సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం స్పైడర్ చిత్ర ప్రచార కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. ఈ సందర్భంగా సాక్షితో ప్రత్యేకంగా మాట్లాడిన మహేష్, తన ఫ్యామిలీ గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. తన కొడుకు గౌతమ్ పుట్టిన రోజే తన జీవితంలో అత్యంత ఆనందం కలిగిన రోజని చెప్పిన మహేష్, తన కూతురు సితార అల్లరి ఎవరు కంట్రోల్ చేయలేరన్నాడు.
ఇక తన సినిమాల ఎంపికలో భార్య నమ్రత, తండ్రి కృష్ణల ప్రమేయం ఏమాత్రం ఉండదని, సినిమాలను తనఇష్టాఇష్టాల మేరకు తానే సెలెక్ట్ చేసుకుంటానని తెలిపారు. అయితే ఆర్థికపరమైన విషాయాలు, యాడ్ ఎండార్స్ మెంట్ల లాంటివి మాత్రం నమ్రతే చూసుకుంటారని తెలిపాడు. ఫ్యామిలీతో కలిసి హాలీడే ట్రిప్స్ కు వెల్లటం ఇష్టమన్న సూపర్ స్టార్ ఎక్కువగా స్విట్జర్లాండ్ లో గడిపేందుకు ఇష్టపడతానని తెలిపారు.