
రీ ఎంట్రీ వార్తలు రూమర్స్..!
కొద్ది రోజుల కిందట సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులకు కిక్ ఇచ్చే వార్త ఒకటి టాలీవుడ్ సర్కిల్స్లో తెగ హడావిడి చేసింది. ప్రస్తుతం మురుగదాస్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న భారీ చిత్రంలో నమ్రత గెస్ట్ అపియరెన్స్ ఇవ్వనుందన్న ప్రచారం జరిగింది. ఒకప్పుడు హీరోయిన్గా నటించిన నమ్రత, పెళ్లి తరువాత వెండితెరకు పూర్తిగా దూరమైంది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన అంజి నమ్రత చివరి సినిమా.
ఇన్నేళ్ల తరువాత ఓ అతిథి పాత్రలో నమ్రత కనిపించే అవకాశం ఉందన్న టాక్ వినిపించటంతో మహేష్ ఫ్యాన్స్ ఖుషీ అయ్యారు. అయితే ఈ రూమర్స్పై స్పందించిన నమ్రత, అంతా ట్రాష్ అంటూ కొట్టిపారేసింది. మహేష్ డేట్స్, ఎండార్సమెంట్స్ చూడటంతో పాటు పిల్లల్ని తానే చూసుకోవాలన్న నమ్రత, తనకు సినిమా చేసే టైం లేదని.. ఆ ఆలోచన కూడా లేదని తేల్చి చెప్పింది. పెళ్లి తరువాత నార్త్లో ఐశ్వర్య, సౌత్లో జ్యోతిక లాంటి తారలు రీ ఎంట్రీలో దూసుకుపోతుంటే నమ్రత మాత్రం ఫ్యామిలీకే అంకితమవుతోంది.