రాజస్థాన్‌లో బీజేపీ, కాంగ్రెస్‌తోపాటు ఇతర ప్రాంతీయ పార్టీలు లోక్‌సభ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరంగా కొనసాగిస్తున్నాయి. ఈ నేపధ్యంలో మేవార్‌లో విచిత్ర ఘటన చోటుచేసుకుంది. ఇది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
అధికార బీజేపీకి చెందిన రాజస్థాన్ ఉప ముఖ్యమంత్రి, ఇతర మంత్రులు, గత కాంగ్రెస్ ప్రభుత్వ మాజీ సీఎంతో సహా ప్రతిపక్ష పార్టీకి చెందిన పలువురు నేతలు ఒకే వేదికపై కనిపించి, అందరినీ ఆశ్చర్యపరిచారు. అయితే ఇదే సందర్భంలో వారు ఒకరిపై ఒకరు విరుచుకుపడటం గమనార్హం.
ఈ ఘటన రాజకీయ వేదికమీద జరగలేదు. మేవార్‌లో మహిళల గౌరవాన్ని కాపాడేందుకు ప్రాణత్యాగం చేసిన మహనీయులకు నివాళులర్పించే కార్యక్రమానికి ఉపముఖ్యమంత్రి దియా కుమారి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, చిత్తోర్‌గఢ్ బీజేపీ అభ్యర్థి సీపీ జోషి హాజరయ్యారు. అలాగే నాటి కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన ప్రస్తుత చిత్తోర్‌గఢ్ కాంగ్రెస్ అభ్యర్థి ఉదయ్‌లాల్ అంజన, కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే ప్రీతీ శక్తావత్, చిత్తోర్‌గఢ్ స్వతంత్ర ఎమ్మెల్యే చంద్రభన్ సింగ్ అక్యాతో పాటు పలువురు నేతలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
వేదికపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సీపీ జోషి మాట్లాడుతూ గత కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. చరిత్రలో మహారాణా ప్రతాప్‌కు బదులు అక్బర్ గొప్పవాడని అభివర్ణించారు. తమ ప్రభుత్వం దానిని సరిదిద్దిందన్నారు. శిలాఫలకాలలోని తప్పుడు సమాచారాన్ని తొలగించిందన్నారు. దీనిపై స్పందించిన కాంగ్రెస్ అభ్యర్థి ఉదయ్‌లాల్ అంజనా మాట్లాడుతూ ఈ వేదికపై రాజకీయాలు మాట్లాడటం తగదని, గత ప్రభుత్వం తప్పు చేస్తే విచారణ జరిపించాలని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment