న్యూఢిల్లీ: నేరగాళ్లు కృత్రిమ మేధను ఉపయోగించుకుని డీప్‌ఫేక్ వీడియోలు, చిత్రాలను సృష్టిస్తుండటంపై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి వాటిని దీటుగా ఎదుర్కొనేందుకు సాంకేతికపరమైన నైపుణ్యాన్ని పోలీసు అధికారులు ఎప్పటికప్పుడు అందిపుచ్చుకోవాలన్నారు. శనివారం రాష్ట్రపతి భవన్‌లో తనను కలుసుకున్న ఐపీఎస్–2022 బ్యాచ్ అధికారులనుద్దేశించి ఆమె మాట్లాడారు.
సైబర్ నేరాలు, నేరాలు, డ్రగ్స్ మాఫియా, వామపక్ష తీవ్రవాదం, ఉగ్రవాదం వంటి పలు సవాళ్లను పోలీసు బలగాలు ఎదుర్కొంటున్నాయని చెప్పారు. ‘నూతన సాంకేతిక, సోషల్ మీడియా ప్రభావంతో పరిస్థితుల్లో వేగంగా మార్పులు సంభవిస్తున్నాయి. నేరగాళ్లు కృత్రిమ మేధను ఉపయోగించుకున్నారు. దీంతో, డీప్–ఫేక్ వంటి సమస్యలు నేడు మన ముందున్నాయి’అని ముర్ము చెప్పారు. నేరగాళ్లపై పైచేయి సాధించాలంటే పోలీసు అధికారులు సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment