్ట వేసేందుకు ఈ రెండు బృందాల పనితీరుపై ప్రజెంటేషన్ ఇచ్చారు ::: బహిరంగంగా స్తన్యమివ్వడానికి ఇబ్బంది పడే తల్లులున్న అంత పెద్ద నాగరిక సమాజమైన అమెరికాలో అక్కడి వర్ధమాన మోడల్.. మారా మార్టిన్ తన ఐదు నెలల కూతురు ఆరియాకు స్తన్యం ఇస్తూ ర్యాంప్‌పై వాక్ చెయ్యడం మహిళా సాధికారతకు ఒక సంచలనాత్మక సంకేతం అయింది. ‘స్పోర్ట్స్ ఇలస్ట్రేటెడ్’ పత్రిక స్విమ్‌సూట్ షోలో మిరుమిట్లు గొల్పుతున్న పసిడివర్ణంలో ఉన్న బికినీ ధరించి, బిడ్డకు చనుబాలు పడుతూ ర్యాంప్ వాక్ చేసిన మార్టిన్.. మర్నాడు ఆ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ, ‘నా మాతృ హృదయాన్ని మంచి మనసుతో అర్థంచేసుకున్న వారందరికీ ధన్యవాదాలు’ అని కామెంట్ పెట్టగా, ప్రఖ్యాత ఫెమినిస్టు వెబ్సైట్ ‘జెజెబెల్’.. ఇలా పాలిస్తూ వాక్ చెయ్యడాన్ని వ్యతిరేకిస్తూ మార్టిన్ ధోరణిని ఒక ప్రహసనంగా అభివర్ణించింది. తమిళ టీవీ సీరియల్ ‘వంశం’లో ప్రధాన పాత్రధారి అయిన రమ్యకృష్ణ పక్కన జ్యోతికగా నటించి వీక్షకుల ఆదరణ పొందిన యువ నటి ప్రియాంక చెన్నైలోని వలసరవాక్కంలో ఉన్న తన నివాసంలో సీలింగ్ ఫ్యాన్‌కు వేలాడుతూ ఆ అపార్ట్మెంట్ పనిమనిషికి కనిపించారు. మూడేళ్ల క్రితం వివాహం చేసుకున్న ప్రియాంకపై పిల్లల్ని కనాలని ఒత్తిడి పెరుగుతోందనీ, ఈ కారణంగానే ఆమె ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు ::: ముంబై స్కూల్స్ స్పోర్ట్స్ అసోసియేషన్.. ముంబైలోని ఆజాద్ మైదాన్‌లో గత నెలలోనే ప్రారంభించిన ‘ఛేంజింగ్ రూమ్’ తాళం చెవుల్ని ఓ అధికారి ఇంటికి తీసుకెళ్లడంతో అండర్ 17 çఫుట్‌బాల్ మ్యాచ్‌లు ఆడేందుకు గ్రౌండ్‌కు వచ్చిన వివిధ జట్లు బాలికలు వాష్‌రూమ్ కోసం ఇబ్బంది పడవలసి వచ్చింది. టోర్నమెంట్ ప్రారంభానికి ముందే డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ట్ ఆఫీసర్ సుమిత్ పాటిల్.. ఆటలు జరిగే రోజులైన జూలై 17, 18 తేదీలలో బాలికల వాష్‌రూమ్‌ను తెరిచి ఉంచాలని అసోసియేషన్‌కు ప్రత్యేకంగా లేఖ రాసినప్పటికీ బాలికలకు ఈ చేదు అనుభవం తప్పలేదు ::: -
నేడు దేశభక్తులు లేరు.. దేశముదుర్లే
షహీద్ భగత్‌సింగ్ పుస్తకావిష్కరణ సభలో ఎండ్లూరి రాజమహేంద్రవరం కల్చరల్: చెరసాలలే చంద్రశాలలుగా, అరదండాలే విరిదండలుగా నాటి త్యాగధనులు భావించారు.నేడు దేశభక్తులు లేరు.. దేశముదుర్లే కనిపిస్తున్నారు అని తెలుగు విశ్వవిద్యాలయం సాహిత్యపీఠం డీన్ ఆచార్య ఎండ్లూరి సుధాకర్ అన్నారు. సర్ ఆర్ధర్ కాటన్ మెమోరియల్ సోషల్ సర్వీస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విశ్రాంతపేపర్ మిల్లు అధికారి ఎస్బీచౌదరి రచించిన‘షహీద్ భగత్‌సింగ్’పుస్తకావిష్కరణ సభలో ఎండ్లూరి ప్రసంగించారు. నన్నయ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య ముర్రు ముత్యాలునాయుడు ‘షహీద్ భగత్‌సింగ్ ’ పుస్తకాన్ని ఆవిష్కరించారు. భగత్ సింగ్, స్వామి వివేకానంద, ఆదిశంకరాచార్యులు జీవించినది కొద్ది కాలమే అయినా మానవాళికి వారు చేసిన సేవలు లెక్కపెట్టలేమన్నారు. గ్రంథకర్త ఎస్బీ చౌదరి మాట్లాడుతూ మంచి మనుషులే సమాజంలో నిజమైన మైనారిటీలన్నారు. సభకు అధ్యక్షత వహించిన డాక్టర్ అరిపిరాల నారాయణరావు మాట్లాడుతూ ఉరితీయకముందు భగత్‌సింగ్‌ను నాటి పోలీస్ అధికారులు చిత్రహింసలకు గురిచేశారన్నారు. స్వాగతవచనాలు పలికిన మహమ్మద్ఖాదర్ఖాన్ ‘జీవితాన్ని ప్రేమిస్తాం–మరణాన్ని ప్రేమిస్తాం, మేం మరణించి–ఎర్రపూల వనంలో పూలై పూస్తాం, ఉరికంబాన్ని ఎగతాళి చేస్తాం, నిప్పురవ్వల మీద నిదురిస్తాం’ అన్న కవితను చదివారు. వ్యక్తిత్వవికాసనిపుణుడు డాక్టర్ బీవీ పట్టాభిరామ్ గ్రంథకర్త కృషిని కొనియాడారు. కోడూరి రంగారావు, ఎర్రాప్రగడ రామకృష్ణ, పెరుమాళ్ల రఘునాథ్ తదితరులు పాల్గొన్నారు. -
జీజీహెచ్‌లో బాలుడు అదృశ్యం
గుంటూరు : ఆసుపత్రిలో చికిత్సపొందేందుకు వచ్చిన ఓ బాలుడు క్యాంటిన్ వద్దకు వెళ్లి అదృశ్యమయ్యాడు. బుధవారం ఈ సంఘటన చోటు చేసుకుంది. పొన్నూరు మండలం నండూరుకు చెందిన షేక్‌బాజి తొమ్మిదేళ్ల కుమారుడు షాహిద్‌ను ఈనెల 15వ తేదీన చికిత్స కోసం 108వ నంబరు గదిలోని పిల్లల వార్డులో అడ్మిట్ చేశారు. బాలుడి ముక్కు నుంచి అప్పుడప్పుడూ రక్తం పడుతుండడంతో వైద్యుల పర్యవేక్షణలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. షాహిద్ బుధవారం టిఫిన్ చేసేందుకు తన కుటుంబ సభ్యులతో కలిసి ఆసుపత్రిలోని క్యాంటిన్ వద్దకు వెళ్లాడు. కుటుంబసభ్యులు టిఫిన్ చేస్తున్న సమయంలో మూత్ర విసర్జనకు వెళ్లి వస్తానని చెప్పి క్యాంటిన్ నుంచి బయటకు వచ్చాడు. ఎంతసేపటికీ బాలుడు తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రుల్లో కంగారు మొదలైంది. కొంతసేపు వేచి చూసిన తల్లిదండ్రులు వార్డులో ఉన్నాడేమోనని వెతికారు. అక్కడ కనిపించకపోయేసరికి ఆసుపత్రి ఆర్ఎంవో డాక్టర్ యనమల రమేష్‌కు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. సీసీ కెమెరాలలో పిల్లవాడు ఎటువైపు వెళ్లాడనే విషయాన్ని పరిశీలించారు. అయినా జాడ తెలియలేదు. అనంతరం ఆసుపత్రి అధికారులు కొత్తపేట పోలీసులకు బాలుడు అదృశ్యంపై ఫిర్యాదు చేశారు. -
ఈ జోడీ పర్ఫెక్ట్!
దేడ్ కహానీ - జబ్ వియ్ మెట్ చేపపిల్ల... నీళ్లల్లో ఈదుతున్నంతసేపూ నోటి దవడలు ఆడిస్తూనే ఉంటుంది. నీళ్లు తాగకుండా ఆక్సిజన్ తీసుకునే ప్రక్రియ అది. దాని జీవనాధారం. అలాగే ఓ చేప కళ్లున్న ఆడపిల్ల, చలాకీగా ఇరవై నాలుగ్గం టలూ తన పెదాలని ఆడిస్తూనే ఉంటుంది. ఎదుటి వాడి మనోభావాలతో సంబంధం లేదు. అలా మాట్లాడుతూనే ఉంటుంది. చివరికి నిద్రలో కూడా. ఆమే... గీత్ సింగ్. అమాయకమైన పల్లె టూరి అమ్మాయి. ముంబైలో ట్రైన్ ఎక్కుతుంది. పరిగెడుతున్న ట్రైన్ లోపల కెమెరా పెట్టి, ఖాళీ డోరు షాటు, కదులు తున్న ట్రైనుని చూపిస్తూ, గట్టిగా గీత్ గొంతు, మాటలు మాత్రమే వినపడేలా కొంత దూరం నడిపించి, తర్వాతే ఆమె రూపాన్ని ప్రేక్షకులకి పరిచయం చేస్తాడు దర్శకుడు. ఒక వాగుడుకాయ్ క్యారెక్టర్‌కి ఇంతకంటే అందమైన, అర్థవంతమైన పరిచయం వేరేది ఉండదు. ఇలా గీత్‌ని పరిచయం చేయడానికి ముందే ముంబైలో ఒక గొప్ప బిజినెస్ మ్యాగ్నెట్ వారసుడు ఆదిత్య కశ్యప్‌ని చాలా నిరాశగా, నిస్పృహగా, జీవితంలో ఓడిపోయి, అదీ తల్లి వేరే వ్యక్తిని ప్రేమించి కుటుంబాన్ని వదిలి వెళ్లిపోతే, ఆ రిఫ్లెక్షను తనని పెళ్లి చేసుకోబోయే అమ్మాయి మీద పడి, ఆమె పెళ్లి క్యాన్సిల్ చేసేస్తే, మూగ బోయినవాడిగా చూపిస్తాడు దర్శకుడు. గమ్యం తెలీక, ఎలా ఉన్నవాడు అలా ఇల్లొదిలి రెలైక్కి కూర్చుంటాడు. అలాంటి వాడికి కో-ప్యాసింజర్ గీత్. అడిగినా అడక్కపోయినా, విసుక్కున్నా, లేచి వెళ్లి ఇంకో దగ్గర కూర్చున్నా ఆమె ధోరణి ఆమెదే. ఆ ఇద్దరూ కలిసి చేసే రైలు ప్రయాణం, దాని కొనసాగింపుగా చేసే జీవిత ప్రయాణమే ‘జబ్ వియ్ మెట్’ సినిమా మొదటి భాగం. నిరాశా నిస్పృహల్లో ఉన్న ఆదిత్యని తన సెలయేటి ప్రవాహం లాంటి మాటల నుంచి ప్రసరించిన తరంగాల కరెంటుతో చైతన్యవంతుణ్ని చేస్తుంది గీత్. అద్భుతమైన సీన్ ఏంటంటే, తండ్రి మరణానికి కారణం తన తల్లి వేరే వ్యక్తిని ప్రేమించి వెళ్లిపోవడం అని, సమాజం తల్లి మీద వేసిన నిందని కొడుకుగా తనూ వేసి ఆమెపై కోపం పెంచుకున్న కశ్యప్‌కి గీత్, తల్లి పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించడం నేర్పిస్తుంది. తల్లి కూడా ఒక మనిషే అని, ఆమె ప్రేమలో తప్పు లేదని, కొడుకుగా ఆమెని అర్థం చేసుకోవాలే తప్ప, సమాజం దృష్టి నుంచి ఆమెని చూడకూడదని చెప్తుంది. ఇలాంటి తల్లుల్ని నిజ జీవితంలో చూసే ఉంటాం, సమాజంలాగ వాళ్లని చెడుగా తిట్టే ఉంటాం - గీత్‌లా వాళ్లని మనుషులుగా భావించమని చెప్పేవాళ్లు మనకుండకపోవచ్చు. జబ్ వియ్ మెట్ గీత్... వుయ్ లెర్న్ హౌ టు లీడ్ లైఫ్ అండ్ హౌ టు ట్రీట్ అదర్స్. సరే, అలాంటి గీత్‌ని ఆమె ఇంట్లోంచి తెల్లారుఝామున తీసుకొచ్చి ఆమె ప్రేమించిన అన్షుమన్ దగ్గర వదిలి వెళ్లిపోతాడు కశ్యప్. ఆమె అడుగుతుంది - మా ఇంట్లోవాళ్లకి తెలీకుండా ఇలా వెళ్లిపోతున్నాను నన్ను క్షమిస్తారా అని! ఆదిత్య చెప్తాడు - మా అమ్మని నీవల్ల నేను అర్థం చేసుకున్నాను, నిన్ను కూడా మీవాళ్లు కొన్నాళ్లకి అర్థం చేసుకుంటారని. అన్షుమన్‌ని కలవకుండానే గీత్‌ని దింపేసి వెళ్లిపోతాడు కశ్యప్ - ఇక్కడ విశ్రాంతి. జీవితాన్ని ఎలా చూడాలో, ఆ క్షణాన్ని ఎలా ఆస్వాదించాలో గీత్ ఆదిత్యకే కాకుండా ఆడియెన్స్ అందరికీ చెప్తుంది. అందుకే ఫస్ట్ హాఫ్ చాలా బావుంటుంది. అందుకే ఫస్ట్ హాఫ్ గురించి ఎక్కువ రాశాను. ద్వితీయార్ధంలో ఆదిత్య చాలా యాక్టివ్ అయిపోతాడు. కానీ గీత్ మాత్రం జీవితంలో ఓడిపోయి కాన్ఫిడెన్స్ కోల్పోయి డీలా పడిపోతుంది. అది తెలిసి ఆమెలో తన చైతన్యంతో కరెంట్ ప్రవహించేట్టు చేసి ఆమెని మామూలుగా తన కుటుంబంతో కలిపే ప్రయత్నం చేస్తాడు ఆదిత్య. ఆ క్రమంలో వాళ్లిద్దరూ ఒకటవ్వడమే కథ. ప్రథమార్ధంలో ఉత్తుంగ తరంగం లాంటి గీత్‌గా మెప్పించిన కరీనా కపూర్ నీరసించడం, నీరస పాత్రలో బాగా మెప్పించిన షాహిద్ కపూర్ ద్వితీయార్ధంలో ఉత్తుంగ తరంగంలా ఎగసి పడలేకపోవడం చూస్తే... సినిమాని కొంచెం పడేసిన ఫీలింగ్ వస్తుంది. కానీ, గీత్ ప్రేమించిన అన్షుమన్‌ని కుటుంబ సభ్యులు స్నేహితుడనుకుని, ఆదిత్యని అల్లుడనుకునే సన్నివేశాలు బాగా నవ్వు తెప్పిస్తాయి. ఆ ఇంటి సీన్లే సెకండ్ హాఫ్‌కి సేవింగ్ ఫ్యాక్టర్. ఒక విధంగా శ్రీను వైట్లగారి సినిమాల ఫార్మాట్ నుంచే ఈ చిత్ర రూపకల్పన జరిగినట్టు ఉంటుంది. ఆ ఇంటి సీన్లు తెలుగులో చాలా సినిమాలకి ముడి సరుకు. షాహిద్, కరీనాలు అప్పటికే ప్రేమికులుగా పాపులర్ అవ్వడం వల్ల కెమిస్ట్రీ మరింత బాగా పండినట్టు ఉంటుంది. కానీ, ఇదే ‘దిల్వాలే దుల్హనియా’ టైమ్‌లో షారుఖ్, కాజోల్ లాంటి జంట చేసుంటే... ఇది కూడా వాటిలాగే ఒక కల్ట్ ఫిల్మ్ అవ్వగలిగే కథ, కథనం ఉన్నాయి ఇందులో. అందుకే ఈ సినిమా బాలీవుడ్లో కమర్షియల్ హిట్‌గా నిలిచింది. 2007 అక్టోబర్‌లో రిలీజైన ఈ సినిమా 2010లో హాలీవుడ్లో ‘లీప్ ఇయర్’ అనే సినిమాకి ప్రేరణ కావడం భారతీయ సినిమా గర్వించదగ్గ అంశమే. విచిత్రం ఏంటంటే ఈ చిత్రం చివరి షెడ్యూల్‌కి వచ్చేసరికి షాహిద్, కరీనాలు నిజ జీవితంలో విడిపోయారు. మీడియా అంతా అది ఈ చిత్రం తాలూకు పబ్లిసిటీ స్టంట్ అని అభివర్ణించింది. కానీ తర్వాత అది నిజమని రుజువైంది. ఈ సినిమా టైటిల్‌ని ‘పంజాబ్ మెయిల్’ అని పెట్టాలా, ‘ఇష్క్ వయా భటిండా’ అని పెట్టాలా ‘జబ్ వియ్ మెట్’ అని పెట్టాలా తేల్చుకోలేక పబ్లిక్ ఓటింగ్ పెడితే జబ్ వియ్ మెట్ గెలిచింది. అలాగే రిలీజయ్యాక ప్రేక్షకుల మన్ననలూ గెలిచింది. కాసుల వర్షమూ రూపాయికి మూడు రూపాయల చొప్పున గెలుచుకొంది. ఈ సినిమాలో చెప్పుకోవాల్సిన మరో ముఖ్య అంశం... ప్రీతమ్ సంగీతం. ఆసాంతం ఆకట్టుకొంటుంది. నటరాజన్ సుబ్రమణియన్ కెమెరా పనితనం కూడా చాలా బావుంటుంది. శ్రేయాఘోషల్కి బెస్ట్ ప్లేబ్యాక్ సింగర్ గాను, సరోజ్ఖాన్కి బెస్ట్ కొరియోగ్రాఫర్ గాను, నేషనల్ అవార్డులను తేవడంతో పాటు కరీనా కపూర్‌కి ఉత్తమ నటిగా ఎన్నో ప్రతిష్టాత్మకమైన ప్రైవేటు అవార్డుల్ని తెచ్చిపెట్టింది ఈ చిత్రం. దర్శకుడు ఇంతియాజ్ అలీ రెండో చిత్రం ఇది. ఈ చిత్రం సక్సెస్ ఇచ్చిన ఊపుతో తర్వాత చాలా మంచి చిత్రాలు తీశాడు. ఇంతియాజ్ కథ కన్నా పాత్రకి, పాత్రల రూపకల్పనకి ఎక్కువ ప్రాధాన్యతనిస్తాడు. వాటి ద్వారా జీవితాన్ని, భావోద్వేగాల్ని అద్భుతంగా ఆవిష్కరిస్తాడు. ప్రేమని చాలా సున్నితంగా ప్రస్తావిస్తాడు. సీన్స్‌ని సుతిమెత్తటి పూవుల్లా ప్యాంపర్ చేస్తాడు. అందుకే మంచి దర్శకుడిగా ఎదిగాడు. రైలు ప్రయాణం ఆధారంగా తీసిన ఈ చిత్రంతో కెరీర్లో, జీవితంలో సక్సెస్ అందుకున్నాడు. తిన్నగా హైవే ఎక్కేశాడు. ఇక పక్కదారి పట్టడనే భావిద్దాం. మరిన్ని మంచి సినిమాలు తీస్తాడని, మనకు చూపిస్తాడనీ ఆశిస్తాం. - వి.ఎన్.ఆదిత్య, సినీ దర్శకుడు -
60 గ్రామాలపై బాంబు దాడులు
జమ్మూ: సరిహద్దులో పొరుగు దేశం ఆగడాలు శ్రుతిమించాయి. పాకిస్తాన్ సైన్యం భారత్ విమర్శలను, హెచ్చరికలను పెడచెవిన పెట్టి మంగళవారం కూడా జమ్మూకశ్మీర్ సరిహద్దులపై భారీ దాడులకు పాల్పడింది. కతువా, సాంబా జిల్లాల్లోని 60కిపైగా గ్రామాలు, చెక్‌పోస్ట్‌లపై బాంబుదాడులు, కాల్పులకు తెగ బడింది. సోమవారం రాత్రి 11 గంటలవరకు సాగిన కాల్పులు మంగళవారం వేకువ జామున మళ్లీ మొదలయ్యాయని కతువా డిప్యూటీ కమిషనర్ షాహిద్ తెలిపారు. మోర్టారు బాంబులు భారత భూభాగంలోకి 4కి.మీ దూరం వరకు వచ్చిపడ్డాయన్నారు. షెర్పూర్, చక్రా, లచిపూర్, లోడి గ్రామాలపై వీటితో దాడి చేశారని అన్నారు. పాక్ దాడులకు బీఎస్ఎఫ్ జవాన్లు దీటుగా బదులిచ్చారని, ఉదయం ఏడు గంటలవరకు ఇరుపక్షాల మధ్య కాల్పులు సాగాయని చెప్పారు. సరిహద్దులో శాంతి కోరుకుంటున్నామని, సహనం నశిస్తే గట్టిగా బదులిస్తామని బీఎస్ఎఫ్ డెరైక్టర్ డీకే పాఠక్ హెచ్చరించారు. కాల్పుల విరమణ ఉల్లంఘనపై తమ నిరసనను ఆ దేశం పట్టించుకోలేదని, దీంతో ఇరు పక్షాల మధ్య సమాచారం మాధ్యమం దెబ్బతిందన్నారు. -
‘హైదర్’ బాగా భయపెట్టాడు
షాహిద్, విశాల్ భరద్వాజ్ మరోసారి జోడీ కట్టారు. గతంలో విశాల్ తీసిన కమీనేలో షాహిద్ హీరోగా నటించడం తెలిసిందే. ప్రఖ్యాత రచయిత షేక్స్పియర్ రాసిన హామ్లెట్ ఆధారంగా ఇతడు రూపొందించిన హైదర్లోనూ మనోడే హీరో. ఇందులో నటించేటప్పుడు ఎంతో భయంగా, కంగారుగా అనిపించిందని షాహిద్ చెప్పాడు. షేక్స్పియర్ మూడు విషాదాంతాలు మాక్బెత్ (మక్బూల్), ఒథెల్లో (ఓంకార), హామ్లెట్ (హైదర్)ను విశాల్ సినిమాలుగా మలిచాడు. ‘నా కెరీర్లో అన్నింటికంటే గొప్పపాత్ర కమీనే సినిమాలోనిది. మళ్లీ విశాల్‌తో కలసి పనిచేయడం ఎంతో సంతోషంగా ఉంది. హామ్లెట్ వంటి కథలతో తీసే సినిమాల్లో నటించే అవకాశం అతికొద్ది మందికే వస్తుంది. ఇలాంటి పాత్ర చేస్తున్నప్పుడు ఏదో వెలితిగా అనిపిస్తుంది. ఇంకా సాధించాల్సింది చాలా ఉందనిపిస్తుంది. షూటింగ్ సమయంలో భయం వేసినప్పుడల్లా ఎవరో ఒకరి దగ్గరికి వెళ్లి ధైర్యం తెచ్చుకునేవాడిని. ‘బాగా చేశానా ?’ అంటూ విశాల్‌తోపాటు ఇతరులనూ అడిగేవాణ్ని’ ఈ సినిమా ట్రయలర్ విడుదల సందర్భంగా మీడియాకు షాహిద్ వివరించాడు. హైదర్ అక్టోబర్ రెండున థియేటర్లకు వస్తున్నాడు. తరువాత విశాల్ మాట్లాడుతూ ఎన్నాళ్లుగానో అనుకుంటున్న ఈ ప్రాజెక్టు తెరకెక్కుతుందని అనుకోలేదని చెప్పాడు. హామ్లెట్‌కు క థ నేపథ్యంగా బాగా నప్పుతుందని చిత్రీకరణకు కాశ్మీర్‌ను ఎంచుకున్నామని, ఇది కుటుంబ కథాచిత్రమని తెలిపాడు. కమీనే వంటి యాక్షన్ సినిమాలు తీసిన విశాల్.. మక్డీ, ది బ్లూ అంబ్రెల్లా వంటి చక్కని బాలల చిత్రాలూ రూపొందించి ప్రశంసలు దక్కించుకున్నాడు. ‘నాకు అన్ని రకాల కథలూ ఇష్టమే. మానవ సంఘర్షణపై ఎక్కువ ఆసక్తి’ అని విశాల్ వివరించాడు. టబూ, కేకే మీనన్, ఇర్ఫాన్ ఖాన్ ఇందులో ముఖ్యపాత్రల్లో కనిపిస్తారు.