న్యూఢిల్లీ, సాక్షి: ఢిల్లీలో లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. రెండు లోక్‌సభ స్థానాలకు పార్టీ పరిశీలకులుగా ఉన్న నీరజ్ బసోయా, నసీబ్ సింగ్‌లు కాంగ్రెస్ పార్టీని వీడతున్నట్లు ప్రకటించారు. ఈమేరకు ఇద్దరు నేతలు పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు వేర్వేరుగా రాజీనామా లేఖలు పంపించారు.
ఇరువురూ నేతలూ ప్రధానంగా కాంగ్రెస్ ఆప్ పొత్తును తమ రాజీనామాలకు కారణాలుగా తమ లేఖలలో పేర్కన్నారు. “ఢిల్లీలో ఆప్‌తో పొత్తు పెట్టుకున్నందుకు ఢిల్లీ కాంగ్రెస్ కార్యకర్తలకు రోజురోజుకూ పెద్ద చెడ్డపేరు తెచ్చిపెడుతోంది. ఆత్మగౌరవం ఉన్న నాయకుడిగా నేను ఇకపై పార్టీలో కొనసాగలేను" అంటూ మాజీ ఎమ్మెల్యే, పశ్చిమ ఢిల్లీ పార్లమెంటరీ స్థానానికి పార్టీ పరిశీలకుడు నీరజ్ బసోయా పేర్కొన్నారు.
రాజీనామా చేసిన మరో మాజీ ఎమ్మెల్యే, వాయువ్య ఢిల్లీ పార్టీ పరిశీలకుడు నసీబ్ సింగ్.. ఢిల్లీ కాంగ్రెస్ చీఫ్‌గా దేవిందర్ యాదవ్ నియామకంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. "అరవింద్ కేజ్రీవాల్ తప్పుడు ఎజెండాపై పంజాబ్‌లో ఇప్పటివరకూ విమర్శల దాడి చేసిన దేవిందర్ యాదవ్ ఇప్పుడు ఢిల్లీలో ఆప్‌ను, ఆ పార్టీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను ప్రశంసించడం తప్పనిసరి" అని ఆయన తన లేఖలో పేర్కొన్నారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు అరవింద్ సింగ్ లవ్లీ ఢిల్లీ యూనిట్ చీఫ్ పదవికి రాజీనామా చేసిన తర్వాత మరో ఇద్దరు కీలక నేతలు పార్టీని వీడటం కాంగ్రెస్‌కు గట్టి ఎదురుదెబ్బగా భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment