
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టూల్స్ పాపులర్ అయిన తరువాత ఆర్టిస్ట్‌లకు కంటినిండా పనిదొరికింది. తమ క్రియేటివిటీకి ఏఐ ఆర్ట్‌ను జత చేస్తూ ఎన్నో ఆశ్చర్యాలను ఆవిష్కరిస్తున్నారు. తాజాగా డిజిటల్ క్రియేటర్ షాహీద్ సృష్టించిన విరాట్ కోహ్లీ ‘దశావతారం’ ఏఐ ఇమేజ్‌లు వైరల్ అవుతున్నాయి.
కామెంట్ సెక్షన్‌లో బోలెడు ‘హార్ట్’ ఇమోజీలు కనిపిస్తున్నాయి. ఆస్ట్రోనాట్, ఫుట్‌బాల్ ప్లేయర్, డాక్టర్, మ్యూజిషియన్, సోల్జర్, ఫైటర్ పైలట్, పోలీస్, మహారాజా... ఇలా రకరకాల గెటప్‌లలో విరాట్ కనిపిస్తాడు. ‘ఇంతకీ విరాట్ ఏ గెటప్‌లో బాగున్నాడు?’ అనే విషయానికి వస్తే.... నెటిజనులలో అత్యధికులు ‘మహారాజా’ గెటప్‌కు ఓటు వేశారు.
Comments
Please login to add a commentAdd a comment