రానున్న లోక్‌సభ ఎన్నికల నేపధ్యంలో యూపీలోని ప్రయాగ్‌రాజ్‌పై అందరి దృష్టి పడింది. ఈ స్థానం నుంచి ఇద్దరు దిగ్గజ నేతల కుటుంబాలు తలపడుతున్నాయి. కేశరి నాథ్ త్రిపాఠి, రేవతి రమణ్ సింగ్‌ల కుమారులు ఎన్నికల బరిలోకి దిగారు. ఒకరు బీజేపీకి చెందిన బలమైన నేత. మరొకరు ఎస్పీకి చెందిన ప్రజాదరణ పొందిన నేత. త్వరలో జరగబోయే ఎన్నికల మహా పోటీలో ప్రజలు ఎవరికి పట్టం కడతారనేదానిపై ఆసక్తి నెలకొంది.
ప్రయాగ్‌రాజ్ నుంచి ఎస్పీ, కాంగ్రెస్ కూటమి తరపున ఎస్పీ సీనియర్ నేత రేవతి రమణ్‌సింగ్ కుమారుడు, మాజీ ఎమ్మెల్యే ఉజ్వల్ రమణ్‌సింగ్ బరిలోకి దిగారు . ఇక బీజేపీ సీనియర్ నేత పండిట్ కేసరినాథ్ త్రిపాఠి కుమారుడు, హైకోర్టు అదనపు అడ్వకేట్ జనరల్ నీరజ్ త్రిపాఠి ఆ పార్టీ అభ్యర్థిగా ఎంపికయ్యారు.
దివంగత పండిట్ కేసరి నాథ్ త్రిపాఠి, రేవతి రమణ్ సింగ్.. ఇద్దరికీ బలమైన రాజకీయ నేపథ్యం ఉంది. పండిట్ కేసరి నాథ్ త్రిపాఠి అశోక్ నగర్ నివాసి. ఆయన బీజేపీకి చెందిన శాసనసభ స్పీకర్‌గా, ఎమ్మెల్యేగా, పశ్చిమ బెంగాల్ గవర్నర్‌గా కూడా పనిచేశారు. రేవతి రమణ్ సింగ్ కర్చనలోని బరాన్ నివాసి. ములాయం సింగ్ యాదవ్‌కు అత్యంత సన్నిహితుడు. ఎస్పీ, కాంగ్రెస్ పొత్తు తర్వాత ఉజ్వల్ రమణ్ సింగ్ కాంగ్రెస్‌లో చేరారు.
నీరజ్ త్రిపాఠి బీజేపీలో ఏనాడూ క్రియాశీలకంగా లేరు. దీంతో ప్రయాగ్‌రాజ్ నుండి నీరజ్ త్రిపాఠి పేరు ప్రకటించినప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు. తండ్రికి ప్రజల్లో ఉన్న ఆదరణ కారణంగా బీజేపీ నీరజ్ త్రిపాఠికి టిక్కెట్ కేటాయించింది. అడిషనల్ అడ్వకేట్ జనరల్ పదవి వచ్చాక తన బాధ్యతలు పెరిగాయని, అందుకే పార్టీలో యాక్టివ్‌గా ఉండలేకపోయానని ఆయన తెలిపారు. ప్రయాగ్‌రాజ్ ప్రజలు తనను ఎంపీగా ఎన్నుకుంటే, స్థానికంగా మూతపడిన కంపెనీలను పునఃప్రారంభించడంతోపాటు కొత్త కంపెనీలను తీసుకురావడానికే మొదటి ప్రాధాన్యత ఇస్తానని ఆయన తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment