successfully
-
వయసు ఆపని పరుగు
సాధారణంగా 53 ఏళ్ల వయస్సులో ఉన్న ఫ్యాషన్ డిజైనర్‌ని మీ లక్ష్యాలేమిటి? అంటే.. ప్రపంచమంతా బొటిక్స్ తెరవడమో మరొకటో అంటారు. కానీ ప్రపంచవ్యాప్తంగా ప్రధాన మారథాన్స్ లను పూర్తి చేయడం అన్నారంటే అది డిజైనర్ నమ్రత జోషిపురా అయి ఉంటారు. అందుకే ఇప్పుడామె బాలీవుడ్ టాప్ డిజైనర్ మాత్రమే కాదు ఇంటర్నేషనల్ మారథాన్ రన్నర్ కూడా. ఇటీవల హైదరాబాద్‌లోని ఓ కార్యక్రమంలో తనను తాను ‘సిక్స్ స్టార్ ఫినిషర్‘ అని సగర్వంగా పరిచయం చేసుకున్న ఢిల్లీ డిజైనర్ నమ్రత సాక్షితో పంచుకున్న విశేషాలు...‘స్కూల్లో, కాలేజ్‌లో ఉండగా హాకీ ఆడేదాన్ని. బీకామ్ చేసినా సృజనాత్మక రంగంలోనే భవిష్యత్తు బాగుంటుందని ఫ్యాషన్ డిజైనింగ్లోకి వచ్చాను. ఢిల్లీ నిఫ్ట్‌లో కోర్సు చేస్తున్నపుడు నా టైమ్ పూర్తిగా దానికే కేటాయించాల్సి వచ్చేది. దాంతో ఫిట్నెస్, హాకీ అన్నీ అటకెక్కాయి. అయితే వాకర్స్‌కు బెస్ట్ సిటీ అయిన న్యూయార్క్‌లో ఉన్నప్పుడు సుదూరాలు నడవడం అలవాటై ఫ్యాషన్ రంగంలో బిజీగా ఉంటూనే మినీ మారథాన్ లో పాల్గొన్నా. ఆ క్రమంలోనే ఎనిమిదేళ్ల క్రితం ప్రపంచంలోని 6 పెద్ద మారథాన్ పూర్తి చేయాలని లక్ష్యం పెట్టుకున్నా. ఢిల్లీ మారథాన్ తో మొదలుపెట్టి 2018లో లండన్, 2019లో చికాగో, 2021లో బోస్టన్ , 2022 బెర్లిన్ లో తాజాగా టోక్యో మారథాన్స్ పూర్తి చేశాను’ ఆగని పరుగు..‘వెర్టిగో, ఆస్తమా, పోస్ట్ మెనోపాజ్ సమస్యలు నన్ను బాధించేవి. రెండుసార్లు కోవిడ్‌తో బాధపడినప్పటికీ మారథాకు ట్రైనింగ్ షెడ్యూల్‌ను కోల్పోలేదు, అయితే ఢిల్లీలో కాలుష్యం వల్ల ఆరు బయట రన్ కష్టమైంది. ట్రెడ్‌మిల్‌పై 25–30 కిలోమీటర్లు పరిగెత్తడం కష్టతరమైన పని. ఇవి దృష్టిలో పెట్టుకుని శిక్షణలో మార్పులు చేస్తూ వచ్చిన నా కోచ్ నకుల్ బుట్టాకు థ్యాంక్స్ చె΄్పాలి’మహిళ... గుర్తించాలి తన కల...‘తన కప్పు ఖాళీగా ఉంచుకుని పక్కనవారి కప్పుని నిండేలా చేయడం అసాధ్యం. ఇంటికోసం మాత్రమే కాదు. తన పట్ల కూడా మహిళకు బాధ్యత ఉండాలి. శారీరక, మానసిక, భావోద్వేగపరమైన ఆరోగ్యాలు కా΄ాడుకుంటూ వ్యక్తిగత లక్ష్యాలు సాధించుకోవాలి’ఆగను... అలుపెరుగను...‘ఫ్యాషన్ రంగంలో కూడా మరింతగా విస్తరించాలి.. కొత్త స్టోర్స్ ్రపారంభించాలి. నా తదుపరి లక్ష్యం కొన్ని ట్రయల్ రన్నింగ్ ఈవెంట్లు. ఎంతకాలం వీలైతే అంత కాలం పరుగు తీస్తూనే ఉంటా’ అంటున్న నమ్రత తన కలను నెరవేర్చుకోవాలని కోరుకుందాం. – సత్యబాబు -
జయహో.. ఉత్తరకాశీ టన్నెల్ ఆపరేషన్ సక్సెస్ (ఫోటోలు)
-
‘తాల్’ ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది వేడుకలు
తెలుగు అసోసియేషన్ ఆఫ్ లండన్ (తాల్) ఉగాది వేడుకలు-2023 ఘనంగా జరిగాయి. లండన్‌లోని సత్తావిస్ పటిదార్ సెంటర్లో ఏప్రిల్ 22న ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో లండన్, పరిసర ప్రాంతాలకుచెందిన సుమారు వెయ్యి మంది తెలుగు వారు ఉత్సాహంగా పాల్గొన్నారు. తాల్ కల్చరల్ సెంటర్ (TCC) విద్యార్థులచే గణపతి పాట, భరతనాట్యం, కర్ణాటక సంగీత ప్రదర్శనలతో వేడుకలు ప్రారంభమయ్యాయి. ఉగాది కోసం ప్రత్యేకంగా మూడు నెలలపాటు నిర్వహించిన సినీ నృత్య శిక్షణ శిబిరాలలో సుమారు వంద మంది చిన్నారులు, గృహిణులు, భార్య భర్తలు పాల్గొని, ఆ నృత్యాలను ఈ కార్యక్రమంలో ప్రదర్శించారు. అవి పెద్ద ఎత్తున ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. సాంప్రదాయ, సినీ సంగీత నృత్యాలతో, విభిన్న కార్యక్రమాలతో వేదిక హోరెత్తింది. హాజరైన వారికి తెలుగు సాంప్రదాయ పద్ధతిలో ఉగాది మిఠాయిలు, రుచికరమైన వంటకాలు అరిటాకులో వడ్డించారు. తాల్ చైర్పర్సన్ భారతి కందుకూరి, వైస్-చైర్మన్ , కోశాధికారి రాజేష్ తోలేటి, ఇతర ట్రస్టీలు గిరిధర్ పుట్లూరు, అనిత నోముల, అనిల్ అనంతుల, రవీందర్ రెడ్డి గుమ్మకొండ, నవీన్ గాదంసేతి మరియు కిషోర్ కస్తూరి పాల్గొన్నారు. 'తాల్' ఉగాది-2023 కన్వీనర్ శ్రీదేవి అల్లెద్దుల సహకారంతో ఈ కార్యక్రమం విజయవంతంగా జరిగింది. ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రముఖ నటుడు, హీరో, డబ్బింగ్ కళాకారుడు సాయి కుమార్ తన 50 సంవత్సరాల సినీ ప్రస్థానాన్ని, తన జీవిత విశేషాలను ప్రేక్షకులతో పంచుకున్నారు. తన సినిమాలలో ప్రేక్షకాదరణ పొందిన డైలాగులు చెప్పి తెలుగువారిని, ప్రేక్షకుల్లో ఉన్న కొందరు కన్నడ వారికోసం కన్నడ డైలాగులు చెప్పి వారిని కూడా కేరింతలు కొట్టించారు. యూకేలో తెలుగు సంస్కృతిని పరిరక్షించడంలో, ప్రోత్సహించడంలో 'తాల్' చేస్తున్న కృషిని ఆయన కొనియాడారు. 'తాల్' వార్షిక పత్రిక “మా తెలుగు”ను సాయి కుమార్ ఈ సందర్భంగా ఆవిష్కరించారు. తాల్ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు ప్రముఖ క్యాన్సర్ వైద్య నిపుణులు, పద్మశ్రీ , బ్రిటన్ ఓబీఈ గ్రహీత, KIMS ఉషా లక్ష్మీ సెంటర్ ఫర్ బ్రెస్ట్ డిసీజెస్ వ్యవస్థాపకులు డాక్టర్ రఘురాం పిల్లరిశెట్టికి అందించి సత్కరించారు. డాక్టర్ రఘురాం మాట్లాడుతూ ఈ పురస్కారం తన జీవితంలో ఎప్పటికీ మంచి జ్ఞాపకంగా గుర్తుండిపోతుందని అన్నారు. అలాగే 'తాల్' చేస్తున్న సేవా సాంస్కృతిక కార్యక్రమాలను కొనియాడారు. లండన్‌లోని హై కమిషన్ ఆఫ్ ఇండియా మినిస్టర్ (కోఆర్డినేషన్) దీపక్ చౌదరి ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిధిగా విచ్చేసి, లండన్‌లో 'తాల్' తెలుగువారి కోసం చేస్తున్న కృషిని కొనియాడారు. అలాగే తెలుగు వారికి భారత దౌత్య కార్యాలయం 'తాల్' సమన్వయంతో సహకారం అందించడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని గుర్తు చేశారు. ప్రముఖ పర్వతారోహకుడు, ప్రపంచ మార్షల్ ఆర్ట్స్ ఛాంపియన్ అన్మిష్ వర్మ ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా భారతదేశం నుంచి విచ్చేశారు. తన ఎవరెస్టు శిఖరం ఎక్కినప్పటి అనుభవాలను, రణ విద్యలలో తను గెలుచుకున్న ప్రపంచ స్థాయి పథకాల ప్రక్రియలో ఎదుర్కొన్న సవాళ్లను వివరించి ప్రేక్షకులలో ముఖ్యంగా యువతలో స్ఫూర్తి నింపారు. ప్రముఖ యాంకర్, నటి శ్యామల, కెవ్వు కార్తీక్, ఆర్జే శ్రీవల్లి తమదైన శైలిలో ప్రేక్షకులను అలరించారు. నేపథ్య గాయకులు హారిక నారాయన్, అరుణ్ కౌండిన్యలు తమ ప్రసిద్ధ తెలుగు పాటలతో మైమరిపించడమే కాకుండా ఉర్రూతలూగించే పాటలతో ప్రేక్షకులుమైమరచిపోయారు. లండన్ బారో ఆఫ్ హన్స్లో మేయర్ రఘువీందర్ సింగ్ అతిథిగా విచ్చేసి, 'తాల్' క్రీడల పట్ల చేస్తున్న కృషిని ప్రత్యేకంగా కొనియాడారు. ప్రతి సంవత్సరం 'తాల్' ప్రతిష్టాత్మకంగా నిర్వహించే 20-20 క్రికెట్ పోటీలు, 'తాల్' ప్రీమియర్ లీగ్ (TPL), ఈ సంవత్సరం ప్రైమ్ నార్త్ టీపీఎల్ 2023గా, మే 6 నుంచి మూడు నెలల పాటు నిర్వహించబోతున్నట్టు తెలియజేస్తూ టోర్నీకి సంబంధించిన పోస్టర్ని TPL కమిటీ ఆవిష్కరించింది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి సహకరించిన ప్రేక్షకులకు, నిర్వాహక కమిటీకి, కళాకారులకు, వాలంటీర్లకు, తోటి సంస్థలు, తోడ్పాటు అందించిన స్పాన్సర్లందరికీ 'తాల్' చైర్పర్సన్ భారతి కందుకూరి ధన్యవాదాలు తెలిపారు. -
NASA's DART Mission: నాసా ప్రయోగం దిగ్విజయం.. గ్రహశకలాల్ని ఇక దారి మళ్లించగలం!
వాషింగ్టన్: అంతరిక్ష సవాళ్లను దీటుగా ఎదుర్కొనే దిశగా కీలక ముందడుగు పడింది. భూమిని ఢీకొట్టే ఆస్కారమున్న గ్రహశకలాలను దారి మళ్లించి మానవాళికి ముప్పును తప్పించగలమన్న భరోసా ఏర్పడింది. భూమికి సుదూరంగా ఉన్న ఓ గ్రహశకలాన్ని ఉపగ్రహంతో ఢీకొట్టించే లక్ష్యంతో నాసా చేపట్టిన డబుల్ ఆస్టిరాయిడ్ రీడైరెక్షన్ టెస్ట్ (డార్ట్) విజయవంతమైంది. ఇందుకోసం 10 నెలల క్రితం ప్రయోగించిన 570 కిలోల ఉపగ్రహం లక్ష్యాన్ని అత్యంత కచ్చితత్వంతో ఛేదించింది. భూమికి 108 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్న డైమోర్ఫస్ అనే బుల్లి గ్రహశకలాన్ని ముందుగా నిర్దేశించిన మేరకు మంగళవారం తెల్లవారుజామున గంటకు 22,530 కిలోమీటర్ల వేగంతో ఢీకొట్టింది. దాంతో నాసా ప్రధాన కార్యాలయంలో పండుగ వాతావరణం నెలకొంది. శాస్త్రవేత్తలంతా పరస్పరం అభినందనలు తెలుపుకుంటూ సందడి చేశారు. అన్ని అంచనాలనూ అధిగమిస్తూ ప్రయోగం దిగ్విజయంగా ముగిసిందని నాసా ప్రకటించింది. అంతరిక్షంలో అతి చిన్న శకలాన్ని కూడా అత్యంత కచ్చితత్వంతో ఢీకొట్టేలా ఉపగ్రహాలను సంధించగలమని రుజువైందని నాసా సైన్స్ మిషన్ డైరెక్టరేట్ అసోసియేట్ అడ్మినిస్ట్రేటర్ థామస్ జుర్బచెన్ అన్నారు. కెనైటిక్ ఇంపాక్ట్ టెక్నిక్ సాయంతో జరిగిన ఈ ప్రయోగం భూగోళ పరిరక్షణలో అతి పెద్ద ముందడుగని నాసా అడ్మినిస్ట్రేటర్ బిల్ నెల్సన్ చెప్పారు. ‘‘నిన్నామొన్నటిదాకా శాస్త్ర సాంకేతిక కల్పనగా తోచిన విషయం ఒక్కసారిగా వాస్తవ రూపు దాల్చింది. నమ్మకశ్యం కానంతటి ఘనత ఇది. భావి అంతరిక్ష ప్రమాదాల బారినుంచి భూమిని కాపాడుకోవడానికి ఒక చక్కని దారి దొరికినట్టే’’ అంటూ హర్షం వెలిబుచ్చారు. ప్రభావం తేలేందుకు మరికాస్త సమయం... డిడిమోస్ అనే మరో చిన్న గ్రహశకలం చుట్టూ డైమోర్ఫస్ తిరుగుతోంది. దాని వేగాన్ని తగ్గించడం ద్వారా కక్ష్యలో కొద్దిపాటి మార్పు తీసుకురావడం ఈ ప్రయోగ ప్రధాన లక్ష్యం. అది నెరవేరిందీ లేనిదీ నిర్ధారించుకునేందుకు ప్రపంచవ్యాప్తంగా పలుచోట్ల నుంచి శక్తిమంతమైన టెలిస్కోప్‌ల ద్వారా నాసా బృందం డైమోర్పస్ను కొద్ది వారాల పాటు నిరంతరం గమనిస్తుంది. డార్ట్‌క్రాఫ్ట్ ఢీకొట్టడం వల్ల డైమోర్ఫస్ కక్ష్య కనీసం ఒక్క శాతం కుంచించుకుపోతుందని అంచనా వేస్తోంది. ఆ లెక్కన డిడిమోస్ చుట్టూ అది పరిభ్రమించే సమయం 10 నిమిషాల దాకా తగ్గాలి. డిడిమోస్ జోలికి వెళ్లకుండా డైమోర్ఫైస్ను మాత్రమే అత్యంత కచ్చితత్వంతో ఢీకొట్టడం మామూలు విజయం కాదని థామస్ చెప్పారు. ఇందుకోసం అత్యాధునిక డ్రాకో నావిగేషన్ పరిజ్ఞానాన్ని ఉపయోగించారు. నియో... డార్ట్ వారసుడు డార్ట్ ప్రయోగం సఫలమవడంతో భూమికి అంతరిక్ష ముప్పును పసిగట్టి నివారించే ప్రయోగాల పరంపరలో తదుపరి దశకు నాసా తెర తీస్తోంది. డార్ట్ ప్రాజెక్టుకు కొనసాగింపుగా నియర్ అర్త్ ఆబ్జెక్ట్ (నియో) సర్వేయర్ పేరుతో రెండో దశ ప్లానెటరీ డిఫెన్స్ మిషన్‌ను రూపొందిస్తోంది. దీన్ని త్వరలో పట్టాలపైకి ఎక్కించనున్నట్టు నాసా ప్లానెటరీ డిఫెన్స్ ఆఫీసర్ లిండ్లీ జాన్సన్ ప్రకటించారు. భూమికి సమీపంలో ఉన్న ప్రమాదకర గ్రహశకలాలను కనిపెట్టి వాటితో భవిష్యత్తులో ముప్పు రాకుండా ముందే జాగ్రత్త పడటం దీని లక్ష్యమన్నారు. డైమోర్ఫస్‌ను ఉపగ్రహం ఢీకొట్టేందుకు కేవలం 43 సెకన్ల ముందు తీసిన ఫొటో -
పందిపిల్ల ఇతివృత్తంతో కమెడియన్ మూవీ.. థియేటర్లలో సందడి
చెన్నై సినిమా: 'పన్నికుట్టి' చిత్రం థియేటర్లలో సందడి చేస్తోంది. కొత్త దర్శకుడు అను చరణ్ తెరకెక్కించిన చిత్రం ఇది. ఇందులో కమెడియన్ యోగిబాబు, కరుణాకరన్ ప్రధాన పాత్రలు పోషించారు. సమీర్ భరత్ రామ్ నిర్మించిన ఈ చిత్రం విడుదల హక్కులను లైకా ప్రొడక్షన్ పొంది శుక్రవారం (జులై 8) విడుదల చేసింది. వినోదం మేళవించిన కుటుంబ కథా చిత్రంగా రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకుల నుంచి మంచి స్పందన పొందుతోంది. యోగిబాబు కామెడీ పంచ్ డైలాగ్స్‌కు ప్రేక్షకుల కడుపుబ్బ నవ్వుకుంటున్నారు. నటుడు కరుణాకరన్ నటన ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా పందిపిల్ల ఇతివృత్తంతో రూపొందిన ఈ చిత్రంలో పలు ఆసక్తికరమైన సన్నివేశాలు ప్రేక్షకులను అలరిస్తున్నాయి. కుటుంబ సమస్యలతో సతమతమయ్యే కరుణాకరన్ వాటి నుంచి బయటపడేందుకు ఒక స్వామిజీని ఆశ్రయిస్తాడు. ఆయన ఏం చేశాడు? కరుణాకరన్ సమస్యల నుంచి బయటపడ్డాడా? అంశాలకు దర్శకుడు హాస్యాన్ని జోడించి చిత్రాన్ని జనరంజకంగా తీర్చి దిద్దారు. నమ్మకమే జీవితం అనే చక్కని సందేశంతో కూడిన ఈ చిత్రం థియేటర్లలో వినోదాలు విందులో సందడి చేస్తోంది. చదవండి: 36 ఏళ్ల క్రితం సినిమాలకు సీక్వెల్.. ఈ హీరోలకు కమ్‌బ్యాక్ హిట్.. యాదృచ్ఛికమా! నా భర్త నేను ఎప్పుడో ఓసారి కలుసుకుంటాం: స్టార్ హీరోయిన్ నితిన్‌కు అసలు డ్యాన్సే రాదు: అమ్మ రాజశేఖర్ -
సాయిధరమ్ తేజ్ కాలర్ బోన్ సర్జరీ విజయవంతం
-
‘మిస్టర్ పెర్ఫెక్ట్ సీఎం’ అంటూ కేరింతలు..
తనకు అలవాటైన రీతిలో టిక్ టిక్మంటూ మైకును తట్టారు.. అన్నా బాగున్నారా.. అంటూ నవ్వుతూ ప్రసంగం ప్రారంభించారు.. ప్రతి అక్కనూ ప్రతి చెల్లినీ.. ప్రతి అవ్వనూ తాతనూ పేరు పేరునా పలకరించారు.. ముఖ్యమంత్రిలా కాదు ఓ ఆత్మబంధువులా అనిపించారు.. అందుకే జగన్మోహనుడిని చూసి సిక్కోలు ప్రజలు పులకించిపోయారు. సీఎం హోదాలో తొలిసారి అడుగుపెట్టిన రాజన్న బిడ్డకు జేజేలు పలికారు. ట్రిపుల్ ఐటీ విద్యార్థులైతే ‘మిస్టర్ పెర్ఫెక్ట్’ అంటూ కేరింతలు కొట్టారు. సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: అధికారంలోకి వచ్చాక సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి జిల్లాలో చేసిన తొలి పర్యటన విజయవంతమైంది. 100 రోజుల పాలన గొప్పతనం చాటి చెప్పింది. అనవసర రాజకీయాలకు పోకుండా... ప్రజలు విసుక్కోకుండా... అధికారులు ఇబ్బందులు పడకుండా ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. చెప్పాలంటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రసంగం యావత్తు సూటిగా...సుత్తి లేకుండా సాగింది. పాదయాత్రలోనూ... ఎన్నికల్లోనూ... ఏ హామీలిచ్చారు... అధికారంలోకి వచ్చాక అమలు చేసినవేంటి?... భవిష్యత్‌లో ఏం చేయబోతున్నారు... సవివరంగా, ప్రణాళిక ప్రకారంగా వివరించారు. దీంతో తమకు కలిగే ప్రయోజనం, మేళ్లేమిటో కళ్లకు కట్టినట్టు ప్రజలకు స్పష్టమైంది. వరాల జల్లు.. ఒకపక్క వరుణ దేవుడు చిరు జల్లులు కురిపిస్తుండగా పలాస సభలో ముఖ్యమంత్రి వరాల మూట విప్పారు. ఎన్నో ఏళ్లుగా కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్న ప్రజలకు ఊరట కలిగించారు. 3, 4 దశల్లో ఉన్న రోగులకు ఇక నుంచి రూ.5 వేలు పింఛన్ ఇవ్వనున్నట్లు కరతాళ ధ్వనుల మధ్య ప్రకటించారు. -ప్రతి 500 మంది కిడ్నీ రోగులకు ఓ హెల్త్ అసిస్టెంట్‌ను నియమిస్తామని, వారు రోగుల బాగోగులు చూస్తారని చెప్పారు. -కిడ్నీ రోగులకు నాణ్యమైన మందులతోపాటు వారికి, వారి ఎటెండెంట్‌కు ఉచిత బస్ పాస్ అందిస్తామని ప్రకటించారు. -ఇచ్ఛాపురం నియోజకవర్గంలో బెంతు ఒరియాలు, బుడగ జంగాల సమస్యలను పరిగణనలోకి తీసుకుని జేసీ శర్మ నేతృత్వంలో వన్‌మేన్ కమిషన్ వేశామని చెప్పారు. -వంశధార నదిపై నేరడి వద్ద బ్యారేజి నిర్మాణంతోపాటు ఆ పనులను యుద్ధప్రాతిపదికన అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. పర్యటన సాగిందిలా.. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం జిల్లాలో సుడిగాలి పర్యటన చేశారు. ఉదయం 11.16 నిమిషాలకు హెలికాప్టర్లో పలాసకు చేరుకున్నారు. అక్కడి నుంచి దారి పొడవునా బారులు తీరిన జనాల నడుమ సభా ప్రాంగణానికి ఉదయం 11.40 నిమిషాలకు చేరుకున్నారు. 11.42 నిమిషాలకు 200 పడకల సూపర్ స్పెషాలిటీ కిడ్నీ ఆసుపత్రి, కిడ్నీ రీసెర్చ్ సెంటర్, రూ.600 కోట్ల మంచినీటి పథకం, రూ.11.95 కోట్లతో నిర్మించనున్న ఫిషింగ్ జెట్టీ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం 12.12 గంటలకు ప్రసంగం ప్రారంభించారు. ప్రసంగం అనంతరం నాణ్యమైన బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. తిత్లీ బాధితులకు పెంచిన పరిహారాన్ని అందజేశారు. 12.58 గంటలకు పలాస సభ ముగిసింది. అక్కడి నుంచి హెలికాప్టర్లో ఎచ్చెర్లకు చేరుకున్నారు. రూ.30 కోట్లతో నిర్మించిన ట్రిపుల్ ఐటీ అకడమిక్ భవన సముదాయాన్ని ప్రారంభించారు. అనంతరం ట్రిపుల్ ఐటీ విద్యార్థులతో ముఖాముఖి భేటీ అయ్యారు. అనంతరం శ్రీకాకుళం మండలం సింగుపురం సమీపంలో నిర్మించిన అక్షయపాత్ర సంస్థ హైటెక్ కేంద్రీయ వంటశాలను ప్రారంభించారు. తర్వాత రోడ్డు మార్గం గుండా ఎచ్చెర్లకు వెళ్లి అక్కడి నుంచి హెలికాప్టర్లో విశాఖపట్నానికి బయలుదేరారు. ఇలా ఒక్కరోజులోనే సీఎం జగన్మోహన్రెడ్డి చకచకా కార్యక్రమాలను పూర్తి చేశారు. ఆద్యంతం ఆసక్తికరం.. గత ఐదేళ్లలో నాటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అనేక పర్యాయాలు జిల్లాలో పర్యటించారు. భారీ జన సమీకరణ ద్వారా సభలను అట్టహాసం చేశారు. సరిగ్గా చంద్రబాబు ప్రసంగించేసరికి జనాలు వెనుతిరిగిపోయేవారు. దానికి గంటల తరబడి విసిగించే ప్రసంగాలే కారణం. ఎంతసేపూ భజనకు ప్రాధాన్యమిస్తూ... ప్రతిపక్షాన్ని తిట్టిపోస్తూ చేసే ప్రసంగాలను వినలేక జనాలు మధ్యలోనే వెళ్లిపోయేవారు. వారిని నిలువరించడం ఒక ప్రహసనంగా మారేది. చంద్రబాబు సభ నిర్వహించాలంటే అధికారులు భయపడే పరిస్థితి ఉండేది. ప్రజలను తీసుకురావడం, తీసుకొచ్చాక వేచి ఉంచడం తలకుమించిన భారంగా ఉండేది. కానీ శుక్రవారం పలాసలో జరిగిన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సభ గాని, ఎచ్చెర్లలో ట్రిపుల్ ఐటీ విద్యార్థులతో జరిగిన ముఖాముఖి గాని అందుకు భిన్నంగా సాగింది. నాటి చంద్రబాబు సభలకు, నేడు జరిగిన వైఎస్ జగన్ కార్యక్రమాలకు మధ్య తేడా స్పష్టమైంది. పలాసలో జరిగిన సభలో అప్పుడే అయిపోయిందా.. అనిపించే రీతిలో ప్రసంగం ఆసక్తికరంగా సాగింది. ట్రిపుల్ ఐటీ విద్యార్థులు సైతం ఆరాధనాపూర్వకంగా ముఖ్యమంత్రితో మాట్లాడారు. వైఎస్ జగన్ ఆశయాలను మరోసారి ప్రశ్నలడిగి మరీ ఆలకించారు. వైఎస్సార్ హయాంలో ప్రారంభమైన ట్రిపుల్ ఐటీలు గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన తమను ఎలా తీర్చిదిద్దుతున్నాయో వివరించారు. టీవీల్లో సీఎం కార్యక్రమాన్ని చూస్తున్న వారు కూడా అతుక్కుపోయారంటే... ఎంత మంచి వాతావరణంలో ముఖాముఖి జరిగిందో అర్థం చేసుకోవచ్చు. రాజకీయ ప్రస్తావన లేకుండా, అనవసరమైన ఆరోపణలు చేయకుండా ప్రతిపక్షం ఊసెత్తకుండా.. తానేం చేశాను... ఏం చేస్తున్నాను... ఏం చేయబోతున్నానో చెప్పి అటు పలాస ప్రజలను, ఇటు ఎచ్చెర్ల ట్రిపుల్ ఐటీ విద్యార్థులను ఆకట్టుకున్నారు. ఏ ఒక్కరూ విసుగెత్తకుండా... సూటిగా... సుత్తి లేకుండా ప్రసంగించారు. దీంతో కార్యక్రమం చివరి వరకు ప్రజలు వేచి ఉన్నారు. బిజీ షెడ్యూల్లో కూడా వినతుల స్వీకరణ.. పర్యటన మొత్తం బిజీబిజీగానే సాగింది. కానీ తన కోసం వేచి ఉన్న అర్జీదారులు నిరుత్సాహం చెందకుండా ప్రతి ఒక్కరి నుం చి వినతులు స్వీకరించారు. తీసుకోవడమే కాకుండా వాటిని చదివి ఏం చేయాలన్న దానిపై ఆలోచన కూడా చేశారు. అటు పలాస, ఇటు ఎచ్చెర్లలో ప్రజలు నుంచి పెద్ద ఎత్తున వినతులు వచ్చాయి. వాటికి సంబంధించి అక్కడికక్కడే సంబంధిత అధికార వర్గాలకు ఆదేశాలు ఇచ్చారు. మిస్టర్ పెర్ఫెక్ట్ సీఎం.. విద్యార్థులతో మాటామంతి కార్యక్రమంలో వారు అడిగిన ప్రశ్నలకు సీఎం జగన్మోన్రెడ్డి ఉత్సాహంగా సమాధానం చెబుతుంటే విద్యార్థులు కేరింతలు కొట్టారు. ‘మిస్టర్ పెర్ఫెక్ట్ సీఎం జగన్’ అంటూ కేకలు వేశారు. ‘నాన్న స్థాపించిన ట్రీపుల్ ఐటీలను దేశంలోనే అగ్రగామిగా నిలుపుతామని, ఐటీ దిగ్గజ కంపెనీలు ఆంధ్రదేశం వైపు చూసేలా చేస్తాన’ని సీఎం చెప్పగానే విద్యార్థులు కరతాళధ్వనులతో హోరెత్తించారు. -
ప్రహార్ క్షిపణి పరీక్ష సక్సెస్
బాలసోర్: భారీ వర్షం మధ్యనే స్వల్ప శ్రేణి క్షిపణి ‘ప్రహార్’ను భారత్ గురువారం ఒడిశా తీరంలో విజయవంతంగా పరీక్షించింది. ఉపరితలం నుంచి ఉపరితలానికి ప్రయోగించే ఈ క్షిపణిని రక్షణ, పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో–డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనేజేషన్) అభివృద్ధి చేసింది. వివిధ దిశల్లో ఉన్న బహళ లక్ష్యాలను ప్రహార్ ఛేదించగలదని అధికారులు చెప్పారు. చాందీపూర్‌లోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి జరిపిన పరీక్షలో క్షిపణి అనుకున్న ప్రకారం పనిచేసిందనీ, 200 కిలో మీటర్ల దూరంలోని లక్ష్యాన్ని ఛేదించిందని వారు వెల్లడించారు. ఈ క్షిపణిలో అత్యాధునిక దిక్సూచి వ్యవస్థ, అడ్వాన్స్డ్ కంప్యూటర్ సహా పలు విశేషాలు ఉన్నాయనీ, అన్ని రకాల వాతావరణాలు, ప్రాంతాల్లో ఇది అత్యంత కచ్చితత్వంతో లక్ష్యాన్ని ఛేదిస్తుందని అధికారులు చెప్పారు. -
జీఐఎస్ సబ్‌స్టేషన్ సక్సెస్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో నిర్మించిన తొలి 400 కేవీ గ్యాస్ ఇన్సులేటెడ్ సబ్‌స్టేషన్ (జీఐఎస్)ను తెలంగాణ విద్యుత్ సరఫరా సంస్థ (ట్రాన్స్‌కో) విజయవంతంగా చార్జింగ్ చేసింది. విద్యుత్ సౌధలోని లోడ్ డిస్పాచ్ సెంటర్ నుంచి ట్రాన్స్‌కో సీఎండీ డి.ప్రభాకర్‌రావు బుధవారం రిమోట్ ద్వారా ఈ సబ్‌స్టేషన్‌కు చార్జింగ్ నిర్వహించారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా భూగర్భంలో 120 మీటర్ల దిగువన నిర్మిస్తున్న మేడారం లిఫ్టుకు విద్యుత్ సరఫరా చేసేందుకు రూ.430 కోట్ల వ్యయంతో ఈ సబ్‌స్టేషన్‌ను ట్రాన్స్‌కో నిర్మించింది. మేడారం లిఫ్టులకు అనుసంధానంగా సబ్‌స్టేషన్‌ను భూగర్భంలో నిర్మించాల్సిన అవసరం ఏర్పడింది. ఫీడర్ల మధ్య నిర్దిష్ట దూరంతో సబ్‌స్టేషన్ నిర్మాణానికి కనీసం 30 ఎకరాల స్థలం అవసరం కాగా, భూగర్భంలో మేడారం లిఫ్టునకు అనుసంధానంగా సబ్‌స్టేషన్ నిర్మించడానికి అంత స్థలం అందుబాటులో లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో తక్కువ స్థలంలో నిర్మించేందుకు వీలు కలిగిన గ్యాస్ ఇన్సులేటెడ్ సబ్‌స్టేషన్‌ను మేడారంలో ట్రాన్స్‌కో నిర్మించింది. 3 వేల గజాల స్థలంలో ఈ సబ్‌స్టేషన్ నిర్మాణాన్ని 5 నెలల రికార్డు సమయంలో పూర్తి చేసింది. ఈ సబ్ స్టేషన్‌లోని ఫీడర్ల మధ్య తక్కు వ దూరం ఉన్నా, వాటి ద్వారా ప్రవహించే విద్యుత్ పరస్పరం సంపర్కంలోకి రాకుండా ఫీడర్ల మధ్య సల్ఫర్ హెగ్జాఫ్లోరైడ్ గ్యాస్ విద్యు త్ నిరోధకంగా పని చేయనుంది. ఈ తరహా సబ్‌స్టేషన్ దేశంలో మూడోది అని, రాష్ట్రంలో నిర్మించడం ఇదే తొలిసారి అని ట్రాన్స్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు ‘సాక్షి’కి తెలిపారు. 870 మెగావాట్ల విద్యుత్.. మేడారం పంపింగ్ స్టేషన్లో 124.4 మెగావాట్ల సామర్థ్యంతో ఏర్పాటుచేస్తున్న 7 పంపులకు ఈ సబ్‌స్టేషన్ ద్వారా 870.80 మెగావాట్ల విద్యుత్ సరఫరా కానుంది. ఈ సబ్‌స్టేషన్‌లో 160 ఎంవీఏ సామర్థ్యం కలిగిన ఏడు పవర్ ట్రాన్స్ఫార్మర్లు, 25 ఎంవీఏల సామర్థ్యం కలిగిన రెండు ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేశారు. రామడుగు 400/33 కేవీ సబ్ స్టేషన్ నుంచి భూగర్భంలోని మేడారం సబ్‌స్టేషన్ వరకు 20.3 కి.మీల 400 కేవీ క్యూఎండీసీ విద్యుత్ లైన్ నిర్మాణం కోసం 2,500 ఎస్‌క్యూఎంఎం కేబుల్‌ను వినియోగించారు. జీఐఎస్ సబ్‌స్టేషన్ చార్జింగ్ విజయవంతం కావడంతో ట్రాన్స్‌కో సీఎండీ, విద్యుత్ శాఖకు సీఎం కేసీఆర్ అభినందనలు తెలిపారు. -
అగ్ని–5 గ్రాండ్ సక్సెస్
బాలసోర్: దేశీయంగా అభివృద్ధి చేసిన, అణ్వాయుధాలను మోసుకెళ్లే సామర్థ్యమున్న అత్యాధునిక అగ్ని–5 ఖండాంతర బాలిస్టిక్ క్షిపణిని రక్షణ శాఖ ఆదివారం విజయవంతంగా పరీక్షించింది. 5 వేల కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను ఇది ఛేదించగలదు. ఉపరితలం నుంచి ఉపరితలానికి ప్రయోగించే ఈ క్షిపణిని ఒడిశాలోని ఏపీజే అబ్దుల్ కలాం దీవి నుంచి ఉదయం 9.45 గంటలకు మొబైల్ లాంచర్ ద్వారా ప్రయోగించి పరీక్షించామని రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి. క్షిపణి పరీక్ష విజయవంతం అవడంతో రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) శాస్త్రజ్ఞులు, సిబ్బందికి రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అభినందనలు చెప్పారు. 2012 ఏప్రిల్ 19 నుంచి ఇప్పటివరకు మొత్తంగా ఆరుసార్లు అగ్ని–5 క్షిపణిని పరీక్షించగా, అన్నిసార్లూ విజయవంతంగా క్షిపణి తన లక్ష్యాన్ని ఛేదించింది. ఇప్పటికే అగ్ని–1 (700 కిలోమీటర్ల పరిధి), అగ్ని–2 (2 వేల కి.మీ), అగ్ని–3 (2,500 కి.మీ) క్షిపణులు రక్షణ శాఖ వద్ద ఉన్నాయి. అగ్ని–5 పరిధిని 5వేల కిలోమీటర్లకు పెంచడంతోపాటు దిక్సూచి వ్యవస్థ, ఇంజిన్, వార్‌హెడ్ తదితరాలకు సంబంధించి అత్యాధునిక సాంకేతికతను జోడించి దీనిని అభివృద్ధి చేశారు. అన్ని వ్యవస్థలూ సరిగ్గా పనిచేస్తున్నట్లు పరీక్షలో తేలిందని ఓ అధికారి తెలిపారు. క్షిపణి కచ్చితంగా సరైన మార్గంలోనే వెళ్లేలా చేయడం కోసం రింగ్ లేజర్ గైరో ఆధారిత దిక్సూచి వ్యవస్థను, మిసైల్‌లో ప్రత్యేక కంప్యూటర్ను వినియోగించారు. చైనా ముందు దిగదుడుపే అగ్ని–5 క్షిపణి ప్రస్తుతం భారత్ వద్ద ఉన్నవాటిల్లోకెల్లా అత్యాధునికమైనదే. అయితే చైనా క్షిపణులతో పోలిస్తే దీని సామర్థ్యాలు చాలా తక్కువనే చెప్పాలి. చైనా వద్దనున్న ‘సీఎస్ఎస్–10 మోడ్ 2’ క్షిపణి పరిధి 11,200 కిలో మీటర్లు. అమెరికాలోని దాదాపు అన్ని ప్రాంతాలకు ఇది చేరుకోగలదు. డీఎఫ్–41 అనే మరో క్షిపణిని కూడా చైనా అభివృద్ధి చేస్తోంది. ఇది ఒకేసారి 10 అణు వార్హెడ్లను మోసుకెళ్లగలదు. దీని పరిధి 12 వేల నుంచి 15 వేల కిలోమీటర్ల వరకు ఉండనుందని అంచనా. డీఎఫ్–41 క్షిపణితో ప్రపంచంలోని ఏ దేశంపైనైనా దాడి చేయగల సామర్థ్యం చైనా సొంతం కానుంది. ‘అగ్ని–5’ ప్రత్యేకతలు ► ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిస్సైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్‌లో భాగంగా డీఆర్డీవో ఈ క్షిపణిని పూర్తిగా దేశీయంగా అభివృద్ధి చేసింది. ► 17 మీటర్ల పొడవు, 2 మీటర్ల వెడల్పు, 50 ట న్నుల బరువుండే ఈ అత్యాధునిక క్షిపణి 1500 కేజీల అణు వార్హెడ్లను మోసుకెళ్లగలదు. ► ఇది సైన్యానికి అందుబాటులోకి వస్తే.. 5000–5500 కిలో మీటర్ల పరిధిలోని లక్ష్యాలను ఛేదించగల ఖండాతర క్షిపణులను కలిగి ఉన్న అమెరికా, రష్యా, చైనా, ఫ్రాన్స్, బ్రిటన్ల సరసన భారత్ చేరుతుంది. ► అగ్ని–1, అగ్ని–2, అగ్ని–3 క్షిపణులు ఇప్పటికే భారత సైన్యంలో చేరి సేవలందిస్తున్నాయి. ► ప్రస్తుతం భారత్‌కు ఉన్న అన్ని క్షిపణిల్లోకెల్లా అత్యధిక పరిధి కలిగిన క్షిపణి ఇదే. ► తూర్పున చైనా మొత్తం, పడమరన యూరప్ మొత్తం దీని పరిధిలోకి వస్తుంది. ఆసియా, యూరప్ల్లోని అన్ని ప్రాంతాలు, ఆఫ్రికాలోని కొన్ని ప్రాంతాలపై దాడులు చేయగలదు. ► మొత్తంగా 800 కిలో మీటర్ల ఎత్తు వరకు వెళ్లి అక్కడి నుంచి మళ్లీ భూమిపైకి తిరిగొచ్చి లక్ష్యాలను ఢీకొట్టగలిగే సామర్థ్యం ఉంది. -
విజయవంతంగా 2కే పింక్ వాక్
-
స్క్రామ్‌జెట్ రాకెట్ ఇంజన్ ప్రయోగం విజయవంతం
బ్రిక్స్ దేశాల మహిళా పార్లమెంటేరియన్ల సదస్సు జైపూర్‌లో రెండు రోజులపాటు జరిగిన బ్రిక్స్ దేశాల మహిళా పార్లమెంటేరియన్ల సదస్సు ఆగస్టు 21న ముగిసింది. ఇందులో పాల్గొన్న ప్రతినిధులు బ్రిక్స్ దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యంపై చర్చించడంతోపాటు ప్రపంచ సంస్థల్లో తమ దేశాలకు అధిక భూమిక ఉండాలని అభిలషించారు. లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ మాట్లాడుతూ వాతావరణ మార్పు పరిణామాలను ఎదుర్కోవడం, మహిళల సంక్షేమాన్ని పెంపొందించడంపై బ్రిక్స్ దేశాలు అనుసరిస్తున్న ఉత్తమ విధానాలను అధ్యయనం చేయాలని సూచించారు. సదస్సు ముగింపులో ఆమోదించిన జైపూర్ డిక్లరేషన్.. ఆర్థిక వృద్ధి, సామాజిక సమ్మిళితం, పర్యావరణ పరిరక్షణ వంటి రంగాల్లో పరస్పర సహకారం, వ్యూహాత్మక భాగస్వామ్యాల పటిష్టతకు మహిళా పార్లమెంటేరియన్లు ప్రతినబూనాలని పేర్కొంది. సరోగసీ (నియంత్రణ) బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం సరోగసీ (నియంత్రణ) బిల్లు 2016ను పార్లమెంటులో ప్రవేశపెట్టేందుకు కేంద్ర కేబినెట్ ఆగస్టు 24న ఆమోదం తెలిపింది. పిల్లలు లేని దంపతులకు వరంగా మారిన సరోగసీ (అద్దె గర్భం) విధానాన్ని కొందరు దుర్వినియోగం చేస్తున్నారు. దీన్ని పూర్తిగా అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం తాజా ముసాయిదా బిల్లును రూపొందించింది. ఈ బిల్లు ప్రకారం చట్టబద్ధంగా వివాహం చేసుకున్నవారు మాత్రమే (వివాహమైన ఐదేళ్ల వరకు పిల్లలు పుట్టకుంటే) ఈ విధానం ద్వారా పిల్లలు పొందేందుకు అర్హులు. విదేశీయులు అక్రమంగా భారత్‌లో అద్దె గర్భం ద్వారా సంతానాన్ని పెంచుకుంటున్నారు. దాంతో వాణిజ్య సరోగసీకి భారత్ కేంద్రంగా మారిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ చర్య తీసుకుంది. ఈ బిల్లు అమల్లోకి వచ్చిన తర్వాత అక్రమ చర్యలకు పాల్పడే వారికి పదేళ్ల జైలు శిక్షతోపాటు రూ.10 లక్షల జరిమానా విధించనున్నారు. మయన్మార్‌లో పర్యటించిన సుష్మా స్వరాజ్ మయన్మార్‌లో ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ ఆగస్టు 22న ఆ దేశంలో పర్యటించారు. భారత్‌కు వ్యతిరేకంగా మయన్మార్‌లో ఎలాంటి కార్యకలాపాలను అనుమతించేది లేదని ఆ దేశం తెలిపింది. పర్యటనలో ఆ దేశ అధ్యక్షుడు యు హిటిన్ క్యా, విదేశాంగ మంత్రి అంగ్‌సాన్ సూకీతో సుష్మ సమావేశమయ్యారు. అంతర్జాతీయం 2050 నాటికి ప్రపంచ జనాభా దాదాపు 980 కోట్లు 2050 నాటికి ప్రపంచ జనాభా దాదాపు 980 కోట్లకు చేరుతుందని పాపులేషన్ రిఫరెన్స్ బ్యూరో (పీఆర్బీ) పేర్కొంది. ఈ మేరకు ఆగస్టు చివరి వారంలో విడుదల చేసిన 2016 వరల్డ్ పాపులేషన్ డేటాషీట్లో తెలిపింది. మానవ అవసరాలు, సుస్థిర వనరులనే ఇతివృత్తంతో డేటా షీట్‌ను రూపొందించారు. యూరప్‌లో జననాల రేటు బాగా క్షీణించి జనాభా భారీగా తగ్గిపోనుండగా, ఆఫ్రికా దేశాల్లో రెట్టింపు అవుతుందని నివేదిక పేర్కొంది. ఇటలీ భూకంపంలో 247 మంది మృతి ఇటలీలో పర్వత ప్రాంతాల్లో ఆగస్టు 24న భారీ భూకంపం సంభవించింది. ఇందులో 247 మంది మరణించగా వందలాది మంది గాయపడ్డారు. కొలంబియా ప్రభుత్వంతో ఫార్క్ శాంతి ఒప్పందం వామపక్ష తీవ్రవాద సంస్థ.. కొలంబియా విప్లవ సాయుధ బలగాల (ఎఫ్ఏఆర్సీ-ఫార్క్)తో ఆ దేశ ప్రభుత్వం శాంతి ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ మేరకు ఇరు పక్షాలు క్యూబా రాజధాని హవానాలో ఆగస్టు 24న ప్రకటన విడుదల చేశాయి. దీంతో దక్షిణ అమెరికాలోని కొలంబియాలో 1964లో ప్రారంభమైన అంతర్యుద్ధానికి తెరపడనుంది. దీనివల్ల ఇప్పటివరకు 2.6 లక్షల మంది మరణించగా, 68 లక్షల మంది ప్రజలు వలస వెళ్లిపోయారు. వార్తల్లో వ్యక్తులు ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడిగా జిమ్ యాంగ్ కిమ్ ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడిగా జిమ్ యాంగ్ కిమ్ రెండోసారి ఆగస్టు 24న ఎంపికయ్యారు. కిమ్ తొలి విడత పదవీ కాలంలో దారిద్య్ర నిర్మూలన, వాతావరణ మార్పులకు సంబంధించి విశేష కృషి చేశారని అమెరికా ఆర్థికశాఖ మంత్రి జాకోబ్ జే లూ పేర్కొన్నారు. ఐక్యరాజ్యసమితి ప్రచారకర్తగా ఐశ్వర్య ధనుష్ తమిళ సినీ నటుడు రజినీకాంత్ కుమార్తె, దర్శకురాలు ఐశ్వర్య ధనుష్ ఐక్యరాజ్యసమితి మహిళా విభాగం (యూఎన్-ఉమెన్) ప్రచారకర్తగా ఎంపికయ్యారు. భారత్‌లో సమానత్వం, మహిళా సాధికారత కోసం పనిచేసేందుకు ఆగస్టు 29న ఆమెకు బాధ్యతలు అప్పగించారు. రచయిత్రి సచ్‌దేవ్‌కు సరస్వతీ సమ్మాన్ ప్రదానం ప్రముఖ డోగ్రీ రచయిత్రి పద్మా సచ్‌దేవ్‌కు ప్రతిష్టాత్మక సరస్వతీ సమ్మాన్ (2015)ను ఆగస్టు 29న ఢిల్లీలో ప్రదానం చేశారు. స్వీయ చరిత్ర చిత్‌ఛటేకు ఆమె ఈ పురస్కారాన్ని పొందారు. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్‌జంగ్ ఈ పురస్కారం కింద పద్మా సచ్‌దేవ్‌కు రూ.15 లక్షల నగదు, ప్రశంసపత్రాన్ని అందించారు. బిర్లా ఫౌండేషన్ ప్రతి ఏటా ఈ అవార్డులను అందిస్తోంది. క్రీడలు టెస్ట్ సిరీస్‌ను కైవసం చేసుకున్న భారత్ భారత్, వెస్టిండీస్‌ల మధ్య జరిగిన నాలుగు టెస్టుల సిరీస్‌ను 2-0 తేడాతో భారత్ గెలుచుకుంది. సిరీస్‌లో భాగంగా పోర్ట్ ఆఫ్ స్పెయిన్‌లో జరిగిన నాలుగో టెస్ట్ డ్రాగా ముగిసింది. మ్యాన్ ఆఫ్ ద సిరీస్‌గా ఆర్.అశ్విన్ ఎంపికయ్యాడు. నికో రోస్బర్గ్కు బెల్జియం గ్రాండ్ ప్రి టైటిల్ ఫార్ములావన్ డ్రైవర్ నికో రోస్‌బర్గ్ తొలిసారి బెల్జియం గ్రాండ్ ప్రి టైటిల్ గెలుచుకున్నాడు. ఆగస్టు 28న జరిగిన రేసులో రోస్‌బర్గ్ విజేతగా నిలవగా, రికియార్డో రెండో స్థానం దక్కించుకున్నాడు. సానియా జోడీకి కనెక్టికట్ ఓపెన్ టైటిల్ సానియా మీర్జా (భారత్), మోనికా నికెలెస్కూ (రొమేనియా)తో కలిసి కనెక్టికట్ డబ్ల్యూటీఏ ఓపెన్ టోర్నమెంట్ మహిళల డబుల్స్ టైటిల్ గెలుచుకుంది. అమెరికాలోని న్యూ హవెన్‌లో ఆగస్టు 27న జరిగిన ఫైనల్లో కాటరీనా బొండారెంకో (ఉక్రెయిన్)-చువాంగ్ చియా జంగ్ (చైనీస్ తైపీ) జోడీపై విజయం సాధించారు. సైన్స్ అండ్ టెక్నాలజీ స్క్రామ్‌జెట్ రాకెట్ ఇంజన్ ప్రయోగం విజయవంతం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) స్క్రామ్‌జెట్ రాకెట్ (ఏటీవీ) ఇంజన్ సామర్థ్యాన్ని ఆగస్టు 28న శ్రీహరికోట నుంచి విజయవంతంగా పరీక్షించింది. దీంతో వాతావరణంలోని ఆక్సిజన్‌ను ఇంధనంగా వాడుకుంటూ అంతరిక్షంలోకి ప్రయాణించే స్క్రామ్‌జెట్ రాకెట్ ఇంజన్ సామర్థ్యం కలిగిన నాలుగో దేశంగా భారత్ నిలిచింది. కుష్టు వ్యాధికి వ్యాక్సిన్ కనుగొన్న భారత్ భారతదేశం ప్రపంచంలోనే తొలిసారిగా లెప్రసీ (కుష్టు వ్యాధి)ని నిరోధించే వ్యాక్సిన్ తయారు చేసింది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇమ్యునాలజీ వ్యవస్థాపక డైరె క్టర్ జీపీ తల్వార్ ఈ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేశారు. ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ముందుగా బిహార్, గుజరాత్‌ల్లోని ఐదు జిల్లాల్లో పెలైట్ ప్రాజెక్టుగా అమలు చేయనున్నారు. 2013-14 లెక్కల ప్రకారం మన దేశంలో 1.27 లక్షల మంది లెప్రసీతో బాధపడుతున్నారు. లీకైన స్కార్పిన్ జలాంతర్గాముల రహస్య సమాచారం ఫ్రాన్స్ నౌకా నిర్మాణ సంస్థ డీసీఎన్ఎస్ సాంకేతిక సహకారంతో ముంబైలో నిర్మిస్తున్న ఆరు అత్యాధునిక స్కార్పిన్ జలాంతర్గాములకు సంబంధించిన అత్యంత రహస్య సమాచారం లీకైంది. దీంతో దీనిపై దర్యాప్తు చేసి నివేదిక అందించాల్సిందిగా కేంద్ర రక్షణ మంత్రి మనోహర్ పారికర్ ఆగస్టు 23న ఆదేశించారు. రాష్ట్రీయం ఏపీ, తెలంగాణల్లో ముగిసిన కృష్ణా పుష్కరాలు పన్నెండు రోజులపాటు తెలుగు రాష్ట్రాల్లో జరిగిన కృష్ణా పుష్కరాలు ఆగస్టు 23న ముగిశాయి. పుష్కరాల కోసం ఏపీ రూ.1200 కోట్లు, తెలంగాణ రూ.800 కోట్లు ఖర్చు చేశాయి. 3 ప్రాజెక్టులపై మహారాష్ట్రతో ఒప్పందం చేసుకున్న తెలంగాణ గోదావరిపై మేడిగడ్డ (కరీంనగర్), ప్రాణహితపై తుమ్మిడిహెట్టి (ఆదిలాబాద్), పెన్‌గంగపై చనాఖ-కొరాట (ఆదిలాబాద్) బ్యారేజ్‌ల నిర్మాణానికి సంబంధించిన ఒప్పంద పత్రాలపై తెలంగాణ సీఎం కేసీఆర్, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌లు ఆగస్టు 23న ముంబైలో సంతకాలు చేశారు. 27 జిల్లాలతో తెలంగాణ రాష్ట్ర పటం ప్రతిపాదిత 17 కొత్త జిల్లాలతోపాటు మొత్తం 27 జిల్లాలతో కూడిన తెలంగాణ పటాన్ని రెవెన్యూ శాఖ ఆగస్టు 26న అందుబాటులోకి తెచ్చింది. 27 జిల్లాల వివరాలు: ఆదిలాబాద్, నిర్మల్, కొమరం భీం (మంచిర్యాల), నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, సంగారెడ్డి, మెదక్, సిద్ధిపేట, హన్మకొండ, వరంగల్, జయశంకర్ (భూపాలపల్లి), మహబూబాబాద్, ఖమ్మం, కొత్తగూడెం (భద్రాద్రి), రంగారెడ్డి, మల్కాజ్గిరి, శంషాబాద్, హైదరాబాద్, యాదాద్రి, నల్లగొండ, సూర్యాపేట, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి. ఆర్థికం ఆర్బీఐకి ఖేల్ ప్రోత్సాహన్ పురస్కారం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ)కు ఖేల్ ప్రోత్సాహన్ 2016 పురస్కారం లభించింది. దీన్ని ఆగస్టు 20న రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ ముంద్రా స్వీకరించారు. క్రీడాకారులకు ఉద్యోగావకాశాలు, ఇతర సంక్షేమ కార్యక్రమాలు కల్పిస్తున్నందుకుగానూ ఆర్బీఐకి ఈ అవార్డు లభించింది. వైఫల్యం చెందకూడని బ్యాంకులుగా ఎస్బీఐ, ఐసీఐసీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ), ఐసీఐసీఐ బ్యాంకులను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆగస్టు 26న వైఫల్యం చెందకూడని అతిపెద్ద బ్యాంకులుగా ప్రకటించింది. ఇలాంటి హోదా ఈ బ్యాంకులకు లభించడం ఇది వరుసగా రెండోసారి. ఆర్థిక వ్యవస్థకు సంబంధించి వ్యవస్థీకృతంగా చాలా ప్రాముఖ్యత కలిగినవని ప్రకటించడమే ఈ హోదా ఉద్దేశం. దీనికి అనుగుణంగా ఆయా బ్యాంకుల పటిష్టతకు గట్టి నిఘా, పర్యవేక్షణలు ఉంటాయి. ఆకేపాటి శ్రీనివాసులు రెడ్డి కరెంట్ అఫైర్స్ నిపుణులు, ఆర్సీ రెడ్డి స్టడీ సర్కిల్, హైదరాబాద్ -
జీశాట్- 15 ఉపగ్రహ ప్రయోగం విజయవంతం
-
'రేవంత్ విజయవంతంగా బయటకు వస్తారు'
-
తొలిప్రయత్నంలోనే అంగారకుడిని చేరిన ఇస్రో
-
నింగిలోకి దూసుకెళ్ళిన పీఎస్ఎల్వీ-సి23
-
సెకండ్ ఇంనింగ్స్ను ఇరగదీసింది