
మహేశ్‌బాబు తనయ సితార ముఖంలో నవ్వులు పూయించారు బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్. ఈ విషయాన్ని మహేశ్‌బాబు సతీమణి నమ్రత పేర్కొన్నారు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘మహర్షి’ సినిమా కోసం మహేశ్‌బాబు న్యూయార్క్‌లో ఉన్నారు. మహేశ్‌బాబుతో కలిసి ఆయన భార్యాపిల్లలు నమ్రత, సితార, గౌతమ్‌లు కూడా వెళ్లారు. అక్కడ ఆలియా భట్‌తో కలిసి సితార దిగిన ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు నమ్రత.
‘‘సితారకు ఆలియా అంటే ఎంతో ఇష్టం. ఆమెతో సితార ఫొటో దిగింది. సితార ముఖంలో నవ్వులకు కారణమైన ఆలియాకు థ్యాంక్స్’’ అని పేర్కొన్నారు నమ్రత. ఇంతకీ ఆలియా న్యూయార్క్ ఎందుకు వెళ్లారనేగా మీ డౌట్. అక్కడికే వస్తున్నాం... రిషి కపూర్‌కు కాస్త అనారోగ్యంగా ఉంటే న్యూయార్క్‌లో చికిత్స చేయించుకోవడానికి వెళ్లారట. ఆయన్ను చూసేందుకే న్యూయార్క్ వెళ్లారట ఆలియా. ఇంతకీ రిషీని ఆలియా ఎందుకు పరామర్శించారంటే.. రణ్‌బీర్ కపూర్ తండ్రి కాబట్టి. రణ్‌బీర్, ఆలియా లవ్‌లో ఉన్నారని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.