అర్ధాంగికి బర్త్‌డే విషెస్‌: మహేశ్‌బాబు | Mahesh Babu Birthday Wishes To His Wife Namrata | Sakshi
Sakshi News home page

భార్యకు బర్త్‌డే విషెస్‌ తెలిపిన సూపర్‌స్టార్‌

Jan 22 2020 9:43 AM | Updated on Jan 22 2020 10:06 AM

Mahesh Babu Birthday Wishes To His Wife Namrata - Sakshi

నమ్రతా శిరోద్కర్‌.. సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు అర్ధాంగిగా అందరికీ సుపరిచితమే. మహేశ్‌బాబుకు అన్ని విషయాల్లో సూచనలు, సలహాలు అందిస్తూ ఎల్లప్పుడూ తోడుగా నిలుస్తుందన్న విషయం తెలిసిందే. నేడు ఆమె పుట్టిన రోజు. ఈ సందర్భంగా మహేశ్‌బాబు తన భార్యకు బర్త్‌డే విషెస్‌ తెలిపాడు. ‘ఎంతగానో ప్రేమించే నా ఇల్లాలికి, జీవిత భాగస్వామికి పుట్టిన రోజు శుభాకాంక్షలు’ అని ట్వీట్‌ చేశాడు. ఇక మహేశ్‌ సోదరి మంజుల కూడా నమ్రతకు బర్త్‌డే విషెస్‌ తెలిపింది. ‘నీ కలలు నిజమవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లవ్‌ యూ సో మచ్‌..’ అంటూ నమత్రతో కలిసి దిగిన ఫొటోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. మహేశ్‌ అభిమానులు సైతం ఆమెకు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

మహేశ్‌, నమ్రత దంపతులు టాలీవుడ్‌లో ఆదర్శ దంపతులుగా పేరు గడించారు. తనకు ఎలాంటి చీకూచింతా లేకుండా ప్రశాంతంగా ఉండటానికి నమ్రతే కారణమని మహేశ్‌ గతంలో ప్రస్తావించాడు. తన యాడ్స్‌, సినిమాలు, వ్యక్తిగత జీవితం.. ఇలా అన్నింటిలోనూ ఆమె కీలక పాత్ర పోషాస్తుందని చెప్పుకొచ్చాడు. కాగా మహేశ్‌బాబు ప్రస్తుతం ‘సరిలేరు నీకెవ్వరు’ సక్సెస్‌ను ఎంజాయ్‌ చేస్తున్నారు. జనవరి 11న విడుదలైన ఈ సినిమా సంక్రాంతి బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే.

చదవండి: నమ్రతా హార్ట్‌ టచింగ్‌ మెసేజ్‌... వైరల్‌

అది నేను తీసుకున్న మంచి నిర్ణయం: మహేశ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement