సాధారణంగా 53 ఏళ్ల వయస్సులో ఉన్న ఫ్యాషన్ డిజైనర్‌ని మీ లక్ష్యాలేమిటి? అంటే.. ప్రపంచమంతా బొటిక్స్ తెరవడమో మరొకటో అంటారు. కానీ ప్రపంచవ్యాప్తంగా ప్రధాన మారథాన్స్ లను పూర్తి చేయడం అన్నారంటే అది డిజైనర్ నమ్రత జోషిపురా అయి ఉంటారు. అందుకే ఇప్పుడామె బాలీవుడ్ టాప్ డిజైనర్ మాత్రమే కాదు ఇంటర్నేషనల్ మారథాన్ రన్నర్ కూడా. ఇటీవల హైదరాబాద్‌లోని ఓ కార్యక్రమంలో తనను తాను ‘సిక్స్ స్టార్ ఫినిషర్‘ అని సగర్వంగా పరిచయం చేసుకున్న ఢిల్లీ డిజైనర్ నమ్రత సాక్షితో పంచుకున్న విశేషాలు...
‘స్కూల్‌లో, కాలేజ్‌లో ఉండగా హాకీ ఆడేదాన్ని. బీకామ్ చేసినా సృజనాత్మక రంగంలోనే భవిష్యత్తు బాగుంటుందని ఫ్యాషన్ డిజైనింగ్‌లోకి వచ్చాను. ఢిల్లీ నిఫ్ట్‌లో కోర్సు చేస్తున్నపుడు నా టైమ్ పూర్తిగా దానికే కేటాయించాల్సి వచ్చేది. దాంతో ఫిట్‌నెస్, హాకీ అన్నీ అటకెక్కాయి. అయితే వాకర్స్‌కు బెస్ట్ సిటీ అయిన న్యూయార్క్‌లో ఉన్నప్పుడు సుదూరాలు
నడవడం అలవాటై ఫ్యాషన్ రంగంలో బిజీగా ఉంటూనే మినీ మారథాన్ లో పాల్గొన్నా. ఆ క్రమంలోనే ఎనిమిదేళ్ల క్రితం ప్రపంచంలోని 6 పెద్ద మారథాన్ పూర్తి చేయాలని లక్ష్యం పెట్టుకున్నా. ఢిల్లీ మారథాన్ తో మొదలుపెట్టి 2018లో లండన్, 2019లో చికాగో, 2021లో బోస్టన్ , 2022 బెర్లిన్ లో తాజాగా టోక్యో మారథాన్స్ పూర్తి చేశాను’
ఆగని పరుగు..
‘వెర్టిగో, ఆస్తమా, పోస్ట్ మెనోపాజ్ సమస్యలు నన్ను బాధించేవి. రెండుసార్లు కోవిడ్‌తో బాధపడినప్పటికీ మారథాకు ట్రైనింగ్ షెడ్యూల్‌ను కోల్పోలేదు, అయితే ఢిల్లీలో కాలుష్యం వల్ల ఆరు బయట రన్ కష్టమైంది. ట్రెడ్‌మిల్‌పై 25–30 కిలోమీటర్లు పరిగెత్తడం కష్టతరమైన పని. ఇవి దృష్టిలో పెట్టుకుని శిక్షణలో మార్పులు చేస్తూ వచ్చిన నా కోచ్ నకుల్ బుట్టాకు థ్యాంక్స్ చె΄్పాలి’
మహిళ... గుర్తించాలి తన కల...
‘తన కప్పు ఖాళీగా ఉంచుకుని పక్కనవారి కప్పుని నిండేలా చేయడం అసాధ్యం. ఇంటికోసం మాత్రమే కాదు. తన పట్ల కూడా మహిళకు బాధ్యత ఉండాలి. శారీరక, మానసిక, భావోద్వేగపరమైన ఆరోగ్యాలు కా΄ాడుకుంటూ వ్యక్తిగత లక్ష్యాలు సాధించుకోవాలి’
ఆగను... అలుపెరుగను...
‘ఫ్యాషన్ రంగంలో కూడా మరింతగా విస్తరించాలి.. కొత్త స్టోర్స్ ్రపారంభించాలి. నా తదుపరి లక్ష్యం కొన్ని ట్రయల్ రన్నింగ్ ఈవెంట్‌లు. ఎంతకాలం వీలైతే అంత కాలం పరుగు తీస్తూనే ఉంటా’ అంటున్న నమ్రత తన కలను నెరవేర్చుకోవాలని కోరుకుందాం.
– సత్యబాబు
Comments
Please login to add a commentAdd a comment