
ముగ్గురు కాంగ్రెస్ నేతలకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయ్యింది. బలరాం నాయక్, పొదెం వీరయ్య, దొంతి మాధవరెడ్డిలకు ప్రజా ప్రతినిధుల కోర్టు వారెంట్లు జారీ చేసింది.
సాక్షి, హైదరాబాద్: ముగ్గురు కాంగ్రెస్ నేతలకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయ్యింది. బలరాం నాయక్, పొదెం వీరయ్య, దొంతి మాధవరెడ్డిలకు ప్రజా ప్రతినిధుల కోర్టు వారెంట్లు జారీ చేసింది. విచారణకు హాజరుకానందున కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. హన్మకొండలో అనుమతి లేకుండా ప్రదర్శన చేశారని 2018లో కేసు నమోదైంది. ముగ్గురు కాంగ్రెస్ నేతలను అరెస్ట్ చేసి హాజరుపర్చాలని కోర్టు ఆదేశించింది. నాన్ బెయిలబుల్ వారెంట్ జారీతో బలరాం నాయక్ కోర్టుకు హాజరయ్యారు. బలరాం నాయక్‌పై నాన్ బెయిలబుల్ వారెంట్ కోర్టు ఉపసంహరించింది. విచారణను వచ్చేనెల 3కి ప్రజా ప్రతినిధులు కోర్టు వాయిదా వేసింది.
ఇవీ చదవండి:
Indira park: లవర్స్‌కు షాక్, వెంటనే వెనక్కి తగ్గిన అధికారులు
Hyderabad: బైక్‌పై చలాన్‌లు చూసి షాకైన పోలీసులు