
మహేష్ సినిమాలో నమ్రత గెస్ట్ రోల్?
సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులకు కిక్ ఇచ్చే వార్త ఒకటి టాలీవుడ్ సర్కిల్స్లో తెగ హడావిడి చేస్తోంది. ప్రస్తుతం మురుగదాస్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న భారీ చిత్రంలో నమ్రత గెస్ట్ అపియరెన్స్ ఇవ్వనుందట. ఒకప్పుడు హీరోయిన్గా నటించిన నమ్రత, పెళ్లి తరువాత వెండితెరకు పూర్తిగా దూరమైంది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన అంజి నమ్రత చివరి సినిమా.
ఇన్నేళ్ల తరువాత ఓ అతిథి పాత్రలో నమ్రత కనిపించే అవకాశం ఉందన్న టాక్ వినిపిస్తోంది. మహేష్ సినిమాలో కీలక పాత్రకు నమ్రత అయితేనే కరెక్ట్ అని భావించిన దర్శకుడు ఇప్పటికే ఆ ప్రపోజల్ను నమ్రత ముందు ఉంచాడట. అయితే నమ్రత తిరిగి సినిమాల్లో నటించేందుకు అంగకీరిస్తుందా..? లేదా..? అన్న విషయంపై క్లారిటీ రావాలంటే మాత్రం, అధికారిక ప్రకటన వచ్చే వరకు ఎదురుచూడాల్సిందే.